దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఓ మ్యారేజ్ ఫంక్లన్లో జరిగిన వివాదం ఈ కేసుకు దారితీసినట్లు తెలుస్తోంది. దెందులూరులో జరిగిన వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి వాహనాన్ని ఎమ్మెల్యే చింతమనేని వాహనానికి అడ్డుపెట్టినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు
దెందులూరులో వేడెక్కిన వాతావరణం..
అబ్బయ్య చౌదరి కావాలని గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అవుతున్నారు. అయితే.. అబ్బయ్య మాత్రం తన కుటుంబాన్ని అంతమొందించే కుట్ర సాగుతోందని మండిపడుతున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.
వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ
ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఆ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎవరు అవుతారోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతోంది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.