బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! కంటెస్టెంట్స్ ఎవరంటే?

www.mannamweb.com


బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది.

గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగస్ట్ నెలాఖరలోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపికచేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ స్టార్స్‌తో పాటు కొందరు నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గా తీసుకురానున్నారని టాక్. ఇటీవలే శశి మధనం తెలుగు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఇక గత బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒక్కరు కూడా హౌజ్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్‌బాస్‌లో కనిపించనున్నారట. పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్‌పీ, బుల్లెట్ భాస్కర్‌ల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బంచిక్ బబ్లూ, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రిత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా , బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణు స్వామి, ఏక్‌నాథ్‌, హారిక జోడి బిగ్‌బాస్‌లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే యాంకర్స్ వర్ణిణి, విష్ణుప్రియ తో పాటు హేమ, రాజ్‌తరుణ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే షో లాంఛింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్ యాజమాన్యం.