Friday, November 15, 2024

వైరల్ వీడియో: స్కూల్లో నిద్రపోయిన చిన్నారి. చివర్లో క్యూట్ రియాక్షన్..!!!

నేటి కాలంలో ఇంటర్నెట్‌లో రోజుకో కొత్త వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి.

సాధారణంగా బిడ్డ ఉన్న ఇంట్లో ఆనందానికి లోటు ఉండదు.

పిల్లలు చేసే చిన్న చిన్న పనులు కూడా ఇంట్లోని వారి హృదయాలకు ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తాయి.

అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు విడుదలైన వీడియోలో ఓ చిన్నారి స్కూల్లో కూర్చుని నిద్రపోతోంది. కొన్ని సెకన్లపాటు నిద్రపోయే పిల్లవాడు ఏదో ఒక సమయంలో కిందపడిపోతాడు. అప్పుడు అందరూ పిల్లవాడిని చూడటం చూసి భయంగా లేచి ఒక్క నిమిషం సిగ్గుపడి నవ్వు ఆపుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఏపీ మహిళలకు చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.18 వేలు పొందే ఛాన్స్!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని చెప్పిన విధంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వగా ఆ హామీ నిలబెట్టుకునే దిశగా అడుగులు పడనున్నాయి.

18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు.

ఈ స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఏడాదికి ఏకంగా 18,000 రూపాయల మొత్తం జమ కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణమైన పథకాలలో ఈ పథకం కూడా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

నెలకు 1500 రూపాయలు ప్రభుత్వం నుంచి అందడం ద్వారా మహిళలు దీర్ఘకాలంలో పొందే ప్రయోజనం అంతాఇంతా కాదు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను ఎవరి సపోర్ట్ లేకుండానే కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహిళలపై ఆర్థిక భారం తగ్గించే పథకాలను కూటమి సర్కార్ అమలు చేస్తుండటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కూటమి సర్కార్ ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను ప్రజలు పొందవచ్చు. ఏపీ సర్కార్ ఒకవైపు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి నిర్ణయాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి .. మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ,అముమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి.

ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకొనే ఆహారం,జంక్ ఫుడ్ తినటం,బోన్ కి అవసరమైన పోషణ లేకపోవటం.

కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కీళ్ల నొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది.

ఆ బాధ భరించటం చాలా కష్టం. ఆ బాధ భరించలేక చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అటుకులు, నాలుగు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేస్తే పెరుగులో అటుకులు నాని మెత్తగా అవుతాయి.

పెరుగులో నానిన అటుకులను ప్రతి రోజు తినాలి. వీటిని ఏ సమయంలోనైనా తినవచ్చు. పెరుగు,అటుకులు రెండింటిలోనూ కాల్షియం ఉండటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

అటుకుల్లో పెరుగు కలిపి తినటం కష్టంగా ఉంటే కొంచెం తాలింపు పెట్టుకొని తినవచ్చు. ప్రతి రోజు అటుకులు,పెరుగు కలిపి తింటే మీకు ఆ తేడా వారంరోజుల్లోనే కనపడుతుంది. పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఏపీలో ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ

అమరావతి: ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధివిధానాలు వర్తిస్తాయని, రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీల్లో జిల్లా ఎస్పీ, సంయుక్త కలెక్టర్‌ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని పేర్కొంది. జిల్లాల్లోని స్టాక్‌ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీలకు సూచించింది. రాష్ట్రంలోని వివిధ స్టాక్‌ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్‌ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డి-సిల్టేషన్‌ ఎక్కడెక్కడా చేపట్టాలనేది జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయిస్తాయని, ఇసుల లోడింగ్‌, రవాణా ఛార్జీలను నిర్థారించే బాధ్యత కూడా జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది. స్టాక్‌ పాయింట్ల వద్ద లోడింగ్‌, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్‌ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని, భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని తెలిపింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్‌ చేసినా జరినామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఒంట్లో కొలెస్ట్రాల్‌ సహజంగా తగ్గాలంటే.. రోజూ 30 నిమిషాలు ఇలా చేయండి!

Cholesterol Exercises: ఒంట్లో కొలెస్ట్రాల్‌ సహజంగా తగ్గాలంటే.. రోజూ 30 నిమిషాలు ఇలా చేయండి!

కొలెస్ట్రాల్ సమస్య గుండెపోటు, స్ట్రోక్‌ సమస్యకు కారణం అవుతుంది. అయితే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే దీనిని సైలెంట్‌ కిల్లర్ అంటారు. ప్రతి 6 నెలలకు బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ.. తరచూ తనిఖీ చేసుకుంటూ ఉంటే తొలి నాళ్లలోనే పసిగట్టవచ్చు. అయితే అధిక కొలెస్ట్రాల్‌కు కేవలం మందులు వాడటం వల్ల మాత్రమే కొలెస్ట్రాల్ అదుపులో ఉండదు..

కొలెస్ట్రాల్ పెరిగితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని ముట్టుకోకపోవడమే మంచిది. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతోపాటు తక్కువ నూనె, మసాలాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కేవలం జిమ్‌కి వెళ్లడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గవు. బదులుగా ఈ కింది 5 జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతిరోజూ 30-40 నిమిషాలు తప్పనిసరిగా నడవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజువారీ నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం నడవలేకపోతే, కనీసం రాత్రి వేళల్లో అయినా నడవడం అలవాటు చేసుకోవాలి.

వాకింగ్‌తో పాటు జాగ్ కూడా చేయవచ్చు. రన్నింగ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అయితే, అకస్మాత్తుగా వేగంగా పరుగెత్తడం ప్రారంభించకూడదు. క్రమంగా వేగాన్ని పెంచాలి. సైక్లింగ్ చేయడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితాయి. రోజులో ఎప్పుడైనా ఇంటి చుట్టూ సైకిల్ తొక్కండి. ఇది కండరాల నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

స్విమ్మింగ్‌ కూడా చేయవచ్చు. స్విమ్మింగ్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలపరుస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆస్తమా సమస్యలను తగ్గిస్తుంది. జిమ్‌కి వెళ్లే బదులు ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయవచ్చు. యోగా వల్ల కొలెస్ట్రాల్‌తో పాటు షుగర్, రక్తపోటు, బరువు కూడా అదుపులో ఉంటాయి.

Curd: రాత్రి పెరుగు తినడం నిజంగానే మంచిది కాదా.? నిపుణులు ఏమంటున్నారంటే..

జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్నింటికీ పెరుగు ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న పెరుగు విషయంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది రాత్రుళ్లు పెరుగు తీసకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.? ఇంతకీ నిజంగానే రాత్రి పెరుగు తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్ని రకాల కూరలు ఉన్నా.. చివర్లో ఒక ముద్ద పెరుగుతో తింటే ఆ మజానే వేరు. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ పెరుగును ఎంతో ఇష్టపడి తింటుంటారు. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా పెరుగుతో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్నింటికీ పెరుగు ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న పెరుగు విషయంలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది రాత్రుళ్లు పెరుగు తీసకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.? ఇంతకీ నిజంగానే రాత్రి పెరుగు తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా.? ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రిపూట పెరుగు తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే టైరమైన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీని కారణంగా మీరు త్వరగా నిద్రపోలేరు. దీంతో ఇది నిద్రలేమి సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* పెరుగు శరీరానికి ప్రొటీన్లను అందించే అద్భుతమైన ఆహారమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పెరుగులో కొవ్వు కూడా ఉంటుంది. సహజంగానే రాత్రి పడుకున్న తర్వాత శారీరకంగా అసలు శ్రమ అనేది ఉండదు. దీంతో ఆ కొవ్వులు శరీంలో నిల్వ అవుతుంటాయి. ఇది బరువు పెరగడానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

* రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బర, గ్యాస్‌ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. దీన్నే లాక్టోస్ ఇంటొలరెన్స్ అంటారు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ, మన శరీరం లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది.

