మహిళల ఖాతాల్లోకి డబ్బులు

ఈ నెల 26 నుంచి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. 2023 – 24 లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు అధికారులు.


కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒక వేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలు ఉంటే.. వారిద్దరిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్‌లో నగదు వేస్తారు.

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాది రూ.12 వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్‌ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6 వేలు జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.