మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కృత్రిమ మేధస్సు (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మొబైల్ ర్యామ్ కంటే AI సర్వర్లకు అవసరమైన చిప్‌లకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల మొబైల్ విడి భాగాల సరఫరాపై ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు.
అలాగే, హైఎండ్ DRAM లాంటి ఖరీదైన కాంపోనెంట్స్ వినియోగం పెరగడం ఫోన్ల తయారీ ఖర్చును పెంచి, దాని ప్రభావం ధరలపై పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో 16GB RAM వేరియంట్లు క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగై, గరిష్ఠంగా 12GB RAMకే ఫోన్లు పరిమితం కావొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆపిల్ కంపెనీ తన స్మార్ట్ ఫోన్ల ధరలను సుమారు రూ.7 వేల వరకు పెంచే అవకాశం ఉంది. ఇక, ఇతర కంపెనీలు కూడా సుమారు రూ.2 వేల వరకు ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం.




































