BEL Recruitment: హైదరాబాద్ లోని బెల్ లో ఉద్యోగాలు..నెలకు రూ.90000 జీతం

www.mannamweb.com


నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL)శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌,టెక్నీషియన్‌-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఈ పోస్టులకు

ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ జులై 11, 2024. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ,విద్యార్హత తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు-32

టెక్నీషియన్‌ సీ-17 పోస్టులు

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్‌-3 పోస్టులు

విద్యార్హత

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా.

టెక్నీషియన్‌ సీ-17: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ ఎలక్ట్రికల్‌)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేయాలి లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి.

జూనియర్‌ అసిస్టెంట్‌-3: బీకాం/ బీబీఎం

వయోపరిమితి

01.06.2024 నాటికి మూడు పోస్టులకు అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయస్సులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ-ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది.

జీతం

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24500 నుంచి రూ.90000. టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21500 నుంచి రూ.82000.

దరఖాస్తు ఫీజు

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు