డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఈ పండు చాలా పాపులర్ అయ్యింది. ఇందులో పోషకాలు అన్నీ ఇన్నీ కాదు. శరీర ఆరోగ్యాన్ని పెంచే పోషకాలన్నీ డ్రాగన్ ఫ్రూట్లో లభిస్తాయి.
ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్‌ని తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తు్నారు.
డ్రాగన్ ఫ్రూట్లో.. ప్రోటీన్, క్యాలరీలు, ఐరన్, విటమిన్లు ఇ, సి, మెగ్నీషియం, ఫైబర్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, జింక్, మాంస కృత్తులు ఎంతో మెండుగా ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ప్రతి రోజూ డ్రాఫన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ వెన్నగా కరిగిపోతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. అంతే కాకుండా వెయిట్ లాస్ అవుతారు. ఫిట్‌గా ఉంటారు. బీపీ, షుగర్ కూడా రాకుండా ఉంటాయి.
బాడీలో రోగ నిరోధక శక్తి అనేది మెండుగా పెరుగుతుంది. దీని వల్ల ఇతర రోగాలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే పార్కినన్స్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో చక్కగా సహాయ పడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. చర్మ అందాన్ని పెంచడంలో కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. గర్భిణీలు తినడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.