* కీళ్ల నొప్పులతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పెరుగుతినడం వల్ల కీళ్లలో దృఢత్వం తగ్గుతుంది, నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది.

మరి ఎప్పుడు తినాలి.?
పెరుగును రాత్రి కంటే ఉదయం తీసుకోవడం బెటర్‌. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో పెరుగును తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మధ్యాహ్నం పెరుగుతో తింటే నిద్ర వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉదయం తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పెద్దలు చద్దన్నంను మనకు అలవాటు చేశారు. ఉదయం చద్దనం తినడం వల్ల కడుపు హాయిగా ఉంటుంది.

Engineering: ఏపీలో ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు

రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు.

అమరావతి: రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ.లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు.

గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా ఉంది.

AP TET 2024: ఏపీ టెట్‌ షెడ్యూల్‌లో కీలక మార్పులు.. పరీక్షలు ఎప్పుడంటే?

AP TET 2024 ఇటీవల ఇచ్చిన టెట్‌ నోటిఫికేషన్‌లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. సన్నద్ధత కోసం అభ్యర్థులకు మరింత సమయం ఇచ్చేందుకు వీలుగా సవరించింది.

AP TET 2024| అమరావతి: రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

టెట్ సవరించిన షెడ్యూల్‌ ఇదే..

  • టెట్‌  నోటిఫికేషన్‌ విడుదల : జులై 2
  • పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆగస్టు 3 వరకు..
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు3 వరకు
  • ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి అందుబాటులోకి
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 22 నుంచి
  • పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20వరకు  (రెండు సెషన్లలో)
  • ప్రొవిజినల్‌ కీ : అక్టోబర్‌ 4న
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
  • తుది కీ విడుదల: అక్టోబర్‌ 27
  • ఫలితాలు విడుదల: నవంబర్‌ 2న

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో BRS ఎమ్మెల్యేలు భేటీ

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో BRS ఎమ్మెల్యేలు భేటీ
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు.

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాంశాలు సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీలో పనిచేసినవారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసి పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీకి వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

టీడీపీ నేతలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలువడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ చేస్తున్న లీకులకు ఎమ్మెల్యేల భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే పార్టీలో చేరుతారా..? లేదా..? అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని పేర్కొంటున్నారు. ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నందుకు కలిసి శుభాకాంక్షలు తెలిపామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వర్ రావు సైతం కలిసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం

Home Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు? నిబంధనలు ఏంటి?

Home Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు? నిబంధనలు ఏంటి?

చాలా మంది బ్యాంకు నుంచి హోమ్‌ లోన్‌ తీసుకుంటారు. ఇల్లు నిర్మించాలన్నా, కొనుగోలు చేయాలన్నా బ్యాంకు రుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ గృహ రుణం చెల్లించడం దీర్ఘకాలింగా ఉంటుంది.

అయితే రుణాన్ని క్లియర్ చేసేలోపు రుణం పొందిన వ్యక్తి చనిపోతే? హోమ్ లోన్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అడిగే అత్యంత సాధారణ ప్రశ్నలలో ఇది ఒకటి. ఇది చాలా సవాలుగా ఉన్న పరిస్థితి అయినప్పటికీ, ఈ తీవ్రమైన పరిస్థితి ఏర్పడితే ఏ ఎంపికలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. గృహ రుణాన్ని చెల్లించేలోపు రుణం కొనుగోలుదారు మరణిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

సాధారణంగా గృహ రుణ గ్రహీత రుణ కాల వ్యవధిలో మరణిస్తే గృహ రుణ కొనుగోలుదారు చట్టపరమైన వారసులు బకాయి ఉన్న లోన్ బ్యాలెన్స్‌ను తిరిగి చెల్లించడం తప్పనిసరి. అంతేకాకుండా, మరణించిన హోమ్ లోన్ కొనుగోలుదారు చట్టపరమైన వారసులు ఈఎంఐ చెల్లింపులను కొనసాగించవచ్చు. రుణం గురించి మళ్లీ చర్చలు జరపవచ్చు లేదా రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆస్తిని విక్రయించవచ్చు.

చట్టపరమైన వారసులు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే ఏమి చేయాలి?

అలాంటప్పుడు రుణం ఇచ్చే ఆర్థిక సంస్థకు అనుషంగిక ఆస్తిని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. అలాగే, బకాయి ఉన్న లోన్ మొత్తం అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని మించి ఉంటే, చట్టబద్ధమైన వారసులు మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, కొన్ని పరిస్థితులలో రుణదాత తాత్కాలిక నిషేధ వ్యవధిని విధించవచ్చని గమనించాలి. ఈ సమయంలో సహ-దరఖాస్తుదారు లేదా చట్టపరమైన వారసులు తదుపరి దశలను నిర్ణయించవచ్చు.

అయితే, గృహ రుణాన్ని కొనుగోలు చేసే ముందు ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మీరు హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకుంటే కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. సాధారణంగా మీరు వెళ్లగలిగే హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్‌లో రెండు కేటగిరీలు ఉన్నాయి.

టర్మ్ ఇన్సూరెన్స్ : బీమా ఆదాయం నేరుగా నామినీకి పంపబడుతుంది. వారు రుణాన్ని, అన్ని అనుబంధ బాధ్యతలను తిరిగి చెల్లించడానికి వాటిని ఉపయోగించవచ్చు.

ప్రత్యేక గృహ బీమా : బీమా సంస్థ రుణదాతకు బకాయి ఉన్న లోన్ బ్యాలెన్స్‌ను నేరుగా చెల్లిస్తుంది.

వ్యక్తి అకాల మరణం సంభవించినప్పుడు రుణదాతను సంప్రదించి, రుణ నిబంధనలను సర్దుబాటు చేయాలి. దీర్ఘకాలంలో మీ హోమ్ లోన్‌కు బీమా చేయడం కూడా కీలకం.

Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి. 10 లక్షలు లోన్ పొందండి.!

Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి. 10 లక్షలు లోన్ పొందండి.!

Pmegp Scheme : భారత ప్రభుత్వం పౌరులకు ఎంతో ప్రయోజనం అందించటానికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొత్త PMEGP రుణ పథకం యువతి, యువకులు మరియు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకు అమలు చేయడం జరిగింది.

ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు రుజువు ద్వారా లోన్ కోసం అప్లై చెయ్యొచ్చు. అయితే లోన్ తో పాటుగా 35% సబ్సిడీ పథకం అందుబాటులో ఉన్నది. కావున ఈ ముఖ్యమైన పథకానికి ఎవరు అర్హులు మరియు అర్హత ప్రమణాలు ఏమిటి. లోన్ పొందే ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుందాం…

ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం : ఎన్నో సంవత్సరాలు గా విద్యను పూర్తి చేసి ఉద్యోగం రాని యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ముఖ్యమైన పథకాన్ని మొదలుపెట్టగా, సొంతంగా వ్యాపారం చేయాలి అనే అనుకునే యువతకు PMEGP ఈ పథకం కింద లోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే యువత ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరియు లోన్ పొందడానికి మరియు ఉపాధిని మొదలు పెట్టడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు ను ఇవ్వడం ద్వారా లోన్ పొందవచ్చు. అలాగే లోనుకు సంబంధించిన అప్లికేషన్ ఆమోదం పొందిన తర్వాత వారు తక్కువ వడ్డీ రేటు తో తిరిగి కట్టాలి..

