టీచర్లకు భారీ షాక్ ఇచ్చింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE). ఇకపై ఉపాధ్యాయులందరికీ టెట్(TET) పరీక్ష ఉత్తీర్ణత కంపల్సరీ అంటూ ఆదేశాలిచ్చింది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసుల్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని NCTE కి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించగా.. తాజాగా దానిని NCTE తిరస్కరించింది. కొత్త టీచర్లకే కాదు, పాత వారికి కూడా టెట్ తప్పనిసరి అంటూ తేల్చి చెప్పింది. 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ రానున్న రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చింది.
అయితే 2017 పార్లమెంటు తీర్మానం ప్రకారం ఆ తీర్పు ఇవ్వగా.. అంతకముందు టీచర్లుగా నియమితులైన వారికి ఈ తీర్పు వర్తింపజేయకూడదని కోరారు. అయితే దీనిపై NCTE కూడా సుప్రీంకోర్టునే అనుసరిస్తూ.. వారి అభ్యర్థన పక్కన పెట్టేసి, టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది.
































