Saturday, November 16, 2024

జనసేన కార్పొరేటర్ దెబ్బకు సీఎస్ జవహర్ రెడ్డికి వణుకు !

జనసేన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలతో చీఫ్ సెక్రటరీ జవహర్ రడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన ఆరోపణలకు ఉలిక్కి పడి వివరణ ఇచ్చారు.

సీక్రెట్ గా తన విశాఖ పర్యటనల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాదు.. చర్యలు తీసుకుంటానని మూర్తి యాదవ్ ను బెదిరించారు. అయితే ఇలాంటి వాటికి మూర్తి యాదవ్ బెదరలేదు. దమ్ముంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సవాల్ చేస్తున్నారు.

జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు బోగాపురం వద్ద చేస్తున్న భూదందాల గురించి ఖచ్చితంగా చెబుతున్నారు మూర్తి యాదవ్. సీఎస్ సీక్రెట్ విశాఖ పర్యటనలు పూర్తి స్థాయిలో భూకబ్జాల కోసమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కూడా సమర్థిస్తోంది. విశాఖ, బోగాపురం దగ్గర భూదందాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఎన్ని అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారుతున్నాయో లెక్కలు బయటకు రావడం లేదు.

కానీ వైసీపీలోని అగ్రనేతలకు సంబంధించిన వారు మాత్రం గత రెండు, మూడు నెలలుగా ఇంత కాలం తాము కబ్జాలు చేసిన వాటిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారులు కలెక్టర్ సహా అందరూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో విషయం బయటకు వచ్చింది.

Big Breaking: కవితకు షాక్.. బెయిల్ పిటిషన్ వాయిదా..

కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

రేపు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఇదిలాఉండగా.. అనారోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్‌లో వివరించారు. కానీ ఆమెకు మాత్రం బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ అధికారులు కోర్టుకు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవితకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యూడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు .

ఒక్క నెలలో కొత్త ఇల్లు రెడీ, ఖర్చు కూడా తక్కువే! కొత్త తరహా ఇళ్లకు ఫుల్ డిమాండ్!

హై దరాబాద్: ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇల్లు కట్టి పెళ్లి చేసుకో అని పెద్దలు అంటున్నారు. ఇది మేస్త్రీలు, కార్మికులు, బిల్డర్లు, ఇంజనీర్లతో సహా పెద్ద వ్యాపారాన్ని కలిగి ఉంటుంది.

ఇల్లు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం మాత్రమే పడుతుంది.

అయితే, గృహ నిర్మాణదారులకు నెలవారీ వడ్డీ మరియు EMI కూడా చాలా ఖరీదైనవి. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రి ఖరీదు కూడా జేబులో చిచ్చు పెడుతోంది. ఇల్లు కట్టుకోవడమే కష్టంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క నెలలో ఇల్లు కట్టిస్తానని చెబుతోంది స్రవంతి.

హైదరాబాద్‌కు చెందిన శ్రవంతి ఆరేళ్లుగా పర్యావరణహిత ఇళ్లను నిర్మించి ప్రత్యేకతను సాధించింది. బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్రవంతి ఎంబీఏ చదివి గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మధ్యమధ్యలో ఇల్లు కట్టుకునే క్రమంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇంటిని కూడా నిర్మించారు. ఇందులో విజయం సాధించి 2018లో హెవెన్లీ మొబైల్ హౌస్ అనే కంపెనీని ప్రారంభించాడు.

ఇప్పటి వరకు స్రవంతి ద్వారా 200 నుంచి 250 ఇళ్లు నిర్మించారు. ఈ మొబైల్ హోమ్‌లకు హైదరాబాద్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫామ్‌హౌస్‌లు, ప్రైవేట్‌ ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణ ఇళ్లు కూడా అసూయపడే విధంగా అత్యంత నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నామని స్రవంతి తెలిపారు.

