భారతీయుడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

www.mannamweb.com


భారతీయుడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

విడుదల తేదీ : జూలై 12, 2024.

నటీనటులు : కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని తదితరులు..

దర్శకుడు : శంకర్

నిర్మాత : సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్..

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : రవి వర్మన్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ఈ సినిమా 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాకు కూడా శంకరే దర్శకత్వం వహించారు. మరీ ఈ సినిమా అంచనాలను అందుకుందా.. అసలు సినిమా ఎలా ఉందో మన రివ్యూలో (Bharateeyudu 2 Review) చూద్దాం..

కథ విషయానికి వస్తే :

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) తన ఫ్రెండ్స్‌తో ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆ యూట్యూబ్ ఛానల్‌లో చిత్ర అరవిందన్.. తన చుట్టూ జరిగే అవినీతిని స్కిట్స్ రూపంలో వీడియోలను చేసి తన ఛానల్‌లో అప్ లోడ్ చేస్తుంటాడు. అంతేకాదు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.. ఈ వీడియోలకు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మరోసారి ఎంట్రీ ఇవ్వాలంటూ #ComeBackIndian అంటూ ఓ యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు. ఆ య్యాష్ ట్యాగ్ దేశమంతా ట్రెండింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తైపీ (తైవాన్)’ లో ఉంటున్న భారతీయుడు ఇండియాకు తిరిగి వస్తాడు. అంతేకాదు రావడం రావడంతోనే అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్నవారిని భారతీయుడు వరుసగా చంపేస్తుంటాడు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియో పోస్ట్‌లు చేస్తూ.. యువకులను మోటివేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) జీవితంతో పాటు పలువురి జీవితాల్లో విషాదం వస్తుంది. దీనికి కేవలం కారణం భారతీయుడే అంటూ ఇటూ వీరు, అటు ప్రజలు కూడా నిందిస్తారు. అంతేకాదు అసలు భారతీయుడుని వదలొద్దు అంటూ వెంటపడుతారు.. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది ?, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడు పై కోపం పెంచుకున్నారు ?, ఇంతకీ, భారతీయుడు టార్గెట్ ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికి వస్తే..

భారతీయుడులో ఓ సోల్ ఉంటుంది.. అది వెంటాడుతుంది. అయితే ఈ సినిమాలో మాత్రం భారీగా సన్నివేశాలు, ఖర్చు చేసినప్పటికీ.. ఓ పాట, లేక ఓ సన్నివేశం వావ్ అనిపించేలా లేవు. అయితే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. ఇక కమల్ హాసన్, సేనాపతిగా ఎప్పటిలాగే తన యాక్టింగ్‌తో అదరగొట్టారు. విజువల్ బాగున్నప్పటికీ సినిమా ఎక్కడా కనెక్ట్ కాదు. డ్రైగా సాగుతుందనిపిస్తుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. ఎలాంటి కొత్తదనం కనిపించదు. కొన్ని సన్నివేశాలు బోర్‌గా అనిపిస్తాయి. అనిరుధ్ సంగీతం కూడా గొప్పగా లేదనిపిస్తుంది. సమాజంలోని చిన్న మొత్తాల్లో లంచాలు తీసుకునే వారినుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునే వారి వరకు దర్శకుడు శంకర్ చూపించారు. అయితే ఓవరాల్‌గా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. ట్విస్ట్ ఏమంటే.. మూడో పార్ట్ కూడా వస్తుందని దర్శకుడు చెప్పడం కొసమెరుపు.

సినిమా టెక్నికల్‌గా సూపర్ అనిపిస్తుంది. కానీ సన్నివేశాలే ఫ్లాట్‌గా ఉంటాయి. దీనకితోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ అని చెప్పోచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీ నటుల విషయానికి వస్తే :

ఈ సినిమాలో చిత్ర అరవిందన్‌ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడని చెప్పోచ్చు. చెప్పాలంటే ఈ సినిమాలో కమల్ హాసన్ కంటే.. సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక మరో పాత్రలో సకలకళ వల్లభుడుగా SJ సూర్య తన పాత్ర మెప్పిస్తుంది. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా కూడా అదరగొట్టాడు. ఇక దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓకే అనిపించింది. మరో పాత్రలో యువ నటి ప్రియా భవానీ శంకర్ కూడా మెప్పిస్తుంది. సముద్రఖని వివేక్, గుల్షన్ గ్రోవర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫ్లస్ పాయింట్స్..

కమల్ యాక్టింగ్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కథ, కథనం

కొన్ని ల్యాగింగ్ సీన్స్..

రేటింగ్ : 2.5/5