హర్షసాయి కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి నుంచి డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుండటంతో ఈ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడంటోంది బాధితురాలు. కానీ ఆ అమ్మయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయట పెట్టాడు హర్షసాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… ఇది “మెగా” కి సంబంధించిన కాపీ రైట్స్ విషయంలో జరిగిన తగదాగా తెలుస్తోంది. ఈ కు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడని ఆరోపణ. ఆ వీడియోలని సీక్రెట్‌గా రికార్డ్ చేసి… కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారు అంటూ హర్షసాయి ఓ పోస్ట్ పెట్టాడు. ఇక సీన్‌లోకి తమ న్యాయవాదులను దింపారు హర్షసాయి, బాధితురాలు. ఇద్దరి న్యాయవాదులు మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. బాధితురాలి న్యాయవాది నాగూర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో రికార్డు చేశాడని చెప్పారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు హర్షసాయికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. గతంలో ఏపీ పోలీస్ శాఖ దిశా యాప్ ప్రమోషన్ కోసం హర్ష సాయిను వాడుకున్నారు. ఈ మేరకు అతనితో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంది ఏపీ పోలీసుశాఖ. లైంగిక దాడి కేసులో హర్షసాయి నిందితుడిగా ఉండడంతో అగ్రిమెంట్ రద్దు చేసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక హర్ష సాయి పై తెలంగాణలోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 328, 376 (2) 354 , 376 ఎన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో తాను ఏ తప్పు చేయలేదు అని.. ఆయువతే తనను వేధిస్తోందని , ఫోన్ కాల్ రికార్డింగ్స్ బయట పెట్టాడు హర్ష సాయి.