LED TV : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో రూ.10,000లోపు ధరలో టీవీలు ఉన్నాయి. ఈ లిస్టులో చౌకైన టీవీ ధర కేవలం రూ.4,999 మాత్రమే. ఒకసారి లిస్ట్ చూద్దాం.
ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని రేంజ్‌ల ఎల్‌ఈడీ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మీరు సరసమైన ధరకు ఉత్తమ ఫీచర్లతో కూడిన ఎల్‌ఈడీ టీవీ కోసం వెతుకుతున్నట్లయితే, కొన్ని ఎంపికలు మీ కోసం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో రూ.10,000లోపు ధరలో అందుబాటులో ఉన్న టీవీల గురించి తెలుసుకుందాం.
వీడబ్ల్యూ
60 సెం.మీ (24 ఇంచెస్) ప్రీమియం సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీ (BW 24A – బ్లాక్)
ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.4,999కు అందుబాటులో ఉంది. ఇది 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేని కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటాయి. ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్‌లతో 20W సౌండ్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్ ఈ టీవీని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
రియల్‌మీ
రియల్‌మీ టెక్ లైఫ్ సినిమాసోనిక్ 80 సెం.మీ (32 ఇంచెస్) క్యూఎల్‌ఈడీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ టీవీ
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కు లభిస్తుంది. ఇది హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే (1366×768), డాల్బీ ఆడియో, 20W సౌండ్ని అందిస్తుంది. 1.5GB RAM, 8GB స్టోరేజ్, మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంటాయి.
వోక్స్
ఫ్రేమ్‌లెస్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ (BW24C3 – బ్లాక్)
అమెజాన్‌లో రూ.5,999కు అందుబాటులో ఉంది. 1366×768 రిజల్యూషన్, 60Hz డిస్‌ప్లే, 24W సౌండ్ అవుట్‌పుట్ ఉంటాయి. 5 సౌండ్ మోడ్‌లు, HDMI, USB పోర్ట్‌లు కనెక్టివిటీకి ఉన్నాయి.
కొడాక్
కొడాక్ 80 సెం.మీ (32 ఇంచెస్) స్పెషల్ ఎడిషన్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ (32SE5001BL)
ధర రూ.8,499. హెచ్‌డీ డిస్‌ప్లే (1366×768), 30W సౌండ్, 3 HDMI, 2 USB పోర్ట్‌లు ఉన్నాయి.
ఏసర్
ఏసర్ 80 సెం.మీ (32 ఇంచెస్) జె సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ గూగుల్ ఎల్‌ఈడీ టీవీ
అమెజాన్‌లో రూ.9,999కు లభిస్తుంది. 1.5GB RAM, 8GB స్టోరేజ్, డాల్బీ ఆడియో, 30W సౌండ్ ఉంటాయి. 178° వ్యూయింగ్ యాంగిల్ కలిగిన డిస్‌ప్లే ఉంది.
టీసీఎల్
టీసీఎల్ 32 ఇంచెస్ మెటాలిక్ బెజెల్‌లెస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (32L4B)
అమెజాన్‌లో రూ.9,490కు లభిస్తుంది. హెచ్‌డీఆర్ 10, డాల్బీ ఆడియో, 2 HDMI, 1 USB పోర్ట్‌లు ఉన్నాయి.