ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్

మలయాళం సినిమాలో ఈ రోజుల్లో థ్రిల్లర్స్ బాగా నడుస్తున్నాయి. అందులోనూ మలయాళం పోలీస్ థ్రిల్లర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్.. ఆసిఫ్ అలీ, బిజు మీనన్ నటించిన తలవన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.


పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ముంబై పోలీస్ నుండి దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ వరకు బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

రేఖాచిత్రం – సోనీ లివ్ ఓటీటీ
ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన మూవీ రేఖాచిత్రమ్. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ ఇది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన రేఖాచిత్రమ్‌లో, పోలీసులు ఒక అస్థిపంజరం కనుగొన్న తర్వాత అసలు బాధితులెవరో తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది.

40 ఏళ్ల కిందట ఈ కేసును సస్పెండ్ అయి మళ్లీ అప్పుడే డ్యూటీలో చేరిన ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడన్నదే మూవీ స్టోరీ. మంచి థ్రిల్ పంచే మూవీ ఇది.

ముంబై పోలీస్ – జియోహాట్‌స్టార్
రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ముంబై పోలీస్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఏసీపీ ఆంటోనీ మోసెస్ గా నటించాడు. జయసూర్య, రెహమాన్ సీనియర్ పోలీస్ పాత్రల్లో నటించారు.

ఒక స్నేహితుడి హత్య కేసులో హంతకుడిని పట్టుకునే ఆంటోనీకి యాక్సిడెంట్ జరిగి గతం మరచిపోతాడు. మళ్లీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి హంతకుడిని పట్టుకోవాలి. అసాధారణ క్లైమాక్స్ ఉన్న ఈ సినిమా పోలీస్ థ్రిల్లర్ నచ్చే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనడంలో సందేహం లేదు

కన్నూర్ స్క్వాడ్ – జియోహాట్‌స్టార్
మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి ఈ కన్నూర్ స్క్వాడ్‌లో ఏఎస్ఐ జార్జ్ మార్టిన్‌గా నటించాడు. అతను, అతని పోలీసు గ్రూపు ఒక నేర ముఠాని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఈ క్రమంలో వాళ్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. చివరికి ఓ ముఠాని పట్టుకుంటారా లేదా అన్నదే ఈ సినిమా స్టోరీ. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించిన మూవీ ఇది.

తలవన్ – సోనీ లివ్ ఓటీటీ
మలయాళ సీనియర్ నటులు బిజు మీనన్, ఆసిఫ్ అలీ నటించిన మూవీ తలవన్. ఒకే పోలీస్ స్టేసన్ లో పని చేసే ఓ సీఐ, ఎస్ఐకి అస్సలు పడదు. కానీ సీఐ ఇంట్లో దొరికిన శవం స్టోరీ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ కేసులో సీఐ పరిస్థితి అర్థం చేసుకున్న ఎస్ఐ అతని అండగా ఉంటూ.. అసలు ఆ శవం అతని ఇంట్లోకి ఎలా వచ్చిందన్నదానిపై ఇన్వెస్టిగేషన్ జరుపుతాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మలుపులతో సాగే మూవీ.

సెల్యూట్ – సోనీ లివ్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ సెల్యూట్. రోషన్ ఆండ్రూస్, బాబీ-సంజయ్ కలిసి ఈ సినిమాని తీశారు. ఇందులో ఎస్ఐ అరవింద్ కరుణాకరన్‌గా దుల్కర్ నటించాడు. అతను, ఇతర పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇరికిస్తారు. కానీ తన తప్పు తెలుసుకున్న పోలీస్, నిజం బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి.