భారత్‌ బంద్‌.. దుకాణాలు మూసివేయాలని ముస్లింల విజ్ఞప్తి

అక్టోబర్‌ 3 (శుక్రవారం)న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారత్‌ బంద్‌ కోసం అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్‌, ముస్లిం ఐక్యత, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు జుబైర్‌ గఫూరి విజ్ఞప్తి చేశారు.


ఈ మేరకు వారు మంగళవారం హనుమకొండ చౌరస్తాలో దుకాణాదారులను కలిసి కోరారు. ఈ శాంతియుత నిరసన వక్ఫ్‌ (సవరణ) బిల్లు 2025ను వ్యతిరేకిస్తున్నట్లు, ఇది మన సమాజ హక్కులను, వక్ఫ్‌ సంస్థలను కాపాడుతుందన్నారు. హనుమకొండ వ్యాపారవేత్తల నుంచి వచ్చిన అఖండ మద్దతు మాకు ధైర్యాన్నిచ్చింది. వారు సంఘీభావంగా తమ దుకాణాలు, వ్యాపారాలను (అవసరమైన వైద్యసేవలు తప్ప) మూసివేస్తామని హామీ ఇచ్చినట్లు, మీ ఐక్యత ఈ బంద్‌ గొప్ప విజయాన్ని నిర్ధారిస్తుంది. న్యాయం కోసం శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నయీముద్దీన్‌, జుబైర్‌ మొహమ్మద్‌, ఖాజా అస్లాం, ఇస్మాయిల్‌, అహ్సాన్‌ మొహమ్మద్‌ బాబర్‌, అహ్మద్‌, ఫయాజ్‌ పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.