Pmegp Scheme PMEGP పథకానికి దరఖాస్తు చేసుకోండి మరియు పది లక్షల వరకు లోన్ పొందండి

ప్రస్తుతం యువతను ఉపాధితో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని మొదలు పెట్టింది. ఇది భారతదేశంలో యువతి,యువకుల అందరికీ కూడా తక్కువ వడ్డీ రేటుతో పది లక్షల వరకు లోన్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు. అయితే వారి సొంత వ్యాపారం, అంతేకాక గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి 35% మరియు నగరంలో ఉండే వారికి మాత్రమే 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మనీ అందుబాటులో ఉండటంతో లోన్ తిరిగి కట్టడం ఎంతో సులభం అవుతుంది…

అర్హత : PMEGP లోన్ స్కీం కోసం మీరు అప్లై చేసుకునే వ్యక్తి ప్రాథమిక విద్యలో అనగా 10 లేక ఇంటర్ లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
* వయో పరిమితి 18 ఏళ్లు పైన, 40 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి.
* వ్యాపారం చేయాలి అనుకునేవారు ఆ రంగంలో కొన్ని నిర్దిష్ట అర్హతలను కూడా కలిగి ఉండాలి.
* లోన్ పొందే వ్యక్తి భారతీయ పౌరుడు అని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి.

మీరు ఈ పథకం కింద లోను పొందడానికి మరియు పనిని మొదలు పెట్టేందుకు పటిష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే, మీ లోన్ ఆమోద ప్రక్రియ అనేది తొందరగా పూర్తి అవుతుంది…

అవసరమైన పత్రాలు :
•ఆధార్ కార్డు.
•కుల ధ్రువీకరణ పత్రం.
•చిరునామా రుజువు.
* బ్యాంక్ పాస్ బుక్.
•10 లేక 12వ తరగతి మార్కులు.
•ఈమెయిల్ ఐడి.
•పాన్ కార్డు.

Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి… 10 లక్షలు లోన్ పొందండి…!

Pmegp Scheme మీరు ఇంటి దగ్గర నుండే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి

PMEGP ఈ పథకం కోసం అప్లై ప్రక్రియ ఎంతో సులభం మరియు కేవలం. ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో సందర్శించాలి. అప్పుడు PMEGP రుణం ఎంపికపై క్లిక్ చేసి అభ్యర్థి ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయండి. అలాగే ఫోటోపై కూడా క్లిక్ చేసి దానికి అవసరమైన పత్రాలను కూడా అప్ లోడ్ చేయాలి. ఈ మొత్తం సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది.అంతేకాక పత్రాలను అప్ లోడ్ చేసిన వెంటనే కింద ఇచ్చిన సబ్ మి ట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియ,మీ రుణం అప్లికేషన్ ను ఆమోదిస్తారు. దీంతో మీ ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది…

డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Hyderabad: డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని వాయిదా వేయాలని లకిడీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు.

హైదరాబాద్‌: నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని వాయిదా వేయాలని లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్, డీఏవో పరీక్షలను రాసినట్లు తెలిపారు. వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని చెప్పారు. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో పూర్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు తాజాగా విడుదలైన కారణంగా కొంత కాలం డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యాలయ ముట్డడికి యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

ఇలా 10 బీన్స్ వాడితే.. కిడ్నీలో రాళ్లు ఐస్ క్రీంలా కరిగిపోతాయి!!

ఇలా 10 బీన్స్ వాడితే.. కిడ్నీలో రాళ్లు ఐస్ క్రీంలా కరిగిపోతాయి!!

ఇలా 10 బీన్స్ వాడితే.. కిడ్నీలో రాళ్లు ఐస్ క్రీంలా కరిగిపోతాయి!!

ఉప్పు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారపదార్థాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి అంతే కాకుండా హార్మోన్ల సమస్యలు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, జన్యుపరమైన కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.దీనిని ప్రాథమిక దశలోనే సరిదిద్దుకోవడం మంచిది.

అవసరమైన వస్తువులు:-

1) బీన్స్
2) నీరు

రెసిపీ:-

ముందుగా 10 బీన్స్‌ను కడిగి మిక్సీ జార్‌లో వేసి గ్లాస్‌లో వడకట్టి గ్రైండ్ చేసుకోవాలి కిడ్నీ ఒక నెలలో కరిగిపోతుంది.

అవసరమైన వస్తువులు:-

1)అరటి కాండం
2)నీరు

రెసిపీ:-

ఒక కప్పు సన్నగా తరిగిన అరటికాయను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి ఈ రసాన్ని ఒక గిన్నెలో వడకట్టి తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి.

అవసరమైన వస్తువులు:-

1) నిమ్మకాయ
2) చక్కెర
3) నీరు

రెసిపీ:-

ఒక గ్లాసు నీటిలో అర నిమ్మకాయ రసాన్ని పిండుకుని, కొద్దిగా పంచదార కలుపుకుని తాగితే కిడ్నీలో రాళ్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

అవసరమైన వస్తువులు:-

1) గుమ్మడికాయ
2) నీరు

రెసిపీ:-

ఒక కప్పు తెల్ల గుమ్మడికాయ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి అవసరమైనంత నీరు పోసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి.

అవసరమైన వస్తువులు:-

1) బార్లీ రైస్
2) నీరు

రెసిపీ:-

ఒక గిన్నెలో 100 మిల్లీలీటర్ల నీరు పోసి, ఒక టేబుల్ స్పూన్ బార్లీ రైస్ వేసి, మరుసటి రోజు ఈ బార్లీ నీటిని తాగితే, మూత్రపిండాల్లో రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది.

నామినేటెడ్ పదవులు ఖరారు- చంద్రబాబు,పవన్ జాబితాలో..!!

నామినేటెడ్ పదవులు ఖరారు- చంద్రబాబు,పవన్ జాబితాలో..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపైన కసరత్తు చేస్తోంది.

మూడు పార్టీలకు పదవుల అంశం పైన చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో ముందుగా రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ నుంచి కోరుకుంటున్న పదవుల పైన ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

పదవులపై చర్చ

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల పంపకాలపై టిడిపి కూటమిలో చర్చలు మొదలయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలని సాధారణ పరిపాలనశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కోరారు. కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిల్లో 25 ఛైర్మన్‌ పోస్టులు జనసేన కోరినట్లు తెలిసింది.

ఏ పార్టీకి ఎన్ని

అయితే జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్‌ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు. మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. కేవలం ఐదు ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి.

కూటమి కసరత్తు

మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్క్రూటినీ చేస్తారని చెబుతున్నారు. ఆ తరువాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భార్య ఖాతాలో డబ్బు వేసి ఆదాయపు పన్ను ఆదా చేయండి, ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది

భార్య ఖాతాలో డబ్బు వేసి ఆదాయపు పన్ను ఆదా చేయండి, ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుంది

ఆదాయపు పన్ను ఆదా చిట్కాలు: సామాన్య ప్రజలు ఆదాయపు పన్నును ఆదా చేయడానికి అనేక ఎంపికల కోసం చూస్తున్నారు. ఇందుకోసం సీఏను కూడా సంప్రదిస్తున్నారు. భార్య ఖాతాలో డబ్బు జమ చేసే అంశంపై చర్చ జరుగుతోంది.

