Big News: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పులు
వేసవి సెలవులు దాదాపు ముగిసే దశకు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాల పని వేళల్లో మార్పులకు ఆమోదం తెలిపినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇది వరకు పాఠశాలలు ఉదయం 9.30కి తెరుచుకుని 4.30కి మూతపడేవి. కానీ, తాజా నిర్ణయం ప్రకారం.. ఉదయం 9 గంటలకే పాఠాశాలలు తెరచుకుని 4.45 వరకు మూతపడనున్నాయి. విద్యార్థులు ఉదయం 9.30 కి స్కూలుకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందనే విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను నడపాలని అధికారులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 2024 – 2025 విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన ఆమోదం కూడా తెలిపారు.