ప్రపంచంలోనే అత్యంత వయస్సు గల అడవి పక్షి(74) గుడ్డు పెట్టిందని అమెరికా జీవశాస్త్రవేత్తలు తెలిపారు. విస్డమ్ అనే పొడవాటి రెక్కలున్న సముద్రపక్షి.
లేసన్ ఆల్బాట్రాస్, హవాయి ద్వీపసమూహం యొక్క వాయువ్య అంచున ఉన్న మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్‌లైఫ్ రెఫ్యూజ్కి తిరిగి వచ్చి గుడ్డు పెట్టిందని నిపుణులు అంచనా వేశారు. విజ్డమ్, తన జంట పక్షితో కలిసి 2006 నుండి గుడ్లు పెట్టడానికి, పొదుగడానికి పసిఫిక్ మహాసముద్రంలోని అటోల్కు తిరిగి వచ్చారు. ఇవి జీవితాంతం సహజీవనం చేస్తూ, సంవత్సరానికి ఒక గుడ్డు పెడతాయి. ఆల్బాట్రాస్ తల్లిదండ్రులు దాదాపు రెండు నెలల పాటు గుడ్డును పొదిగిస్తారు. పిల్లలు పొదిగిన ఐదు నుండి ఆరు నెలల తర్వాత సముద్రానికి ఎగురుతాయి. అవి వాటి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం మీదుగా ఎగురుతూ, స్క్విడ్ మరియు చేపల గుడ్లను తింటారు. ఈ పక్షి చివరిగా 2021లో పొదిగినట్లు నిపుణులు తెలుపుతున్నారు.