Friday, November 15, 2024

చెరకు రసమే కాదు ఆ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా తాగకండి – కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ICMR

ICMR New Guidelines: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఉపశమనం కోసం జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. చెరుకు రసం సహా పలు రకాల పండ్ల రసాలు తాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చరకు సహా ఎక్కువ చక్కెర కలిగి ఉండే జ్యూస్లు, కూల్ డ్రింక్స్ వినియోగం తగ్గించాలని వెల్లడించారు.

ఈ మేరకు ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు 17 కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

చెరకు రసం తక్కువగా తీసుకోండి

చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం పట్ల వీలైనంత తక్కువగా తీసుకోవాని ICMR తెలిపింది. అంతే కాదు, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్ డ్రింక్స్, చక్కెర యాడ్ చేసిన పండ్ల రసాలు, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది. పండ్లతో పాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేసింది. సమతుల ఆహారం, మెరుగైన ఆహారపు అలవాట్లతో కూడిని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

చెరకు రసం గురించి ప్రత్యేక ప్రస్తావన

ICMR తాజా మార్గదర్శకాల్లో చెరకు రసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. 100 మిల్లీ లీటర్ల చెరకు రసంలో 13 – 15 గ్రాముల చక్కెర ఉంటుందని తెలిపింది. “దేశంలో ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే చెరకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు వినియోగాన్ని తగ్గించాలి” అని ICMR వెల్లడించింది. పెద్దలు ప్రతిరోజూ 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు రోజుకు 24 గ్రాములకు పరిమితం చేయాలని సూచిస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోలికోననాల్ నిద్రలేమి సహా పలు సమస్యలకు కారణం అవుతుందన్నారు.

పండ్ల రసాలను తగ్గించి పండ్లు తినండి

చక్కెర కలిపిన పండ్ల రసాలను తీసుకోవద్దని ICMR సూచించింది. పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లు తీసుకోవాలని వెల్లడించింది. పండ్లలోని ఫైబర్, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపింది.

కూల్ డ్రింగ్స్ అస్సలు తీసుకోకండి

శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని ICMR తెలిపింది. చక్కెర, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో పాటు చక్కెర కలిపిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపింది. “కూల్ డ్రింక్స్ అనేవి నీళ్లు, తాజా పండ్లకు ప్రత్యామ్నాయం కాదు. వాటిని వీలైనంత వరకు వాటిని తీసుకోకపోవడం మంచిది” అని ICMR వెల్లడించింది. మజ్జిగ, నిమ్మరసం, పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం అని తెలిపింది.

టీ, కాఫీలతో ఆరోగ్యానికి చాలా ముప్పు

అధిక కెఫీన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీని వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని ICMR సూచించింది. 150ml కప్ బ్రూ కాఫీలో 80 నుండి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుందని తెలిపింది. టీలో 30 నుండి 65 మిల్లీ గ్రాముల వరకు ఉంటుందని వెల్లడించింది. రోజువారీ కెఫిన్ 300 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదని వెల్లడించింది.

టీ, కాఫీలోని టానిన్లు, ఐరన్ శోషణను నిరోధిస్తాయని ICMR తెలిపింది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీసే అవకాశం ఉందని వెల్లడించింది. భోజనానికి ముందు, తర్వాత కనీసం ఒక గంట వరకు టీ, కాఫీని తీసుకోవద్దని ICMR సూచించింది. అధికంగా కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

చక్కెర కలిపిన డ్రింక్స్ ను మానేసి, వాటి స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, సీ ఫుడ్స్ లాంటి సమతుల ఆహారం తీసుకోవాలని ICMR వెల్లడించింది.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నూనె, చక్కెర, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయాలని ICMR మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

 

 

 

హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం

Hyderabad is now capital of telangana: అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి, హైదరాబాద్ ఇక తెలంగాణదే.. ఏపీతో తెగిన బంధం
Hyderabad is now capital of telangana: ఆంధ్రప్రదేశ్‌తో హైదరాబాద్‌కు బంధం తెగింది. హైదరాబాద్ ఇక తెలంగాణ సొంతమైంది. ఇప్పటి వరకు గవర్నర్ చేతిలో ఉన్న రాజధాని పౌరుల ఆస్తి, రక్షణ వ్యవహారాలు తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చాయి.

ఏపీ పునర్విభన చట్ట ప్రకారం హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత, ఏపీకి పదేళ్లు తాత్కాలిక రాజధానిగా కేంద్ర ప్రకటించింది. ఆ గడువు జూన్ ఒకటి (శనివారం)తో ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్.. తెలంగాణ సొంతమైంది.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామన్నా రు. ప్రజా పాలన అందిస్తామని వెల్లడించారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లుపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకు దక్కతాయని పేర్కొన్నారు.

ఏళ్ల సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీ నాయకులందరి కీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి.

ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెడుతోంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది.

ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

Election Results 2024: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ అలర్ట్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు..!

లోక్‌సభ తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ 4న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్ మీనా. తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు సీఈఓ. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వెంటనే బయటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక, హింసాత్మక ఘటనల విషయంలో కఠినంగా వ్యవహారించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కీలకమైన పరిస్థితుల్లో తప్పుడు వార్తలను వెంటనే ఖండించాలని చెప్పారు సీఈఓ మీనా. కఠినమైన పరిస్థితుల్లోనే శాంతిభద్రతలను కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపారు ముకేశ్ కుమార్ మీనా. మరోవైపు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా.. ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా పోలీసుల నిఘా కొనసాగుతుందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!

అటు తెలంగాణలో కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌. 17 ఎంపీ స్థానాలకు జూన్‌ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ షురూ అవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్‌ వారీగా గరిష్టంగా 24 రౌండ్లు, కనిష్టంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు సీఈవో వికాస్‌రాజ్‌. రాష్ట్రంలోని అన్ని కౌంటింగ్ సెంటర్లలో.. ప్రతి మూలా కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ల దగ్గర బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని వికాస్ రాజ్ వివరించారు. నాలుగు అంచెల భద్రత ఉంటుందన్నారు. ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించారు. ఇక..కౌంటింగ్ సెంటర్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సిబ్బంది సెల్‌ఫోన్లకు పర్మిషన్ ఉండదని స్పష్టం చేశారు. 10వేల మంది సిబ్బంది.. 2400మంది మైక్రో అబ్జర్‌వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారన్నారు సీఈవో వికాస్‌రాజ్‌. మరోవైపు.. కౌంటింగ్ రోజు మద్యం షాపులు బంద్ ఉంటాయని చెప్పారు

చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఆర్మూర్, భద్రాచలం, ఆశ్వరావుపేటలో కేవలం 13 రౌండ్లలోనే ఫలితాలు వెలువడుతాయని వివరించారు. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని వికాస్ రాజ్ తెలిపారు.

వైట్‌నర్‌… టేప్‌లా వచ్చింది! వాడేయండి సులభంగా

వైట్‌నర్‌… టేప్‌లా వచ్చింది!

పిల్లలు ఏదైనా రాసుకునేప్పుడో, పెద్దవాళ్లు ఆఫీసు ఫైల్స్‌లోనో… పొరపాట్లు వస్తే వెంటనే గుర్తొచ్చేది వైట్‌నర్‌. రాసిన అక్షరాలపైన వైట్‌నర్‌ లిక్విడ్‌ను- బ్రష్‌ తీసి నెమ్మదిగా పూస్తారు.

ఆ పని పెద్దవాళ్లు జాగ్రత్తగానే చేస్తారేమో కానీ పిల్లలకు కాస్త ఇబ్బందే. పక్కనున్న అక్షరాలపైకీ ఆ లిక్విడ్‌ అంటుకుపోతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే… కొత్తగా వస్తున్న కరెక్షన్‌, వైట్‌నర్‌ టేప్‌ని వాడొచ్చు. పెన్నులా దీన్ని పట్టుకుని అవసరమైనచోట గీసుకుంటూపోతే సన్నని టేప్‌ దాంట్లోంచి వస్తుంది. దీంతో క్షణాల్లో పనైపోతుంది, పైగా ఈ ప్లాస్టిక్‌ వైట్‌నర్‌ చాలారోజులూ ఉంటుంది. నచ్చితే, ఈసారి మీ పిల్లలకు కొనే స్టేషనరీ వస్తువుల్లో దీన్ని భాగం చేయండైతే!

Vera Wang : 74 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ 24 ఏళ్ల యువతిలా కనిపిస్తోంది.. ఈమె అందం రహస్యం తెలుసా?

ప్రస్తుత జీవనశైలి ప్రకారం, చాలా మంది ప్రజలు కేవలం 50 ఏళ్ల వయస్సులోనే వృద్ధాప్యంగా కనిపిస్తారు. ఎంత మేకప్ వేసుకున్నా ముడతలు పడిన చర్మాన్ని దాచుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా మెడ, చేతులు పాతవిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మమ్మ వయసులో ఉన్న ఓ మహిళను ఒక్కసారి అలా చూస్తే షాక్ అవుతారు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యాన్ని ఆమె మాటల్లోనే వినండి. మే 27న, వెరా వాంగ్ తెల్లటి స్విమ్‌సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోటోకి పోజులిచ్చింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది , ఆమె బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించింది. 74 ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ, వాంగ్ ఈ ఫోటోలో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఆమె ఫోటో చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందం రహస్యం ఏంటని కొందరు అడుగుతున్నారు.

అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాంగ్ వయసు 74 సంవత్సరాలు. అయితే ఆమె ఎంత అందంగా ఉందో అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూసిన వారెవరైనా ఆమె వయస్సు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత వయసొచ్చిందంటే ఎవరూ నమ్మరు. పైగా ఆమె జుట్టు కూడా తెల్లగా లేదు. కానీ మీడియా ఇంటర్వ్యూలలో, వాంగ్ తన జుట్టుకు నలుపు రంగు వేసుకున్నట్లు అంగీకరించింది. అయితే ఆమె చర్మం మాత్రం యువతిలా కనిపిస్తోంది. 74 ఏళ్ల వయసులోనూ ఇలా బిగుతుగా ఉండే చర్మాన్ని కాపాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన వాంగ్ బ్యూటీ సీక్రెట్ ఏంటని పలువురు మీడియా ప్రశ్నించగా.. “నేను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. యవ్వనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో కలిసి పని చేస్తాను. ఆయన్ని చూసి ప్యాషన్‌తో పనిచేయడం వల్ల యంగ్‌గా కనిపిస్తున్నాను. అలాగే తగినంత నిద్ర పొందండి , ప్రకాశవంతమైన సూర్య కిరణాలకు దూరంగా ఉండండి. సాయంత్రం పూట వోడ్కా తాగడం తన యవ్వన రహస్యమని వెరా తెలిపింది.

అంతేకాకుండా, 74 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, వాంగ్ గ్వాన్ స్టెఫానీ , అరియానా గ్రాండే వంటి చాలా మంది ప్రసిద్ధ వ్యక్తుల కోసం దుస్తులను డిజైన్ చేస్తున్నారు. 1990లో, వోగ్ మ్యాగజైన్ , రాల్ఫ్ లారెన్‌లో పనిచేసిన తర్వాత, తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా వారు ఇప్పటికీ ప్రధాన కస్టమర్లను కలిగి ఉన్నారు. వెరా తన టైమ్‌లెస్ ఫ్యాషన్ సెన్స్ , వయసుకు తగ్గ అందంతో చాలా మందిని ఆకర్షిస్తోంది.

Bank Deposits: కోట్లాది మంది కస్టమర్లకు ఆ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఇది 91 రోజుల నుండి 180 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపైలపై 4.80 శాతం వడ్డీని అందిస్తోంది. 181 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీకి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీ రేట్లు:

సీనియర్ సిటిజన్లు సాధారణ రేట్లు కాకుండా 0.50% అదనపు వడ్డీని పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లకు 399 రోజులకు గరిష్టంగా 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 నుండి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డిలపై సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పుడు 46 రోజుల నుండి 90 రోజుల మధ్య FDపై 4.50 శాతం వడ్డీ రేటు అందుబాటులో

సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది. 399 రోజుల ఎఫ్‌డీపై గరిష్ట వడ్డీ రేటు 8 శాతం.

సాధారణ ప్రజలు, సీనియర్‌ సీటిజన్స్‌కు ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా..

  1. 7 నుంచి 14 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  2. 15 నుంచి 30 రోజులు – సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  3. 31 నుంచి 45 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 4 శాతం
  4. 46 నుంచి 90 రోజులకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5 శాతం
  5. 91 రోజుల నుంచి 120 రోజులకు సాధారణ ప్రజలకు 4.80 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.30 శాతం.
  6. 121 రోజుల నుంచి 180 రోజులకు సాధారణ ప్రజలకు 4.90 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 5.40 శాతం.
  7. 181 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 6.75 శాతం.
  8. 1 సంవత్సరం నుంచి 398 రోజులకు సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.25 శాతం.
  9. 399 రోజులకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.50 శాతం.
  10. 400 రోజుల నుంచి 2 సంవత్సరాలకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7.75 శాతం.
  11. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  12. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.
  13. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్‌ సీటిజన్స్‌కు 7 శాతం.

 

 

 

Digestion : అజీర్తి సమస్యకు పసుపుతో చెక్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

Digestion : అజీర్తి సమస్యకు పసుపుతో చెక్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

తీసుకుంటున్న ఆహారంలో, జీవనశైలిలో మార్పులు వెరసి ఇటీవల చాలా మంది అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారు. తీసుకున్న ఆహారం జీర్ణం కావడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు.

అందుకే తీసుకునే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టడంలో పసుపు కూడా కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది.

పసుపులోని కర్‌క్యుమిన్‌ అజీర్ణ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో ఆమ్లం తగ్గటానికి వాడే ఒమిప్రజోల్‌ మందుతో సమానంగా పసుపు పనిచేస్తునందని పరిశోధనల్లో వెల్లడైంది. పసుపులోని కర్‌క్యుమిన్‌కు వాపును తగ్గించే గుణాలుఉన్నాయి. అలాగే సూక్ష్మక్రిములను కట్టడి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

గాయమైన సమయంలో పసుపు అప్లై చేసుకునేది ఇందుకే. అయితే పసుపు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే సంపద్రాయ మందులతో పోల్చితే పసుపు జీర్ణక్రియను ఏమేర మెరుగు పరుస్తుందో అన్నదానిపై స్పష్టత లేదు. థాయిలాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అజీర్ణ సమస్యతో బాధపడేవారిలో కర్‌క్యుమిన్‌, ఒమిప్రజోల్‌ మాత్రలు ఇచ్చి పరిశీలించారు. వీరందరిలోనూ నొప్పి, కడుపుబ్బంర వంటి లక్షణాలు దాదాపు సమానంగా తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు.

Chicken: చికెన్‌ తింటున్నారా? జాగ్రత్త.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

చికెన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎఇ)లోని లేబొరేటరీ పరిశోధనలో చికెన్‌లో 40 శాతం యాంటీబయాటిక్ అవశేషాలు ఉన్నాయని కనుగొన్నారు. చికెన్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కానీ ఇటీవలి కొన్ని పరిశోధనలు దీనిని తినే వ్యక్తులలో రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చని, యాంటీబయాటిక్స్‌కు తక్కువ అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

మీరు చికెన్ తింటే జాగ్రత్తగా ఉండండి

కోళ్లకు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు లేదా అవి వేగంగా ఎదగడానికి, బరువు పెరగడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఆ చికెన్ తింటే, అది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎందుకంటే చికెన్‌లోని యాంటీబయాటిక్స్ మీ శరీరంలోకి వెళ్తాయి. ఆ తరువాత, మీ శరీరం దానికి అలవాటుపడుతుంది. కానీ ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు, యాంటీబయాటిక్స్ తగినంత వేగంగా పని చేయవు. అందుకే వారికి ఎక్కువ మోతాదులను ఇస్తారు. శరీరానికి హాని కలిగించేవి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్స్‌ను విచక్షణారహితంగా ఉపయోగించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. కానీ చాలా మంది ఇప్పుడు యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని చూడటం లేదు. దాదాపు 75 శాతం మంది రోగులు యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని WHO నివేదిక కనుగొంది. కానీ అది పని చేయనప్పుడు, ఎక్కువ మోతాదులు అవసరం. కానీ శరీరం కూడా దానికి ప్రతిస్పందించడం ఆపే సమయం వస్తుంది.

COVID-19 మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్ వాడకం ప్రబలంగా ఉంది. తూర్పు మధ్యధరా, ఆఫ్రికన్ ప్రాంతంలో ఇది 83 శాతం పెరిగింది. అయితే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 33 శాతం పెరిగింది. తీవ్రమైన COVID-19 ఉన్న వ్యక్తులకు అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చారు.

రోగికి యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అనవసరంగా ఉపయోగించినప్పుడు, అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. జనవరి 2020 – మార్చి 2023 మధ్య 65 దేశాల్లోని ఆసుపత్రులలో చేరిన 4,50,000 మంది రోగుల డేటా ఆధారంగా ఈ ఫలితాలు కనుగొన్నారు.

Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గోదాములో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. త్రిపురాంతకం గ్రామానికి చెందిన కె.ప్రసాద్‌ అనే వ్యక్తి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద పహారా విధులు కేటాయించారు. ఇందులో భాగంగా రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శశికుమార్‌(22)తో కలిసి ద్విచక్ర వాహనంపై గోదాము వద్దకు వచ్చారు.

నిబంధనల ప్రకారం సదరు గోదాములోకి విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించకూడదు. అయినప్పటికీ ప్రసాద్‌ తన వెంట కుమారుడిని తీసుకెళ్లారు. ఒకటో తేదీ కావడంతో వేతనం తాలుకా డబ్బులు తనకు ఇవ్వాలని శశికుమార్‌ తండ్రిని అడిగారు. దీంతో ప్రసాద్‌ ఒక్కసారిగా విచక్షణ కోల్పోయారు. తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో శశికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను నియంత్రించారు.

Air Conditioner: మీ ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు చేస్తే పేలుడు ఖాయం.. నివారణకు మార్గాలు ఏంటి?

