Thursday, November 14, 2024

Neck Blackness: మెడ నలుపును తగ్గించుకునేందుకు ఎఫెక్టీవ్‌ చిట్కాలు ఇవే!

మచ్చలు లేని, నలుపు లేని చర్మం కావాలని అందరూ అనుకుంటారు. చర్మం నలుపుగా ఉన్నా.. మచ్చలు లేకుండా కనిపిస్తే.. చాలు అనుకుంటారు. చాలా మంది మెడ నలుపుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మెడ దగ్గర మాత్రం నలుపుగా ఉంటుంది. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇది మీరు చేసే నిర్లక్ష్యం కారణంగానే వస్తుంది. ఎందుకంటే చాలా మంది కేవలం ముఖాన్ని మాత్రమే శుభ్రం చేస్తూ ఉంటారు. మెడను అస్సలు పట్టించుకోరు. ఎలాంటి క్రీమ్స్ చేసుకున్నా.. ప్యాక్స్‌ అయినా కేవలం ముఖానికి మాత్రమే వేసుకుంటారు. మెడను అస్సలు పట్టించుకోరు. దీని వల్ల మెడపై మురికి పేరుకు పోయి.. పిగ్మెంటేషన్ లేదా నలుపుగా మారిపోతుంది. ఈ మెడ నలుపును వదిలించుకునేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలు ట్రై చేస్తే సరి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

శనగ పిండి:
మెడ నలుపుతో బాధ పడేవారు.. శనగ పిండిని ఉపయోగించవచ్చు. నలుపును పోగొట్టడంలో శనగ పిండి చక్కగా పని చేస్తుంది. నలుపును క్రమేపీ తగ్గించి.. మెరుపును తీసుకొస్తుంది. ఒక గిన్నెలోకి ఒక స్పూన్ శనగ పిండి తీసుకోండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమంతో మెడపై రుద్దుతూ ఉంటే నలుపు తగ్గుతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయండి.

పెరుగు:
పెరుగుతో ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మానికి, జుట్టుకు కూడా పెరుగును ఉపయోగించవచ్చు. నలుపును తొలగించే గుణాలు పెరుగులో ఉన్నాయి. మెడపై నలుపును వదిలించుకునేందుకు ఒక గిన్నెలో.. కొద్దిగా పెరుగు, పసుపు తీసుకుని కలిపి.. మెడకు పట్టించండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.

తేనె:
తేనెతో కూడా నలుపును తగ్గించుకోవచ్చు. నలుపును తగ్గించే గుణాలు తేనెలో కూడా ఉన్నాయి. కాబట్టి మెడ నలుపు కూడా తగ్గుతుంది. ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా తేనె, నిమ్మరసం తీసుకుని కలపండి. ఈ మిశ్రమాన్ని మెడకు బాగా పట్టించి రుద్దండి. ఆరిపోయాక కడిగేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మెడ నలుపు తగ్గుతుంది.

BREAKING: ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్.. మరికొద్దిసేపట్లో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్!

ఆళ్లగడ్డలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో శ్రీదేవి ప్రాణాలు కోల్పోగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో పోలీసులు శాఖ 144 సెక్షన్ విధించింది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీదేవిపై దాడిలో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతో పాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదైంది. అందులో A1గా వేణుగోపాల్ రెడ్డి, A2గా శిరీష, A3 కేదార్నాథ్ రెడ్డి, A4 ఏవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. హత్య జరిగిన వెంటనే పరారైన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఏవీ సుబ్బారెడ్డి, అఖియ ప్రియ టీడీపీ పార్టీలోనే ఉన్నారు. .

Pinnelli: వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు.

నరసరావుపేట: వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలకు పాల్పడిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను బుధవారం తిరస్కరించింది.

ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వయిగేటు పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలుకొట్టడంతో పాటు అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. వీటన్నింటి మీదా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు జూన్‌ 20న హైకోర్టులో వాదనలు ముగియగా.. ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన ఫిక్స్..కల్ట్ చూపించే టైమ్ వచ్చింది

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.

ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు. దాని తరువాత తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్లనున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. మాల ధారణ చేశారు. 11 రోజులపాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కూడా ఆయన ఇదే దీక్ష చేశారు.

దీక్షలో భాగంగా ఈ నెల 29వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొక్కులు చెల్లించనున్నారు. ఇదివరకు ఇదే ఆలయాన్ని సందర్శించారాయన. వారాహి వాహనానికి పూజలు చేయించారు అప్పట్లో. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.

దీని తరువాత కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటిస్తారు పవన్ కల్యాణ్. జులై 1వ తేదీన ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 1వ తేదీన సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో ప్రసంగిస్తారు. కృతజ్ఞత సభను నిర్వహిస్తారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలను తెలియజేయనున్నారు.

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలను జారీ చేస్తారు. అలాగే- మూడు రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

జగన్‌కు ప్రతిపక్ష నేతగా అవకాశం లేదు

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జగన్ రూల్స్ చదువుకోవాలని సూచించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఆయన కొనసాగుతారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు ఫ్లోర్ లీడర్లు ఉన్నారని తెలిపారు.

కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టిందని గుర్తు చేశారు. జగన్‌కు కూడా ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. ”2014లో 44 సీట్లు వచ్చాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. 2019లో 54 సీట్లు వచ్చాయి. అప్పుడు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్లుగా మాత్రమే కొనసాగారు. పదేళ్ల తర్వాత ఈరోజే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ విపక్ష హోదా దక్కింది. వైసీపీ కూడా ప్రతిపక్ష హోదా రావడానికి కచ్చితంగా 10 సంవత్సరాలు పడుతుంది. 2029లోనూ వైసీపీ ప్రతిపక్ష హోదా రాద”ని పయ్యావుల కేశవ్ అన్నారు.

