Friday, November 15, 2024

బెజవాడలో గెలిచే కేశినేని బ్రదర్ ఎవరు – తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!!

ఏపీలో ఎన్నికల ఫలితం పైన ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి. పలు సంస్థలు ఏపీలో అధికారం పైన భిన్న అంచనాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న నియోకవర్గాల్లో విజయవాడ లోక్ సభ స్థానం తొలి వరుసలో ఉంది.

అక్కడ కేశినేని బ్రదర్స్ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. మోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే దాని పైన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి కర విశ్లేషణ చేసాయి. బ్రదర్స్ లో గెలిచేదెవరో అంచనాకు వచ్చాయి.

ఆసక్తి కర రాజకీయం

విజయవాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా సాగింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలో నిలిచారు. దీంతో, ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ సీటు ఖరారు చేసింది. నాని అప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్, సామాజిక సమీకరణాలు నానికి కలిసి వస్తాయనే లెక్కలు వేసారు. అదే విధంగా విజయవాడ నగరంలో నాని హయాంలో చేసిన పనులు తిరిగి గెలుపుకు దోహదం చేస్తాయని భావించారు.

కేశినేని బ్రదర్స్ ఫైట్

ఇటు..కేశినేని చిన్నికి సీటు ఖాయమైన సమయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనసేన, బీజేపీకి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓట్ బ్యాంక్ పూర్తిగా తనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేసారు. ఆ రెండు పార్టీల నేతలతో సమన్వయంతో పని చేసారు. టీడీపీ అధినాయకత్వం చిన్నికి అండగా నిలవటంతో క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు సైతం పూర్తిగా సహకరించారు. ఎన్నికల్లో కీలకమైన సమన్వయం ఎక్కడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా అందరితో కలిసి పని చేసారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దులతో కలిసి ఎలక్షనీరింగ్ పక్కాగా అమలు చేసారు.

గెలుపు దక్కేదెవరికి

పోలింగ్ సరళి గమనించిన తరువాత కేశినేని బ్రదర్స్ లో గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది. రెండు వైపులా క్షేత్ర స్థాయిలో పోలింగ్ సరళి గురించి సమాచారం సేకరించి ఎవరికి వారు తమకు అనుకూలంగా లెక్కలు వేసుకున్నారు. గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ విజయవాడ ఫలితం పైన ఆసక్తికర విశ్లేషణ చేసాయి. జగన్ సంక్షేమం, సామాజిక సమీకరణాలు పని చేసాయని పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ వ్యతిరేకత అర్బన్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించిందని..మూడు పార్టీల పొత్తు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి కలిసి వచ్చిందని విశ్లేషించారు. ఫలితంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసారు.

రాత్రి 7 గంటలకంటే ముందుగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. కానీ సరైన ఆహారం తీసుకోవడం మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడదు.

అందుకు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. ఫిట్‌నెస్‌ను కాపాడుకునే చాలా మంది వ్యక్తులు రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం చేయడం అలవాటు చేసుకుంటారు. రాత్రి 7 గంటల లోపు రాత్రి భోజనం చేయడం వల్ల మీ శరీరం పూర్తిగా మారిపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు అర్ధరాత్రి తినడాన్ని వ్యతిరేకిస్తారు. తొందరగా రాత్రి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతారు. ఇది శరీరం ప్రధాన విధులను తదనుగుణంగా షెడ్యూల్ చేస్తుంది. ఈ అంతర్గత గడియారం, సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. శరీరం పర్యావరణ మార్పులు, నిద్ర, జీర్ణక్రియ, ఆహారం వంటి కార్యకలాపాలకు సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది.

మీ భోజనం సమయం మీ బరువు నియంత్రణ, జీవక్రియ నియంత్రణ, హృదయ స్పందన రేటు, నిద్ర చక్రంపై కూడా ప్రభావం చూపుతుందని గ్రహించండి. బరువు తగ్గడం, మంచి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్య నిపుణులు రాత్రిపూట ముందుగానే తినడం సిఫార్సు చేస్తారు. రాత్రి 7 గంటల లోపు రాత్రి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను చూడండి..

జీర్ణవ్యవస్థ బాగుంటుంది

మీరు ఆలస్యంగా తిన్నప్పుడు తిన్నవన్నీ జీర్ణించుకోవడానికి మీ జీర్ణవ్యవస్థకు తగినంత సమయం ఉండదు. ఇది అజీర్ణం లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. భోజనం, నిద్ర మధ్య మంచి మొత్తంలో గ్యాప్ ఉండాలి. రాత్రిపూట ఆలస్యంగా తింటే జీర్ణక్రియ సరిగా జరగక నిద్ర సరిగా పట్టదు. మీరు త్వరగా తింటే ఆహారం మీ శరీరానికి బాగా శోషించబడుతుంది. బాగా నిద్రపోగలుగుతారు. మంచి రాత్రి నిద్ర మరుసటి రోజు కూడా మీలో శక్తిని నింపుతుంది.

గ్యాస్, ఎసిడిటీ రావు

త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరం ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట త్వరగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ లేదా గుండెల్లో మంట వంటి అన్ని సమస్యలను నివారించవచ్చు.

బరువు తగ్గవచ్చు

బరువు తగ్గాలనుకునే వారు తమ భోజన సమయాలను ఎల్లప్పుడూ గమనించాలి. రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిద్రపోతున్నప్పుడు శరీర కొవ్వును శక్తి కోసం ఉపయోగిస్తారు. తద్వారా కొవ్వును కోల్పోతారు. రాత్రిపూట ఆలస్యంగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. మొత్తం బరువు పెరగవచ్చు.

రక్తపోటు

నిద్రవేళకు, రాత్రి భోజనానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. అర్ధరాత్రి భోజనం చేసేవారు హైపర్‌టెన్షన్ తో బాధపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో రాత్రి సమయంలో రక్తపోటు సరిగ్గా తగ్గదు. ఒత్తిడి పెరిగితే, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

గ్యాప్ మెయింటెయిన్ చేయాలి

మీ డిన్నర్, బెడ్ టైం మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేయడం వల్ల కొంత వరకు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. రాత్రి త్వరగా భోజనం చేసిన తర్వాత లేదా మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఆకలితో అలమటించడం కూడా మంచిది కాదు. అటువంటి సమయాల్లో మీరు తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలను తీసుకోవచ్చు.

MrBeast: అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌

ప్రపంచంలోనే అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ (MrBeast) నిలిచింది. భారత మ్యూజిక్‌ కంపెనీ ‘టీ-సిరీస్‌’ను (T-Series) వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన జేమ్స్‌ స్టీఫెన్‌ డోనాల్డ్‌సన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

మిస్టర్‌బీస్ట్‌కు (MrBeast) 26.6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీ-సిరీస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దానికంటే 1,608 తక్కువ. ఈ సంఖ్యలను పోలుస్తూ మిస్టర్‌బీస్ట్‌ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 12 మిలియన్ల వ్యూస్‌, 10 వేల లైక్‌లు రావడం గమనార్హం. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సైతం ఆయన్ని అభినందిస్తూ పోస్ట్‌ చేశారు. 2024 ఏప్రిల్‌లో మిస్టర్‌బీస్ట్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్‌గా నిలిచింది.