ఈ వేసవి మరింత కఠినమైనది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. అయితే కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏసీల వినియోగం పెరుగుతుండడంతో ఏసీల వల్ల ఇళ్లకు మంటలు చెలరేగడం ఎక్కువవుతుంటుంది. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముంబైలో ఇటీవల జరిగిన ఇళ్లు మంటలకు ఏసీ కంప్రెసర్ పేలుళ్లే కారణమని విచారణలో వెల్లడైంది. తాజాగా యూపీలోని నోయిడాలోని ఓ సొసైటీ ఫ్లాట్‌లో ఏసీ వల్ల ఇల్లు దగ్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చినా పెద్దగా నష్టం వాటిల్లలేదు కానీ చాలా సొసైటీల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఏసీ కంప్రెషర్‌లు పేలిపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు కూడా ఉన్నాయి. ఆ ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్ కండీషనర్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉంటే కూడా ఏసీ కంప్రెసర్ పేలి పెద్ద ప్రమాదాలు, మరణాలకు కూడా దారి తీస్తుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సరిగ్గా నిర్వహించబడకపోతే, అది పనిచేయకపోవచ్చు. అందువల్ల, ఎలక్ట్రికల్ వస్తువులను సరిగ్గా ఉపయోగించడం అవసరం.

ఏసీ కంప్రెసర్ ఎందుకు విరిగిపోతుంది?
ఎయిర్ కండీషనర్ (AC) కంప్రెషర్‌లు పేలడం అనేది తీవ్రమైన విషయం. ఇది ఆర్థిక నష్టానికి, కొన్నిసార్లు ప్రాణనష్టానికి దారితీస్తుంది. చాలా అగ్ని ప్రమాదాలు ఏసీలో షార్ట్ సర్క్యూట్ లేదా కంప్రెసర్ పేలుడు వల్ల సంభవిస్తాయి. ఇది తీవ్రమైన గాయం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించవచ్చు. కొన్ని తప్పులు, నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి సంఘటనలు నివారించడానికి, సరైన సంరక్షణ, నిర్వహణ చాలా ముఖ్యం. కంప్రెసర్ పేలుడుకు కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.

వేడెక్కడం: అధిక ఉష్ణోగ్రతలు కంప్రెసర్ పేలుడుకు ప్రధాన కారణం కావచ్చు. కంప్రెసర్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నిరంతరం నడుస్తుంటే, అగ్ని లేదా పేలుడు జరుగుతుంటుంది.
నిర్వహణలో నిర్లక్ష్యం: ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్, మెయింటెయిన్ చేయకపోతే కంప్రెసర్‌లో దుమ్ము, ధూళి, ఇతర శిధిలాలు పేరుకుపోతాయి. ఇది కంప్రెసర్‌పై ఒత్తిడిని పెంచుతుంది. అది విఫలమవుతుంది.
గ్యాస్ లీకేజ్: కంప్రెసర్‌లో రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీకేజ్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ఒక లీక్ ఉన్నట్లయితే, గ్యాస్ పీడనం అసాధారణంగా మారవచ్చు. ఇది కంప్రెసర్‌కు హాని కలిగించవచ్చు.
వోల్టేజ్ హెచ్చుతగ్గులు: స్థిరమైన వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కంప్రెసర్‌ను దెబ్బతీస్తాయి. ఇది చివరికి పేలుడుకు కారణమవుతుంది.
కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడం: కంప్రెసర్ కూలింగ్ ఫ్యాన్ పని చేయకపోయినా, కంప్రెసర్ వేడెక్కుతుంది. దీని కారణంగా ఏసీ పేలిపోయే అవకాశం ఉంది.

కంప్రెసర్ పేలుడును నివారించడానికి మార్గాలు:
రెగ్యులర్ సర్వీసింగ్, నిర్వహణ: మీ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసు చేయించండి. అలాగే కంప్రెసర్ శుభ్రపరచడం, నూనె వేయడం, అన్ని నిర్వహణలు క్రమానుగతంగా జరుగుతాయి. ప్రతి 6 నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి ఏసీ రిపేరర్ ద్వారా సర్వీస్‌ను పొందండి.
సరైన వోల్టేజీని జాగ్రత్తగా చూసుకోండి: వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఉపయోగించాలి. తద్వారా వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్‌ను పాడుచేయవు. ఏసీ కోసం విద్యుత్ సరఫరా సరైన వోల్టేజ్‌లో ఉందని నిర్ధారించుకోవడానికి వోల్టేజ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
గ్యాస్ లీకేజీని తనిఖీ చేయండి: ఏసీకి సంబంధించి గ్యాస్ లీకేజీని క్రమానుగతంగా తనిఖీ చేయండి. ఏ రకమైన లీకేజీ అయినా, వెంటనే సాంకేతిక నిపుణుడిని పిలిచి మరమ్మతు చేయండి. గ్యాస్ రీఫిల్లింగ్ సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారా మాత్రమే చేయాలి.
ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ శుభ్రపరచడం: ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఇది కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని కలిగించదు. ఇది సరిగ్గా పని చేస్తుంది.
సరైన వెంటిలేషన్: వేడెక్కకుండా నిరోధించడానికి కంప్రెసర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. కంప్రెసర్‌ను ప్రత్యక్ష సూర్యకాంతి లేదా చాలా వేడి ప్రదేశాలలో ఉంచవద్దు.
కూలింగ్‌ ఫ్యాన్‌ని తనిఖీ చేస్తోంది: కూలింగ్‌ ఫ్యాన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్‌ చేయండి. కూలింగ్ ఫ్యాన్‌లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించండి.

మీరు కొనుగోలు చేసిన పాలు కల్తీవా.. మంచివా?.. ఎలా గుర్తించాలి?

ఈ మధ్య ఎక్కువగా కల్తీ ఆహారాలు, కల్తీ పదార్థాలపైనే చర్చ జరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక లోపాలు బయట పడటమే ఇందుకు కారణం.

దీంతో ప్రజలు అలర్ట్ అవుతున్నారు. బయట టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు? సేఫ్ అని భావిస్తేనే తిడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కల్తీ జరుగుతున్నప్పటికీ గుర్తించలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రతిరోజూ కనుగోలు చేసే పాలల్లో కల్తీని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

* సాధారణ పాలకంటే కల్తీ పాలు చాలా మందంగా లేదా చిక్కగా ఉంటాయి. అట్లనే మనం కొన్న పాలు పొడిగా లేదా గట్టిగా మారితే.. కల్తీ చేయబడ్డాయని అనుమానించవ్చు. 5 మిల్లీలీటర్ల పాలలో రెండు టీ స్పూన్ల ఉప్పు లేదా అయోడిన్ వేసి కలపాలి, అప్పుడు అవి నీలం రంగులోకి మారితే గనుక అందులో ఏవో పిండి పదార్థాలు కలిపారని అర్థం.

*కల్తీ పాలను గుర్తించడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు కొనుగోలు చేసిన పాలను తక్కువ మంట మీద 2 నుంచి 3 గంటలు మరిగించాలి. అంటే గట్టిపడి.. చిక్కబడే వరకు మరగాలన్నమాట. ఈ సందర్భంగా పాల రేణువులు మందంగా, గట్టిగా ఉంటే కల్తీ జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

* ఇంకో టెక్నిక్ ఏంటంటే.. కొన్ని చుక్కల పాలను నేలపై వేయండి. అవి ఎలా ప్రవహిస్తున్నాయో గమనించండి. స్లోగా కదులుతూ తెల్లని మచ్చలుగా కనిపిస్తే స్వచ్ఛంగా ఉన్నట్లే. అలా కాకుండా నేలపై పడిన వెంటనే స్పీడ్‌గా ప్రవహిస్తే మాత్రం అవి కల్తీ పాలు.

*పాలను కల్తీ చేయడానికి ‘టింక్చర్’ అనే రసాయనిక పొడిని కూడా యూజ్ చేస్తుంటారు. వాస్తవానికి ఇది అత్యంత సాధారణ రూపంలో లభించే యూరియా. వివిధ పదార్థాలలో కలపడంవల్ల వాటి రుచి కూడా మారదు. కాబట్టి కల్తీ చేసేవారు యూజ్ చేస్తారు. అయినా కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు. ఎలాగంటే.. అర టేబుల్ స్పూన్ పాలు తీసుకొని, అందులో కాస్త సోయాబిన్ పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక లిట్మస్ కాగితాన్ని (మార్కెట్‌లో దొరుకుతుంది) తీసుకొని కొన్ని సెకన్లపాటు పాలలో ముంచండి. అవి ఎరుపు నుంచి నీలం రంగులోకి మారితే యూరియాతో కల్తీ చేశారని అర్థం చేసుకోవచ్చు.

రూ.10 వేలకే లావా 5జీ ఫోన్‌ 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

రూ.10 వేలకే లావా 5జీ ఫోన్‌ 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ..

Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Lava సరసమైన ధరకే సరికొత్త 5G ఫోన్ ను విడుదల చేసింది. యువతను దృష్టిలో ఉంచుకుని Lava Yuva 5G పేరుతో తీసుకొచ్చారు.

రెండు స్టోరేజీ వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్ ధర రూ 10 వేలు మాత్రమే

Lava Yuva 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Unisoc T750 ప్రాసెసర్‌తో ఆధారితం.
18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వస్తోంది.
కంపెనీ రెండు సంవత్సరాల పాటు ఒక OS అప్‌డేట్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా. మిస్టిక్ బ్లూ మరియు మిస్టిక్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.