ఈ ట్రిక్ ఉపయోగించి ఆదాయపు పన్ను ఆదా చేసుకోండి. భార్య ఖాతాలో డబ్బు జమ చేయడం ద్వారా పన్ను ఆదా చేసే విధానాన్ని ‘క్లబ్బింగ్’ అంటారు. మీరు భార్య పేరు మీద కొన్ని పెట్టుబడులు పెడితే, ఆమె ఖాతాలో డబ్బు వేస్తే, అది కొన్ని ప్రయోజనాలను తెస్తుంది. దాని కోసం, ఈ పూర్తి నియమం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం.

క్లబ్బింగ్ ఎంపిక ఏమిటి?

ఆదాయపు పన్ను రూల్స్ 60 నుండి 64 ప్రకారం, మీరు మీ భార్య ఖాతాలో డబ్బును వేసి, దాని నుండి కొంత ఆదాయాన్ని (వడ్డీ, అద్దె, డివిడెండ్ వంటివి) పొందినట్లయితే, అది మీ మొత్తం ఆదాయానికి జోడించబడుతుంది. ఇది పన్ను విధించబడుతుంది. దీనిని క్లబ్బింగ్ ఎంపిక అంటారు. అయితే ఆ మొత్తాన్ని మీ భార్యకు బహుమతిగా ఇస్తే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే, దాని నుండి వచ్చే లాభంపై క్లబ్బింగ్ నియమం వర్తిస్తుంది.

పెట్టుబడి నుండి పన్ను ఆదా చర్యలు

మీ భార్యకు తక్కువ ఆదాయం లేదా ఆదాయం లేకుంటే, మీరు ఆమె పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ వంటి పెట్టుబడి ఎంపికలను ఉపయోగించవచ్చు. దాని ద్వారా వచ్చే ఆదాయంపై తక్కువ పన్ను ఉంటుంది.

ఇంటి అద్దె భత్యం

ఇల్లు భార్య పేరు మీద ఉంటే, మీరు ఆమెకు అద్దె చెల్లించవచ్చు. కాబట్టి మీరు ఇంటి అద్దె అలవెన్స్ (HRA) కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది మీ పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది.

పొదుపు ఖాతాలో డబ్బు జమ చేయడం

భార్య పొదుపు ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. కాబట్టి మీరు పొదుపు ఖాతా నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని నివారించవచ్చు. పొదుపు ఖాతా వడ్డీపై 10,000 వరకు తగ్గింపు ఉంది.

ఏం చేయాలి?

భార్య పేరు మీద పెట్టుబడి పెట్టండి. దాని ద్వారా వచ్చే ఆదాయానికి తక్కువ పన్ను ఉంటుంది.
క్లబ్బింగ్ ఎంపికను సరిగ్గా ఉపయోగించండి.
HRA ద్వారా పన్ను ఆదా చేసుకోండి.
ఏమి చేయకూడదు?

తప్పుడు సమాచారం అందించవద్దు.
క్లబ్బింగ్ ఎంపికను విస్మరించవద్దు.
ఆలోచించకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి.
ఈ విధంగా ఆదాయపు పన్ను ఆదా చేసుకోండి

పెళ్లి చేసుకోబోతున్న భర్త పెళ్లికి ముందే తన భార్యకు ఆస్తిని బహుమతిగా ఇస్తే, ఆమె క్లబ్బింగ్ ఎంపికలోకి రాదు.
మీరు మీ భార్యకు ఖర్చులకు చెల్లిస్తున్నట్లయితే మరియు ఆమె దాని నుండి పొదుపు చేస్తే, అది ఆదాయంగా పరిగణించబడదు.
ఆరోగ్య బీమా ద్వారా పొదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80డి కింద మీరు వైద్య బీమా ప్రీమియంపై రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
బహుమతికి బదులు భార్యకు రుణం ఇవ్వడం ద్వారా ఆదాయపు పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు ఆమెకు తక్కువ వడ్డీతో చెల్లించవచ్చు. అందుకు సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలి. కాబట్టి మీ ఇద్దరి ఆదాయాలు కలిసిపోవు.
మీరు పెట్టుబడి కోసం ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ప్రైమరీ హోల్డర్ మాత్రమే భార్య అయి ఉండాలి. ఇది మీ పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఖాతా నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ప్రాథమిక హోల్డర్‌కు చేరుతుంది.

TTD Vs Telangana: టీటీడీ ఆదాయంలో వాటా అడుగుతున్న తెలంగాణ..! వాస్తవమెంత..?

TTD Vs Telangana: టీటీడీ ఆదాయంలో వాటా అడుగుతున్న తెలంగాణ..! వాస్తవమెంత..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి దశాబ్ధకాలం గడుస్తోంది. అయినా నేటికీ ఇరు రాష్ట్రాల మధ్య లావాదేవీలు కొలిక్కిరాలేదు. విభజన ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ 10 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాలకి రాజధానిగా ఉంటుంది.

కాగా ఈ పదేళ్లలో ఏపీ నూతన రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. 10 ఏళ్లు తరువాత ఏపీకి హైదరాబాధ్‌పై ఎలాంటి హక్కులు ఉండవు.

ఈ ఒప్పదం ప్రకారమే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. అయితే అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తన కంటూ ప్రత్యేక రాజధానిని నిర్మించుకోలేక పోయింది. దీనితో ప్రస్తుతం దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. ఓవైపు రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ మొగ్గు చూపట్లేదు, మరో వైపు రాష్ట్రం అప్పులు కుప్పగా మారిందని, అలానే గతంలో ఇరురాష్ట్రాల మధ్య లావాదేవీలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదని విశ్లేషలకు పేర్కొంటున్నారు.

అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నిన్న తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ఈ శమావేశంలో ఇరు రాష్ట్రల మధ్య ఉన్న లావాదేవీల గురించి చర్చించారని సమాచారం. అయితే నిన్న జరిగిన సమావేశంలో టీటీడీ ఆదాయంలో 40% వాటా తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని వైసీపీ అధినేత పేరుతో ఉన్న సోషల్ మీడియా మూఖలు ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ పోస్టులపై టీడీపీ ట్టిట్టర్ వేధికగా స్పంధించింది.

‘నిన్న జరిగిన సమావేశం, విభజన చట్టంలో ఉన్న హామీల మీద. గత 5 ఏళ్ళలో అప్పనంగా జగన్ రెడ్డి ఇచ్చేసిన ఏపి భవనాల మీద, విద్యుత్ బకాయిలపై పోరాటం చేస్తుంటే, సుప్రీం కోర్టులో జగన్ రెడ్డి కేసు వెనక్కు తీసుకుని ఏపికి నష్టం చేసిన దాని మీద, తన ఆస్తులు కాపాడుకోవటం కోసం జగన్ రెడ్డి తాకట్టు పెట్టిన 9, 10 వ షెడ్యూల్ ఆస్తుల పంపకం మీద.. తిరుమల ఆంధ్రులకి చెందిన ఆస్తి.

తిరుమల ఆస్తులు, ఆదాయం, పక్క రాష్ట్రం వాటా ఎందుకు అడుగుతుంది ? బుర్ర లేని బులుగు మీడియా, ఇలాంటి ఫేక్ వార్తలు ఆపితే మంచిది..’ అంటూ ఘాటుగా పొస్టులో రాసుకొచ్చింది.

ఇది తెలుసా? రోజూ మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే.