2019 నుంచి టీ-సిరీస్‌ అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా కొనసాగింది. స్వీడన్‌కు చెందిన ‘ప్యూడైపై’ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2023లో ఓసారి ప్యూడైపైకు మిస్టర్‌బీస్ట్‌ మద్దతుగా నిలిచారు. తాజాగా టీ-సిరీస్‌ను ఆయన ఛానల్‌ దాటేయటంతో ప్యూడైపై ప్రతీకారం తాను తీర్చుకున్నానంటూ పోస్ట్‌ చేశారు.

2023లో అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ (MrBeast) నిలిచింది. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ డోనాల్డ్‌సన్‌ నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని అంచనా.

AP Private Schools RTE – 12(1)C Results 2024-25 Selection List

AP Private Schools RTE – 12(1)C Results 2024-25 Selection List AP Private Schools Free Seats Admissions 2024 Result, Selection List RTE – 12(1)C Results List of selected students for admission in Class 1 Under Phase- 1 AP RTE 12 (1) (c) 2024-25 Lottery Results AP Private Schools 25% Free Seats Selected Candidates Lists, Verification, Confirmation List of selected students for class 1 admissions in private schools under 12(1)C Andhra Pradesh Right of Children to Free and Compulsory Education Rules 2010 List of eligible Children District wise

AP Private Schools Free Seats Admissions 2024 Result, Selection List School Education – Admission of children in Class I under Section 12(1) (C) of the Right of Children to Free and Compulsory Education Act,2009 for the academic year 2024-2025 for all Private Unaided Schools (IB/ICSE/CBSE/State Syllabus) in Andhra Pradesh after the process of 1st Round of lottery – Instruction issued

List of eligible Children District wise.

1st Round Selection List click here

2nd Round Selection List click here

 

Running: రోజుకి 10 నిమిషాలు పరుగెత్తితే చాలు.. ఇన్ని ప్రయోజనాలు పొందుతారు..!

Running: రోజుకి 10 నిమిషాలు పరుగెత్తితే చాలు.. ఇన్ని ప్రయోజనాలు పొందుతారు..!

వ్యాయామం, వాకింగ్‌, రన్నింగ్‌ మొదలైనవి శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పరిగెత్తడం మీ గుండెకు మంచిది. ఆరోగ్యంగా ఉండటానికి ఇది గొప్ప మార్గం. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడం నుండి ఆరోగ్యకరమైన బరువును నిర్వహణ వరకు ఈ రన్నింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకే రోజులో కనీసం 10 నిమిషాల పాటు పరుగెత్తడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రన్నింగ్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రన్నింగ్ లేదా జాగింగ్ ఒక గొప్ప కార్డియో వర్కవుట్‌గా చెబుతారు. ప్రతిరోజు 10 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ రన్నర్లకు గుండె సమస్యలతో మరణించే ప్రమాదం 50శాతం తక్కువగా ఉంటుంది.. రన్నింగ్ మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీ హృదయ స్పందన తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని అర్థం

మీ ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం స్వయంగా రిపేర్ అవుతుంది. కాబట్టి మీరు పని రోజంతా మంచి అనుభూతి చెందుతారు. రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మీ మెదడును చురుకుగా ఉంచుతాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి.

హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టుకు టీడీపీ

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంలో వైసీపీ సవాల్ చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవివేట్ దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. వైసీపీ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు.

ఏపీ హైకోర్టు ఏం చెప్పింది..?

ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శనివారం నాడు తీర్పు చెప్పింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు ఇదే పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని రకాల అడ్డదార్లు తొక్కి విఫలమైన వైసీపీ, చివరికి కోర్టులో కూడా భంగపాటుకు గురైంది. ఎన్నికల అధికారులు, విపక్షాలపై అనేక విమర్శలు చేసిన వైసీపీ చివరికి పోస్టల్‌ బ్యాలెట్‌పై భారీ ఆరోపణలు గుప్పించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ను తప్పుదోవ పట్టించి టీడీపీని దెబ్బకొట్టాలని ప్రయత్నించింది.

 

మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌

కొందరు చేపట్టే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృథా చేసుకోవద్దని ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ప్రజలకు సలహా ఇచ్చారు. నిన్న పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలువడిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తొలిసారి స్పందించారు. ‘‘ఈ సారి ఎప్పుడైనా ఎన్నికలు.. రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరేసుకుపడే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్‌ మీడియా మేధావుల పనికిమాలిన విశ్లేషణలపై మీ సమయం వృథా చేసుకోవద్దు’’ అని ప్రజలకు పీకే సలహా ఇచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 300కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రశాంత్‌ కిశోర్ మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్‌ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ, కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో.. ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులను సవాలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. ‘‘జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి’’ అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్‌ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇస్తాయని ఆయన జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్‌డీఏ కూటమి భారీగా సీట్లను సాధిస్తుందని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోనూ భాజపా సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.

Pawan Chamling: దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి

Pawan Chamling: దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి..

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Aseembly Elections) విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌కేఎం గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డొమోక్రాటిక్ ఫ్రంట్ (SDF) కేవలం ఒకే సీటుతో కుదేలయింది.

 ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang)
ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang)

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Election Result) ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (SDF)కు ఘోర పరాభవం ఎదురైంది. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ.. ప్రస్తుతం 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోవడం గమనార్హం.

పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (Pawan Kumar Chamling) సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని మూటగట్టుకున్నారు. 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆయన తొలిసారి పరాజయం పాలయ్యారు.

1994- 2019 వరకు అయిదుసార్లు సీఎంగా పనిచేసిన పవన్‌ చామ్లింగ్‌.. ఈ ఎన్నికల్లో పాక్లోక్‌ కామ్రాంగ్‌, నామ్చేబంగ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. అయితే, పాక్లోక్‌ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్‌ రాయ్‌ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లోనూ అదే పార్టీకి చెందిన రాజుబసంత్‌ చేతిలో 2256 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగు పెట్టకపోవడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM)’ ప్రభంజనం సృష్టించి ఏకంగా 31 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019లో ‘ఎస్‌కేఎం’కు 17 సీట్లు రాగా.. ఈసారి మరో 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి

Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి

కిడ్నీలో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో ఖనిజాలు, సోడియం పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చాలా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే.. కొన్ని సాధారణ నియమాలు పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించవచ్చు. దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. జీవనశైలిలో మార్పుల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను సులభంగా తొలగించవచ్చు.

కిడ్నీలో రాళ్ల నుంచి ఉపశమనం పొందే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా నీరు పుష్కలంగా త్రాగాలి. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి రాళ్లు చిన్నవిగా మారి మూత్రం ద్వారా బయటకు వస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి రోజుకు రెండుసార్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో కలిపి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లు కూడా మేలు చేస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. సహజంగా రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.

తులసి రసం మూత్రపిండాల్లో రాళ్ల చికిత్సలో కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల రసాన్ని తీసి అందులో తేనె మిక్స్ చేసి సేవించాలి. ఇది రాళ్లను పగలగొట్టడంలో, తొలగించడంలో సహాయపడుతుంది. కిడ్నీ ఆరోగ్యానికి గోధుమ గడ్డి రసం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలో రాళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. తాజా దానిమ్మ రసం తాగడం మంచిది.

తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్

Homemade Curd: అన్నం తిన్న తర్వాత కచ్చితంగా చివరికి పెరుగుతో తినాల్సిందే. అలా తింటేనే పూర్తిగా తిన్న ఫీల్ వస్తుంది. మరి ఈ పెరుగు తియ్యగా ఉంటేనే బాగుంటుంది.

