ఎండ వేడికి గుండె జాగ్రత్త! అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు.

www.mannamweb.com


ఎండ వేడికి గుండె జాగ్రత్త!
గుండెజబ్బు ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటివే గుర్తుకొస్తాయి. అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు.
గుండెజబ్బు ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటివే గుర్తుకొస్తాయి. అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు. ఇది రోగనిరోధక వ్యవస్థకు చేటు చేస్తుందని.. ఫలితంగా వాపు ప్రక్రియ పెరిగి, గుండెరక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

వేసవిలో అధిక వేడి మూలంగా వడదెబ్బ, నిస్త్రాణ, పిక్కలు పట్టే యటం, తలనొప్పి, చర్మం కమలటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అôతే ఇవే కాదు.. ఇతరత్రా సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది. ఉదాహరణకు- గుండెజబ్బులు. అప్పటికే గుండె జబ్బులతో బాధపడుతుంటే తీవ్రమవుతాయి కూడా. ఇంతకీ వేడికీ గుండెకూ ఏంటీ సంబంధం? వాపు ప్రక్రియే. గుండెజబ్బుల విషయంలో అధిక వేడిని అంతగా పట్టించుకోరు గానీ ఇదీ ముఖ్యమైన ముప్పు కారకమేనని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ డేనియల్‌ డబ్ల్యూ. రిగ్స్‌ చెబుతున్నారు. వేసవిలో ఎండ ప్రభావానికి గురైనవారి రక్తంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) సూచికల మోతాదులు పెరుగుతున్నాయని వివరిస్తున్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే బి కణాల సంఖ్య తగ్గటమూ గమనార్హం. రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాలూ తగ్గుతున్నాయనటానికి ఇది నిదర్శనం. ఇన్‌ఫెక్షన్లు, గాలి ద్వారా వ్యాపించే జబ్బుల వ్యాప్తికి ఉష్ణోగ్రత, తేమ దోహదం చేస్తాయి. అంటే అధిక ఉష్ణోగ్రత ప్రభావంతో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమే కాకుండా వాపు ప్రక్రియతో ముడిపడిన గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పూ పెరుగుతుందన్నమాట.