నీకు ఇది తెలుసా? రోజూ మూడు వెల్లుల్లి రెబ్బలు తింటే.

పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను నమిలితే కొవ్వు పోతుంది.

మరియు వెల్లుల్లి వాసన నమలడానికి విపరీతంగా ఉంటుంది.

వెల్లుల్లిపాయలు తినేవారి చెమటలో కూడా ఆ వాసన తెలిసిపోతుంది. కానీ వెల్లుల్లి అనేక అనారోగ్యాలను దూరం చేయడానికి గొప్ప ఔషధం.

ఉపయోగాలు :

# ప్రతిరోజూ మూడు వెల్లుల్లిపాయలు తింటే సరిపోతుంది; జలుబు నుంచి ఇన్ఫెక్షన్ల వరకు కడుపు సమస్యలు రావు.

# వెల్లుల్లిని తింటే బ్యాక్టీరియా, వైరల్ ఫీవర్, దగ్గు, ఇన్ఫెక్షన్లు, గాయాలు ఎప్పటికీ రావు. వచ్చినా ఎగిరి గంతేస్తుంది.

# దీన్ని ఆహారంలో చేర్చడం మంచిది; అయితే, ఇందులోని పోషకాలు తగ్గుతాయి; కాబట్టి, కొరికి మింగడం మంచిది.

# గొంతు బొంగురుందా? చింతించకండి; డాక్టర్ వద్దకు వెళ్లవద్దు; నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొరికి మింగాలి.

# మధుమేహ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లిని తీసుకుంటే, అది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది; ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది.

# వెల్లుల్లిని ఐదు నెలల పాటు నిరంతరం తింటే రక్తపోటు తగ్గుతుంది.

# వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ పోషకం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

# వెల్లుల్లి కూడా మొటిమలు మరియు మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా గ్రైండ్ చేసి దానిపై రాస్తే రోజు చివరిలోపు మొటిమలు మాయమవుతాయి.

# వెల్లుల్లి అలర్జీలకు అద్భుతమైన ఔషధం; రోజూ మూడు వెల్లుల్లి పేస్టులను మూడు వారాల పాటు కంటిన్యూగా తింటే అలర్జీ పోతుంది.

దానికి కూడా # పల్వలియా, వెల్లుల్లి సరిపోతుంది. చిగుళ్లను కొరికి దాని రసం తాగితే పంటి నొప్పి పోతుంది.

# ప్లేగు నుండి సార్స్ వరకు సూక్ష్మక్రిములను చంపగల సామర్థ్యం. రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. అపానవాయువును తొలగిస్తుంది.

# వెల్లుల్లిలోని ఈథర్ మన ఊపిరితిత్తులు, పల్మనరీ ట్యూబ్ మరియు ముఖంపై ఉన్న సైనస్ క్యావిటీలలో పేరుకుపోయిన మందపాటి శ్లేష్మాన్ని కరిగించి బయటకు పంపుతుంది.

# పాలు+వెల్లుల్లి+తేనె మిశ్రమాన్ని రోజూ తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. అధిక కొవ్వు ఆర్థరైటిస్ బాధితులకు మంచిది.

# క్షయ వ్యాధిగ్రస్తులు ఒక టంబ్లర్ నీళ్లలో ఒక టంబ్లర్ పాలు, పది మిరియాలపొడి, కొన్ని పసుపు పొడి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వడగట్టి ఒక టంబ్లర్ తయారు చేసిన తర్వాత తాగాలి.

# ఈ వెల్లుల్లి పాలను ఉదయం మరియు రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే జలుబు, దగ్గు మరియు గ్యాస్ వంటి అన్ని వ్యాధులు నయమవుతాయి. వ్యాధి నయమైన తర్వాత, పాలు ఆపాలి.

# ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ వెల్లుల్లి పాలను సేవిస్తే కొంతవరకు శ్వాసలోపం నుంచి ఉపశమనం లభిస్తుంది.

# వెల్లుల్లిని ఆహారంతో పాటు తింటే మన శరీరంలోని టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి.

# ఈ వెల్లుల్లి వైరస్‌ల వంటి అవాంఛిత వ్యాధికారకాలను చంపుతుంది మరియు అలిమెంటరీ కెనాల్‌లో ఏదైనా మంట లేదా అవాంఛిత వాయువును కూడా నయం చేస్తుంది.

# వెల్లుల్లి తినడం వల్ల మన పేగుల్లో ఉండే పురుగులు కూడా ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి, మన రక్తనాళాల్లో పేరుకుపోయిన అనవసరమైన కొలెస్ట్రాల్ మరియు కొవ్వును కరిగించి, మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

# దీనివల్ల రక్తప్రసరణ అవరోధం లేకుండా మన శరీరమంతా తిరుగుతుంది, కణాలకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ అందుతాయి, రక్తపోటు, నాడి, శ్వాస సక్రమంగా ఉంటాయి.

# క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు వెల్లుల్లి రెబ్బను మొత్తం ఉడకబెట్టి, దానికి సంబంధించిన మందులతో రోజూ తింటే క్యాన్సర్ పుండ్లు త్వరగా తగ్గుతాయి.

# మన ముఖంలోని మొటిమల మీద పచ్చి వెల్లుల్లిని చాలాసార్లు రుద్దితే మొటిమ ఎక్కడ ఉందో తెలియకుండా పోతుంది.

# మీరు రుచి కోసం ఆరాటపడి, వేయించిన చిరుతిళ్లను ఎక్కువగా తింటుంటే, వెంటనే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని కొద్దిగా కొరికి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

# అలసత్వం, వృద్ధాప్యం వంటి కారణాలతో గృహస్థ జీవితం గడపలేని వారు వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా చేర్చుకుంటే గృహస్థ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రేషన్ కార్డు కలిగివున్న వారికి గుడ్‌న్యూస్: వెంటనే ఈ పని చేయండి

రేషన్ కార్డు కలిగివున్న వారికి గుడ్‌న్యూస్: వెంటనే ఈ పని చేయండి

రేషన్ కార్డు కలిగివున్న వారికి ఇది అద్భుత అవకాశం. రేషన్ కార్డులో మార్పులు, సవరణలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలా మంది పేరెంట్స్ తమ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.

అలాగే, రేషన్ కార్డులో కొత్తగా పెళ్లైన కొడుకు పేరు ఉండి కోడలి పేరు లేని వారు కూడా చాలా మందే ఉన్నారు.

కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు ఉండి.. అందులో పేరు లేని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం తాజా మంచి అవకాశం కల్పించింది. ఇందుకోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. అంతేగాక, మీ రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా సవరించుకోవచ్చు. అంటే, చిరునామా (అడ్రస్) మార్చుకోవడం, పేర్లలో తప్పులు ఉంటే మార్చుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇంతకీ, రేషన్ కార్డులో కొత్తవారిని ఎలా యాడ్ చేసుకోవాలి? తప్పులు ఎలా సవరించుకోవాలి? ఏ ఏ ధ్రువపత్రాలు అవసరం? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం..

రేషన్​ కార్డులో తప్పుల సవరణకు దరఖాస్తు విధానం:

రేషన్ కార్డు సవరణ, కొత్త మెంబర్​ యాడింగ్ కోసం.. ముందుగా ‘Telangana Mee seva Portal’ని సందర్శించాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే Services అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్​పై క్లిక్​ చేయాలి.

