వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

www.mannamweb.com


LPG Cylinder Price Reduced : ప్రతినెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తాయి చమురు సంస్థలు. దాదాపుగా ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది. కానీ.. వరుసగా రెండోనెల ఎల్ పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి చమురు సంస్థలు. ఇందుకు కారణం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటమేనంటున్నారు నిపుణులు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మే 1, బుధవారం ప్రకటించాయి. సవరించిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

తగ్గించిన ధరతో నేటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్ పీజీ సిలిండర్ ధర రూ. 1745.50 ఉంది. ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,74917.50 నుంచి రూ.1,698.50కి తగ్గింది. చెన్నైలో కూడా రూ.19 తగ్గింది.ప్రస్తుత ధర రూ.1,930 నుంచి రూ.1,911కు తగ్గింది. కోల్‌కతాలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 1,859గా ఉంది.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా తగ్గాయి. గతనెల వాణిజ్య సిలిండర్ ధర రూ.30 మేర తగ్గగా.. ఈ నెల రూ.19 మేర తగ్గింది. మొత్తంగా రూ.49 ధర తగ్గడంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో.. ఎల్ పీజీ సిలిండర్ ధర తగ్గుతూ వస్తుంది. యూఎస్ లో ముడి చమురు నిల్వలు పెరగడం, మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న సందిగ్ధత చమురు ధరల తగ్గుదలకు కారణం కావొచ్చని తెలుస్తోంది.