బ్రౌన్ రైస్ కంటే బ్లాక్ రైస్ 100 రెట్లు బెటర్.. ఆ జబ్బుకు చెక్ పెట్టేది ఇదొక్కటే

మనలో చాలా మంది రోజూ తినేది తెలుపు రంగు బియ్యం. వీటి వాడకం గురించి అందరికి తెలిసిందే కానీ తక్కువ మందికి పరిచమైన  రైస్ కూడ ఒకటి ఉంది. అదే బ్లాక్ రైస్ ఈ రైస్ రాజులు, చక్రవర్తులు కాలం నాటి బియ్యం అని చెబుతుంటారు.

మనలో చాలా మంది రోజూ తినేది తెలుపు రంగు బియ్యం. వీటి వాడకం గురించి అందరికి తెలిసిందే కానీ తక్కువ మందికి పరిచమైన  రైస్ కూడ ఒకటి ఉంది. అదే బ్లాక్ రైస్ ఈ రైస్ రాజులు, చక్రవర్తులు కాలం నాటి బియ్యం అని చెబుతుంటారు. వీటిని ఆకాలంలో రహస్యంగా సాగు చేసి రాజులు, చక్రవర్తులు మాత్రమే తినేవారని తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గం కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్ కుమార్ రెడ్డి ఈ బ్లాక్ రైస్ సాగు వెనకున్న మూడేళ్ళుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ రైతు దగ్గర 18 రకాల దేశవాళి రకంకు చెందిన  బియ్యాలు ఉన్నాయి. వీటిని కొన్ని ఏళ్లుగా ఆన్లైన్, ఆఫ్ లైన్ మార్కెటింగ్ కూడ చేస్తున్నారు. వీటి ధరలు అమెజాన్, మాల్స్
తమిళనాడు తరహాలోనే ఏపీలో..


సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం నాలుగు నెలలు మాత్రమే. అద్భుతమైన ఔషధ గుణాలున్న బ్లాక్ రైస్ రకం ఇప్పుడు రైతులకు వరంగా మారింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలో అక్కడి పూర్వీకులు సహజ పద్ధతిలో సాగు చేస్తూ వరి విత్తనాలను కాపాడుకుంటూ వచ్చారు. అవే నేటి తరాలకు ఆందుబాటులోకి వస్తున్నాయి. తమిళనాడు ప్రాంతం నుంచి మాపిళ్ళై సాంబ( బ్లాక్ రైస్) విత్తనాలను తెచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ప్రకృతి రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా ఈ వంగడాన్ని కొన్నళ్లుగా సాగు చేస్తున్నారు.
ఊపందుకున్న సాగు..

పలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామం వద్ద చందూల్ కుమార్ అనే ప్రకృతి రైతు మూడేళ్లుగా బ్లాక్ రైసు సాగు చేస్తున్నాడు. ఈసారి తన ఎకరం పొలంలో ఈ వంగడాన్ని నాటాడు. ప్రస్తుతం వరి పంట ఆరు ఆడుగులకు పైగా పెరిగి ఏపుగా ఎన్ను పట్టింది. రైతు పూర్తిగా సేంద్రియ సహజ పద్ధతిలో పంట సాగు చేశాడు. సాధారణంగా వరి పంట కాలం నాలుగు నెలలుగా ఉంటే దీనికి ఏడు నెలలు ఉంటుంది. ఈ రైతు పండిం చిన రకానికి చుట్టుపక్కల ప్రాంతాలే రాదు కర్ణాటక నుంచి సైతం రైతులు సందర్శించి వెళుతున్నారు. ఈ విడత పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్ లో 30 ఎకరాల్లో బ్లాక్ రైస్ సాగు అవుతోందని పట్టణ వ్యవసాయాధికారి సంధ్య తెలిపారు.
బ్లాక్ రైస్ ప్రత్యేకత..

ఈ రైస్ నలుపు రంగులో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ  క్యాన్సర్ కారకాలు ఈ రైస్ లో ఉంటాయి. మన శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉంటే క్యాన్సర్ ను కరిగించే శక్తి ఉంటుంది. ఇందులో బి 12 విటమిన్స్ పుష్కలంగా ఉంటాయన్నారు. బ్లాక్ రైస్ ను కాలపాటి బియ్యం అని కూడ అంటారు. ఒక పిడికిడి బ్లాక్ రైస్ తింటే చాలు అర్ధ కేజీ మటన్ లో ఉండే  బి 12 విటమిన్స్ లభిస్తాయన్నారు. రైస్ నుంచి వచ్చే గంజి కూడా తినడానికి కమ్మగా ఉంటుందన్నారు. షుగరు బీపీ ఉన్నవారు రోజు వారీ ఆహారం తీసుకొంటే చాలు షుగరు,బీపీ ను కంట్రోల్ చేయొచ్చన్నారు. చిన్న పిల్లలకు స్వీట్, పాయసం వంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారన్నారు. ఆన్లైన్ ,ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రైస్ ధర రూ.300 పైన పలుకుతోంది. బయట దేశాల్లో అమెరికా వంటి ప్రదేశాల్లో కిలో ధర రూ.600 నుండి 700 ఉంది. రైతుగా తాను కిలో రూ.130 అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ ధర వస్తే చాలు రైతుగా హ్యాపీగా ఫీల్ కావోచ్చన్నారు. ఈ సాగు మొత్తం రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్దతిలో పాలేకర్ అడుగుజాడల్లో సలహాలు సూచనలు మేరకే సాగు చేస్తున్నట్లు తెలిపారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.