డయాబెటిక్ పేషెంట్లకు వరం ఈ నీరు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు తాగితే..

డయాబెటిక్ పేషెంట్లకు వరం ఈ నీరు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు తాగితే..


మధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ మహమ్మారి పట్టిపీడిస్తోంది.. అయితే.. డయాబెటిస్ ఉన్నవారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ముఖ్యంగా తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే జీవనశైలిలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో మేము చెప్పే ఈ డ్రింక్‌ని ప్రతిరోజూ ఉదయం ఓ గ్లాసు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అదేంటో కాదు.. బార్లీ వాటర్.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బార్లీ గింజలు ఉడకబెట్టి.. ఆ నీటిని తాగితే బ్లడ్ షుగర్ పెరగదంటున్నారు.

బార్లీలో ‘బీటా గ్లూకాన్’ అనే తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో అదనపు చక్కెరను శోషించడాన్ని నిరోధిస్తుంది. తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. బార్లీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులలో మంటను తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

బార్లీ వాటర్‌లోని ఫైబర్, ఇతర పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బార్లీ నీరు మలబద్ధకం, అపానవాయువు, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిక్ రోగులలో గుండె జబ్బులు చాలా సాధారణం. బార్లీ వాటర్ తాగడం వల్ల గుండె జబ్బులు రావు. ఈ పానీయంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బార్లీ నీరు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు కూడా నరాల సమస్యలను దూరం చేస్తాయి. మధుమేహంలో బరువు నియంత్రణ చాలా ముఖ్యం. బార్లీ నీరు బరువును తగ్గిస్తుంది. ఈ పానీయంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ముందుగా.. బార్లీ గింజలను బాగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, కొద్దిగా నీరు పోసి స్టవ్ మీద 10 నిమిషాలు ఉడికించాలి. ఈ బార్లీ నీళ్లలో నిమ్మరసం కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.. ఇలా డైలీ తాగితే.. తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.