మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు

ఎండాకాలం రానే వచ్చింది.. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఈ ఎండలకు బాగా దాహం వేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీనీ డీ హైడ్రేడ్‌గా ఉంచడం కోసం మనం కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అని వైద్య నిపుణులు అంటూనే ఉంటారు. ఇక చాలా మంది కూల్ నీళ్ల కోసం ఫ్రిడ్జ్ మీద ఆధార పడతారు. అయితే ప్రిడ్జ్‌లో కూల్ అయిన నీళ్లను తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మట్టి కుండలో నేచురల్‌గా కూల్ అయిన వాటర్‌ను తాగడం వల్ల చాలా లాభాలున్నాయంటున్నారు నిపుణులు.


అయితే మట్టి కుండలు ధరలోనూ చాలా తక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి మట్టి కుండలో నీళ్లను తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మట్టి కుండల్లో నీరు తాగడం వల్ల మనకు అతిగా దాహం వేయదు. అలాగే ఎసిడిటీ సమస్యలు కూడా కంట్రోల్‌లోకి వస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా.. శరీరాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది.

మట్టికుండల్లోని నీరు వడదెబ్బ నుంచి మనల్ని రక్షించడమే కాకుండా.. మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. అటు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడం.. గొంతుకు సంబంధించిన సమస్యలు దరికి చేరకపోవడం కూడా జరుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఈ మట్టి కుండల్లోని నీరు టెస్టోస్టెరోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

అలాగే మట్టి కుండలో నీళ్లను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెష్యర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే దొరికే మట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి. అందులో తయారయిన చల్లని నీళ్లను తాగి మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా ఉంచుకోండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.