Pet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?

Father and son died after pet dog attack in vizag: చాలా మంది కుక్కలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. మనుషుల కన్నా..కొందరు నోరులేని జీవాలే బెటర్ అని భావిస్తుంటారు.

అందుకే కుక్కలను తమ ఇళ్లలో ఇష్టంతో పెంచుకుంటారు. వాటిని తమ ఇళ్లలోని మనుషుల మాదిరిగా ట్రీట్ చేస్తారు. మంచి ఫుడ్ ఇస్తారు. రెగ్యులర్ గా వాకింగ్ లకు తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా.. వెటర్నరీ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లి డీవార్మింగ్ కూడా చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుక్కలు కూడా తమ యజమానుల పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. తమ ఓనర్ ను వదిలి అస్సలు ఉండవు. ఇతరులు ఏదైన తినడానికి పెడితే అస్సలు ముట్టుకొవు.

తమ యజమాని కన్పించకపోతే.. తినడంకూడా మానేస్తుంటారు. అంతగా శునకాలు, మనుషులతో ఎమోషన్ గా కనెక్ట్ అయి ఉంటాయి. మరోవైపు.. కుక్కలను పెంచుకోవడం వల్ల మన శరీరంలోని ఒత్తిడిలు, అనేక రుగ్మతలు కూడా తగ్గిపోతాయని కూడా నిపుణులు చెబుతుంటారు. కానీ శునకాలను పెంచడంతో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని మాత్రం సూచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కుక్కలు వింతగా ప్రవర్తిస్తుంటాయి. బైట వారిమీద కాకుండా.. ఇంట్లో వాళ్ల మీద కూడా దాడులకు పాల్పడుతుంటాయి.ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు..

విశాఖ పట్నం జిల్లాలోని భీమిలిలో దారుణం చోటుచేసుకుంది. నరసింగరావు తన ఇంట్లో కొన్నేళ్లుగా కుక్కలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. కొన్నిరోజుల క్రితం..నరసింగరావు(59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు.

కానీ అప్పటికే.. వారిలో కూడా కొన్ని హెల్త్ కండీషన్ కూడా పాడైనట్లు తెలుస్తోంది. వారిలో కూడా.. మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తండ్రి,కొడుకులు మరణించారు.ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్రకలకలంగ మారింది. కుక్క కరవగానే.. గ్యాప్ ఇవ్వకుండా యాంటి రేబిస్ తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కలకు కూడా క్రమంతప్పకుండా.. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ చేయించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.

Adulterated Ghee: మార్కెట్లోకి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి, ఈ నకిలీ నెయ్యిని కనిపెట్టడం ఎలా?

Adulterated Ghee: ప్రతి తెలుగింట్లోనూ నెయ్యికి చోటు ఉంటుంది. వేడివేడి అన్నంలో పప్పు. నెయ్యి వేసుకుని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఇప్పుడు నకిలీ నెయ్యి మార్కెట్లోకి అధికంగా వస్తోంది.

ఈ కల్తీ నెయ్యిని కొని ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఎన్నోసార్లు కల్తీ నెయ్యి అమ్మకాలను అడ్డుకున్నాయి. టన్నులకొద్దీ నకిలీ నెయ్యి ఇంకా మార్కెట్లోకి వస్తూనే ఉంది. అలాంటి నెయ్యిని పిల్లలకు తినిపించడం లేదా పెద్దలు తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు రావచ్చు.

మనదేశంలో నెయ్యిని లిక్విడ్ గోల్డ్ అని పిలుచుకుంటారు. దాని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నెయ్యిని మొదటిసారి మన దేశంలోనే తయారు చేశారు. వెన్నను నిల్వచేసి దాన్ని నెయ్యిగా మారుస్తారు. మనదేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా వంటి ఇతర ప్రాంతాలకు ఈ నెయ్యి వ్యాపించింది.

నెయ్యి సృష్టించింది ఇతడే

హిందూ పురాణాల ప్రకారం చూస్తే నెయ్యిని సృష్టించింది ప్రజాపతి అని చెబుతారు. ప్రజాపతి సంతానాన్ని ఇచ్చే దేవుడు తన చేతులను ఒకదానితో ఒకటి రుద్దడం ద్వారా ఈ నెయ్యిని ఉత్పత్తి చేశాడని, ఆ నెయ్యిని అగ్నికి సమర్పించడం ద్వారా అతనికి సంతానం కలిగిందని కథలు వాడుకలో ఉన్నాయి. నెయ్యితో చేసిన ఏ ఆహారం అయినా చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వాసన తినాలన్న కోరికను మరింతగా పెంచేస్తుంది.

స్వచ్ఛమైన నెయ్యి బంగారాన్ని తలపించేలా ఉంటుంది. నెయ్యి ఉత్పత్తులు మార్కెట్లో కొనేటప్పుడు దాని ప్యాకేజింగ్, ఆ ప్యాకెట్ పై ఉన్న లేబుల్‌ను ప్రత్యేకంగా చదవండి. నెయ్యిని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు కాల్చిన వాసన రాకూడదు. అలా కాలిన వాసన వచ్చిందంటే అందులో నీరు లేదా ఇతర పదార్థాలు కలిసాయని అర్థం. అంటే ఆ నెయ్యి కల్తీదని అర్థం.

