రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన

రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా.


తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు

సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో ఆరుబయట కట్టెల పొయ్యిపై బిర్యానీ వండాడు

అనంతరం అతనే స్వయంగా రామ్ చరణ్ తో పాటు ఉపాసన, సురేఖలకు వడ్డించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

అటు రామ్ చరణ్ కూడా తన ఇంట్లో జరిగిన బిర్యానీ పార్టీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.