Dark Underarms: చంకల్లో నలుపుదనం పోగొట్టే ఎఫెక్టీవ్ హోమ్ రెమిడీస్..
శరీరంలోని అన్ని భాగాలనూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే మరింత అందంగా కనిపిస్తారు. చాలా మందికి చంకలో నలుపుదనం ఉంటుంది. దీంతో స్లీవ్ లెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు ఇష్టమైన దుస్తులను ధరించ లేరు. చంకల్లో నలుపుకు చాలా కారణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఉన్న డియోడరెంట్‌లను ఉపయోగించడం, క్లెన్సింగ్‌లో జాగ్రత్తలు తీసుకోలేక పోవడం, మృత కణాలు బాగా పేరుకు పోవడం..
శరీరంలోని అన్ని భాగాలనూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే మరింత అందంగా కనిపిస్తారు. చాలా మందికి చంకలో నలుపుదనం ఉంటుంది. దీంతో స్లీవ్ లెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు ఇష్టమైన దుస్తులను ధరించ లేరు. చంకల్లో నలుపుకు చాలా కారణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఉన్న డియోడరెంట్‌లను ఉపయోగించడం, క్లెన్సింగ్‌లో జాగ్రత్తలు తీసుకోలేక పోవడం, మృత కణాలు బాగా పేరుకు పోవడం, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వంటివి ఉపయోగించడం వల్ల చంకల్లో నలుపుదనం అనేది ఉంటుంది.
చంకల్లో నలుపుదనం వదిలించు కోవడానికి ఖరీదైన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల్ని ఉపయోగించి మీ డార్క్ ఆర్మ్పిట్‌ను వదిలించుకోవచ్చు. మరి చంకల్లో ఉండే నలుపు దనం పోగొట్టుకోవడానికి ఎలాంటి చిట్కాటు ఉపయోగ పడతాయో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ ఇ:
చంకల్లో నలుపుదనం పోగొట్టు కోవడానికి విటమిన్ ఇ, కొబ్బరి నూనె ఎంతో చక్కగా ఉపయోగ పడతాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి.. నలుపు దనం ఉన్న చోట రాసుకోవచ్చు. కొబ్బరి నూనె చర్మానికి పోషణ అందించి.. మృదువుగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఇ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ప్రతి రోజూ స్నానం చేసే ఒక గంట ముందు అప్లే చేసి, మర్దనా చేసి ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
నిమ్మకాయ:
నలుపుదనం తగ్గించడంలో నిమ్మకాయ కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. కాబట్టి నలుపు త్వరగా తగ్గుతుంది. నిమ్మకాయను కట్ చేసి.. చంకల్లో రుద్దాలి. ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు. నిమ్మకాయ రుద్దిన తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో కూడా చంకల్లో ఉండే నలుపుదనం తగ్గించుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలిపి చంకల్లో స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి.. నలుపు దనం క్రమంగా తగ్గుతుంది.