Lava Yuva 5G రెండు వేరియంట్లలో వస్తుంది. 4GB + 64GB స్టోరేజ్ ధర రూ.9,499. 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. అమెజాన్‌తో పాటు లావా ఇ-స్టోర్ మరియు రిటైల్ అవుట్‌లెట్లలో జూన్ 5 నుండి ఫోన్ అమ్మకానికి వస్తుంది.

Vastu Tips: ఉత్తరం దిశలో ఈ వస్తువులు పెట్టండి.. ఆర్థిక కష్టాలు తీరుతాయి

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులను వాస్తును విడదీయలేని పరిస్థితి. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ విషయంలో వాస్తును ఫాలో అవుతుంటారు.

కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఏ వస్తువులు పెట్టుకోవాలో కూడా నిర్ణయించారు.

ముఖ్యంగా ఇంట్లో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే వాస్తు లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఈ దిశలో కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో వాస్తు దోషం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతుంటారు. ఇంతకీ ఉత్తరం దిశలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో ఉత్తర దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. ఇంటి ఉత్తర దిక్కు ఖాళీగా ఉంటే, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంటి ప్రధాన ద్వారా వీలైనంత వరకు ఉత్తర దిశలో ఉండాలని చెబుతున్నారు. ఇక ఉత్తర దశలో అద్దం ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే, ఇంటికి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇక ఇంట్లో ఉత్తరం దిశలో కుబేరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఇంట్లోని వంటగది ఉత్తరం వైపు ఉంటే వంటగదిలో ఎప్పుడూ ధాన్యంతో నిండి ఉంటుందని (సంపద ఉంటుంది),అలాంటి వారికి ఆర్థిక సంక్షోభం ఉండదని చెబుతున్నారు. ఇక ఇంట్లో నిత్యం చికాకులు ఉంటే, ఆర్థికంగా పురోగతి లేకుంటే తులసి మొక్కను ఉత్తర దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఇక ఉత్తరం వైపు ఉండే గోడలపై నీలం రంగు పెయింట్ చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఎలాంటి సమస్య ఉండదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

బడికొచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు! ఒకటో తారీఖున జీతం కోసం చూస్తున్నారు

ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా..

విద్యార్థులకు 70 శాతం మార్కులెందుకు రావడం లేదో చూడండి.. బాధ్యతతో బోధించండి

గన్నవరం బాలికల హైస్కూల్‌ ఉపాధ్యాయులతో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌

గన్నవరం, జూన్‌ 1: ”విద్యార్థులు బడికి వస్తున్నారు. ఉపాధ్యాయులు వచ్చి కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. ఒకటో తారీఖున జీతం పడిందా లేదా అని కాకుండా విద్యార్థికి 70శాతం మార్కులు ఎందుకు రావడం లేదనే ఆలోచన చేయండి. అదే మీ పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు.

40 శాతం మార్కులు వచ్చిన వారికి మీకు కంపెనీ ఉంటే ఉద్యోగం ఇస్తారా?” అని గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రశ్నించారు. హైస్కూళ్ల పరిశీలనలో భాగంగా గన్నవరం బాలికల ఉన్నత పాఠశాల, గొల్లనపల్లి హైస్కూల్‌ను శనివారం ప్రవీణ్‌ ప్రకాశ్‌ తనిఖీ చేశారు. తొలుత గన్నవరం బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అక్కడ ఉపాధ్యాయు లతో మాట్లాడారు.

పదో తరగతిలో 70శాతం మార్కులు ఎంతమందికి వచ్చాయని ఉపాధ్యాయులను అడిగారు. దీనిపై కొందరు ఉపాధ్యా యులు మొత్తం పర్సంటేజ్‌ చెప్పారు. దీనిపై ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ బాధ్యత లేదు.

బాధ్యతతో విద్యార్థులకు బోధన చేయడం లేదనడంతో డీఈవో తాహెరా సుల్తానా సమాధానం చెప్పబోయారు. నేనేమీ చిన్న పిల్లోడిని కాదు. ఐఏఎస్‌ ర్యాంకర్‌ని. మీరు చెప్పే సమాధానం ఆఫీసులో కూర్చుని కూడా తెలుసుకోగలనన్నారు.

పదో తరగతిలో రిజల్ట్‌ కావాలని పదేపదే చెబుతున్నా పట్టడం లేదని, ఫౌండేషన్‌ సరిగా లేని విద్యార్థికి ఆరో తరగతి నుంచే బేసిక్స్‌ నేర్పుతూ వస్తే రిజల్ట్‌ ఇలా ఉం టుందా అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా 70శాతం మార్కులు తక్కువ మందికి రావటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంను పరిశీలించి కొలతలు వేశారు. సరిపడా వచ్చిందా రాలేదా అని ఎంఈవోలను అడిగారు.

ఎంత మందికి ఎంత అవసరమని అడగితే సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవోలు కె.రవికుమార్‌, ఆర్‌.కమల కుమారి, హెచ్‌ఎం డి.ఝాన్సీరాణి పాల్గొన్నారు. తర్వాత గొల్లనపల్లి హైస్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. హెచ్‌ఎం కేఎస్‌ జగదీ శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వాషింగ్ పౌడర్ నిర్మా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు.. నిర్మా యాడ్‌లో కనిపించిన పాప ఎవరు ?

‘టయ్.. వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. పాలల్లోనా తెలుపు.. నిర్మాతో వచ్చింది.. రంగుల బట్టలే తళతళలా మెరిశాయి. అందరూ మెచ్చినదే నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. హేమా..రేఖా..జయ..సుష్మా. అందరూ మెచ్చే నిర్మా’ ఈ పాట ఏ ప్రొడక్ట్ ప్రకటనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆ పాట ఆకట్టుకోవడమే కాదు.. ఆ డిజర్జెంట్ పౌడర్ కూడా మెప్పించింది. ఇప్పుడంటే చాలా సర్ఫ్ ఉత్పత్తులు వచ్చాయి కానీ.. ఒకప్పుడు నిర్మాదే హవా. ప్రతి మహిళ దీన్ని వినియోగించిన వాళ్లే. దశాబ్దాలకు పైగా తిరుగులేని ఉత్పత్తిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సర్ఫ్ కొనేవారే కాదు వాడేవారు కూడా తక్కువ అయ్యారు. ఈ వాషింగ్ పౌడర్ కూడా అంతగా కనిపించటడం లేదు. అలాగే ఆ ప్యాకెట్ మీద ఉన్న అమ్మాయి ఎవరు అనే డౌట్ కూడా వస్తుంది. ఇంత మంచి ఉత్పత్తిని అందించిన ఆ వ్యక్తి ఎవరు… తెలుసుకుందాం

ఒకప్పుడు దుస్తులు పువ్వుల్లా మెరవాలంటే మహిళలు ఉప్పు, సోడా వంటి వాటితో దుస్తులు శుభ్రం చేసుకునేవారు. దీంతో దుస్తులు త్వరగా పాడైపోయేవి. 1960వ దశకంలో వస్త్రాలను శుభ్రం చేసే ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా వచ్చిందే నిర్మా వాషింగ్ పౌడర్‌. ఇది వచ్చాక విపరీతంగా మహిళలను ఆకట్టుకుంది. అప్పట్లో మరో ఆప్షన్ కూడా ఉండేది కాదు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే ఆ సమయంలో మార్కెట్‌లో నంబర్ 1 ప్రొడక్ట్‌గా అవతరించింది. ఈ వాషింగ్ పౌడర్ సృష్టి కర్త ఎవరంటే.. కర్బన్ బాయ్ పటేల్. అతడో బిజినెస్ మ్యాన్. ఇప్పటికీ ధనవంతుల జాబితా తీస్తే ఆయన పేరు ఉంటుంది. గుజరాత్‌లోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తిచేశాడు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాడు. అయితే డిటర్జెంట్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలివేశాడు. తనకున్న కెమిస్ట్రీ నాలెడ్ట్ ఉపయోగించి తన ఇంటి వద్దనే సర్ఫ్ తయారు చేశాడు.


ఇక ఆ ప్యాకెట్ పై కనిపించే ఆ బాలిక ఎవరంటే. కర్బన్ భాయి పటేల్ కూతురు నిరుపమ. తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం తాను తయారు చేసిన వాషింగ్ పౌడర్‌కు “నిర్మా వాషింగ్ పౌడర్”గా పేరు పెట్టాడు తండ్రి. వాషింగ్ పౌడర్ ప్యాకెట్‌పై నిర్మాకు గుర్తుగా ఆ పాప ఫోటోను ఉంచాడు. తొలుత సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ ఈ డిటర్జెంట్ పౌడర్ అమ్మేవాడు. ఈ పౌడర్‌కు ఆదరణ లభించడంతో సంస్థ ఎదగడం స్టార్ అయ్యింది. ఒక చిన్న ఫ్యాక్టరీ స్థాపించి వాషింగ్ పౌడర్ తయారీ మొదలు పెట్టాడు. నిర్మా పౌడర్ ప్రమోషన్ కోసం, రేడియోలో ప్రకటనలు ఇచ్చారు. కొంత కాలానికి టీవీలో ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా వచ్చిందే నిర్మా సాంగ్. అప్పట్లో మార్కెట్‌లో హిందూస్థాన్ యూనిలివర్ కంపెనీ వాషింగ్ పౌడర్‌ అగ్రగామిగా ఉండేది.