కల్తీ నెయ్యి ఇలా పరీక్షించండి

నెయ్యి కల్తీతో కాదో తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. నెయ్యిని తీసి మీ అరచేతిపై వేసుకున్నప్పుడు అది జారకుండా అక్కడే ఉండి కొన్ని క్షణాలకు కరగడం ప్రారంభిస్తే ఆ నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం.

నీటి పరీక్ష

గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసు నీటిని తీసుకొచ్చి పెట్టాలి. అందులో ఒక చుక్క నెయ్యిని వేయాలి. ఆ నెయ్యి తేలితే కల్తీ లేనిదని అర్థం. అలా కాకుండా అది మునిగిపోతే దానిలో ఇతర పదార్థాలు కలిశాయని, నకిలీదని అర్థం.

నెయ్యిని వేడి చేస్తున్నప్పుడు దాని నుంచి బుడగలు, ఆవిరి వంటివి వస్తే అది కల్తీ నెయ్యని అర్థం. నెయ్యిని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. కాసేపటికి డబ్బాలో గాలి బుడగలు ఏర్పడినా, లేదా నూనెల్లాంటివి తేలినా ఆ నెయ్యి కల్తీదని అర్థం చేసుకోవాలి. కల్తీ నెయ్యిని తినక పోవడమే మంచిది. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?

18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. అయితే మళ్లీ ప్రధాని మోదీ ఎందుకు ఓం బిర్లాను ఎంచుకున్నారు. ఆయన నేపథ్యం, ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఓం బీర్లా.. ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలోఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు. అసలు ఎవరీయన..? ఎందుకు రెండోసారి కూడా ఏరికోరి మరీ ఈయన్నే స్పీకర్‌గా కూర్చోబెట్టాల్సి వచ్చింది..? అంతమంది సీనియర్లు.. ఎన్నికల్లో హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్‌ కొట్టిన వాళ్లుండగా బిర్లాకే మోదీ ఎందుకు ఓటేశారు..? బిర్లా పొలిటికల్ బ్యాగ్రౌండ్, వ్యక్తిగత జీవితం.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

రెండోసారి..

18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా, ప్రతిపక్షం నుంచి కె. సురేష్ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎంపికయ్యారు. గతంలో బలరాం జాఖర్ రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. చాలా మంది నాయకులు స్పీకర్ అయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఓం బిర్లా ఎన్నికల్లో గెలిచారు.

మోదీ ఈసారి కూడా

సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా గతంలో ఓం బిర్లా సభను నడిపిన తీరు ఎంతో ప్రశంసనీయమని చెప్పవచ్చు. నేతల మాటల తీరును బట్టి సభలో చర్యలు తీసుకోవడంలో కూడా ఓం బిర్లా మోదీ ప్రశంసలు దక్కించుకున్నారు. దీంతో మళ్లీ ప్రధాని మోదీ ఈసారి కూడా ఓం బిర్లావైపే మొగ్గుచూపారు. అయితే ఎవరీ ఓ బిర్లా, ఆయన నేపథ్యం ఎంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఓం బిర్లా రాజకీయ జీవితం?

ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటాకు చెందినవారు. కోటా బండి లోక్‌సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్‌పై 41,974 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2003 నుంచి ఓం బిర్లా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 2003లో తొలిసారిగా కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2008లో కోటా సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత శాంతి ధరివాల్‌పై విజయం సాధించారు. 2013లో కోటా సౌత్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు.

ఇప్పటి వరకు

అయితే 2014లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019, 2024లో విజయం సాధిస్తు వచ్చారు. 2019లో బీజేపీ ఆయనను స్పీకర్‌గా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా ఓం బిర్లా సభను నడిపిన తీరు ప్రశంసనీయం. ఓం బిర్లా హయాంలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA), మూడు క్రిమినల్ చట్టాల అమలుతో సహా అనేక ముఖ్యమైన పనులు జరిగాయి. ఆయన పదవీకాలంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోలేదు.

ఓం బిర్లా వ్యక్తిగత జీవితం

ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శ్రీ కృష్ణ బిర్లా, తల్లి పేరు శ్రీమతి శకుంతలా దేవి. మార్చి 11, 1991న, ఆయన డాక్టర్ అమితా బిర్లాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆకాంక్ష, అంజలి బిర్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓం బిర్లా విద్యాభ్యాసం 1986లో మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి M.Com డిగ్రీ పూర్తి చేశారు.

Student Kit App Latest Version Download

Student Kit App Latest Version Download 2024-25 Student Kit Latest App Updated version Student Kit app updated version 2024 Student Kit Latest App download link, How to use Student Kit app

Student Kit Latest App download link, How to use Student Kit app All HMs are request to install the latest New version app. If they have the student kit app older one please delete and install the above one.

స్టూడెంట్ కిట్ 2024-25 పంపిణీకు సంబంధించి STUDENT KIT APP ను అప్డేట్ చేశారు. అందరు MEOs, Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు App Default Password: Skt@2024, User Id : IMMS App User ID

Student Kit App Latest Version Download
Andhra Pradesh government has decided to start Student Kit Scheme 2024-25 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.

