HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన మినిమం బ్యాలెన్స్

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మినిమం బ్యాలెన్స్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు రూ. 10 వేలుగా ఉన్న మినిమం బ్యాలెన్స్ ను ఏకంగా రూ.


25 వేలకు పెంచుతున్నట్లుగా కీలక ప్రకటన చేసింది. 2025 ఆగస్టు 1వ తేదీ తరువాత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వారికి ఇది వర్తిస్తుంది. పాత అకౌంట్లకు పాత నిబంధనలే కొనసాగుతాయి. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ. 25 వేలుగా(గతంలో రూ.5 వేలు)గా నిర్ధారించింది. ఇక రూరల్ ఏరియాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంటే ఫైన్ విధిస్తారు. ఈ జరిమానా లోటు మొత్తంలో 6% వరకు లేదా గరిష్టంగా రూ.600 వరకు ఉండవచ్చు. అటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని రకాల రుణాలపై MCLR (ఫండ్స్ ఆధారిత రుణ రేటు) ను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ తగ్గింపు ఆగస్టు 7నుండి అమల్లోకి వచ్చింది.ఈ మార్పు తర్వాత, బ్యాంక్ MCLR రేట్లు 8.55% నుంచి 8.75% వరకు ఉన్నాయి.

వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ (ICICI) కనీస బ్యాలెన్స్ నిబంధనలలో మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం 2025 ఆగస్టు 1 నుండి మెట్రో మరియు పట్టణ ప్రాంతాల్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారికి కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) రూ. 10,000 నుండి రూ. 50,000 కు పెంచింది.సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ. 5,000 నుండి రూ. 25,000 కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,000 నుండి రూ. 10,000 కు పెంచింది. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి్ంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.ఇప్పుడు మెట్రో, పట్టణ ప్రాంతాల్లో MAB అవసరాన్ని రూ. 50,000 నుండి రూ. 15,000 కు తగ్గించింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ. 7,500 కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,500 కు సవరించింది. ఈ నిబంధనలు ఆగస్టు 1, తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి. పాత అకౌంట్లకు పాత నిబంధనలే కొనసాగుతాయి.

మొదటి ఐదు లావాదేవీలు ఉచితం

అటు ICICI బ్యాంక్ ATMలలో నెలకు మొదటి ఐదు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.23 వసూలు చేస్తారు. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మిని స్టేట్మెంట్ వంటివి) ఉచితం. ఆరు మెట్రో నగరాలలో (ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు మరియు హైదరాబాద్), నెలకు మొదటి మూడు లావాదేవీలు (ఫైనాన్షియల్ మరియు నాన్-ఫైనాన్షియల్) ఉచితం. ఆ తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.23, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.8.5 వసూలు చేస్తారు. ఇతర ప్రాంతాలలో మొదటి ఐదు లావాదేవీలు ఉచితం, ఆ తర్వాత పైన పేర్కొన్న ఛార్జీలు వర్తిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.