కానీ తక్కువ ధరకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ దొరకడం, సామాన్యులు సైతం కొనగలిగేలా ఉండటంతో కొంతకాలంలోనే నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్‌లో నంబర్ స్థానానికి చేరింది. నిర్మా కంపెనీ కొంత కాలం తర్వాత డిటర్జెంట్ కేక్స్ అంటే సోప్స్ కూడా తయారు చేసింది. అయితే కొన్ని దశాబ్దాల పాటు మార్కెట్ శాసించిన నిర్మా వాషింగ్ పౌడర్ కు పోటీగా మరిన్ని ఉత్పత్తులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కాంపిటీషన్ తట్టుకుని నిలబడలేకపోయింది. మార్కెట్‌లో వస్తున్న కొత్త కొత్త బ్రాండ్స్ కారణంగా నిర్మాకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత కర్సన్ భాయ్ పటేల్ వేర్వేరు బిజినెస్‌లు చేశాడు. నిర్మా గ్రూప్ 2014లో సిమెంట్ తయారీ మొదలుపెట్టింది. కర్సన్ భాయ్ పటేల్ ప్రస్తుతం ఇండియాలో మిలియనీర్లలో ఒకరు. అతని అతి ఆస్తి విలువ 4.9 బిలియన్ డాలర్లు.

PoK: పీఓకే విదేశీ భూభాగమే.. కోర్టులో అంగీకరించిన పాకిస్థాన్ గవర్నమెంట్

POK Foreign Territory: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే ) విదేశీ భూభాగం అని పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ దేశ హైకోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. పీఓకేకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో కోర్టుకు ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ విదేశీ భూభాగం అని పాకిస్థాన్ అంగీకరించింది. జర్నలిస్ట్ అహ్మద్ కిడ్నాప్ కేసులో కోర్టుకు ఈ అంశాన్ని తెలిపింది. పీఓకేపై పాక్ ప్రభుత్వ పెత్తనం, ఆ దేశ ఆర్మీ మోహరింపుకు వ్యతిరేకంగా అహ్మద్ పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో మే 15న ఆయన ఇంటి వద్ద ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పాకిస్థాన్ ఇంటలీజెన్స్ ఏజెన్సీ తన భర్తను కిడ్నాప్ చేసిందని ఆయన భార్య ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించింది. పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ శనివారం ప్రభుత్వం తరుపున కోర్టులో వాదించారు. పీఓకేలోని పోలీస్ కస్టడీలో అహ్మద్ ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్న పీఓకే విదేశీ భూభాగం అని చెప్పారు.

దీనిపై పాకిస్తాన్‌కు అధికార పరిధి లేదని అన్నారు. పీఓకేలోని పాకిస్థాన్ కోర్టుల తీర్పును విదేశీ తీర్పుగా పరిగణిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఇస్లామాబాద్ హై కోర్టులో హాజరుపరచలేమని తెలిపారు.పీఓకే కు సంబంధించిన పలు విషయాలపై కోర్టుకు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ వాదనలపై ఇస్లామాబాద్ న్యాయమూర్తి మొహ్సిన్ మండిపడ్డారు. పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ సైన్యం రేంజర్లు ఆ భూమిలోకి ఎలా ప్రవేశించారని అడిగారు. పాకిస్థాన్ గూడఛార సంస్థలు పీఓకేను బలవంతంగా అపహరించే పద్ధతిని కొనసాగిస్తున్నాయని న్యాయమూర్తి విమర్శిస్తున్నట్లు పాక్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు దొంగిలించి, దానిని 240 ముక్కలుగా నరికారు, ఎందుకో తెసుసా?రహస్యం ఎలా బయటపడింది?

Albert Einstein’s brain was stolen and chopped into 240 pieces, do you know why? How did the secret get out? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు దొంగిలించి, దానిని 240 ముక్కలుగా నరికారు, ఎందుకో తెసుసా?రహస్యం ఎలా బయటపడింది?

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955లో తన 76వ ఏట మరణించాడు. అతని మరణం తర్వాత శవపరీక్ష నిర్వహించారు. మరియు ఈ గొప్ప శాస్త్రవేత్త యొక్క తల ఆ ఆసుపత్రి నుండి దొంగిలించబడింది.

అంతే కాదు ఐన్‌స్టీన్ విలువైన మెదడును ముక్కలు చేశారు. ఆ తర్వాత ఫార్మాలిన్‌తో కూడిన రసాయనాలతో నిల్వచేసారు. ఇది ఎందుకు చేశారు, ఎవరు చేశారు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త శరీరంతో ఇంత క్రూరమైన ప్రవర్తన ఎందుకు?

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ప్రకాశవంతమైనవాడు. జటాయువు మాటల్లో చెప్పాలంటే ‘నువ్వు పండించాలి సార్’. ఈ నిజమైన గొప్ప శాస్త్రవేత్త యొక్క మెదడును పెంపొందించడానికి ప్రపంచం మొత్తం ఆసక్తి చూపింది. మరియు అది జరిగింది. కానీ, ఐన్‌స్టీన్ మరణానంతరం మెదడు ఎలా తయారైందో వింటే మీరు కూడా షాక్ అవుతారు.

మెదడును ఎలా దొంగిలించబడింది!

చిన్నప్పటి నుంచి గణితంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అతను చాలా కష్టమైన సంఖ్యలను రెప్పపాటులో ఛేదించేవాడు. అతని నైపుణ్యాన్ని చూసి స్కూల్-కాలేజీ టీచర్లు ఆశ్చర్యపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సమయం కంటే కొంచెం ముందున్నాడు. ఎందుకంటే అతని మెదడు. తన తెలివితేటలు బలంగా ఉన్నాయని మొండి వ్యక్తిత్వానికి గోల్స్ ఇచ్చాడు ఈ జర్మన్ శాస్త్రవేత్త. కానీ, మీకు తెలుసా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు అతని మరణం తరువాత అతని ఇష్టానికి వ్యతిరేకంగా మరియు అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా దొంగిలించబడింది. అది దొంగిలించబడడమే కాదు, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు దాచబడింది. శాస్త్రవేత్త తల ముక్కలుగా నరికేశారు

ఐన్‌స్టీన్ తలను ఎందుకు దొంగిలించారు?

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955లో తన 76వ ఏట మరణించాడు. శవపరీక్షకు డా. థామస్ హార్వే. శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత, ఈ వైద్యుడు ఐన్‌స్టీన్ మెదడును తొలగించాడు. లొంగుబాటులో, అతను తన పుర్రె నుండి ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించిన తర్వాత దాన్ని ఫార్మాలిన్‌ జార్‌లో నిల్వచేశాడు

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ శవపరీక్ష ప్రిన్స్‌టన్ హాస్పిటల్‌లో జరిగింది. అక్కడి మార్చురీ నుండి డాక్టర్ ఫార్మాలిన్ జార్ నిండా సైంటిస్ట్ మెదడుని ఇంటికి తీసుకెళ్లాడు. థామస్ ఆ కూజాను మీ ఇంటి గదిలో దాచిపెట్టాడు

ఐన్‌స్టీన్ తలను దొంగిలించిన వైద్యుడు అతని కుటుంబ జీవితంలో అస్సలు సంతోషంగా లేడు. ఏ విధంగానూ అతనికి శాంతి లభించలేదు. బాధతో తన పెద్ద భార్యతో విడిపోయాడు. అయినా అమూల్యమైన ఐన్ స్టీన్ తలరాత తప్పలేదు డా. థామస్

రహస్యం ఎలా బయటపడింది?

అమెరికాలోని న్యూజెర్సీ వార్తాపత్రిక రిపోర్టర్ స్టీవెన్ లెవీ ఈ వార్తను లీక్ చేశారు. 1970లో డా. థామస్ హార్వేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ జర్నలిస్ట్ తన కడుపులో నుండి మాట్లాడాడు. ఐన్‌స్టీన్ విలువైన మెదడును అల్మారాలోని పెట్టెలో జాగ్రత్తగా ఉంచినట్లు డాక్టర్ చూపించాడు. పెట్టెపై ‘కోస్టా సైడర్’ అని రాసి ఉంది.

ఐన్‌స్టీన్ మెదడులోని సెరెబెల్లమ్, మెడ దగ్గర తల వెనుక భాగం ముక్కలుగా కత్తిరించబడింది. ఇది కాకుండా, సెరిబ్రల్ కార్టెక్స్ అంటే మెదడు పై భాగం కూడా సన్నగా కత్తిరించబడింది. ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త యొక్క తలపై పరిశోధన చేయడానికి తాను ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని జర్నలిస్ట్ గ్రహించాడు.

ఐన్‌స్టీన్ తల ఎలా ఉంది?

1985లో ఐన్‌స్టీన్ తలను దొంగిలించిన ఈ వైద్యుడి పరిశోధనా పత్రం ప్రచురించబడింది. న్యూరో సైంటిస్టులు మానవ మెదడులోని మొత్తం 47 భాగాలను గుర్తించారు. దీనినే బ్రాడ్‌మన్ మ్యాప్ అంటారు. ఈ మ్యాప్ ప్రకారం, మానవ మెదడులోని 9వ మరియు 39వ మచ్చలు చాలా ముఖ్యమైనవి. ప్రజల జీవిత ప్రణాళికలు, జ్ఞాపకాలు మరియు శ్రద్ధ ఈ సంఖ్య 9 స్పాట్ ద్వారా నిర్ణయించబడతాయి. మరోవైపు, 39వ స్థానం భాష మరియు సంక్లిష్ట సమస్యలతో వ్యవహరిస్తుంది.