How to download, install, login, Distribute kit through biometric Student Kit Mobile Application

1. The items delivered by the supplier at Mandal Stock Point shall be counted by the Mandal teams and ensure the quantity and quality of the items.
2. If any shortage of items at the time of counting is noticed, the same should.be immediately informed to the concerned supplier through official e-mail. duly extending a copy to the District Educational Officer/Additional Project Coordinator and State Project Director.
3. The Mandal team should ensure the quality of the items at the time of verification at Mandal Stock Point. If any damaged/ under quality/ Mismatch items are found supplied by the vendor, such items should be kept aside and informed to the supplier immediately through official e-mail and such items should be returned to the supplier. The supplier should be requested by the Mandal Educational Officer concerned to replace the above under quality/damaged/Mismatch items with new items immediately.
4. Acknowledgement should be given to the supplier only for the items that are received in good condition and in good quality. Under quality items/Damaged items/ Mismatch items should be rejected at the level of Mandal Educational Officer only. Such unqualified items should not be supplied to Schools and Students.
5. Proper accounts should be maintained by the District Educational Officer/Additional Project Coordinator/ Deputy Educational Officer/Mandal Educational Officer/Head Master regarding the receiving’s, distribution shortages, damages, mismatch, replacement. The concerned Regional Joint Directors/ District Educational Officers /Additional Project Coordinators / Community Mobilization Officers should take the responsibility of quality receiving’s and supplies to students for entire end to end monitoring.
6. All sample items of student kits should be displayed in Quality wall at Mandal Stock Points with out fail
7. An annexure with details of suppliers, Phone numbers, e-mail addresses are enclosed herewith for favor of necessary action.

Student Kit App Latest Version Download

 

Reliance Retail: రిలయన్స్‌ కొత్త బిజినెస్‌

రిలయన్స్ రిటైల్ క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన 30-45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది.

అయితే ఈ సర్వీస్‌ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్‌ రిటైల్‌ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్‌లో ‘హైపర్‌లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్‌ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్ల చొరవ కీలకమని చెప్పింది.

టాటా యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టో.. వంటి క్విక్‌ కామర్స్‌ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్‌ రిటైల్‌ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది. ఈ అంశంపై స్పందిస్తూ..’ప్రస్తుతం మార్కెట్‌లో క్విక్‌ కామర్స్‌ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్‌ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా, రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్లను రిటైల్‌ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్‌(FYND), లోకస్‌(Locus) వంటి సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.

గతేడాది రిలయన్స్..జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నవీ ముంబయిలో క్విక్‌ కామర్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్‌లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఇలా చేస్తే అకౌంట్ లోకి రూ.78 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కోసం పిఎం సూర్య ఘర్: మఫ్త్ బిజిలీ యోజన పేరుతో ఒక స్కీమ్ అమలవుతోంది.

ఈ స్కీమ్ కోసం ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నా చాలామంది దరఖాస్తులను సమర్పించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం అందుతోంది.

దరఖాస్తు చేసుకున్న వాళ్లలో చాలామంది ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో కొంతమందికి ఇంకా సబ్సిడీలు అందలేదని సమాచారం అందుతోంది. పోర్టల్ లో పెండింగ్ సమస్యలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని సమాచారం అందుతోంది.

దేశంలో ఎవరైనా ఈ పథకం ద్వారా సబ్సిడీతో కూడిన రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కింద ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్ లను వినియోగిస్తే 78 వేల రూపాయల సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎక్కువగా విద్యుత్ ను వినియోగించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఒకసారి భారీ మొత్తంలో పెట్టుబడులు పెడితే జీవితాంతం కరెంట్ బిల్లుల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కేంద్రం అమలు చేస్తున్న సూపర్ స్కీమ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Ap Inter: నేడే ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు..

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను కింది లింక్స్‌లో చూడొచ్చు.

ప్రథమ సంవత్సరం (జనరల్‌) ఫలితాలు

ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ఫలితాలు

 

YS Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్‌ రకరకాల మాటలు

‘చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే 17/18 మంది అవుతారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు లాగేద్దాం అని కొందరన్నారు.. అలా చేసి ఉంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదు’ అంటూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా.. తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ మరీ మాట్లాడారు. ‘ఇదీ వాస్తవం.. తెలుసుకో’ అంటూ ఏకవచనంతో హుంకరించారు కూడా!

ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే అప్పట్లో తెదేపాకు 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురిని జగన్‌ లాగేసుకుని ఉంటే తెదేపాకు 18/17 మంది మిగిలేవారు. అయినా చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదని సభలో చాలా గట్టిగా జగన్‌ ఏ లెక్కన చెప్పారు? సభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందనే ఉద్దేశంతో కాదా!

ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్‌ చెబుతున్నారు. ఈ నెల 21న సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష నేతగా తనను ప్రమాణం చేయించకపోవడం తప్పని కూడా మంగళవారం స్పీకర్‌కు రాసిన లేఖలో నొక్కి వక్కాణించారాయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు. జగన్‌ విచిత్ర వాదన నేపథ్యంలో.. ‘సంప్రదాయాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయా? సంప్రదాయాలు అధికారంతో విర్రవీగినపుడు ఒకలా.. జన ఛీత్కారం పొందాక మరోలా ఉంటాయా?’ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Renu Desai: నా కుమార్తె కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడతాయి: రేణు దేశాయ్‌

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన సతీమణి అనా లెజినొవా(Anna Lezhneva), పిల్లలు అకీరా నందన్‌ (Akira Nandan), ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. క్యూట్‌ ఫొటో అంటూ అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఫొటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్‌ (Renu Desai)ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్‌ రూపొందించారు. దీంతో మీమ్స్‌ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేశారు.

‘‘ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

జూన్‌ 12న ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ తన భార్య, పిల్లలతో కలిసి మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. అయితే మధ్యలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వారు సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అయింది.

కడుపు మాడుస్తున్నారు సార్‌.. ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని

తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది.

తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది. మంగళవారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు పల్నాడు జిల్లా బొల్లాపల్లి కస్తూర్బా పాఠశాలకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఎంఈఓ పార్వతి విద్యార్థినులకు సూచించారు.

