బిగ్‌ బ్రేకింగ్‌: ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్‌!

www.mannamweb.com


టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిసిన క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవాళి క్రికెట్‌లో తన సత్తా చాటి భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకుని..

దేశానికి ప్రాతినిథ్యం వహించిన డేవిడ్‌ జాన్సన్‌(52) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉండే భవనం పైనుంచి దూకి ప్రాణం విడిచాడు. బెంగళూరులోని కొత్తనూరు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరసికెరెకు చెందిన డేవిడ్ 1996లో భారత్ తరఫున 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

కుడిచేతి వాటం పేస్‌ బౌలర్‌ అయిన జాన్సన్‌ 1996 అక్టోబర్‌ 10న ఆస్ట్రేలియాతో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌తో జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఎక్కువ కాలం టీమ్‌లో ఉండలేకపోయాడు. డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన టెస్ట్‌ జాన్సన్‌ కెరీర్‌లో చివరి టెస్ట్‌గా మిగిలింది. మొత్తంగా టీమిండియా తరఫున కేవలం రెండు టెస్టు మాత్రమే ఆడిన జాన్సన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. కానీ, దేశవాళి క్రికెట్‌లో మాత్రం జాన్సన్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. తన కెరీర్‌లో మొత్తం 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్‌ 125 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా జాన్సన్‌ పేరిట ఉంది. అలాగే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 33 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.

1971 అక్టోబరు 16న హాసన్ జిల్లా అరసికెరెలో జన్మించిన డేవిడ్ జాన్సన్ 90వ దశకంలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అప్పట్లోనే గంటకు 157.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ స్లేటర్ వికెట్ తీశాడు. అంత వేగంతో బౌలింగ్‌ వేసినా.. ఎందుకో టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ అనిల్ కుంబ్లే సంతాపం తెలిపారు. ఆయనతో పాటు మరి కొంతమంది క్రికెటర్లు సైతం జాన్సన్‌కి మృతికి సంతాపం తెలిపారు. అయితే.. జాన్సన్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.