Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం..

Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం..


Pimples:ఈ పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాస్తే నిమిషంలో మొటిమలు మాయం… ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మొటిమలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు.

మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులతో చిన్న చిన్న చిట్కాలు చేస్తే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మొటిమలు,మొటిమల మచ్చలు తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు,అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు, రంధ్రాల సమస్యలు అన్ని తొలగిపోతాయి.

ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలకు బెస్ట్ చిట్కా అని చెప్పవచ్చు. మెంతులు చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అలాగే పసుపు,తేనె కూడా మొటిమలు,నల్లని మచ్చలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.