పుల్లగా ఉంటే ముద్దు కూడా ముట్టాలి అనిపించదు. మరి తియ్యటి పెరుగు కావాలంటే ఎలా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా.. అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకొని.. శుభ్రం చేసుకోవాలి. తర్వాత అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోయాలి. ఈ ఫుల్ క్రీమ్ మిల్క్‌లో 6 శాతం ఫ్యాట్ ఉంటుంది. ఈ పాలను సిమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేడిచేయాలి. ఈ పాలతో పెరుగు చేస్తే అదిరిపోతుంది.

పాలు వేడి అవుతున్న సమయంలో.. మధ్య మధ్యలో గరిటతో తిప్పాలి. వేడి అవుతున్నప్పుడు మీగడ ప్యాన్ కు అతుకుతుంది. అలా అతుక్కుపోకుండా చూడాలి. ప్యాన్ అడుగు భాగంలో కూడా మీగడ అతుక్కోకుండా చూసుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. పాలలో కలిసేలా చెస్తుండాలి. కాసేపటికి పాలు పొంగుతూ, బుడగలు వస్తుంటాయి. ఇలా పాలు ఒకసారి పొంగిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఆ పాలను మూత పెట్టి.. వేడి తగ్గడం కోసం పక్కన పెట్టాలి. ఓ అరగంటలో పాల వేడి తగ్గుపోతుంది.

గోరు వెచ్చగా అయిన తర్వాత ఈ పాలలో ఒక స్పూన్ పెరుగు వేయాలి. వేసవికాలంలో.. 1 టీస్పూన్ వేసినా సరిపోతుంది. పాలలో వేసే పెరుగు గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇక ఈ పెరుగు పుల్లగా అసలు ఉండకూడదు. కాస్త తియ్యటి పెరుగును వేయండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఓ 4 నుంచి 7 గంటలపాటూ పక్కన ఉంచేస్తే సరిపోతుంది. చల్లని వాతావరణంలో 8 నుంచి 12 గంటలు పక్కన ఉంచేయండి. కమ్మని పెరుగు తయారు అయిపోతుంది.

తక్కువ సమయం ఉంచితే ఎక్కువగా గడ్డ కట్టకపోవచ్చు. ఎక్కువ సమయం ఉంచితే.. బాగా గడ్డ కడుతుంది పెరుగు. కానీ ఎక్కువ సేపు ఉంచడం వల్ల పెరుగు పుల్లగా అయిపోతుంది. ఎంత ఎక్కువ సేపు ఉంచితే, అంతగా పులుపు పెరిగిపోతుంది అని గుర్తు పెట్టుకోండి. అందువల్ల మీకు ఏ రుచిలో కావాలో చూసుకొని, దానికి తగినట్లుగా అంతసేపు పక్కన ఉంచేయండి. మీకు కావాల్సిన టేస్ట్ వచ్చిన తర్వాత ప్రీజ్ లో స్టోర్ చేసుకోండి.

Monsoon: గుడ్‌ న్యూస్.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు

Monsoon: గుడ్‌ న్యూస్.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు

Monsoon: అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు… క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రుతుపవనాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. రుతపవనాల ప్రభాతంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి. రుతుపవనాలు రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది.

వారందరికీ రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నాం – సీఎం రేవంత్‌

ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్‌. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు.

ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది… పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నామని ప్రకటన చేశారు సీఎం రేవంత్‌.

ప్రాణం తీసిన ఒక్క రూపాయి గొడవ

బిర్యానీ కొన్నాక ఒక రూపాయి ఎక్కువ పే చేసిన ఆటో డ్రైవర్‌
ఎగతాళి చేసిన యువకుడు, ఇద్దరి మధ్య గొడవ
తోపులాటలో కిందపడి తలకు రాయి తగలడంతో ఆటో డ్రైవర్‌ మృతి
కాశీబుగ్గ : ఒక్క రూపాయి విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన వరంగల్‌ మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లేబర్‌ కాలనీలో శనివారం జరిగింది. వరంగల్‌ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన ఈసెంపెల్లి ప్రేమ్‌సాగర్‌ (42) ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. శుక్రవారం రాత్రి లేబర్‌ కాలనీలోని ఓ బిర్యానీ పాయింట్‌ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బిర్యానీ కోసం జన్ను అరవింద్‌ అనే యువకుడు సైతం అక్కడికి వచ్చాడు.

బిర్యానీ రూ. 59 అయితే ప్రేమ్‌సాగర్‌ ఫోన్‌ పే ద్వారా రూ. 60 చెల్లించాడు. దీంతో ఒక రూపాయి ఎక్కువ చెల్లించావంటూ అరవింద్‌ ప్రేమ్‌సాగర్‌ను ఎగతాళి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. గొడవ పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అరవింద్ ప్రేమ్‌సాగర్‌ను బలంగా నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు.

పక్కనే ఉన్న రాయి తలకు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ ప్రేమ్‌సాగర్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అరవింద్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చరిత్ర సృష్టించిన అమెరికా ఆటగాడు.. వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ ప్లేయర్​గా..!

టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను చాలా మంది లైట్ తీసుకున్నారు. క్రికెట్​లో పసికూన కావడంతో మెగా టోర్నీలో ఆ జట్టు ఏం చేయలేదని తక్కువ అంచనా వేశారు. అయితే భారత్, వెస్టిండీస్ సంతతి ప్లేయర్లతో నిండిన యూఎస్​ఏ సత్తా ఏంటో ఇప్పుడు బయటపడింది. టాలెంటెడ్ క్రికెటర్స్​తో ఉన్న ఆ టీమ్ మెగా టోర్నీకి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో కెనడాను చిత్తుగా ఓడించింది.
ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్​లో అగ్రరాజ్యం 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా సంధించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 14 బంతులు ఉండగానే ఛేదించింది యూఎస్​ఏ. దీంతో ఆ దేశ క్రికెట్ హిస్టరీలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచింది.

కెనడా సంధించిన టార్గెట్​ను అందుకునేందుకు బరిలోకి దిగిన యూఎస్​ఏను.. ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65), ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94) విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా జోన్స్ భారీ షాట్లు బాదుతూ కెనడా బౌలర్లకు చుక్కులు చూపించాడు. ఏకంగా 10 సిక్సులు బాది ప్రత్యర్థులకు నరకాన్ని పరిచయం చేశాడు. ఈ ఇన్నింగ్స్​తో అతడు పలు రికార్డులు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో సక్సెస్​ఫుల్ రన్ ఛేజ్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన నాన్ ఓపెనర్​గా జోన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్​లో ఛేజింగ్​లో ఎన్నోమార్లు జట్టును గెలిపించాడు. అయితే సక్సెస్​ఫుల్ రన్ ఛేజ్​లో మాత్రం ఇంత స్కోరు బాదలేదు. ఈ రికార్డుతో పాటు టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు జోన్స్. ఫస్ట్ ప్లేస్​లో క్రిస్ గేల్ (11 సిక్సులు) ఉండగా.. జోన్స్ (10 సిక్సులు) రెండో స్థానంలో నిలిచాడు. ఇలా ఒక్క ఇన్నింగ్స్​తో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడీ యూఎస్​ఏ ప్లేయర్. ఇక, కెనడాను చిత్తు చేసిన జోష్​లో ఉన్న అమెరికా.. నెక్స్ట్ మ్యాచ్​లో పాకిస్థాన్​ను ఢీకొట్టనుంది.

