కూర్చొని పని చేసేవారు కూడా ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం

www.mannamweb.com


కూర్చొని పని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా శరీరం షేప్ మొత్తం మారిపోతుంది.

అందరి చూపు మీ పొట్టపైనే ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్‌ను మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూర్చొని పని చేయడం వల్ల పెద్దగా శారీరక శ్రమ ఉండదు. దీంతో తిన్న ఆహారం త్వరగా అరకగ పొట్టలోనే ఉంటుంది. ఇది కాస్తా కొవ్వుగా మారి.. ఊబకాయం వస్తుంది. ఊబకాయం కారణంగా షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్, మతి మరుపు కూడా వస్తుంది. వంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ రావచ్చు. దీన్ని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. మహిళల పొట్ట 35 అంగుళాలకు మించినా, పురుషుల పొట్ట 40 అంగుళాలకు మించి ఉన్నా.. రింగు కొవ్వు ఉన్నట్లే. అయితే ఈ పొట్టని మనం ఈజీగానే వదిలించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

వేడి నీరు తాగండి:

ఊబకాయంతో బాధ పడేవారు ఎక్కువగా గోరు వెచ్చటి నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు కరిగేందుకు ఛాన్న ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగండి. ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అలాగే రోజంతా గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి. దీంతో తిన్న ఆహారమే కాకుండా.. పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

వ్యాయామాలు:

బెల్లీ ఫ్యాట్ కరిగించాలంటే వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. పొట్టపై ఒత్తిడి పడే వ్యాయామాలు ఉదయం చేయడం వల్ల మీకు నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 15 రోజుల్లో కూడా మీరు ఫలితాన్ని గమనించవచ్చు. వ్యాయామం చేస్తూ గోరు వెచ్చని నీరు తాగాలి.

ఫైబర్ ఫుడ్స్:

బెల్లీ ఫ్యాట్‌తో బాధ పడేవారు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి. దీని వలన ఇవి కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నట్టు పొట్ట నిండిపోతుంది. దీంతో త్వరగా పొట్ట కొవ్వు తగ్గుతుంది.

ఉపవాసం ఉండండి:

ఉపవాసం ఉండటం వల్ల కొవ్వు కరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రోజులో ఒకసారి ఉపవాసం ఉండేందుకు ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల పొట్ట కొవ్వు వేగంగా కరిగేందుకు ఛాన్స్ ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)