ఓ బాలిక వేదిక పైకి వచ్చి కూరలు నాసిరకంగా పెడుతున్నారని, తాగునీటి సమస్య ఉందని కన్నీటి పర్యంతమైంది. వెంటనే ఎమ్మెల్యే వంట సిబ్బందిని ప్రశ్నించగా నాసిరకం సరకులు ఇస్తున్నారని చెప్పారు. సరకులు సరఫరా చేసే గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Pappu Yadav demands for Re NEET 2024 | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బిహార్ రాష్ట్రం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పరీక్షపై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు.

బిహార్ రాష్ట్రం పుర్నియా నుంచి ఎంపీగా ఎన్నికై మంగళవారం లోక్ సభలో ప్రమాణం చేసిన పప్పూ యాదవ్ రీనీట్ అని రాసి ఉన్న ఒక టీషర్ట్ వేసుకొచ్చారు. అయితే పప్పూ యాదవ్ అక్కడితో ఆగలేదు.

ప్రమాణం చేసిన అనంతరం సైతం.. రీ నీట్, బిహార్ కి స్పెషల్ స్టేటస్, సీమాంచల్ జిందాబాద్, మానవతా వాద్ జిందాబాద్, బీమ్ చిందాబాద్, సంవిధాన్ జిందాబాద్ అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రెజరీ బెంచ్ పై ఉన్న సభ్యుడితో ఆయనకు వాగ్వాదమూ జరిగింది. ప్రమాణం అనంతరం బెంచ్ సభ్యులు ఏదో అంటుంటే.. ‘‘నేను ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు తెలుసు. మీరు గుంపుగా వస్తారు. కానీ నేను సింగిల్ గా వస్తాను. నాలుగో సారి ఇండిపెండెంట్ గా గెలిచాను. మీరు నాకు నేర్పిస్తారా?’’ అంటూ ఛైర్మన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పప్పూ యాదవ్ స్టేజ్ దిగారు.

SBI Jobs: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

SBI SO Recruitment 2024: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II, మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ కింద 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యెమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: రూ. 48,170- 69,810.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27.2024.

Kalki Avatar: కల్కి ఎవరు?.. ఎప్పుడు వస్తాడు?

Kalki Avatar Story in Telugu:కల్కి ఎవరు? అద్భుతమైన ఊహకు ప్రాణం పోసినట్లుండే భారతీయ పురాగాథల్లో కల్కి పాత్ర ప్రత్యేకత ఏంటి? లోకమంతా కటిక చీకటి ఆవరించిన దుర్భర సందర్భంలో ధర్మమనే కాంతిని ప్రసరింప చేయడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడని భారతీయ పురాణాలు చెబుతున్నాయి.

విష్ణుమూర్తి పదవ అవతారం

హిందూ పురాణాల ప్రకారం ధర్మం మీద అధర్మానిది ఎప్పుడు పైచేయి అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని భారత, భాగవత పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో వచ్చే విష్ణువు పదో అవతారమే కల్కి. ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని హిందూ గాథలు చెబుతున్నాయి.

కల్కి ఏం చేస్తాడు?

విశ్వ కాల చక్ర భ్రమణాన్ని వేదాలు నాలుగు యుగాలుగా విభజించాయి. అవి.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ నాలుగు కాలావస్థల్లో ఇప్పుడు ఈ భూమి మీద కలియుగం నడుస్తోంది. కలియుగంలో దుష్ట శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి, న్యాయం, ధర్మం క్షీణించినప్పుడు… సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో భూమి మీదకు వస్తాడన్నది హిందువుల నమ్మకం. చీకటి యుగాన్ని తుడిచేసి ధర్మంతో ప్రకాశించే కొత్త యుగానికి, సత్య యుగానికి బాటలు నిర్మిస్తాడు కల్కి.

కల్కి ఎలా వస్తాడు?

దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడు కల్కి. దేవదత్త అనే అశ్వం స్వచ్ఛతకు, పవిత్ర కాంతికి ప్రతీక. ఆ గుర్రం మీద కల్కి మహా కరవాలంతో వస్తాడు. ఆ కత్తితో కల్కి అన్యాయాల్ని, అక్రమాల్ని చీల్చి చెండాడుతాడు. అతని రాక రాజసంతో వెలిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అతడి నుంచి వెలువడే కాంతితో మనిషి గుండెలో కటిక చీకటితో మగ్గుతున్న మారుమూలలు కూడా ప్రకాశిస్తాయట.

కల్కి ఎక్కడ జన్మిస్తాడు?

భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్‌లోని శంభాల గ్రామంలో సుమతి, విష్ణుయశ్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు. త్రేతాయుగంలో దశరథుడికి రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే, కలియుగంలో కల్కి చిన్నవాడిగా జన్మిస్తాడు.

విష్ణువు భార్య లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తారని, ఆమె పేరు పద్మ అని, ఆమెకు అష్టసఖులు ఉంటారని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి. పుట్టుకతోనే కల్కి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడని, ప్రత్యేక శక్తులు చూపిస్తాడని, తన లక్ష్యం ఏమిటో సూటిగా తెలిసిన వ్యక్తిగా శక్తిమంతంగా ఎదుగుతాడని అంటారు.

ప్రతి కలియుగంలో కల్కి వస్తాడా?

కల్కి ప్రతి కలియుగంలో ఏమీ రాడని, కొన్ని కలియుగాల్లో విభిన్న రూపాల్లో వస్తాడని మహాభారత, మత్స్య, స్కంధ పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ఒక కలియుగాన్ని పరుశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దేవీభాగవతం చెబుతోంది.