ఆ తర్వాత Department అనే ఆప్షన్‌​లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అనంతరం ఓపెన్ అయిన పేజీలో ‘Corrections in Food Security Card’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్ట్ వచ్చే పేజీలో రైట్​ సైడ్​కి Download Application Form అని కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేసి ఆ ఫారంను డౌన్‌​లోడ్ చేసుకోండి.

ఆ తర్వాత ఆ ఫారంను ప్రింట్​ అవుట్ తీసుకోవాలి. ఫాంపైన Address Change/ Member Details Modifications/ Member Addition అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు అందులో మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపై టిక్ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

చివరగా కావాల్సిన ధ్రువపత్రాలు మీరు ఫిల్ చేసిన ఫారంకు​కి యాడ్ చేసి

దగ్గరలోని మీసేవా కేంద్రంలో సమర్పించాలి. లేదంటే, మీరు డైరెక్ట్‌గా కావాల్సిన పత్రాలు తీసుకొని దగ్గరలోని మీ సేవా వద్దకు వెళ్లినా అక్కడి సిబ్బంది ప్రక్రియను పూర్తి చేస్తారు.

కాగా, అప్లికేషన్ ఫారమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అంతేగాక, అప్లికేషన్​లో పేర్కొన్న మరికొన్ని సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం, అధికారుల వెరిఫికేషన్ అనంతరం మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు పూర్తి అవుతాయి.

Joint Pains: ఈ 7 మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.. ఒక్కసారి వాడి చూడండి..

Joint Pains: ఈ 7 మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.. ఒక్కసారి వాడి చూడండి..

Effective Herbs For Joint pains: కీళ్ల నొప్పుల సమస్య వయసులో ఉన్నవారికి కూడా వేధిస్తుంది. జీవన శైలిలో మార్పులు సరైన నడక విధానాలు అవలంబిస్తే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి.

అయితే మనం వంట గదిలో ఉండే ఏడు మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ అవి ఏంటో తెలుసుకుందాం.

అల్లం..
అల్లం మనం నిత్యం వంటలో వినియోగిస్తాం, అల్లాన్ని మన ఆయుర్వేదంలో కూడా గత ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది జలుబు తలనొప్పి అర్థరైటిస్ వంటి సమస్యలకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం లో జింజర్ షాగోపాల్, జింజోరేం అనే ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం అల్లం లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు జాయింట్ పెయిన్ సమస్యలకు ఎఫెక్టివ్ రెమిడి.

వెల్లుల్లి..
వెల్లులిలో మంచి అరోమా ఉంటుంది. ఇది కూడా ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉపయోగించే పూస్తా మెడిసిన్ రూపంలో ఉపయోగిస్తారు వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా జాయింట్ ఆర్డర్ సమస్యలకు ఎఫెక్ట్ ఉంటుంది. డైలీ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల వంట సమస్యలు తగ్గిపోతాయి ఇవి మన వంటల్లో సులభంగా ఉపయోగించవచ్చు.

పసుపు..
పసుపులో సంప్రదాయబద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి పసుపులో కర్కూమీన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. పసుపు నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడిగా పనిచేస్తుంది.

యాలకులు..
యాలకులు కూడా నిత్యం మన వంటగదిలో అందుబాటులో ఉంటుంది. వివిధ వంటలో వినియోగిస్తాం కొన్ని నివేదికల ప్రకారం యాలకులు కూడా మంట సమస్యను తగ్గిస్తాయి ఫ్రీ డయాబెటిస్ నాన్ ఆల్కహాలిక్ సాటి లివర్ తో బాధపడేవారు యాలకులను డైట్ లో చేర్చుకోవాలి.

మిరియాలు..
మిరియాలను ‘కింగ్ ఆఫ్ స్పైస్’ అని పిలుస్తారు ఎందులో ఉండే ఘాటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరానికి ఎంతో అభిషేకం ఆరోగ్యం నల్ల మిరియాలు జాయింట్ వాపులు మంట సమస్యను తగ్గిస్తుంది.

జింగ్సేన్..
జింగ్సేన్ కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు కానీ నివేదికల ప్రకారం జింగ్సేన్లో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ సమస్య ఉన్నవారికి ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది వీటి వేళ్లతో టీ తయారు చేసుకొని తీసుకుంటే మంచి ప్రభావం చూపుతుంది.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎపిగల్లో కేటాచ్ ఇన్ 3 గాలెట్ అనే ఫాలిఫైనల్ కూడా ఉంటుంది ఇందులో మంట సమస్య తగ్గించే గుణాలు ఉంటాయి గ్రీన్ టీ తరచుగా మేము డైట్లో చేర్చుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్యతో బయటపడవచ్చు.

భోజనం చేశాక వీటిని రెండు తింటే చాలు..

భోజనం చేశాక వీటిని రెండు తింటే చాలు..

యాలకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. భోజనం చేసిన తర్వాత రెండు యాలకులు తీసుకోవడం వలన జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా, ఇది ఉబ్బరం వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

కడుపులో ఆమ్లాన్ని నివారిస్తుంది. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే యాలకులు ఇమ్మ్యూనిటీని పెంచుతాయి.

యాలకులలో మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి. హాట్ వాటర్లో కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. గ్యాస్ సమస్యలను పరిష్కరించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలకు పెట్టడం వలన వారి బోన్స్ గట్టిగా అవుతాయి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. యాలకులు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది.

సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ ఈ ఒక్క తప్పు చేయొద్దు.. బెంగళూరులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు

సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ ఈ ఒక్క తప్పు చేయొద్దు.. బెంగళూరులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు

బెంగళూరు : సెల్‌ఫోన్‌లను తరచుగా ఛార్జింగ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే బెంగళూరులో 24 ఏళ్ల యువకుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ చనిపోయాడు.

కర్ణాటకలోని పిధరాయ్ జిల్లాకు చెందిన సినీవాస్ (వయస్సు 24). ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాలన్నది అతని కల. దీంతో సొంత ఊరు వదిలి బెంగుళూరు వచ్చాడు శ్రీనివాస్.

ఐటీ కెరీర్‌లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు బెంగళూరులోని ఓ కోచింగ్ సెంటర్‌లో కొత్త కోర్సులు చదివారు. బెంగళూరు రాజాజీ నగర్ సమీపంలోని మంజునాథ్ నగర్‌లో సినీవాస్ ఉంటూ పీజీ చదువుతున్నాడు.

ఈ క్రమంలో నిన్న రాత్రి 8 గంటల సమయంలో సినీవాస్ సెల్ ఫోన్ తీసుకుని చార్జింగ్ పెట్టేందుకు వెళ్లాడు. అప్పుడు ఊహించని విధంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో మైమరచిపోయాడు. అక్కడున్న వారు అతడిని రక్షించి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కూడా వారు తెలిపారు.

అయితే, సినీనటుల్లో విద్యుత్ ఎలా ప్రవహించింది? అన్నది తెలియలేదు. స్విచ్ నుండి విద్యుత్ ప్రవహిస్తుందా? లేకపోతే, అతని ఛార్జర్ నుండి విద్యుత్ ప్రవహించిందా? అన్నది తెలియలేదు. అయితే స్విచ్‌ను ‘ఆన్‌’ చేసి చార్జింగ్‌ పెట్టడం వల్లే మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అందువల్ల, ఇంట్లో సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసేటప్పుడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా ప్రాణాపాయమే. ఎందుకంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. తమిళనాడులో గతంలోనూ చాలా ఘటనలు జరిగాయి.

