వీడు మామూలోడు కాదు.. రీల్స్ కోసం సముద్రంలోనే స్కూటర్ నడిపాడు..

వీడు మామూలోడు కాదు.. రీల్స్ కోసం సముద్రంలోనే స్కూటర్ నడిపాడు..
రాను రాను రీల్స్ పైత్యం ఎక్కువైపోతోంది జనాలకు. ఫేమస్ అవ్వటం కోసం వింత ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలామంది.ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.ఓ వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తో సముద్రంలోకి వెళ్ళాడు.


కొంత దూరం వెళ్లిన అతను అలలు వేగంగా వస్తుండటంతో మళ్లీ వెనక్కి వచ్చాడు, వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్లిన అతను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం భయంతో వచ్చాడు.

ఆ వ్యక్తి రిటర్న్ వస్తున్న సమయంలో స్కూటర్ ఆగిపోవడంతో తోసుకుంటూ వచ్చాడు. భయంతో ఒడ్డుకు వచ్చిన సదరు వ్యక్తి మళ్లీ సముద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.ఈ వీడియోను లాఫ్టర్ ఐకాన్ లతో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.ఓలా కంపెనీ వాడు వీడికి కోటిరూపాయల ప్రైజ్ మని ఇవ్వాలంటూ కొంతమంది నెటిజన్లు. అంత లోతు నీటిలోకి వెళ్లినా మళ్ళీ ఆ స్కూటర్ ఆఫ్ అవ్వకుండా పని చేయటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.