నేటి నుంచి టోల్‌ ఛార్జీలు పెంపు

నేటి నుంచి టోల్‌ ఛార్జీలు పెంపు

ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు ఈరోజు అర్ధరాత్రి (జూన్‌ 3వ తేదీ) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 1వ తేదీన టోల్‌ రుసుముల ధరలు పెంచుతుండగా..

ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది.
ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగ్‌ జూన్‌ 1వ తేదీన ముగియడంతో టోల్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.

కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.35,
భారీ రవాణా వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాస్‌ రూ.330 నుంచి రూ. 340కి పెంచనున్నట్లు సమాచారం.

చెరకు రసమే కాదు ఆ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా తాగకండి – కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ICMR

ICMR New Guidelines: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఉపశమనం కోసం జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. చెరుకు రసం సహా పలు రకాల పండ్ల రసాలు తాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చరకు సహా ఎక్కువ చక్కెర కలిగి ఉండే జ్యూస్లు, కూల్ డ్రింక్స్ వినియోగం తగ్గించాలని వెల్లడించారు.

ఈ మేరకు ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు 17 కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

చెరకు రసం తక్కువగా తీసుకోండి

చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం పట్ల వీలైనంత తక్కువగా తీసుకోవాని ICMR తెలిపింది. అంతే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్, చక్కెర యాడ్ చేసిన పండ్ల రసాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. పండ్లతో పాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. సమతుల ఆహారం, మెరుగైన ఆహారపు అలవాట్లతో కూడిని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

చెరకు రసం గురించి ప్రత్యేక ప్రస్తావన

ICMR తాజా మార్గదర్శకాల్లో చెరకు రసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 100 మిల్లీ లీటర్ల చెరకు రసంలో 13 – 15 గ్రాముల చక్కెర ఉంటుందని తెలిపింది. “దేశంలో ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే చెరకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు వినియోగాన్ని తగ్గించాలి” అని ICMR వెల్లడించింది. పెద్దలు ప్రతిరోజూ 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 24 గ్రాములకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోలికోననాల్ నిద్రలేమి సహా పలు సమస్యలకు కారణం అవుతుందన్నారు.

పండ్ల రసాలను తగ్గించి పండ్లు తినండి

చక్కెర కలిపిన పండ్ల రసాలను తీసుకోవద్దని ICMR సూచించింది. పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లు తీసుకోవాలని వెల్లడించింది. పండ్లలోని ఫైబర్, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపింది.

కూల్ డ్రింగ్స్ అస్సలు తీసుకోకండి

శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని ICMR తెలిపింది. చక్కెర, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో పాటు చక్కెర కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపింది. “కూల్ డ్రింక్స్ అనేవి నీళ్లు, తాజా పండ్లకు ప్రత్యామ్నాయం కాదు. వాటిని వీలైనంత వరకు వాటిని తీసుకోకపోవడం మంచిది” అని ICMR వెల్లడించింది. మజ్జిగ, నిమ్మరసం, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం అని తెలిపింది.

టీ, కాఫీలతో ఆరోగ్యానికి చాలా ముప్పు

అధిక కెఫీన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని ICMR సూచించింది. 150ml కప్ బ్రూ కాఫీలో 80 నుండి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుందని తెలిపింది. టీలో 30 నుండి 65 మిల్లీ గ్రాముల వరకు ఉంటుందని వెల్లడించింది. రోజువారీ కెఫిన్ 300 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదని వెల్లడించింది.

టీ, కాఫీలోని టానిన్లు, ఐరన్ శోషణను నిరోధిస్తాయని ICMR తెలిపింది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీసే అవకాశం ఉందని వెల్లడించింది. భోజనానికి ముందు, తర్వాత కనీసం ఒక గంట వరకు టీ, కాఫీని తీసుకోవద్దని ICMR సూచించింది. అధికంగా కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

చక్కెర కలిపిన డ్రింక్స్ ను మానేసి, వాటి స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, సీ ఫుడ్స్ లాంటి సమతుల ఆహారం తీసుకోవాలని ICMR వెల్లడించింది.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నూనె, చక్కెర, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయాలని ICMR మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

 

 

 

హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం

Hyderabad is now capital of telangana: అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి, హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం
Hyderabad is now capital of telangana: ఆంధ్రప్రదేశ్‌తో హైదరాబాద్‌కు బంధం తెగింది. హైదరాబాద్ ఇక తెలంగాణ సొంతమైంది. ఇప్పటి వరకు గవర్నర్ చేతిలో ఉన్న రాజధాని పౌరుల ఆస్తి, రక్షణ వ్యవహారాలు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చాయి.

ఏపీ పునర్విభన చట్ట ప్రకారం హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత, ఏపీకి పదేళ్లు తాత్కాలిక రాజధానిగా కేంద్ర ప్రకటించింది. ఆ గడువు జూన్ ఒకటి (శనివారం)తో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్.. తెలంగాణ సొంతమైంది.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామన్నా రు. ప్రజా పాలన అందిస్తామని వెల్లడించారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లుపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకు దక్కతాయని పేర్కొన్నారు.

ఏళ్ల సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీ నాయకులందరి కీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి.

ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెడుతోంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది.

ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

Election Results 2024: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

లోక్‌సభ తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ 4న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా. తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు సీఈఓ. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వెంటనే బయటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక, హింసాత్మక ఘటనల విషయంలో కఠినంగా వ్యవహారించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కీలకమైన పరిస్థితుల్లో తప్పుడు వార్తలను వెంటనే ఖండించాలని చెప్పారు సీఈఓ మీనా. కఠినమైన పరిస్థితుల్లోనే శాంతిభద్రతలను కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపారు ముకేశ్ కుమార్ మీనా. మరోవైపు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా.. ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!

అటు తెలంగాణలో కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌. 17 ఎంపీ స్థానాలకు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ షురూ అవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్‌ వారీగా గరిష్టంగా 24 రౌండ్లు, కనిష్టంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు సీఈవో వికాస్‌రాజ్‌. రాష్ట్రంలోని అన్ని కౌంటింగ్ సెంటర్లలో.. ప్రతి మూలా కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ల దగ్గర బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని వికాస్ రాజ్ వివరించారు. నాలుగు అంచెల భద్రత ఉంటుందన్నారు. ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించారు. ఇక..కౌంటింగ్ సెంటర్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సిబ్బంది సెల్‌ఫోన్లకు పర్మిషన్ ఉండదని స్పష్టం చేశారు. 10వేల మంది సిబ్బంది.. 2400మంది మైక్రో అబ్జర్‌వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారన్నారు సీఈవో వికాస్‌రాజ్‌. మరోవైపు.. కౌంటింగ్ రోజు మద్యం షాపులు బంద్ ఉంటాయని చెప్పారు

చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఆర్మూర్, భద్రాచలం, ఆశ్వరావుపేటలో కేవలం 13 రౌండ్లలోనే ఫలితాలు వెలువడుతాయని వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు.

వైట్‌నర్‌… టేప్‌లా వచ్చింది! వాడేయండి సులభంగా

వైట్‌నర్‌… టేప్‌లా వచ్చింది!

పిల్లలు ఏదైనా రాసుకునేప్పుడో, పెద్దవాళ్లు ఆఫీసు ఫైల్స్‌లోనో… పొరపాట్లు వస్తే వెంటనే గుర్తొచ్చేది వైట్‌నర్‌. రాసిన అక్షరాలపైన వైట్‌నర్‌ లిక్విడ్‌ను- బ్రష్‌ తీసి నెమ్మదిగా పూస్తారు.