డాక్టర్ ఐన్‌స్టీన్ మెదడులోని ఈ రెండు మచ్చలలోని న్యూరాన్‌లు మరియు గ్లియల్ కణాల నిష్పత్తిని మరో 11 మంది 65 ఏళ్ల వృద్ధులతో పోల్చారు. ఐన్‌స్టీన్ మెదడు యొక్క ఎడమ వైపున ఉన్న స్పాట్ నంబర్ 39 ఒక్కటే న్యూరాన్‌కు ఒకటి కంటే ఎక్కువ గ్లియల్ సెల్‌లను కలిగి ఉందని తేలింది. ఇది మిగతా 11 మంది మెదడులో లేదు. ఈ ఫలితం ఆధారంగా, 39 మచ్చలలో ఎక్కువ గ్లియల్ కణాలు ఉన్నందున ఐన్‌స్టీన్ మెదడు ఏదైనా విషయంపై ఎక్కువ శక్తిని ఖర్చు చేసింది. బహుశా అతని ఆలోచనా శక్తి మరియు సైద్ధాంతిక పరిజ్ఞానం సగటు కంటే ఎక్కువ.

2006లో ఇలాంటిదే మరొక పరిశోధనా నివేదిక ప్రచురించబడింది. ఐన్‌స్టీన్ మెదడులోని గ్లియల్ కణాల నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉన్నట్లు తేలింది. ఐన్‌స్టీన్ మెదడు బరువు 1,200 గ్రాములని మరో అధ్యయనం వెల్లడించింది. సగటు మనిషి మెదడు బరువు 1400 గ్రాములు.

పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో YCP కు ఎదురుదెబ్బ

A setback for YCP over postal ballots
పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో YCP కు ఎదురుదెబ్బ

పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’పై అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాలు చేస్తూ వైకాపా ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ‘‘ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌పై అటెస్టేషన్‌ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులున్నాయి. మెమోల అమలును నిలుపుదల చేయాలి’’ అని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్‌ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించిన ధర్మాసనం.. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీవీ నటి రిధిమా పండిత్‌ (Ridhima Pandit)తో అతడి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన నటి వదంతుల (Wedding Rumours)పై క్లారిటీ ఇచ్చారు. ఆ క్రికెటర్‌తో ఎలాంటి పరిచయం లేదన్నారు.

టీవీ నటి రిధిమా, గిల్‌ (Shubman Gill) గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబరులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్‌లు వైరల్‌ అయినప్పటి నుంచి నటికి విపరీతమైన ఫోన్‌ కాల్స్ వచ్చాయట. దీంతో ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘ఈ ఉదయం నుంచి జర్నలిస్టుల నుంచి అనేక కాల్స్‌ వచ్చాయి. ఇలా ఎప్పుడూ జరగలేదు. నా వివాహం గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. నా జీవితంలో ఏదైనా జరిగితే స్వయంగా ప్రకటిస్తా’’ అని రాసుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ దీని గురించి స్పందించింది. ‘‘కొందరు కావాలనే ఈ కథను అల్లి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వ్యక్తిగతంగా శుభ్‌మన్‌ గిల్‌ (Cricketer Shubman Gill)తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నిన్న ఉదయం నుంచి శుభాకాంక్షల మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. విసిగెత్తిపోయి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టా’ అని తెలిపింది. ప్రస్తుతానికి తాను సింగిల్‌ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లి, ప్రేమ గురించి గతంలోనూ పలుమార్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ టీవీ షో ‘బహు హమారీ రజనీకాంత్‌’తో రిధిమా పండిత్‌ (TV Actress Ridhima Pandit) బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా పాపులరిటీ సంపాదించుకుంది. ఖత్రోన్‌ కీ ఖిలాడీ, బిగ్‌బాస్‌ ఓటీటీ తదితర రియాల్టీ షోస్‌లో మెరిసింది.

 

సార్వత్రిక ఎన్నికలు – 2024… ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఇవీ!

సార్వత్రిక ఎన్నికలు – 2024… ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఇవీ!

ABN live

ETV LIVE

SAKSHI LIVE

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ 2024మొత్తం సీట్లు: 175
ఏజెన్సీ టీడీపీ+ వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ ఇతరులు
చాణక్య స్ట్రాటజీస్ 114 -125 39 – 49 0 1
పీపుల్ పల్స్ 111-135 45-60 0 0
పయనీర్ పోల్ స్ట్రాటజీస్ 144 31 0 0
జేబీఆర్‌ఎస్‌జీ 98 73 1 3
పల్స్ టుడే 121-129 45-54 0 0
స్మార్ట్ పోల్ సర్వే 93 (+/-8) 82 (+/-8) 0 0
జన్‌మత్ పోల్స్ 67-75 95-103 0 0
WRAP Survey 4-17 158 0 0
ఆరా 71-81 94-104 0 0
లోక్ సభ ఎగ్జిట్ పోల్ 2024మొత్తం సీట్లు: 543
ఏజెన్సీ ఎన్డీఏ (బీజేపీ+) ఇండియా(కాంగ్రెస్+) ఇతరులు
రిపబ్లిక్ భారత్-పి మార్క్ 359 154 30
రిపబ్లిక్-మాట్రైజ్ 353-368 118 – 13 43 – 48
ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ 371 125 47
జన్‌కీ బాత్ 377+/-15 151+/-10 15 +/-5
ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ 365 142 36

Snake Viral Video: కొమ్ముల పాము.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్!

Snake Viral Video: ప్రపంచంలో చాలా రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో చాలా విషపూరితమైనవి ఉంటాయి. ఈ విషసర్పాలు కాటేస్తే మనిషిని క్షణాల్లో చనిపోతాడు. ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన పాములు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఓ వింత పాము ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి తెలిస్తే మీరు నమ్మలేరు. మీరు ఇంకా కొమ్ముల పాముని ఎప్పుడైనా చూశారా? ఆ పాము పరుగెడుతుంది కూడా. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పూర్తి సమాచారం తెలుసుకుందాం.

పాము పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పాము తలపై కొమ్ములు ఉన్నాయి. ఈ పాము తలపై ఉన్న కొమ్ములను చూసి జనం ఆలోచనలో పడ్డారు. ఈ వింత పామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో Love Nature అనే అకౌంట్ పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. ఈ వీడియోలో కొమ్ములున్న పామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఈ వింత పాము వేగంగా పరిగెడుతున్న పొలానికి సంబంధించినది. ఈ పామును చూసిన జనాలు తమ కళ్లను నమ్మలేకపోతున్నారు. ఇది కలియుగ అద్భుతం అని కొందరు అంటారు.

వీడియోలో పామును చూసిన చాలా మంది నమ్మలేకపోతున్నారు. పాము తలపై కొమ్ములు ఎలా పెంచుకుంటాయనే ప్రశ్న వారి మదిలో మెదులుతోంది. చూడగానే ఇక్కడున్న పాము మిగతా వాటికంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. చాలా మంది ఈ వీడియో అబద్ధమని అనుకుంటున్నారు. కానీ ఈ వీడియోలో పాము తలపై ఉన్న కొమ్ములు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలకు రెండు వైపులా కొమ్ము లాంటి అవయవాలు కనిపిస్తాయి. చూసిన తర్వాత కొమ్ముల పాము అని అంటున్నారు.

సోషల్ మీడియాలో వీడియోపై యూజర్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. పాము కప్పను తినక తప్పదని అంటున్నారు. కాళ్లు కనిపించే కప్పను పాము నోటిలోకి లాక్కుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన పామును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో ఫేక్ లేదా నిజమా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రపంచంలో కొమ్ముల పాములు ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే పాము పేరు వైపర్. ఇది చాలా విషపూరితమైనది. రాజస్థాన్ ఎడారిలో వైపర్ పాములు కనిపించడం సర్వసాధారణం.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ తల్లి పరారీ.. వెనుదిరిగిన సిట్!

బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాసన అశ్లీల వీడియో, కిడ్నాప్‌ కేసుల్లో (Sex Crimes Case) సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌ (Kidnap) ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్‌ (SIT) అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. నేడు ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే నేటి ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.

కర్ణాటక (Karnataka News) హాసనలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుసటిరోజే ఈ అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణ (JDS MP Prajwal Revanna) విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ప్రజ్వల్‌ లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ సహా కుటుంబసభ్యులు హెచ్చరించారు.

ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు చేరిన హాసన (Hassan) ఎంపీని అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 6 వరకు సిట్‌ కస్టడీకి అప్పగించారు.

అజినోమోటో నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా..? విషపూరితమా..? దీని వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసా..?

Is Ajinomoto really good for health? Is it poisonous? Do you know the problems caused by this..?
అజినోమోటో నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా..? విషపూరితమా..? దీని వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసా..?

మన ఆరోగ్యం పూర్తిగా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి ఆహారం తింటున్నాం, ఎందులో వండిన ఆహారం తింటున్నాం ఇది చాలా ముఖ్యం. వంట చేసేవాళ్లకు అజినోమోటో గురించి బాగా తెలుసు.

