అమ్మకు నమస్కారం చేయడం గురించి పెద్ద అప్‌డేట్.. మీరు ఈ 2 పనులు చేశారా

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు రెడీ అవుంది. వీటిల్లో ముఖ్యమైన తల్లికి వందనం పథకం..


జూన్ నెలలోనే అమల్లోకి రానుంది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత జూన్‌లోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. జూన్‌లోనే ఈపథకాన్ని అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది. తల్లకి వందనం పథకం అమలుకు కొన్ని రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. ఈ పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ జారీ చేసింది. రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం నిధులు రావని తెలిపింది. ఆ వివరాలు..

ఈ ఏడాది జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అయితే దాని కన్నా ముందే.. తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు. తల్లికి వందనం నిధులు కట్ కాకుండా.. నేరుగా ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి అని స్పష్టం చేశారు.

అలానే లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో కూడా తప్పకుండా లింకప్ చేయాలని అధికారులు సూచించారు. ఈ రెండు పనులు చేయకపోతే.. తల్లికి వందనం నిధులు ఖాతాలో జమ కావని అధికారులు తెలిపారు. కనుక విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తమ బ్యాంక్ అకౌంట్‌ను.. ఆధార్, ఎన్‌పీసీఐతో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ లింక్ కాకపోతే.. ఆ పని పూర్తి చేయాలి వెల్లడించారు.

తల్లికి వందనం పథకం నిధులు తల్లుల అకౌంట్‌లో రూ.15వేలు నగదు జమ కావాలంటే ఖచ్చితంగా ఆధార్, ఎన్‌పీసీఐ లింకింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. అలానే ఎన్‌పీసీఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు.. రాష్ట్రంలోని పోస్టల్, సచివాలయ సిబ్బందితో పాటుగా అధికారులు కూడా సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. జూన్ 5వ తేదీలోగా అందరికీ ఆధార్, ఎన్‌పీసీఐ లింకేజ్ చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సహకరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలానే జూన్ నెలలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పథకం కింద నిధులు విడుదల చేయాలని సర్కార్ కసరత్తులు చేస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.