ఆ పని పెద్దవాళ్లు జాగ్రత్తగానే చేస్తారేమో కానీ పిల్లలకు కాస్త ఇబ్బందే. పక్కనున్న అక్షరాలపైకీ ఆ లిక్విడ్‌ అంటుకుపోతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే… కొత్తగా వస్తున్న కరెక్షన్‌, వైట్‌నర్‌ టేప్‌ని వాడొచ్చు. పెన్నులా దీన్ని పట్టుకుని అవసరమైనచోట గీసుకుంటూపోతే సన్నని టేప్‌ దాంట్లోంచి వస్తుంది. దీంతో క్షణాల్లో పనైపోతుంది, పైగా ఈ ప్లాస్టిక్‌ వైట్‌నర్‌ చాలారోజులూ ఉంటుంది. నచ్చితే, ఈసారి మీ పిల్లలకు కొనే స్టేషనరీ వస్తువుల్లో దీన్ని భాగం చేయండైతే!

Vera Wang : 74 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ 24 ఏళ్ల యువతిలా కనిపిస్తోంది.. ఈమె అందం రహస్యం తెలుసా?

ప్రస్తుత జీవనశైలి ప్రకారం, చాలా మంది ప్రజలు కేవలం 50 ఏళ్ల వయస్సులోనే వృద్ధాప్యంగా కనిపిస్తారు. ఎంత మేకప్ వేసుకున్నా ముడతలు పడిన చర్మాన్ని దాచుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా మెడ, చేతులు పాతవిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మమ్మ వయసులో ఉన్న ఓ మహిళను ఒక్కసారి అలా చూస్తే షాక్ అవుతారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యాన్ని ఆమె మాటల్లోనే వినండి. మే 27న, వెరా వాంగ్ తెల్లటి స్విమ్‌సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటోకి పోజులిచ్చింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది , ఆమె బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించింది. 74 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, వాంగ్ ఈ ఫోటోలో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఆమె ఫోటో చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందం రహస్యం ఏంటని కొందరు అడుగుతున్నారు.

అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాంగ్ వయసు 74 సంవత్సరాలు. అయితే ఆమె ఎంత అందంగా ఉందో అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూసిన వారెవరైనా ఆమె వయస్సు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత వయసొచ్చిందంటే ఎవరూ నమ్మరు. పైగా ఆమె జుట్టు కూడా తెల్లగా లేదు. కానీ మీడియా ఇంటర్వ్యూలలో, వాంగ్ తన జుట్టుకు నలుపు రంగు వేసుకున్నట్లు అంగీకరించింది. అయితే ఆమె చర్మం మాత్రం యువతిలా కనిపిస్తోంది. 74 ఏళ్ల వయసులోనూ ఇలా బిగుతుగా ఉండే చర్మాన్ని కాపాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన వాంగ్ బ్యూటీ సీక్రెట్ ఏంటని పలువురు మీడియా ప్రశ్నించగా.. “నేను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. యవ్వనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో కలిసి పని చేస్తాను. ఆయన్ని చూసి ప్యాషన్‌తో పనిచేయడం వల్ల యంగ్‌గా కనిపిస్తున్నాను. అలాగే తగినంత నిద్ర పొందండి , ప్రకాశవంతమైన సూర్య కిరణాలకు దూరంగా ఉండండి. సాయంత్రం పూట వోడ్కా తాగడం తన యవ్వన రహస్యమని వెరా తెలిపింది.

అంతేకాకుండా, 74 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, వాంగ్ గ్వాన్ స్టెఫానీ , అరియానా గ్రాండే వంటి చాలా మంది ప్రసిద్ధ వ్యక్తుల కోసం దుస్తులను డిజైన్ చేస్తున్నారు. 1990లో, వోగ్ మ్యాగజైన్ , రాల్ఫ్ లారెన్‌లో పనిచేసిన తర్వాత, తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా వారు ఇప్పటికీ ప్రధాన కస్టమర్లను కలిగి ఉన్నారు. వెరా తన టైమ్‌లెస్ ఫ్యాషన్ సెన్స్ , వయసుకు తగ్గ అందంతో చాలా మందిని ఆకర్షిస్తోంది.

Bank Deposits: కోట్లాది మంది కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇది 91 రోజుల నుండి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపైలపై 4.80 శాతం వడ్డీని అందిస్తోంది. 181 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీకి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీ రేట్లు:

సీనియర్ సిటిజన్లు సాధారణ రేట్లు కాకుండా 0.50% అదనపు వడ్డీని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లకు 399 రోజులకు గరిష్టంగా 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో

సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది. 399 రోజుల ఎఫ్‌డీపై గరిష్ట వడ్డీ రేటు 8 శాతం.

సాధారణ ప్రజలు, సీనియర్‌ సీటిజన్స్‌కు ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా..

  1. 7 నుంచి 14 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  2. 15 నుంచి 30 రోజులు – సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  3. 31 నుంచి 45 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  4. 46 నుంచి 90 రోజులకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5 శాతం
  5. 91 రోజుల నుంచి 120 రోజులకు సాధారణ ప్రజలకు 4.80 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.30 శాతం.
  6. 121 రోజుల నుంచి 180 రోజులకు సాధారణ ప్రజలకు 4.90 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.40 శాతం.
  7. 181 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 6.75 శాతం.
  8. 1 సంవత్సరం నుంచి 398 రోజులకు సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.25 శాతం.
  9. 399 రోజులకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.50 శాతం.
  10. 400 రోజుల నుంచి 2 సంవత్సరాలకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.75 శాతం.
  11. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  12. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  13. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.

 

 

 

Digestion : అజీర్తి సమస్యకు పసుపుతో చెక్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

Digestion : అజీర్తి సమస్యకు పసుపుతో చెక్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

తీసుకుంటున్న ఆహారంలో, జీవనశైలిలో మార్పులు వెరసి ఇటీవల చాలా మంది అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారు. తీసుకున్న ఆహారం జీర్ణం కావడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు.

అందుకే తీసుకునే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టడంలో పసుపు కూడా కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది.

పసుపులోని కర్‌క్యుమిన్‌ అజీర్ణ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో ఆమ్లం తగ్గటానికి వాడే ఒమిప్రజోల్‌ మందుతో సమానంగా పసుపు పనిచేస్తునందని పరిశోధనల్లో వెల్లడైంది. పసుపులోని కర్‌క్యుమిన్‌కు వాపును తగ్గించే గుణాలుఉన్నాయి. అలాగే సూక్ష్మక్రిములను కట్టడి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

గాయమైన సమయంలో పసుపు అప్లై చేసుకునేది ఇందుకే. అయితే పసుపు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే సంపద్రాయ మందులతో పోల్చితే పసుపు జీర్ణక్రియను ఏమేర మెరుగు పరుస్తుందో అన్నదానిపై స్పష్టత లేదు. థాయిలాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అజీర్ణ సమస్యతో బాధపడేవారిలో కర్‌క్యుమిన్‌, ఒమిప్రజోల్‌ మాత్రలు ఇచ్చి పరిశీలించారు. వీరందరిలోనూ నొప్పి, కడుపుబ్బంర వంటి లక్షణాలు దాదాపు సమానంగా తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు.