ఇది ఒక రకమైన ఉప్పు. జంక్‌ఫుడ్స్‌లో, బిర్యానీల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా..? దీని వాడకం ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? చాలా తక్కువ మొత్తంలో వేస్తున్నాం కదా ఏం కాదులో అనుకుంటున్నారా..?

అజినోమోటో ఒక రకమైన రసాయనం. దీనినే MSG అని కూడా అంటారు. MSG అనేది మోనోసోడియం గ్లుటామేట్. ఇది ప్రొటీన్‌లో భాగం. దీనిని అమినో యాసిడ్ అని కూడా అంటారు. అజినోమోటోను 1909లో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకేడా కనుగొన్నారు.

అజినోమోటో ఎలాంటి ఆహారంలో వాడతారు..?

నూడుల్స్, ఫ్రైడ్ రైస్ మరియు మంచూరియన్, సూప్ వంటకాలు వంటి చాలా చైనీస్ వంటకాలలో అజినోమోటోను ఉపయోగిస్తారు. అలాగే, దీనిని పిజ్జా, బర్గర్, మ్యాగీ మసాలాలు, జంక్ ఫుడ్, టొమాటో సాస్, సోయా సాస్ మరియు చిప్స్‌లో ఉపయోగిస్తారు.

అజినోమోటో వల్ల కలిగే నష్టాలు..

నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది: చైనీస్ వంటకాల్లో ఉపయోగించే అజినోమోటో నాడీ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని గ్లుటామిక్ యాసిడ్ మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే మెదడుకు ప్రమాదం ఏర్పడుతుంది.

బరువు పెరగడం :

నేడు చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రెండో విషయం ఏమిటంటే నేటి ఆహారపు అలవాట్లు దిగజారిపోయాయి. కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, అజినోమోటో మీ ఆకలిని పెంచుతుంది. దీనివల్ల పదే పదే తినడం వల్ల ఊబకాయం వస్తుంది.

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం :

గర్భిణీ స్త్రీలు చైనీస్ ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. దీనికి ప్రధాన కారణం అజినోమోటో. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం మరియు అసౌకర్యం కలుగుతుంది. ఇది శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది.

అధిక రక్తపోటు సమస్య :

చైనీస్ ఆహారంలో అజినోమోటో రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. బహుశా, మీరు ఇప్పటికే రక్తపోటు పేషెంట్ అయితే, అజినోమోటో ఫుడ్ తినకండి. దీని వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది.

నిద్రలేమి మరియు మైగ్రేన్లు :

మీకు నిద్ర మరియు మైగ్రేన్ సమస్యలు ఉంటే, అజినోమోటో ఒక ప్రధాన కారణం కావచ్చు. ఇది నిద్రలేమి మరియు తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అజినోమోటో ఫుడ్ తినడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది.

Rain Alert: . కూల్ న్యూస్ వచ్చేసింది.. మూడు రోజులపాటు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ..

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండ మండిపోతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణం కూల్‌గా మారింది. ఒక్కసారిగా ఈదురుగాలతో కూడిన వర్షానికి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణం చల్లబడింది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ముమ్మిడివరం, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు భానుడి భగభగలకు ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిన ప్రజలు ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. ఉప్పాడలో ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం విరిగి రోడ్డు పై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది.ఆ టైమ్‌లో ఆటోలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడింది. నిన్న ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా.. ప్రజలకు కాస్త ఊరట చెందారు. ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలు చీకటిలోనే ఉండాల్సి వచ్చింది.

నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి పయనం 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం /60 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతుంది. తదుపరి కాలంలో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి 2-3 రోజులలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాలు నిజమవుతాయా? 2019, 2014, 2009 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

Exit Poll 2024: నేడు తుది దశ పోలింగ్ ముగిశాక సాయంత్రం 6:30తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాట్ పోల్స్ మధ్య వ్యత్యాసం ఉంటుందా?

ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం ఎంత? గత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కు దగ్గరగా ఉన్నాయా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? 2019, 2014, 2009ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అప్పటి రియల్ పోల్స్ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం.

గత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి

నేడు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత నుండి అన్ని పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి గత ఎన్నికల సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తే గత రెండు పర్యాయాలు అంటే 2014-2019 ఎన్నికలలో రెండుసార్లు ఎన్డీయే గెలుపును అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయి.

విజయం ఎవరిదో చెప్పినా, సీట్ల లెక్కల్లో అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్

అయితే విజయం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఊహించడం లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ కాలేదు. 2009లో యూపీఏ గెలిచినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ స్థానాలను యూపీఏ గెలుచుకోవటం గమనార్హం. 2019లో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ, సీట్ల విషయంలో మళ్లీ అంచనాలు తప్పాయి.

2019 ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాట్ పోల్స్ కు తేడా ఇదే

2019లో 13 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి 306 సీట్లను సాధిస్తుందని, యూపీఏ కూటమి స్థానాలను సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ పనితీరుపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయి. మొత్తం 353 సీట్లు ఎన్డీఏ గెలుచుకోగా, యూపీఏకు 93 స్థానాలు వచ్చాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 2019లో 303 స్థానాలను, కూటమిలోని కాంగ్రెస్‌, 2019లో 52 సీట్లను గెలుచుకున్నాయి.

2014లో మోడీ వేవ్ అంచనా వేయటంలో తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

2014లో విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 8 ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ 283 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 105 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. అయితే అప్పుడు మోడీ వేవ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి.

2014లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిందిదే… కానీ ఫలితాలిలా

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీఏ 336 స్థానాలతో విజయకేతనం ఎగురవేయగా, యూపీఏ కేవలం 60 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2014లో ఎన్డీఏ కూటమిలోని బిజెపి 282 స్థానాలను, యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి.

2009లో ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాట్ పోల్స్

2009లో ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే UPA తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, నాలుగు ఎగ్జిట్ పోల్స్ యూపీఏ విజయాన్ని తక్కువగా అంచనా వేశాయి. యూపీఏకు 195, ఎన్డీయేకు 185 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే అప్పుడు యూపీఏ 262 సీట్లు, NDA 158 సీట్లను గెలుచుకుంది. యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 206 సీట్లు , ఎన్డీఏ కూటమిలోని BJP 116 సీట్లు 2009లో గెలుచుకున్నాయి.

Arvind Kejriwal: బెయిల్‌పై కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్ విషయంలో ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై దిల్లీ కోర్టు జూన్‌ 5న నిర్ణయం తీసుకోనుంది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్ రేపు జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిఉంది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ..కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. నేటితో ఆ బెయిల్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ రోజు విచారణ జరిగింది.

విచారణ సమయంలో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఈడీ బెయిల్ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని సీఎం తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును జూన్‌ 5కు వాయిదా వేసింది.

‘ప్రాజెక్ట్ Z’ (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Project Z
Release Date: 2024-06-01
Cast: Sundeep Kishan, Lavanya Tripathi ,Jackie Shroff, Daniel Balaji, Mime Gopi, Amarendran
Director:C V Kumar
Producer: Thirukumaran
Music: Ghibran
Banner: Thirukumaran Entertainment
Rating: 2.50 out of 5

మొదటి నుంచి సందీప్ కిషన్ ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో ఆయన చేసిన ‘మాయావన్’ అక్కడ బాగానే ఆడింది. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా, ఒక కీలకమైన పాత్రలో జాకీ ష్రాఫ్ కనిపిస్తాడు. అలాంటి ఈ సినిమా చాలా గ్యాప్ తరువాత ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. కుమార్ (సందీప్ కిషన్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని బాల్యంలో ఒక సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి అతను నెత్తురు చూస్తే భయపడిపోతాడు. అయినా అలాగే పోలీస్ వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. అతను ఒక దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఒక మర్డర్ జరగడం చూస్తాడు. హంతకుడిని వెంబడిస్తాడు. అయితే కుమార్ నుంచి తప్పించుకునే ఆ ప్రయత్నంలో ఆ హంతకుడు చనిపోతాడు.

ఫలితంగా కుమార్ మానసికంగా ఫిట్ గా లేడని చెప్పి, పై అధికారులు కొంతకాలం పాటు అతణ్ణి డ్యూటీకి దూరంగా ఉంచుతారు. దాంతో అతను మానసిక వైద్యురాలైన అనిత ( లావణ్య త్రిపాఠి) దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తరువాత డ్యూటీలో చేరిన కుమార్ కి ఒక కేసు సవాల్ గా మారుతుంది. హంతకుడు వరుస హత్యలు చేస్తూ వెళుతుంటాడు. హత్య చేసిన ప్రదేశంలో హంతకుడు రక్తం అంటిన తన చేతులను అక్కడి గోడకి రాస్తుంటాడు. ఆ రక్తం చూడగానే కుమార్ అదోలా అయిపోతుంటాడు.

చనిపోయిన వాళ్లంతా కొన్ని రోజుల ముందు వింతగా ప్రవర్తించారనే విషయం కుమార్ పరిశోధనలో తేలుతుంది. ఇంగ్లిష్ రానివారు సైతం ఇంగ్లిష్ పేపర్ చదివారని తెలిసి షాక్ అవుతాడు. అలాగే ఎప్పుడూ లేనిది నీట్ గా ఉండటానికి ట్రై చేసేవారనీ, ఖరీదైన బ్రాండ్స్ వాడేవారని తెలిసి నివ్వెరపోతాడు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే అతను ముందుకు వెళతాడు. ఆ క్రమంలో అతను ‘రుద్ర’ను కలుస్తాడు. గతంలో చనిపోయినవారి లక్షణాలు అతనిలో గమనించి అలర్ట్ అవుతాడు.

అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ‘రుద్ర’ ను అరెస్టు చేస్తాడు. జైల్లోనే మానసిక నిపుణులను ఏర్పాటు చేయిస్తాడు. రుద్రను సైన్ చేయమంటే .. అతను తన పేరు కాకుండా ‘ప్రమోద్’ అనే సంతకం పెడతాడు. దాంతో ప్రమోద్ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు మొదలవుతుంది. అతను ఓ పెద్ద సైంటిస్ట్ అనే విషయం కుమార్ కి తెలుస్తుంది. అతని సహచరుడైన శ్రీరామ్ (జేపీ) ద్వారా ప్రమోద్ గురించి తెలుసుకుంటాడు.

ప్రమోద్ సైన్స్ లో జీనియస్ .. అతను ఎన్నో ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలిగిన మేథావి. అతను చేసిన ఓ ప్రయోగం పేరే ‘ప్రాజెక్ట్ z’. అది సాధారణ వ్యక్తులకు అర్థంకానిది .. అంతుబట్టనిది. అతను తన జ్ఞాపకాలను ఒక ల్యాబ్ లో భద్రపరుస్తాడు. తాను అనుకున్న వ్యక్తిలోని జ్ఞాపకాలను చెరిపివేసి .. ఆ స్థానంలో తన జ్ఞాపకాలను పోస్ట్ చేయగలడు. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి ప్రమోద్ లా వ్యవహరించడం మొదలుపెడతాడు. శరీరం వేరైనప్పటికీ .. లోపల ప్రమోద్ ఉంటాడు.

ప్రమోద్ కి తాను ధరించిన శరీరం రాలిపోతుందని అనిపించినప్పుడు, వెంటనే మరో శరీరంలోకి వెళ్లిపోగలడు. అలాంటి ఒక ముందస్తు జాగ్రత్త చేసుకుంటూనే ఉంటాడు. కుమార్ కి విషయం అర్ధమయ్యే సమయానికి ప్రమోద్ .. ఆర్మీ జనరల్ సత్య (జాకీ ష్రాఫ్) బాడీలో ఉంటాడు. ఆ హోదాలో ప్రమోద్ ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు. అప్పుడు కుమార్ ఏం చేస్తాడు? ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు? అనేది మిగతా కథ.

ఈ కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. తన జ్ఞాపకాలను ఇతరుల మైండులో సెట్ చేస్తూ, వాళ్ల శరీరంలో తాను జీవించి ఉండే ఒక సైంటిస్ట్ కథ ఇది. శరీరాలను ఒక డ్రెస్ ల మార్చేస్తూ ముందుకు వెళ్లే క్రిమినల్ మైండ్ ఉన్న ఒక శాడిస్ట్ కథ ఇది. దర్శకుడు ఈ కథను సాధ్యమైనంత స్పష్టంగా చెప్పడానికే ట్రై చేశాడు. అందువలన యూత్ కి ఈ కథ అర్థమవుతుంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒక పట్టాన అర్థం కాదు.

అటు సైంటిస్ట్ అరాచకాలు .. ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా చకచకా పరుగులు తీస్తూనే ఉంటుంది. అయితే హీరో – హీరోయిన్స్ మధ్య రొమాన్స్ మాత్రం ఉండదు. పైగా రక్తం చూసి భయపడిపోయే హీరోను అక్కున చేర్చుకుని హీరోయిన్ ధైర్యం చెబుతూ ఉంటుంది. హీరో హీరోయిన్స్ వైపు నుంచి రొమాంటిక్ సాంగ్సు ను ఆశించే ప్రేక్షకుడు ఇక్కడే కాస్త డీలాపడతాడు. ఇక ఈ కథలో ఎక్కడా కూడా కామెడీ కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. ప్రేక్షకులు సీరియస్ గా పోలీసులను ఫాలో కావలసిందే.

ఈ సినిమాలో పాత్రల పరంగా చాలా సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. అందువలన నటన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ స్థానంలో హీరో అనేవాడు డైనమిక్ గా ఉండాలనే ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ రక్తం చూసి పడిపోవడం .. దుప్పటి ముసుగేసుకుని దాక్కోవడం వంటివి అతిగా అనిపిస్తాయి. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ను నమ్ముకుని మనం ఎక్కడ ఫాలో అయ్యేది అనిపిస్తుంది.

పాత్ర పరంగా జబ్బున పడిన హీరోయిన్నుంచి రొమాంటిక్ సాంగ్స్ ను ఆడియన్స్ ఆశించరు .. ఇదీ అంతే. అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఫిజికల్ గా తన ఇబ్బందిని దాటుకుని వెళ్లి లక్ష్యాన్ని ఛేదించడం వేరు. అప్పుడు ఆడియన్స్ సపోర్టు దక్కుతుంది. ఆ కోణంలో హీరో పాత్రను చూపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. గోపీ అమర్నాథ్ ఫొటోగ్రఫీ .. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. లియో జాన్ పౌల్ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కొనసాగుతాయి

Delhi Liquor Scam: మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

Delhi Liquor Scam: మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైలులో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్టయ్యారు. తీహార్ జైలులో ఉండగానే సీబీఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిలు కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిలు కోసం కవిత పెట్టుకున్న పిటిషన్‌పై మే 27, 28న వాదనలు జరగ్గా తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

ఈ నెలంతా సెలవులే
బెయిలుపై తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో కవిత మరో నెల రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వు చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు నిన్న బెయిలు పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిలుపై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జులై మొదటి వారంలోనే కవిత బెయిలు పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నెల 3తో కవిత జుడీషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది.

ఒక్క ప్రమాదం – ఆ కుటుంబం మొత్తం జైలుపాలు …

ఒక్క ప్రమాదం ఆ కుటుంబం మొత్తాన్నీ జైలుపాలు చేసింది.. పరీక్షల్లో పాస్ అయిన సందర్భంగా మద్యం తాగి కారు నడిపిన పూణె బాలుడు యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు టెకీలు అక్కడికక్కడే మరణించారు. అయితే, ప్రమాదం జరిగిందనే బాధ కానీ, ఇద్దరు చనిపోయారనే పశ్చాత్తాపం కానీ లేకుండా కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ఆ బాలుడి కుటుంబం ప్రయత్నించింది. అదికాస్తా బెడిసికొట్టడంతో ఒకరి తర్వాత ఒకరుగా తల్లి, తండ్రి, తాతలు కటకటాల వెనక్కి చేరారు.

పూణె కార్ యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బాలుడి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో బాలుడు మద్యం మత్తులో ఉన్నాడని ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే, బాలుడికి రక్త పరీక్ష నిర్వహించేందుకు సేకరించిన శాంపిల్స్ ను వైద్యుల సాయంతో బాలుడి తండ్రి మార్చేశాడు. బాలుడి రక్త నమూనాల స్థానంలో బాలుడి తల్లి నమూనాలు చేర్చారు. ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు బాలుడికి రెండుచోట్ల రక్త పరీక్ష నిర్వహించారు.

ఒకచోట బాలుడి రక్తంలో మద్యం ఆనవాళ్లు లేవని, మరోచోట ఉన్నాయని రిపోర్టు వచ్చింది. దీంతో ఏం జరిగిందని పరిశోధించగా.. బాలుడి రక్త నమూనాలను మార్చిన విషయం బయటపడింది. ఈ నిర్వాకానికి పాల్పడిన వైద్యులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వైద్యులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కొడుకును తప్పించేందుకు తన రక్తం ఇచ్చిన బాలుడి తల్లిని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు. పార్టీల్లో వణుకు

మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏడో దశ లోక్‌సభ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడికానున్నాయి.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ప్రతి కంపెనీ ఎగ్జిట్ పోల్ దాదాపు ఒకేరకం గా ఉన్నా కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు ఉత్కంఠతకు గురవుతున్నారు మరియు ఏ సంస్థ కూడా ఈ పార్టీ గెలవబోతుంది అని చెప్పటం లేదు క్లియర్ గ . సీట్ల విషయంలో చాలా తేడా వస్తుంది.

చివరి వరకు నిషేధం

ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు లోక్‌సభ ఏడో దశ పోలింగ్ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. లేదంటే మిగతా రాష్ట్రాలపైనా ప్రభావం ఉంటుందని ఈసీ చెబుతోంది. లోక్ సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్‌ ఎలా ఉంటుందో తెలుస్తుంది.

తప్పిన ఎగ్జిట్ పోల్ అంచనా

ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు తప్పు. కొన్ని సందర్భాల్లో ఇది సరైనది. 1998, 2012, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిజమయ్యాయి.

2021లో కేరళలో ఎల్‌డీఎఫ్‌, బెంగాల్‌లో టీఎంసీ అధికారంలోకి వస్తాయని సర్వే సంస్థలు జోస్యం చెప్పగా.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి.

కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పాయి. 2004లో ఎన్డీయే అధికారం చేపడుతుందని అంచనా వేసాయి.ఎన్డీయే 181 సీట్లకే పరిమితమైంది. యూపీఏ మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది.

Health

సినిమా