BIG BREAKING: కవితకు బిగ్‌ షాక్‌.. బెయిల్ నిరాకరణ

www.mannamweb.com


Kavitha Bail: ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కవిత పటిషన్‌ను తిరస్కరిస్తూ.. బెయిల్‌కు నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన కవిత.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే కవిత ఇంతకుముందు బెయిల్‌ కోసం రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ ఆమె బెయిల్‌ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కవిత.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. లిక్కర్‌ కేసులో 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కవిత తరఫు న్యాయవాది వాదనతో సహా.. సీబీఐ, ఈడీ వాదనలు విన్న కోర్టు జులై 1కి తీర్పును రిజర్వు చేసింది. చివరికి ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించడంతో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగినట్లైంది.