Chicken: చికెన్‌ తింటున్నారా? జాగ్రత్త.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

చికెన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎఇ)లోని లేబొరేటరీ పరిశోధనలో చికెన్‌లో 40 శాతం యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని కనుగొన్నారు. చికెన్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కానీ ఇటీవలి కొన్ని పరిశోధనలు దీనిని తినే వ్యక్తులలో రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చని, యాంటీబయాటిక్స్‌కు తక్కువ అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

మీరు చికెన్ తింటే జాగ్రత్తగా ఉండండి

కోళ్లకు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు లేదా అవి వేగంగా ఎదగడానికి, బరువు పెరగడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఆ చికెన్ తింటే, అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎందుకంటే చికెన్‌లోని యాంటీబయాటిక్స్ మీ శరీరంలోకి వెళ్తాయి. ఆ తరువాత, మీ శరీరం దానికి అలవాటుపడుతుంది. కానీ ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు, యాంటీబయాటిక్స్ తగినంత వేగంగా పని చేయవు. అందుకే వారికి ఎక్కువ మోతాదులను ఇస్తారు. శరీరానికి హాని కలిగించేవి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా ఉపయోగించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. కానీ చాలా మంది ఇప్పుడు యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని చూడటం లేదు. దాదాపు 75 శాతం మంది రోగులు యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని WHO నివేదిక కనుగొంది. కానీ అది పని చేయనప్పుడు, ఎక్కువ మోతాదులు అవసరం. కానీ శరీరం కూడా దానికి ప్రతిస్పందించడం ఆపే సమయం వస్తుంది.

COVID-19 మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్ వాడకం ప్రబలంగా ఉంది. తూర్పు మధ్యధరా, ఆఫ్రికన్ ప్రాంతంలో ఇది 83 శాతం పెరిగింది. అయితే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 33 శాతం పెరిగింది. తీవ్రమైన COVID-19 ఉన్న వ్యక్తులకు అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చారు.

రోగికి యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అనవసరంగా ఉపయోగించినప్పుడు, అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. జనవరి 2020 – మార్చి 2023 మధ్య 65 దేశాల్లోని ఆసుపత్రులలో చేరిన 4,50,000 మంది రోగుల డేటా ఆధారంగా ఈ ఫలితాలు కనుగొన్నారు.

Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గోదాములో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. త్రిపురాంతకం గ్రామానికి చెందిన కె.ప్రసాద్‌ అనే వ్యక్తి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద పహారా విధులు కేటాయించారు. ఇందులో భాగంగా రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శశికుమార్‌(22)తో కలిసి ద్విచక్ర వాహనంపై గోదాము వద్దకు వచ్చారు.

నిబంధనల ప్రకారం సదరు గోదాములోకి విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించకూడదు. అయినప్పటికీ ప్రసాద్‌ తన వెంట కుమారుడిని తీసుకెళ్లారు. ఒకటో తేదీ కావడంతో వేతనం తాలుకా డబ్బులు తనకు ఇవ్వాలని శశికుమార్‌ తండ్రిని అడిగారు. దీంతో ప్రసాద్‌ ఒక్కసారిగా విచక్షణ కోల్పోయారు. తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో శశికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను నియంత్రించారు.

Air Conditioner: మీ ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు చేస్తే పేలుడు ఖాయం.. నివారణకు మార్గాలు ఏంటి?

ఈ వేసవి మరింత కఠినమైనది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. అయితే కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏసీల వినియోగం పెరుగుతుండడంతో ఏసీల వల్ల ఇళ్లకు మంటలు చెలరేగడం ఎక్కువవుతుంటుంది. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముంబైలో ఇటీవల జరిగిన ఇళ్లు మంటలకు ఏసీ కంప్రెసర్ పేలుళ్లే కారణమని విచారణలో వెల్లడైంది. తాజాగా యూపీలోని నోయిడాలోని ఓ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ వల్ల ఇల్లు దగ్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చినా పెద్దగా నష్టం వాటిల్లలేదు కానీ చాలా సొసైటీల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఏసీ కంప్రెషర్‌లు పేలిపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు కూడా ఉన్నాయి. ఆ ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్ కండీషనర్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉంటే కూడా ఏసీ కంప్రెసర్ పేలి పెద్ద ప్రమాదాలు, మరణాలకు కూడా దారి తీస్తుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సరిగ్గా నిర్వహించబడకపోతే, అది పనిచేయకపోవచ్చు. అందువల్ల, ఎలక్ట్రికల్ వస్తువులను సరిగ్గా ఉపయోగించడం అవసరం.

ఏసీ కంప్రెసర్ ఎందుకు విరిగిపోతుంది?
ఎయిర్ కండీషనర్ (AC) కంప్రెషర్‌లు పేలడం అనేది తీవ్రమైన విషయం. ఇది ఆర్థిక నష్టానికి, కొన్నిసార్లు ప్రాణనష్టానికి దారితీస్తుంది. చాలా అగ్ని ప్రమాదాలు ఏసీలో షార్ట్ సర్క్యూట్ లేదా కంప్రెసర్ పేలుడు వల్ల సంభవిస్తాయి. ఇది తీవ్రమైన గాయం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించవచ్చు. కొన్ని తప్పులు, నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి సంఘటనలు నివారించడానికి, సరైన సంరక్షణ, నిర్వహణ చాలా ముఖ్యం. కంప్రెసర్ పేలుడుకు కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.

వేడెక్కడం: అధిక ఉష్ణోగ్రతలు కంప్రెసర్ పేలుడుకు ప్రధాన కారణం కావచ్చు. కంప్రెసర్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నిరంతరం నడుస్తుంటే, అగ్ని లేదా పేలుడు జరుగుతుంటుంది.
నిర్వహణలో నిర్లక్ష్యం: ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్, మెయింటెయిన్ చేయకపోతే కంప్రెసర్‌లో దుమ్ము, ధూళి, ఇతర శిధిలాలు పేరుకుపోతాయి. ఇది కంప్రెసర్‌పై ఒత్తిడిని పెంచుతుంది. అది విఫలమవుతుంది.
గ్యాస్ లీకేజ్: కంప్రెసర్‌లో రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీకేజ్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ఒక లీక్ ఉన్నట్లయితే, గ్యాస్ పీడనం అసాధారణంగా మారవచ్చు. ఇది కంప్రెసర్‌కు హాని కలిగించవచ్చు.
వోల్టేజ్ హెచ్చుతగ్గులు: స్థిరమైన వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కంప్రెసర్‌ను దెబ్బతీస్తాయి. ఇది చివరికి పేలుడుకు కారణమవుతుంది.
కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడం: కంప్రెసర్ కూలింగ్ ఫ్యాన్ పని చేయకపోయినా, కంప్రెసర్ వేడెక్కుతుంది. దీని కారణంగా ఏసీ పేలిపోయే అవకాశం ఉంది.