కాంక్రీటు, ఇసుక, సిమెంట్ మరియు ఉక్కు పౌర గృహాలకు ఉపయోగిస్తారు. కానీ ఈ మొబైల్ హోమ్ కోసం స్టీల్ పూర్తిగా ఉపయోగించబడుతుంది. ఉక్కు కాకుండా, గోడ మరియు పైకప్పు కోసం ప్రత్యేక పదార్థం తయారు చేయబడింది. తాపీ మేస్త్రీలు కట్టిన ఇల్లు 50, 60 ఏళ్లు ఎలా ఉంటుందో, ఈ ఇల్లు కూడా 60 ఏళ్లు ఉంటుందని స్రవంతి అన్నారు.

వేసవిలో, ఈ ఇంటి లోపల ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే 10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. చలికాలంలోనూ బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇంట్లో వేడి స్వయంచాలకంగా ఉత్పన్నమవుతుందని చెప్పారు. కుక్కటపల్లిలో వర్క్ షాప్ ప్రారంభించి 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్టీలు నుంచి గోడలకు ఉపయోగించే ఫైబర్ వరకు అన్నింటిలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని స్రవంతి తెలిపారు.

స్రవంతిలో 300 డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. నెల రోజుల్లో ఇల్లు కట్టడమే కాకుండా ఎక్కడికైనా రవాణా చేస్తామని, ఈ ఇంటి ఖర్చు సామాన్యులకు అందుబాటులో ఉంటుందని స్రవంతి తెలిపారు.

AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు.. సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు ఇస్తుంటే.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే.. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల పోలింగ్ పూర్తై.. 14 రోజులైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే సంస్థలు తమ పనిని పూర్తిచేశాయి. పోలింగ్ తర్వత ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజుల గ్యాప్ రావడంతో సర్వే సంస్థలు ఎక్కువమంది నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి అవకాశం దొరికింది. సంస్థలతో పాటు.. కొందరు అభ్యర్థులు సైతం సర్వే ఏజెన్సీలతో ఫలితాలపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉన్నప్పటికీ గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.

తాడిపత్రిలో అరాచకాలు..ఏఎస్పీ, సీఐలపై వేటు!

కూటమి విజయం పక్కా అంటూ..

పొత్తులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేశాయి. దీంతో 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ 144 చోట్ల, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీచేసింది. అధికారం కోసం 88 సీట్లు అవసరం. కూటమి కనీసం 110 నుంచి 120 సీట్లలో గెలుస్తుందని.. టీడీపీకి 100 నుంచి 110 సీట్లు వస్తాయని పార్టీ అంతర్గత సర్వేలో తేలిందట. ఓటింగ్ సరళి గమనించిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఓటు వేసినట్లు స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో విజయం మాదేనంటూ కూటమి నేతలు చెబుతున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం చేయించిన సర్వేలోనూ ఎన్డీయే కూటమికి మెజార్టీకి కావాల్సిన సీట్లు వస్తాయని తేలిందట.

వైసీపీ నేతల్లో ధీమా..

కూటమి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపారని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో.. గెలుపుపై వైసీపీ నేతలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. కనీసం వంద సీట్లలో గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 50 నుంచి 60 వరకు వైసీపీకి రావొచ్చని.. రాయలసీమలో ఎక్కువ ప్రభావం చూపించి.. ఉభయ గోదావరి జిల్లాల్లో గౌరవప్రధమైన స్థాయిలో సీట్లు గెలుచుకుంటే 60 నుంచి 70 గరిష్టంగా గెలుచుకోవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎవరి అంచనాలు కరెక్ట్.. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనేది జూన్4న తేలనుంది.

జీవితాన్ని మార్చే ఆకు..! కాలేయం, కిడ్నీలు, గుండెను 70 ఏళ్లపాటు ఫిట్‌గా ఉంచే సంజీవిని..!!

బొప్పాయి రుచికరమైన, పోషకమైన పండు. మనకు ఆరోగ్య నిధి. దీని వినియోగం మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

బొప్పాయిలో ఉండే పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, బొప్పాయి తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తిని అందించి, వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బొప్పాయి రసంలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్, కడుపు సమస్యలను నయం చేస్తుంది. సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా బొప్పాయి గుండె, పేగు సమస్యలను కూడా దూరం చేస్తుంది. బొప్పాయి మన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, వ్యాధుల నుండి మనలను రక్షించడంలో కూడా సహాయపడుతుంది. కానీ, మీరు ఎప్పుడైనా బొప్పాయి ఆకుల గురించి ఆలోచించారా.? ఇది ఉపయోగకరమైన, ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. బొప్పాయి ఆకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

* బొప్పాయి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు

1. డెంగ్యూ:-

డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్సలో బొప్పాయి ఆకుల రసం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్, RBCల మొత్తాన్ని పెంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది.

