వాహనదారులకు కేంద్రం బిగ్ అలెర్ట్ ప్రతిపాదించింది. ట్రాఫిక్ నిబంధన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రధానంగా చలాన్ విషయంలో కూడా కేంద్రం భారీ మార్పులు చేసింది. ఇదివరకు ఉన్న 90 రోజుల్లో చలాన్ చెల్లించే విధానానికి చెక్ పెట్టి.. 45 రోజుల్లో చెల్లించాలని అని ప్రతిపాదించింది. లేకపోతే బండి స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో భాగంగా కీలక సవరణలు చేసింది కేంద్రం. వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. 45 రోజుల్లో చలాన్ కట్టేయాలని తెలిపింది. ఆలస్యమైతే బండి సీజ్ చేసే అవకాశం ఉందని.. ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని కూడా ప్రతిపాదించింది. ఈ కొత్త రూల్స్‌కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కేంద్రం. నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనదారులు నోటీస్ కూడా జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఇక వాహనదారులకు ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీ రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి పంపవచ్చని తెలిపింది.
































