సీజన్‌లో భలే చాన్స్.. సికింద్రాబాద్‌ టు గోవా రైలు సర్వీస్ షురూ

www.mannamweb.com


సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లాలనుకునే వారి సౌలభ్యం కోసం మరో రైలును ప్రారంభించింది రైల్వేశాఖ. ప్రస్తుతం సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసుకు (17603) తీవ్ర డిమాండ్ ఉండటంతో..

మరో ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలును.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (17039) వెళ్లే ట్రైన్ బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్​(17040)కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏటా సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు ట్రిప్స్ వేస్తుండగా.. అందులో 20 శాతం మంది తెలుగువారే ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే రైలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారు చాలామంది టూరిస్టులు. ప్రస్తుతం నేరుగా వెళ్లే రైలు అందుబాటులోకి వచ్చింది.

నయా గోవా రైలు ఆగే స్టేషన్స్ ఇవే….

కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్​లు ఉంటాయి. ఈ నెల 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.