అదేమిటంటే.. గత మే నెలాఖరున చెన్నైలో ఓ మహిళా వైద్యురాలు తన ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెడుతూ మరణించింది. కోయంబత్తూరు నుంచి శిక్షణ కోసం చెన్నైకి వచ్చిన సరణిత అనే మహిళా వైద్యురాలు తన ల్యాప్‌టాప్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఆ తర్వాత గత నెలలో విరుదునగర్ జిల్లా రాజపాళయం సమీపంలోని సొక్కనాథన్ బుధూర్ గ్రామంలో సెంథిమైల్ అనే మహిళ తన ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టింది. అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అందుకే సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిక్ పేషెంట్లకు వరం ఈ నీరు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు తాగితే..

డయాబెటిక్ పేషెంట్లకు వరం ఈ నీరు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు తాగితే..

మధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ మహమ్మారి పట్టిపీడిస్తోంది.. అయితే.. డయాబెటిస్ ఉన్నవారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ముఖ్యంగా తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే జీవనశైలిలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో మేము చెప్పే ఈ డ్రింక్‌ని ప్రతిరోజూ ఉదయం ఓ గ్లాసు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అదేంటో కాదు.. బార్లీ వాటర్.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బార్లీ గింజలు ఉడకబెట్టి.. ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ పెరగదంటున్నారు.

బార్లీలో ‘బీటా గ్లూకాన్’ అనే తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో అదనపు చక్కెరను శోషించడాన్ని నిరోధిస్తుంది. తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. బార్లీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులలో మంటను తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

బార్లీ వాటర్‌లోని ఫైబర్, ఇతర పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బార్లీ నీరు మలబద్ధకం, అపానవాయువు, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిక్ రోగులలో గుండె జబ్బులు చాలా సాధారణం. బార్లీ వాటర్ తాగడం వల్ల గుండె జబ్బులు రావు. ఈ పానీయంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బార్లీ నీరు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు కూడా నరాల సమస్యలను దూరం చేస్తాయి. మధుమేహంలో బరువు నియంత్రణ చాలా ముఖ్యం. బార్లీ నీరు బరువును తగ్గిస్తుంది. ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ముందుగా.. బార్లీ గింజలను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, కొద్దిగా నీరు పోసి స్టవ్ మీద 10 నిమిషాలు ఉడికించాలి. ఈ బార్లీ నీళ్లలో నిమ్మరసం కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.. ఇలా డైలీ తాగితే.. తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం..

Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం..

Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం… ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మొటిమలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు.

మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులతో చిన్న చిన్న చిట్కాలు చేస్తే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మొటిమలు,మొటిమల మచ్చలు తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు,అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు, రంధ్రాల సమస్యలు అన్ని తొలగిపోతాయి.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలకు బెస్ట్ చిట్కా అని చెప్పవచ్చు. మెంతులు చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అలాగే పసుపు,తేనె కూడా మొటిమలు,నల్లని మచ్చలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

Tech tips | అప్పుడప్పుడు ఆధార్‌ హిస్టరీ చెక్‌ చేసుకోండిలా.. ఎందుకంటే..!

Tech tips | అప్పుడప్పుడు ఆధార్‌ హిస్టరీ చెక్‌ చేసుకోండిలా.. ఎందుకంటే..!

Tech tips : ఆధార్‌ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌ అయ్యింది. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా ప్రతి దానికి ఆధార్‌ కార్డును సమర్పించాల్సిందే.

అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌ కార్డు ఇచ్చేస్తున్నాం. దాంతో ఈ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో కూడా తెలియట్లేదు. ఒక్కోసారి ‘వేరెవరైనా మన కార్డును దుర్వినియోగం చేస్తున్నారా..?’ అనే అనుమానం కూడా కలుగుతుంది. అలా అనుమానం కలిగినప్పుడు మీ అనుమానం తీరాలంటే కార్డు హిస్టరీని చెక్‌ చేయాలి. దాని ద్వారా మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును వినియోగిస్తే సులువుగా కనిపెట్టవచ్చు. మరి అదెలాగో చూద్దాం..

ఆధార్‌ హిస్టరీ ఇలా..

ముందుగా ఉడాయ్‌ https://uidai.gov.in/en/ పోర్టల్‌లోకి వెళ్లాలి.
తర్వాత పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్‌ చేయాలి.
ఇప్పుడు కిందకు స్క్రోల్ చేసి Aadhaar Authentication History అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
అందులో లాగిన్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా, ఓటీపీ ఎంటర్‌ చేయాలి.
తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
అక్కడ ALL ని ఎంచుకొని డేట్‌ను ఎంపిక చేసుకొని Fetch Authentication History పై క్లిక్‌ చేయాలి.
ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు కనిపిస్తాయి.

Diabetes:ఒక స్పూన్ పొడి మజ్జిగలో కలిపి తాగితే చాలు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

Diabetes:ఒక స్పూన్ పొడి మజ్జిగలో కలిపి తాగితే చాలు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

Diabetes:ఒక స్పూన్ పొడి మజ్జిగలో కలిపి తాగితే చాలు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.. కాకర కాయను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు క్రమంగా మధుమేహాన్ని నిర్వహించడానికి సహజ సిద్దమైన ఆహారంగా భావించబడుతుంది.

మనలో చాలా మంది కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గిపోతుందని భావిస్తారు. కానీ డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే తప్పనిసరిగా మందులు వాడవలసిందే. మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.

కాకరలో ఉండే ‘కరాటిన్‌’, ‘మమోర్డిసిన్‌’ అనే పోషకాలకు రక్తంలోని చక్కెర పాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్‌-పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది.

కాకరను జ్యూస్ చేసుకొని తాగవచ్చు. కాకరను కూరగా చేసుకోవచ్చు. కాకరను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోని నిల్వ చేసుకొని వాడవచ్చు. ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ పొడిని కలిపి తాగవచ్చు. కాకరకాయ పొడి మార్కెట్ లో కూడా లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో చేసుకుంటేనే మంచిది.

డయాబెటిస్ నియంత్రణ ఉండటానికి సహాయపడటమే కాకుండా కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

తెలంగాణలో రెండు రోజుల సెలవులు

తెలంగాణలో రెండు రోజుల సెలవులు

Holidays in Telangana: మొహర్రం పండగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 9, 10 తేదీల్లో సెలవు ఇచ్చినట్లు వెల్లడించింది. గతంలో విడుదల చేసిన హాలిడే క్యాలెండర్‌లో ఈ మేరకు మార్పులు చేసింది.

గతంలో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మొహర్రం, అషూరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఈ నెల 16, 17 తేదీల్లో సెలవులు ఉండేవి. 16న ఆప్షనల్, 17న సాధారణ సెలవుగా గుర్తించింది. నెలవంక కనిపించడానికి అనుగుణంగా సవరణలు చేసింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మొహర్రం, అషూరా సెలవులను ఇచ్చింది.

మొహర్రం పండుగను ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెలగా భావిస్తారు. దీన్ని సంతాప మాసంగా జరుపుకొంటారు ముస్లింలు. మొహర్రం నెల ప్రారంభమైన 10వ రోజున షియా ముస్లింలు పీర్లను ఊరేగిస్తారు. సున్నీ ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ సమయంలో కొత్త బట్టలు సైతం కొనుగోలు చేయరు. శుభకార్యాలకు దూరంగా ఉంటారు.

