Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసిందోచ్చ్.. ఆ క్రెడిట్ కార్డులపై నమ్మలేని తగ్గింపులు

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ వచ్చేసిందోచ్చ్.. ఆ క్రెడిట్ కార్డులపై నమ్మలేని తగ్గింపులు


భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీలో ఇవ్వడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఆ సేల్స్ సమయంలో కొన్ని ఉత్పత్తుల నమ్మలేని తగ్గింపులతో ఆఫర్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆయా సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ డే 2024 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు అనేక డీల్‌లు, కొత్త లాంచ్‌లతో సేల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌లో సామ్‌సంగ్, మోటోరోలా, వన్‌ప్లస్, ఎంఐ, ఐక్యూ, హానర్, రియల్ మీ వంటి ఫోన్లపై తగ్గింపులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్‌డే సేల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపుపై 10 శాతం పొదుపు పొందవచ్చు. అలాగే 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. అలాగే ప్రైమ్ డే సేల్‌లో కొన్ని కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఆయా ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులతో పాటు క్రెడిట్ కార్డుల తగ్గింపులు కూడా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆ సరికొత్త స్మార్ట్ ఫోన్ల గురించి కూడా తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 35 ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 17న లాంచ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐక్యూ జెడ్ 9 లైట్ 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కూడా జూలై 17న లాంచ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (అల్ట్రా ఆరెంజ్) వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో మంగళవారం లాంచ్ చేసిన రెడ్‌మీ 13 5జీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా సేల్ సమయంలో కస్టమర్‌లు కొత్త ఆర్చిడ్ పింక్ వేరియంట్‌ను పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో హానర్ 200 సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ జూలై 18న లాంచ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో లావా బ్లేజ్ ఎక్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జూలై 10న లాంచ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రియల్మీ జీటీ 6టీ మిరాకిల్ పర్పుల్ వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్ ప్లస్ 12 ఆర్ 5జీ కొత్త వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.