Benefits Of Betel Leaf: తమల పాకులతో హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చెక్‌!

www.mannamweb.com


తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని మీకు తెలుసా?

సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.

తమలపాకు నీటితో జుట్టును కడగాలి
తల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్‌ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది.

తమలపాకు,నెయ్యి హెయిర్‌ మాస్క్‌
తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

మసాజ్‌
తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

తమలపాకులతో చేసిన నూనె
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్‌ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు.

తమలపాకులను తినండి
ఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.