కంప్రెసర్ పేలుడును నివారించడానికి మార్గాలు:
రెగ్యులర్ సర్వీసింగ్, నిర్వహణ: మీ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసు చేయించండి. అలాగే కంప్రెసర్ శుభ్రపరచడం, నూనె వేయడం, అన్ని నిర్వహణలు క్రమానుగతంగా జరుగుతాయి. ప్రతి 6 నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి ఏసీ రిపేరర్ ద్వారా సర్వీస్‌ను పొందండి.
సరైన వోల్టేజీని జాగ్రత్తగా చూసుకోండి: వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఉపయోగించాలి. తద్వారా వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్‌ను పాడుచేయవు. ఏసీ కోసం విద్యుత్ సరఫరా సరైన వోల్టేజ్‌లో ఉందని నిర్ధారించుకోవడానికి వోల్టేజ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
గ్యాస్ లీకేజీని తనిఖీ చేయండి: ఏసీకి సంబంధించి గ్యాస్ లీకేజీని క్రమానుగతంగా తనిఖీ చేయండి. ఏ రకమైన లీకేజీ అయినా, వెంటనే సాంకేతిక నిపుణుడిని పిలిచి మరమ్మతు చేయండి. గ్యాస్ రీఫిల్లింగ్ సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారా మాత్రమే చేయాలి.
ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ శుభ్రపరచడం: ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఇది కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని కలిగించదు. ఇది సరిగ్గా పని చేస్తుంది.
సరైన వెంటిలేషన్: వేడెక్కకుండా నిరోధించడానికి కంప్రెసర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కంప్రెసర్‌ను ప్రత్యక్ష సూర్యకాంతి లేదా చాలా వేడి ప్రదేశాలలో ఉంచవద్దు.
కూలింగ్‌ ఫ్యాన్‌ని తనిఖీ చేస్తోంది: కూలింగ్‌ ఫ్యాన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్‌ చేయండి. కూలింగ్ ఫ్యాన్‌లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించండి.

మీరు కొనుగోలు చేసిన పాలు కల్తీవా.. మంచివా?.. ఎలా గుర్తించాలి?

ఈ మధ్య ఎక్కువగా కల్తీ ఆహారాలు, కల్తీ పదార్థాలపైనే చర్చ జరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక లోపాలు బయట పడటమే ఇందుకు కారణం.

దీంతో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. బయట టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు? సేఫ్ అని భావిస్తేనే తిడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కల్తీ జరుగుతున్నప్పటికీ గుర్తించలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రతిరోజూ కనుగోలు చేసే పాలల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

* సాధారణ పాలకంటే కల్తీ పాలు చాలా మందంగా లేదా చిక్కగా ఉంటాయి. అట్లనే మనం కొన్న పాలు పొడిగా లేదా గట్టిగా మారితే.. కల్తీ చేయబడ్డాయని అనుమానించవ్చు. 5 మిల్లీలీటర్ల పాలలో రెండు టీ స్పూన్ల ఉప్పు లేదా అయోడిన్ వేసి కలపాలి, అప్పుడు అవి నీలం రంగులోకి మారితే గనుక అందులో ఏవో పిండి పదార్థాలు కలిపారని అర్థం.

*కల్తీ పాలను గుర్తించడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు కొనుగోలు చేసిన పాలను తక్కువ మంట మీద 2 నుంచి 3 గంటలు మరిగించాలి. అంటే గట్టిపడి.. చిక్కబడే వరకు మరగాలన్నమాట. ఈ సందర్భంగా పాల రేణువులు మందంగా, గట్టిగా ఉంటే కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

* ఇంకో టెక్నిక్ ఏంటంటే.. కొన్ని చుక్కల పాలను నేలపై వేయండి. అవి ఎలా ప్రవహిస్తున్నాయో గమనించండి. స్లోగా కదులుతూ తెల్లని మచ్చలుగా కనిపిస్తే స్వచ్ఛంగా ఉన్నట్లే. అలా కాకుండా నేలపై పడిన వెంటనే స్పీడ్‌గా ప్రవహిస్తే మాత్రం అవి కల్తీ పాలు.

*పాలను కల్తీ చేయడానికి ‘టింక్చర్’ అనే రసాయనిక పొడిని కూడా యూజ్ చేస్తుంటారు. వాస్తవానికి ఇది అత్యంత సాధారణ రూపంలో లభించే యూరియా. వివిధ పదార్థాలలో కలపడంవల్ల వాటి రుచి కూడా మారదు. కాబట్టి కల్తీ చేసేవారు యూజ్ చేస్తారు. అయినా కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు. ఎలాగంటే.. అర టేబుల్ స్పూన్ పాలు తీసుకొని, అందులో కాస్త సోయాబిన్ పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక లిట్మస్ కాగితాన్ని (మార్కెట్‌లో దొరుకుతుంది) తీసుకొని కొన్ని సెకన్లపాటు పాలలో ముంచండి. అవి ఎరుపు నుంచి నీలం రంగులోకి మారితే యూరియాతో కల్తీ చేశారని అర్థం చేసుకోవచ్చు.

రూ.10 వేలకే లావా 5జీ ఫోన్‌ 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

రూ.10 వేలకే లావా 5జీ ఫోన్‌ 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Lava సరసమైన ధరకే సరికొత్త 5G ఫోన్ ను విడుదల చేసింది. యువతను దృష్టిలో ఉంచుకుని Lava Yuva 5G పేరుతో తీసుకొచ్చారు.

రెండు స్టోరేజీ వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్ ధర రూ 10 వేలు మాత్రమే

Lava Yuva 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Unisoc T750 ప్రాసెసర్‌తో ఆధారితం.
18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోంది.
కంపెనీ రెండు సంవత్సరాల పాటు ఒక OS అప్‌డేట్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా. మిస్టిక్ బ్లూ మరియు మిస్టిక్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.

Lava Yuva 5G రెండు వేరియంట్లలో వస్తుంది. 4GB + 64GB స్టోరేజ్ ధర రూ.9,499. 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. అమెజాన్‌తో పాటు లావా ఇ-స్టోర్ మరియు రిటైల్ అవుట్‌లెట్లలో జూన్ 5 నుండి ఫోన్ అమ్మకానికి వస్తుంది.

Vastu Tips: ఉత్తరం దిశలో ఈ వస్తువులు పెట్టండి.. ఆర్థిక కష్టాలు తీరుతాయి

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులను వాస్తును విడదీయలేని పరిస్థితి. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ విషయంలో వాస్తును ఫాలో అవుతుంటారు.

కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలో కూడా నిర్ణయించారు.

ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే వాస్తు లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఉత్తరం దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. ఇంటి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారా వీలైనంత వరకు ఉత్తర దిశలో ఉండాలని చెబుతున్నారు. ఇక ఉత్తర దశలో అద్దం ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇక ఇంట్లో ఉత్తరం దిశలో కుబేరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇంట్లోని వంటగది ఉత్తరం వైపు ఉంటే వంటగదిలో ఎప్పుడూ ధాన్యంతో నిండి ఉంటుందని (సంపద ఉంటుంది),అలాంటి వారికి ఆర్థిక సంక్షోభం ఉండదని చెబుతున్నారు. ఇక ఇంట్లో నిత్యం చికాకులు ఉంటే, ఆర్థికంగా పురోగతి లేకుంటే తులసి మొక్కను ఉత్తర దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఇక ఉత్తరం వైపు ఉండే గోడలపై నీలం రంగు పెయింట్ చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఎలాంటి సమస్య ఉండదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

బడికొచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు! ఒకటో తారీఖున జీతం కోసం చూస్తున్నారు

ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా..

విద్యార్థులకు 70 శాతం మార్కులెందుకు రావడం లేదో చూడండి.. బాధ్యతతో బోధించండి

గన్నవరం బాలికల హైస్కూల్‌ ఉపాధ్యాయులతో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌

గన్నవరం, జూన్‌ 1: ”విద్యార్థులు బడికి వస్తున్నారు. ఉపాధ్యాయులు వచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా విద్యార్థికి 70శాతం మార్కులు ఎందుకు రావడం లేదనే ఆలోచన చేయండి. అదే మీ పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు.