అయితే, ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కల్కి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలో మనం శ్వేత వరాహ కల్పంలోకి అడుగు పెడుతున్నాం. కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు లేదా ఒక రాత్రి. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మన లెక్కల్లో బ్రహ్మదేవుడి ఒక రోజు మకు 864 కోట్ల సంవత్సరాలు. భూమి మీద 25 వేల 920 కోట్ల సంవత్సరాలైతే బ్రహ్మకు ఒక నెల. అలాంటి 12 నెలలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం. ఈ మహావిశ్వం వయసు అలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు.

ఈ కాలక్రమంలో ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51వ సంవత్సరంలోని శ్వేతవరాహ కల్పంలోకి వెళ్తున్నాం. కాబట్టి, ఈ కల్పంలో కల్కి వస్తాడన్నది పురాగాథల సారాంశం.

కల్కి వచ్చేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి?

అధర్మం పెచ్చు మీరుతుంది. మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు. నిజాయతీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మనుషులు కర్మయోగను విస్మరించి, భోగలాలసలో మునిగిపోతారు. భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు. రకరకాల వ్యాధులు వస్తాయి. యౌవనంలోనే ప్రాణాలు పోతుంటాయి. అవినీతి పరులు, దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు. భూమి మీద వేడి పెరుగుతుంది. వర్షాలు తగ్గుతాయి. పూర్ణ చంద్రుడు కనిపించడు. వెన్నెల తరిగిపోతుంది. మనిషి సగటు జీవితం 16 ఏళ్ళకు పడిపోతుంది. ఏడెనిమిదేళ్ళకు పిల్లలను కనే పరిస్థితులు వస్తాయి. అరాచకం రాజ్యమేలుతుంది.

అలాంటి పరిస్థితుల్లో దేవతలంతా విష్ణుమూర్తి వద్దకు వస్తే. ఆయన కల్కి అవతారమెత్తుతాని చెబుతారు. కల్కిగా జన్మించి కలియుగాన్ని అంతం చేస్తాడని, ఉన్నత ధార్మిక విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని హిందూ గాథలు చెబుతున్నాయి.

మహాభారతంలో కల్కిని ఒక ఆపద్బాంధవుడిగా వర్ణిస్తారు. సంక్షోభ సమయంలో ఈ భూమి మీదకు వచ్చి సజ్జనులకు జనన మరణాల సాంసారిక జగత్తు నుంచి విముక్తి కల్పిస్తాడని రాశారు.

హిందూ పురాణాల ప్రకారం కల్కి… కారు చీకటిలో కాంతి రేఖ.

ఏపీలో రైతులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.20వేలు.. పథకం పేరు కూడా మార్పు

ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం..

ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ బీమా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పేర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరో పథకం పేరు మార్చింది.

వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు.

వరల్డ్ కప్ సెమీస్​కు ఆఫ్ఘానిస్థాన్.. తాలిబన్ల నుంచి BCCIకి మెసేజ్!

నిన్న మొన్నటి వరకు ఆ జట్టును అంతా పసికూనగా చూశారు. ఈ టీమ్ ఏం చేయగలదని తక్కువ అంచనా వేశారు. అయితే అదే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ సైడ్​గా మారింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకుంటే..

ఏకంగా సెమీస్​కు అర్హత సాధించింది. మనం మాట్లాడుకుంటోంది ఆఫ్ఘానిస్థాన్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రషీద్ సేన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పట్టుదలతో ఆడుతూ పొట్టి కప్పు సెమీస్​కు దూసుకెళ్లింది. సూపర్-8లో తొలుత ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆ తర్వాత కీలకమైన మరో పోరులో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. దీంతో ఆ దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనల మధ్య సంతోషానికి ఆమడ దూరంలో ఉండే ఆఫ్ఘానిస్థాన్​లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. రషీద్ సేన సక్సెస్​ను ఆ దేశ ప్రజలు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ భయపడకుండా రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. వేలాది మంది ఒకేచోట గుమిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. ఇన్నేళ్లుగా తాము పడుతున్న బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్​లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం.

‘మేం ఎప్పటికీ భారత్​కు రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం’ అని తాలిబన్ గవర్నమెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీసీఐకి తాలిబన్ల నుంచి వచ్చిన మెసేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ల సక్సెస్​లో ఇండియా పాత్ర ఎంతో ఉందని అంటున్నారు. అడిగిన వెంటనే వాళ్లకు అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్​ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు బీసీసీఐ అంతా తానై అండగా నిలబడిందని మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్​కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.

Budget 2024: బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతారా..?

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 బడ్జెట్ గురించి అంచనాలు ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం. బడ్జెట్ 2024లో పాత ఆదాయపు పన్ను స్లాబ్‌లకు సర్దుబాట్లు ఉండవచ్చు లేదా కొత్త విధానం కోసం పన్ను మినహాయింపు పరిమితిలో పెరుగుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వివిధ ఆదాయ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త పన్ను విధానంలో అధిక వ్యయంతో కూడిన నిర్దిష్ట సమూహాలకు పన్ను ఉపశమనం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. 2024-25 పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెల జులై 23 లేదా 24న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం, ఓపీఎస్
8వ వేతన సంఘం రాజ్యాంగం, జీతభత్యాల వర్గానికి పన్ను రాయితీ పెంపుదల, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు డిమాండ్లు చేశారు. ముఖ్యంగా పీఎస్‌యూల ప్రైవేటీకరణ చర్యను నిలిపివేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. నిత్యావసర ఆహార పదార్థాలు, మందులపై జీఎస్టీతో సామాన్య ప్రజానీకానికి భారం కాకుండా కార్పొరేట్ పన్ను, సంపద పన్నును పెంచడంతోపాటు వారసత్వ పన్నును ప్రవేశపెట్టడం ద్వారా వనరుల సమీకరణ జరగాలని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రతి కుటుంబానికి 200 రోజుల పని హామీతో ఉపాది హామీ పరిధిని విస్తృతం చేయాలని కోరారు. అంతేకాకుండా వ్యవసాయం, అనుబంధ రంగ పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి అనుసంధానం చేయాలని కోరారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేసింది. ఇది నెలకు రూ. 100 టోకెన్ మొత్తంతో, సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీతో కంట్రిబ్యూటరీగా చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా డిమాండ్ల ప్రభుత్వ స్పందన అనేది బడ్జెట్ ప్రకటన తేలుతుంది.