మహమ్మద్ ప్రవక్త మనవళ్లు ముస్లింలు ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుస్సేన్‌ త్యాగాలను స్మరించుకుంటూ మొహ్రరం వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విషాదానికి గుర్తుగా నల్ల దుస్తులను ధరిస్తారు. పీర్లను ఊరేగిస్తారు. హైదరాబాద్ పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా పీర్లపండగను ఘనంగా జరుపుకొంటారు.

6వ తేదీన చంద్రుడు కనిపించనందున- మొహర్రం మాసం 8 నుంచి ప్రారంభమవుతుందని మస్జిద్-ఇ-నఖోడా మర్కాజీ, రూయత్-ఎ-హిలాల్ కమిటీ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో సాధారణంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర గల్ఫ్ దేశాల కంటే ఒక రోజు ఆలస్యంగా నెలవంక కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా దేశాల్లో పండగ జరుపుకొంటారు.

Amit Shah: అన్నదాతలు.. ఆడ పడుచులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. మీరు తెలుసుకోండి!

Amit Shah: అన్నదాతలు.. ఆడ పడుచులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. మీరు తెలుసుకోండి!

Amit Shah: కేంద్రంలోని నరేంద్రమోదీ 3.0 ప్రభుత్వం అన్నదాతలకు, ఆడ పడుచులకు శుభవార్త చెప్పింది. దీంతో చాలా మందికి ఊరట లభించనుంది. ఇంతకీ కేంద్రం చేసిన ప్రకటన ఏమిటి..

ఎవరికి లబ్ధి కలుగుతుంది.. అర్హతలు ఏమిటీ అనే విషయాలు తెలుసుకుందాం.

జిల్లాకో కోఆపరేటివ్‌ బ్యాంక్‌..
దేశంలోని ప్రతీ జిల్లాలో ఒక సహకార బ్యాంకు(కోఆపరేటివ్‌ బ్యాంకు), పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో మల్టీపర్పస్‌ ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీలను( పీఏసీఎస్‌ ) ఏర్పాటు చేస్తామని తెలిపారు.

2 లక్షల పంచాయతీలు సహకారానికి దూరం…
దేశవ్యాప్తంగా సహకారం సంస్థ లేని పంచాయతీలు 2 లక్షలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవం పురస్కరించుకుని సహకార్‌ సే సమృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నానో యూరియా, నానో డీఏపీపై 50 శాతం సబ్సిడీని ప్రకటించిన గుజరాత్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామాల్లో సహకారమే కీలకం..
గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సహకారరంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో సహకార బ్యాంకు, జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ లేకుండా ఏ రాష్ట్రం, జిల్లా ఉడకుడదని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఐదేళ్లలో 2 లక్షల పంచాయతీల్లో మల్టీపర్సస్‌ పీఏసీఎస్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

త్వరలో జాతీయ సహకార విధానం..
జాతీయ సహకార విధానం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. 1,100 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేశామని చెప్పారు. రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్ల జారీతో మరిన్న సహకార సంస్థల సంక్షేమం కోసం నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పనిచేస్తుందని తెలిపారు.

ఆర్గానిక్‌ సాగు పెంచేలా..
సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేసేందుకు రైతులకు సరైన ధర అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిందని వివరించారు. ఇక రైతుల జీవితాలను సుసంపన్నం చేసేందుకు కేంద్రం ఆర్గానిక్‌ కమిటీ, ఎక్స్‌పోర్ట్‌ కమిటీ, సీడ్‌ కమిటీ అనే మూడు బహుళ, రాష్ట్ర సహకార సంస్థలను కూడా ఏర్పాటు చేసిందని అమిత్‌షా తెలిపారు.

ఒక్కరు.. ఇద్దరు కాదు.. భర్తలను మార్చడంలో ఆఫ్ సెంచరీ కొట్టిన మాయలేడీ.. లిస్ట్‌లో ప్రముఖులు..

పెళ్లంటే నూరేళ్ల పంట.. మ్యారేజెస్‌ మేడిన్‌ హెవన్‌ అంటారు. ఒక్కసారి మూడు ముళ్లు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే పెళ్లంటే.. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే మూడునాళ్ల ముచ్చటే.

తలంబ్రాలు పోయించుకున్నామా.. డబ్బు, నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగిస్తోందీ కిలాడీ లేడీ. వాట్సాప్‌లో డీపీ మార్చినంత ఈజీగా.. డ్రస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంది ఈ మాయలేడి.. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది ఈ నిత్య పెళ్లకూతురు. ఏకంగా నలభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణం తమినాడులో జరిగింది.

తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్‌సైట్‌లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకొని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గమైంది. కాపురం పెట్టారు. అంతా సాఫీగా సాగుతోందనే టైమ్‌లో ఒక్కసారిగా కిరికిరి. పెళ్లయిన మూడు నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది.

అనుమానం వచ్చిన ఆ యువకుడు.. సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులో తీసుకుని విచారిస్తే అసలు యవ్వారం బయటపడింది.

ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది. ఒక డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితుల లిస్ట్‌లో ఉన్నారని తేలింది.

సంధ్య ఇప్పటివరకు 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే.. సంధ్య విషయం తెలిసి.. పోలీసులే అవాక్కవుతున్నారు. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

క్లాస్‌ రూంలో దారుణం.. లెక్చరర్‌ ప్రాణం తీసిన ఇంటర్‌ విద్యార్ధి

క్లాస్‌ రూంలో దారుణం.. లెక్చరర్‌ ప్రాణం తీసిన ఇంటర్‌ విద్యార్ధి

విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్‌ విద్యార్ధి.

క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.

అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో రాజేష్‌ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్‌ను రన్‌ చేస్తున్నారు.

అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కెమిస్ట్రీ సబ్జెట్‌ చెప్పేందుకు క్లాస్‌కు వచ్చాడు. అనంతరం క్లాస్‌ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.

ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్‌ డ్రెస్‌తో క్లాస్‌కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్‌ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్‌ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.

దీంతో అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్‌ రాజేష్‌పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు.

విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్‌ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నడంతే..ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..?

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నడంతే..ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..?

అభిమానం వెర్రి వేషాలు అన్నట్టుగా మారిపోయింది జనసేన అభిమానుల తీరు. తాజాగా పవన్ అభిమానులు చేసిన చర్య ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేసింది. జనసేన స్థాపించిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు పవన్ కల్యాణ్.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పొటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌కు ఒక్క చోట కూడా విజయం దక్కని పరిస్థితి.

ఒంటరిగా వెళ్తే జగన్‌ను ఎదుర్కొవడం కష్టమని భావించిన పవన్,టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. పోటీ చేసింది 21 స్థానాల్లో అయినప్పటికి అన్ని స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పవన్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు. ఇది పవన్ దృష్టికి వెళ్లడంతో అభిమానులను అలా చేయవద్దని వారించారు. ఇలా చేయడం వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని, ఆర్టీఓ అధికారులకు చాలా ఇబ్బంది అని.. ఇలాంటి పనులు చేయవద్దని అభిమానులను పవన్ వారించారు. అయినప్పటికి అభిమానుల తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.

తాజాగా ఓ అభిమాని తన బైక్‌పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నెంబర్ ప్లేట్ మీద రాసుకున్నాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారి ఆ బైక్‌ను అపి మరి వారిని ప్రశ్నించాడు. మీలో ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఉన్న నెంబర్ ప్లేటును తొలగించిన దాని స్థానంలో ఆ బండి నెంబర్‌ను వారితోనే పెట్టించడం జరిగింది. ఇలాంటివి చేయవద్దని వారిని ఆ ట్రాఫిక్ అధికారి హెచ్చరించడం జరిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Health

సినిమా