Beetroot: బీట్ రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఉత్సాహమే

www.mannamweb.com


Beetroot: నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది బీట్‌రూట్(Beetroot). బీట్ రూట్ జ్యూస్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దీనివల్ల శరీరంలో రక్తం మోతాదును పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి.. సాధారణంగా హిమోగ్లోబిన్ పెరగడానికే అనుకుంటాం గానీ ఇదొక దివ్య ఔషధమని చాలామందికి తెలియదు. రక్తహీనతతో బాధపడే వారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

రక్తం చాలా త్వరగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి త్వరిత కాలంలోనే బయట పడవచ్చు. ఇక ఇంట్లో పనుల వల్ల రోజంతా నీరసంగా ఉండేవారు. ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి అందుతుంది. దాంతో చురుగ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలుగుతారు. హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక ఔషధమనే చెప్పాలి. బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీ ని తగ్గిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇక కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే మంచిది.

కొలెస్ట్రాల్‌ కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. గర్భిణీలు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల..కడుపులో ఉండే బిడ్డకు మెరుగైన ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. లివర్‌ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం మంచిది. దీంతో లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయి..లివర్ శుభ్రమవుతుంది.