బొప్పాయి ఆకుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాలు క్యాన్సర్ నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ లక్షణాలు కణితి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తాయి. బొప్పాయి ఆకు రసం గర్భాశయ, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి ఆకుల రసం కూడా మలబద్ధకం నుండి ఉపశమనానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిని భేదిమందు అని కూడా అంటారు. భేదిమందు మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయి ఆకు రసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కాలేయం, మూత్రపిండాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇది మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

పండిన బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

– పీరియడ్స్ సమయంలో స్త్రీలు బొప్పాయి తీసుకోవడం చాలా ముఖ్యం. బొప్పాయిలో ఉండే గుణాలు రుతుచక్రాన్ని సమానంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అదనంగా, ఇది ఋతుస్రావం సమయంలో కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కంటి చూపు: పండిన బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విటమిన్లు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. అందువల్ల, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం.

స్థూలకాయం:- బొప్పాయి తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. పండిన బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పండిన బొప్పాయిని కేవలం 10 రోజుల పాటు తీసుకోవడం ద్వారా, మీ శరీరంలోని వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారు.

గుండె జబ్బులు: బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి మరియు ఇ ఉంటాయి. ఈ ఆక్సిడెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది కాకుండా, రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఫైబర్ ఇందులో ఉంటుంది.

BSFలో 144 ఎస్​ఐ, కానిస్టేబుల్ పోస్టులు – దరఖాస్తు చేసుకోండిలా! – BSF Recruitment 2024

BSF Recruitment 2024 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)​ పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్-బి, గ్రూప్​-సి (నాన్-గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు

బీఎస్​ఎఫ్ ఇన్​స్పెక్టర్ – 2 పోస్టులు
ఎస్​ఐ స్టాఫ్​ నర్స్ – 14 పోస్టులు
ఏఎస్​ఐ ల్యాబ్ టెక్నీషియన్​​ – 38 పోస్టులు
ఏఎస్​ఐ ఫిజియోథెరపిస్ట్​ – 47 పోస్టులు
ఎస్​ఐ వెహికల్ మెకానిక్ – 3 పోస్టులు
కానిస్టేబుల్​ టెక్నికల్ – 34 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ – 4 పోస్టులు
కానిస్టేబుల్ కెన్నెల్​మాన్​ – 2 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 144
విద్యార్హతలు
BSF Job Eligibility : పోస్టులను అనుసరించి అభ్యర్థులు 10+2, డిగ్రీ, డిప్లొమాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి
BSF Job Age Limit :

బీఎస్​ఎఫ్ ఇన్​స్పెక్టర్ లైబ్రేరియన్ – గరిష్ఠంగా 30 ఏళ్లు
ఎస్​ఐ స్టాఫ్​ నర్స్ – 21 నుంచి 30 ఏళ్లు
ఏఎస్​ఐ ల్యాబ్ టెక్​ – గరిష్ఠంగా 25 ఏళ్లు
ఏఎస్​ఐ ఫిజియోథెరపిస్ట్​ – 20 నుంచి 27 ఏళ్లు
ఎస్​ఐ వెహికల్ మెకానిక్ – గరిష్ఠంగా 30 ఏళ్లు
కానిస్టేబుల్​ టెక్నికల్ – 18 నుంచి 25 ఏళ్లు
హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ – 18 నుంచి 25 ఏళ్లు
కానిస్టేబుల్ కెన్నెల్​మాన్​ – 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం
BSF Job Selection Process :

రాత పరీక్ష
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్
మెడికల్ ఎగ్జామినేషన్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు రుసుము
BSF Job Application Fee : ఎస్​ఐ/స్టాఫ్ నర్సు పోస్టులకు రూ.200; మిగిలిన పోస్టులకు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

జీత భత్యాలు
BSF Salaries :