40 శాతం మార్కులు వచ్చిన వారికి మీకు కంపెనీ ఉంటే ఉద్యోగం ఇస్తారా?” అని గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రశ్నించారు. హైస్కూళ్ల పరిశీలనలో భాగంగా గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి హైస్కూల్‌ను శనివారం ప్రవీణ్‌ ప్రకాశ్‌ తనిఖీ చేశారు. తొలుత గన్నవరం బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అక్కడ ఉపాధ్యాయు లతో మాట్లాడారు.

పదో తరగతిలో 70శాతం మార్కులు ఎంతమందికి వచ్చాయని ఉపాధ్యాయులను అడిగారు. దీనిపై కొందరు ఉపాధ్యా యులు మొత్తం పర్సంటేజ్‌ చెప్పారు. దీనిపై ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ బాధ్యత లేదు.

బాధ్యతతో విద్యార్థులకు బోధన చేయడం లేదనడంతో డీఈవో తాహెరా సుల్తానా సమాధానం చెప్పబోయారు. నేనేమీ చిన్న పిల్లోడిని కాదు. ఐఏఎస్‌ ర్యాంకర్‌ని. మీరు చెప్పే సమాధానం ఆఫీసులో కూర్చుని కూడా తెలుసుకోగలనన్నారు.

పదో తరగతిలో రిజల్ట్‌ కావాలని పదేపదే చెబుతున్నా పట్టడం లేదని, ఫౌండేషన్‌ సరిగా లేని విద్యార్థికి ఆరో తరగతి నుంచే బేసిక్స్‌ నేర్పుతూ వస్తే రిజల్ట్‌ ఇలా ఉం టుందా అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా 70శాతం మార్కులు తక్కువ మందికి రావటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంను పరిశీలించి కొలతలు వేశారు. సరిపడా వచ్చిందా రాలేదా అని ఎంఈవోలను అడిగారు.

ఎంత మందికి ఎంత అవసరమని అడగితే సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవోలు కె.రవికుమార్‌, ఆర్‌.కమల కుమారి, హెచ్‌ఎం డి.ఝాన్సీరాణి పాల్గొన్నారు. తర్వాత గొల్లనపల్లి హైస్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. హెచ్‌ఎం కేఎస్‌ జగదీ శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు.. నిర్మా యాడ్‌లో కనిపించిన పాప ఎవరు ?

‘టయ్.. వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. పాలల్లోనా తెలుపు.. నిర్మాతో వచ్చింది.. రంగుల బట్టలే తళతళలా మెరిశాయి. అందరూ మెచ్చినదే నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. హేమా..రేఖా..జయ..సుష్మా. అందరూ మెచ్చే నిర్మా’ ఈ పాట ఏ ప్రొడక్ట్ ప్రకటనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆ పాట ఆకట్టుకోవడమే కాదు.. ఆ డిజర్జెంట్ పౌడర్ కూడా మెప్పించింది. ఇప్పుడంటే చాలా సర్ఫ్ ఉత్పత్తులు వచ్చాయి కానీ.. ఒకప్పుడు నిర్మాదే హవా. ప్రతి మహిళ దీన్ని వినియోగించిన వాళ్లే. దశాబ్దాలకు పైగా తిరుగులేని ఉత్పత్తిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సర్ఫ్ కొనేవారే కాదు వాడేవారు కూడా తక్కువ అయ్యారు. ఈ వాషింగ్ పౌడర్ కూడా అంతగా కనిపించటడం లేదు. అలాగే ఆ ప్యాకెట్ మీద ఉన్న అమ్మాయి ఎవరు అనే డౌట్ కూడా వస్తుంది. ఇంత మంచి ఉత్పత్తిని అందించిన ఆ వ్యక్తి ఎవరు… తెలుసుకుందాం

ఒకప్పుడు దుస్తులు పువ్వుల్లా మెరవాలంటే మహిళలు ఉప్పు, సోడా వంటి వాటితో దుస్తులు శుభ్రం చేసుకునేవారు. దీంతో దుస్తులు త్వరగా పాడైపోయేవి. 1960వ దశకంలో వస్త్రాలను శుభ్రం చేసే ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా వచ్చిందే నిర్మా వాషింగ్ పౌడర్‌. ఇది వచ్చాక విపరీతంగా మహిళలను ఆకట్టుకుంది. అప్పట్లో మరో ఆప్షన్ కూడా ఉండేది కాదు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే ఆ సమయంలో మార్కెట్‌లో నంబర్ 1 ప్రొడక్ట్‌గా అవతరించింది. ఈ వాషింగ్ పౌడర్ సృష్టి కర్త ఎవరంటే.. కర్బన్ బాయ్ పటేల్. అతడో బిజినెస్ మ్యాన్. ఇప్పటికీ ధనవంతుల జాబితా తీస్తే ఆయన పేరు ఉంటుంది. గుజరాత్‌లోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తిచేశాడు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాడు. అయితే డిటర్జెంట్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తనకున్న కెమిస్ట్రీ నాలెడ్ట్ ఉపయోగించి తన ఇంటి వద్దనే సర్ఫ్ తయారు చేశాడు.


ఇక ఆ ప్యాకెట్ పై కనిపించే ఆ బాలిక ఎవరంటే. కర్బన్ భాయి పటేల్ కూతురు నిరుపమ. తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం తాను తయారు చేసిన వాషింగ్ పౌడర్‌కు “నిర్మా వాషింగ్ పౌడర్”గా పేరు పెట్టాడు తండ్రి. వాషింగ్ పౌడర్ ప్యాకెట్‌పై నిర్మాకు గుర్తుగా ఆ పాప ఫోటోను ఉంచాడు. తొలుత సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ ఈ డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు. ఈ పౌడర్‌కు ఆదరణ లభించడంతో సంస్థ ఎదగడం స్టార్ అయ్యింది. ఒక చిన్న ఫ్యాక్టరీ స్థాపించి వాషింగ్ పౌడర్ తయారీ మొదలు పెట్టాడు. నిర్మా పౌడర్ ప్రమోషన్ కోసం, రేడియోలో ప్రకటనలు ఇచ్చారు. కొంత కాలానికి టీవీలో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా వచ్చిందే నిర్మా సాంగ్. అప్పట్లో మార్కెట్‌లో హిందూస్థాన్ యూనిలివర్ కంపెనీ వాషింగ్ పౌడర్‌ అగ్రగామిగా ఉండేది.

కానీ తక్కువ ధరకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ దొరకడం, సామాన్యులు సైతం కొనగలిగేలా ఉండటంతో కొంతకాలంలోనే నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్‌లో నంబర్ స్థానానికి చేరింది. నిర్మా కంపెనీ కొంత కాలం తర్వాత డిటర్జెంట్ కేక్స్ అంటే సోప్స్ కూడా తయారు చేసింది. అయితే కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ శాసించిన నిర్మా వాషింగ్ పౌడర్ కు పోటీగా మరిన్ని ఉత్పత్తులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కాంపిటీషన్ తట్టుకుని నిలబడలేకపోయింది. మార్కెట్‌లో వస్తున్న కొత్త కొత్త బ్రాండ్స్ కారణంగా నిర్మాకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత కర్సన్ భాయ్ పటేల్ వేర్వేరు బిజినెస్‌లు చేశాడు. నిర్మా గ్రూప్ 2014లో సిమెంట్ తయారీ మొదలుపెట్టింది. కర్సన్ భాయ్ పటేల్ ప్రస్తుతం ఇండియాలో మిలియనీర్లలో ఒకరు. అతని అతి ఆస్తి విలువ 4.9 బిలియన్ డాలర్లు.

Health

సినిమా