బిగ్ బాస్ నుంచి రెండోసారి భరణి శంకర్ ఎలిమినేట్- రీ ఎంట్రీ, అధికంగా రెమ్యూనరేషన్- సీరియల్ విలన్ 12 వారాల సంపాదన ఎంతంటే?

బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కింద ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.


సుమన్ శెట్టి ఎలిమినేట్

అంటే, బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. మొదటగా శనివారం (డిసెంబర్ 13) నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం (డిసెంబర్ 14) నాటి ఎపిసోడ్‌లో భరణి శంకర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే, భరణి శంకర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవడం ఇది రెండోసారి. ఇదివరకు 6వ వారంలో బిగ్ బాస్ తెలుగు 9 నుంచి భరణి శంకర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు భరణికి ఉన్న క్రేజ్, సోషల్ మీడియాలో బీబీ టీమ్‌పై వ్యతిరేకత వచ్చింది. దాంతో మళ్లీ బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు భరణి శంకర్.

8వ వారంలో రీ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 9 ఎనిమిదో వారంలో భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అంతగా ఆకట్టుకోలేదు. దివ్యతో ఫ్రెండ్‌షిప్ కారణంగా అరుపులు, అనవసరపు వాగ్వాదాలు తప్ప పెద్ద చేసింది లేదు. దివ్య నిఖిత ఎలిమినేషన్ తర్వాత భరణి శంకర్ ఆటలో వేగం అందుకుంది. అప్పుడు అసలైన భరణి ఏంటో తెలిసింది.

కానీ, ఆలోపే అందరికి ఫెవరెట్స్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారు. దాంతో భరణికి రీ ఎంట్రీ పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయింది. ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భరణి శంకర్ ఎలిమినేట్ అవడం చాలా వరకు అందరికి షాకింగ్ విషయమే. నిజానికి సంజన ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ, అనూహ్యంగా భరణి ఎలిమినేట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో భరణి శంకర్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌పై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ అందరికంటే భరణి శంకర్ పారితోషికం ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. భరణి బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రోజుకు రూ. 50 వేలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే, వారానికి రూ. 3 లక్షల 50 వేలు.

భరణి శంకర్ సంపాదన

ఈ లెక్కన మొదటి ఆరు వారాల్లో రూ. 21 లక్షలు సంపాదించిన సీరియల్ విలన్ భరణి శంకర్ ఆ తర్వాత 8వ వారం నుంచి కంటిన్యూ అయ్యాడు. 8వ వారం నుంచి 14వ వారానికి మధ్య ఆరు వారాలు ఉన్నాయి. మొదటి 6 వారాలు, రీ ఎంట్రీ ఆరు వారాలు కలుపుకుని మొత్తంగా 12 వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో భరణి శంకర్ ఉన్నాడు.

ఈ లెక్కన సుమారుగా రూ. 42 లక్షలను బిగ్ బాస్ ద్వారా భరణి శంకర్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఇది సుమారుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌ మనీకి దగ్గరిగా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.