రంగంలోకి భారతి, అటు షర్మిల – సమరమే…!!

www.mannamweb.com


ఏపీ ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి – వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ – వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలచారు. దీంతో..కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. కడప లో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. హోరెత్తుతున్న ప్రచారం ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరంది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అటు చంద్రబాబు – పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నకల ప్రచారం కొనసాగిస్తున్నారు. జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ నెల 18 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సీఎం జగన్ ీ నెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత పులివెందులో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది.

పులివెందులలో భారతి జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ తరువాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం. పులివెందుల టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ది ఖరారు కావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలోనూ భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేసారు. ఈ సారి పులివెందుల తో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అయితే, ఈ సారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అవినాశ్ పోటీ చేస్తున్నారు. షర్మిల, సునీత తమ ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాశ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆసక్తి కర రాజకీయం సీఎం గా జగన్ వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లా లో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది. జగన్ కడప లో జరిగిన సభలో వివేకా హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత గురించి ప్రస్తావించినా..ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేస్తారని.. షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో..కడప కేంద్రంగా చోటు చేసుకోనున్న ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది.