తక్కువ బడ్జెట్లో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ప్రతి క్లిక్.. ఓ మధురానుభవమే..

www.mannamweb.com


వీవో టీ3.. వీవో టీ3 ఫోన్ లోని ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో నో షేక్, నాన్ బర్లీ ఇమేజ్ లు తీసుకోవచ్చు. సోనీ సెన్సార్, 6.67 అల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7200 4ఎం ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు, ఈ ఫోన్ రూ.19,999కు అందుబాటులో ఉంది.

ఐక్యూ జెడ్9.. దీనిలోని సూపర్ నైట్ మోడ్ తో చీకటిలోనూ ఫొటోలు స్పష్టంగా తీసుకోవచ్చు. 50ఎంపీ సోనీ ఓఐఎస్ కెమెరాతో రన్నింగ్ లో స్థిరమైన ఫొటోలు లభిస్తాయి. దీనిలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన చిత్రాలు తీసుకోవచ్చు. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 4ఎం ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.19,998కు అందుబాటులో ఉంది.

సామ్సంగ్ గెలాక్సీ ఎం35.. ఓఐఎస్ తో 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, 6000 ఏఎంహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఇన్సినిటీ ఓ డిస్ ప్లేతో విజువల్ స్పష్టంగా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ రూ.19,275కు అందుబాటులో ఉంది.

మోటో జీ85.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50 ఎంపీ కెమెరా దీనిలో ప్రత్యేకత. త్రీడి కర్వ్ పోలెడ్ 6.7 అంగుళాల డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి. 32 ఎంపీ హై పెర్మార్మింగ్ కెమెరాతో సెల్పీలు చాాలా బాగుంటుంది. స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్3 ప్రాసెసర్, 500 ఏఎంహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.17,499కి అందుబాటులో ఉంది.

సీఎంఎఫ్ (నథింగ్ 1).. నథింగ్ బ్రాండ్ నుంచి విడుదలైన సీఎంఎఫ్ 1 ఫోన్ లో కెమెరా చాలా బాగుంది. దీనిలోని 50 ఎంపీ కెమెరాతో ఫొటోలు స్పష్టంగా ఉంటాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అక్టాకోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనితీరు బాగుంటుంది. సీఎంఎఫ్ 1 ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.15,999కి అందుబాటులో ఉంది.