Best Mileage Bikes: రూ.65 వేల లోపు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్.

రోజు వారీ అవసరాలకు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తున్నారా? మీ అవసరాలకు సరిపోయే 3 కంపెనీల బైక్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి. రోజు వారీ అవసరాలకు తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తున్నారా? మీ అవసరాలకు సరిపోయే 3 కంపెనీల బైక్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.


ఇండియాలో ఆటో మొబైల్ రంగం ఎంత దూసుకుపోతున్నా ఫ్యామిలీ మెన్ అవసరాలు తీర్చేవి మాత్రం బైకులే. అందుకే మధ్య తరగతి వారు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ సమాచారం. రూ.55 వేల నుంచి రూ.65 వేల మధ్యలో ధరలు ఉన్న బెస్ట్ మైలేజ్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

TVS స్పోర్ట్

రోజూ ఆఫీస్ కి వెళ్లొచ్చే వారికి, మార్కెటింగ్ జాబ్స్ చేసేవారికి TVS స్పోర్ట్ అనువైన బైక్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.59,881 నుండి ప్రారంభమవుతుంది. 110cc ఇంజిన్ ఉన్న ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఇందులో ఉన్న ET-Fi టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఇందులో 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ లీటరుకు 70-80 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తేలికైన బాడీ కావడంతో రైడ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

హోండా షైన్ 100

రోజువారీ అవసరాల కోసం హోండా షైన్ 100 కూడా బాగుంటుంది. ఇంజిన్ గురించి చెప్పాలంటే షైన్ 100 98.98 cc 4 స్ట్రోక్ SI ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో కూడా 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటుంది. మైలేజ్‌ విషయానికొస్తే లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

హోండా షైన్ 100 ధర మార్కెట్ లో రూ.64 వేల నుండి ప్రారంభమవుతుంది. సిటీల్లో ఉండే వారికి ఈ బైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

హీరో HF డీలక్స్

హీరో మోటోకార్ప్(Hero MotoCorp) HF డీలక్స్ ధర మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ. ఆఫీస్‌కి రోజూ వెళ్లి రావడానికి ఇది అనువైన బైక్. హీరో మోటోకార్ప్ ఇంజిన్ కెపాసిటీ 97.2cc. ఈ ఇంజిన్ 8.36 bhp శక్తిని, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ నగరం నివసించే వారికే కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి కూడా బాగుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.