Kerala: మారనున్న కేరళ రాష్ట్ర పేరు.. కొత్త పేరు ఏంటి అంటే..?

కేరళ రాష్ట్రం పేరు ఇక కేరళంగా మారనుంది. పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో రూపొందించిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..

కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే సీఎం పినరయి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్‌, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. తొలి తీర్మానం పరిశీలన తర్వాత, కొన్ని మార్పులు చేయాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. దీంతో మార్పులు చేసిన తర్వాత తాజాగా మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని పంపింది కేరళ ప్రభుత్వం.

కేరళ పేరును అన్ని భాషల్లోనూ కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పినరయి సర్కార్‌ కోరింది. రాష్ట్రంపేరును పూర్వం నుంచే మలయాళం అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పూర్వ కాలం నుండే ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళల సాంస్కృతిక నేపధ్యం, చరిత్రను దృష్టిలో ఉంచుకుని కేరళంగా పేరు మార్చాలనే డిమాండ్ అన్నివర్గాల ప్రజలనుంచి ఉందన్నారు. మరోవైపు దేశంలో ఏదైనా రాష్ట్రంపేరును మార్చాలంటే రాజ్యాంబద్దంగా కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోనే ఆ రాష్ట్రం పేరును మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రం పేరు మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశం. మరి ఈసారైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేరళ మార్పుకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

AP news: శ్రీకాకుళంలో రిటైర్డ్‌ టీచర్‌ స్థలం ఆక్రమించి వైకాపా కార్యాలయం

శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు.

శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90 శాతం భవనం పూర్తి చేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందిన లే అవుట్లు ఉన్నాయి. ఇందులో 30 సెంట్ల వరకు ఆక్రమించేశారు. ఎకరా యాబై సెంట్లలో నిర్మించాల్సిన భవనాన్ని దాదాపు రెండు ఎకరాల్లో చేపట్టినట్లు తెలుస్తోంది. కోటబొమ్మాళికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు జి.వెంకటరమణ 1993లో ఐదున్నర సెంట్ల భూమిని కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తన భూమి కబ్జా చేసి షెడ్డు, ప్రహరీ నిర్మించారని బాధితుడు వాపోతున్నారు. గతేడాది అక్టోబరు 6న స్థానిక పోలీసులకు, తహసీల్దారు, సర్వేయర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకోకపోగా ఎవరినడిగి కొన్నావంటూ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన ఆరోపించారు.

Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Health Fruits: ఈ పండ్లు తింటే దీర్ఘాయువు.. నిత్యయవ్వనం.. మీ డైట్లో ఉన్నాయా మరి?

Health Fruits: మనం నిత్యం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు మనల్ని ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

అయితే కొన్ని రకాల పండ్లు మీ డైట్లో ఉన్నాయంటే మీకు వయస్సురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు రావు. అంతేకాదు మీ ముఖం కూడా యవ్వనంగా కనిపిస్తుంది. సాధారణంగా పండ్లలో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బెర్రీలు, అవకాడో, దానిమ్మ, కీవీ, యాపిల్‌ వంటి పండ్లు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది.

ఆరెంజ్‌..
ఆరెంజ్‌ పండులో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థకు కూడా ప్రేరేపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే ఆరెంజ్‌లో ఫైబర్‌ కూడా ఉంటుంది.

యాపిల్స్‌..
యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కరిగే ఫైబర్‌ ఉంటుంది. అదే పెక్టిన్‌ ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తాయి. యాపిల్ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

అరటిపండ్లు..
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బీపీ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి. అంతేకాదు కండరాల పనితీరుకు కూడా అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సీ,b6 కూడా ఉంటుంది.

కీవీ..
కీవీలో విటమిన్‌ సీ, కే, డైటరీ ఫైబర్‌ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా ఎంతో ముఖ్యం. కీళ్ల ఆరోగ్యానికి, స్కిన్‌ ఎలాస్టిసిటీని కూడా కీవీ ప్రేరేపిస్తుంది. అంతేకాదు కీవీ పండు డయాబెటీస్‌ రోగులకు కూడా మంచిది. ఇది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను సైతం బలపరుస్తుంది.

అవకాడో..
అవకాడోలో మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. అవకాడోలో విటమిన్‌ ఇ, సీ, బీ కాంప్లెక్స్‌, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని నిర్వహిస్తాయి కూడా. అవకాడోలో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా అవకాడోను తరచూ తీసుకోవడం వల్ల మీ ముఖం కూడా కాంతివంతం అవుతుంద

బెర్రీలు..
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్‌ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, ఫైబర్‌ కూడా ఉంటాయి. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు మీ దరిచేరకుండా కాపాడతాయి.

Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips : బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు సర్వసాధారణమయ్యాయి. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి అరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

వైద్యులు చెప్పినట్లే రోగులు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తుంటారు. తాజాగా వైద్యులు బ్రౌన్ షుగర్‌ కూడా ఆరోగ్యానికి మంచిదని రిఫర్ చేస్తున్నారు. బ్రౌన్‌ షుగర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం..

ప్రయోజనాలు..

1. బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్‏లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వైట్ షుగర్ తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

2. బ్రౌన్ షుగర్‌తో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరిపోతుంది. అందుకోసం రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.

3. అదేవిధంగా శరీరంలో తిమ్మిర్లను తగ్గించడానికి కూడా బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

4. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోటెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా విరివిగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా పనిచేస్తాయి. చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‏గా పనిచేస్తాయి.

5. బ్రౌన్ షుగర్ యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చేసే చికిత్సలో సాయపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా బ్రౌన్‌ షుగర్‌ కలిగి ఉంటుంది.

Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకంలో అప్లై చేసుకుంటే మీకు రూ.5 లక్షల విలువైన వైద్యం మీ సొంతం..

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి అతిపెద్ద వైద్య సంక్షేమ పథకం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సుమారు 10 కోట్ల కుటుంబాలు వైద్య సేవలను పొందనున్నారు. సుమారు యాభై కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించనుంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని 23 సెప్టెంబరు 2018న ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా లబ్ధిదారులు ఆరోగ్య సేవలను పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దాదాపు 5 లక్షల రూపాయల విలువైన వైద్యం లభిస్తుంది. ఎంపిక చేసుకున్న ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం లభిస్తుంది. మీరు ఒకవేళ ఈ పథకం లబ్ధిదారుడు కానట్లయితే, వెంటనే ఈ పథకం కోసం అప్లై చేసుకోవడం మంచిది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా మీరు సులభంగానే మీ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఏమేం సేవలు అందుబాటులోకి వస్తాయి.
వైద్య పరీక్షలు, ప్రీ-హాస్పిటలైజేషన్ చార్జీలు, ఔషధాలు, వైద్యంలో వినియోగించే ప్రోసీజర్ వస్తువులు, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, ల్యాబోరేటరీ సేవలు, మెడికల్ ఇంప్లాంటేషన్ సేవలు , వసతి సదుపాయాలు, ఆహారం, చికిత్స సమయంలో తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రిలో చేరిన తర్వాత 15 రోజుల వరకు సంరక్షణ వంటివి కవర్ అవుతాయి.

ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే ఎలా అప్లై చేయాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డును పొందాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. . ఇందుకోసం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఏమేం డాక్యుమెంట్స్ కావాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మీరు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా ఇందుకోసం ఉపయోగపడుతుంది.

Big breaking: ఎన్డీఏకు మద్దతిచ్చిన వైసీపీ.. స్పీకర్ ఎన్నికకు సానుకూల స్పందన!

Delhi: దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది.

జూన్‌ 26న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరగనుంది.

బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకే..
అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని జగన్ ఒక్కమాట కూడా అనని జగన్.. రాష్ట్రంలోనూ కూటమితో పొత్తుపెట్టుకున్నప్పటికీ బీజేపీని సూటిగా టార్గెట్ చేసి కామెంట్స్ చేయలేదు.

దేశ చరిత్రలో మొదటిసారి..
ఇదిలా ఉంటే.. భారత చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుండటం ఆసక్తికరంగా మారింది. మాములుగా స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మోదీ 2.0 పాలనతో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు కొనసాగాయి. కానీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెల్చుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఈ అలా చేయకపోతే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని రాజ్ నాథ్ విపక్షాలను కోరారు. ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనికి ఎన్డీయే సమ్మతించకపోవడంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. 18వ లోక్ సభ స్పీకర్ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా (Om Birla) నామినేషన్‌ వేయగా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ (K Suresh) నామినేషన్ వేశారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక నిర్హహించనున్నారు.

ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

guruvayoor ambalanadayil ott: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil ott). విపిన్‌ దాస్‌ దర్శకుడు. బసిల్‌ జోసెఫ్‌, రేఖ, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జూన్‌27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథేంటంటే: విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పార్వతి (నిఖిలా విమల్‌)తో బ్రేకప్‌ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంటాడు. విను వాటి నుంచి బయటపడేందుకు అతని బావ ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) సాయం చేస్తుంటాడు. అయితే, ఆనంద్‌ లైఫ్‌ కూడా ఏమీ హ్యాపీగా ఉండదు. భార్యకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్‌ జీవితంలో సంతోషాన్ని నింపాలని విను అనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అనుకోని వ్యక్తిని కలుస్తారు. దీంతో వీరి బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంజలిని విను వివాహం చేసుకున్నాడా? ఆనంద్‌ తన భార్యను కలిశాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అన్నది ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ చిత్ర కథ.

Telangana: విద్యార్థులకు అలెర్ట్.. రేపు స్కూల్స్ బంద్…

జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్స్‌లో మొదటిరోజే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు.

ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మార్చకుండానే ముంద్రించడంతో… పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. ముందు మాట మార్చి మళ్లీ తిరిగి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అయితే జూన్ 26న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ABVP పాఠశాలలకు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.

పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చి పాఠశాలల బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా… పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో చెప్పాలని.. ABVP డిమాండ్ చేస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠాశాలల యాజామాన్యాలు బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నాయని.. ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ABVP కోరుతోంది. పర్మిషన్స్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 26న జరిగే స్కూళ్ల బంద్​కు మేనేజ్ మెంట్లు సహకరించాలని… స్వచ్చందంగా పాఠశాలలు బంద్ చేయాలని కోరారు.

Health

సినిమా