Blinkit: ఇప్పుడు 10 నిమిషాల్లో ఏసీల డెలివరీ!

Blinkit: ఇప్పుడు 10 నిమిషాల్లో ఏసీల డెలివరీ!


Blinkit: గత కొన్ని రోజులుగా క్విక్‌ కామర్స్‌ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. మొదట కేవలం కిరాణా వస్తువుల డెలివరీతో ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ఇప్పుడు మొబైల్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్‌జెట్లు వంటి వస్తువులను కూడా 10 నిమిషాల్లో అందించడం ప్రారంభించాయి. ఇదే ఫ్లోలో ఇప్పుడు జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్‌ ఇంకా ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ చేసింది.

వేసవికి సిద్ధంగా: ఇంట్లోకే 10 నిమిషాల్లో ఏసీ!

వేసవి కాలంలో ఏసీల డిమాండ్‌ పెరుగుతోంది. ఈ అవసరాన్ని గమనించిన బ్లింకిట్‌, ప్రసిద్ధ ఏసీ బ్రాండ్‌ లాయిడ్‌తో కలిసి 10 నిమిషాల్లో ఏసీ డెలివరీ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా లాయిడ్‌ బ్రాండ్‌ ఏసీలు త్వరితగతిని కస్టమర్ల ఇళ్లకు చేరుకుంటాయి. ప్రస్తుతం ఈ సేవ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలో ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా తెలిపారు.

డెలివరీ తర్వాత 24 గంటుల్లో ఇన్‌స్టాలేషన్‌

కేవలం ఏసీ డెలివరీ మాత్రమే కాదు, డెలివరీ అయిన 24 గంటల్లోపు బ్లింకిట్‌ టీం వారి ఇంటికి వెళ్లి ఏసీని ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఈ కొత్త సేవతో, బ్లింకిట్‌ క్విక్‌ డెలివరీ సెక్టార్‌లో మరో మైలురాయి సాధించింది. వేగంగా, సులభంగా ఇంట్లోకే ఏసీలు పొందే అవకాశం ఇప్పుడు బ్లింకిట్‌ ద్వారా సాధ్యమవుతోంది!

“తక్కువ సమయంలో, ఎక్కువ సౌకర్యం!” – బ్లింకిట్‌