ఎస్​ఐ/స్టాఫ్ నర్సులకు నెలకు రూ.35,400 – రూ.1,12,400;
ఏఎస్​ఐలకు నెలకు రూ.29,200 – రూ.92,300 వరకు జీతం ఉంటుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
ముఖ్యమైన తేదీలు

ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మే 19
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 17

Yerneni Sita Devi Dead : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూత

Former Minister Yerneni Sita Devi Passed Away : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో ఆమె గుండెపోటు కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యెర్నేని సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలంలో ఉన్న కోడూరు గ్రామం. ఆమె ముదినేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1988లో ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారామె.

ఆ తర్వాత బీజేపీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా.. ఆమె కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. భర్త నాగేంద్రనాథ్ అలియాస్ చిట్టిబాబు ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. గతేడాదే ఆయన మరణించారు. చిట్టిబాబు సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కూడా 2 పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజా సీతాదేవి, చిట్టిబాబు దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఐటీఐ అర్హతతో – రైల్వేలో 1010 పోస్టులు – అప్లై చేసుకోండిలా!

Railway Apprentice Posts 2024 : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికిగాను 1010 యాక్ట్​ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రేడ్స్​

కార్పెంటర్ – 90 పోస్టులు
ఎలక్ట్రీషియన్ – 180 పోస్టులు
ఫిట్టర్ – 260 పోస్టులు
మెషినిస్ట్ – 90 పోస్టులు
పెయింటర్​ – 90 పోస్టులు
వెల్డర్ – 260 పోస్టులు
ఎంఎల్​టీ రేడియాలజీ -5 పోస్టులు
ఎంఎల్​టీ పాథాలజీ – 5 పోస్టులు
పీఏఎస్​ఏఏ – 10 పోస్టులు
మొత్తం పోస్టులు – 1010
విద్యార్హతలు
ICF Chennai Apprentice Job Eligibility : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్​ (ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నాన్​-ఐటీఐ అభ్యర్థులు కూడా అర్హులే.

వయోపరిమితి
ICF Chennai Apprentice Job Age Limit :

ఐటీఐ అభ్యర్థుల వయస్సు 2024 జూన్​ 21 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
నాన్​-ఐటీఐ అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
ICF Chennai Apprentice Application Fee :

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
ICF Chennai Apprentice Selection Process : అకడమిక్​ మార్కుల మెరిట్​, రూల్​ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైపెండ్​
ICF Chennai Apprentice Salary : యాక్ట్ అప్రెంటీస్​లకు నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ అధికారిక వెబ్​సైట్​ https://pb.icf.gov.in ఓపెన్ చేయాలి.
వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అప్పుడు మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
‘అప్లై ఆన్​లైన్’ లింక్​పై క్లిక్ చేసి, లాగిన్ కావాలి.
అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు

ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 మే 22
ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జూన్ 21

Rupee Value : భారతదేశపు 1 రూపాయి ఆ దేశ కరెన్సీలో 500కి సమానం.! అది ఏ దేశమో తెలుసా?

గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో ప్రతి దేశం డబ్బుకు విలువ ఉంటుంది. ప్రత్యేకించి, ఒక US డాలర్ విలువ 83 భారతీయ రూపాయలు, అంటే భారతదేశం ఒక US డాలర్‌కు 83 రూపాయలు చెల్లించాలి.

భారతదేశం 271 రూపాయలు ఇస్తుండగా, కువైట్ ఒక దినార్ ఇస్తుంది. భారతదేశం 221 రూపాయలు ఇస్తే, ఒమన్ ఒక ఒమన్ రియాల్ ఇస్తుంది.

కానీ భారతదేశం 1 రూపాయి ఇస్తే, 500 రూపాయలు ఇచ్చే దేశం ఉంది. భారతదేశానికి ఈ దేశంతో ప్రాచీన కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, అమెరికా ఆంక్షల కారణంగా దేశం పరిస్థితి దిగజారుతోంది. అందుకే ఈ దేశంలో 1 భారతీయ రూపాయి విలువ కనీసం 500 రూపాయలు. మనం మాట్లాడుకుంటున్న దేశం చాలా మందికి సుపరిచితమే. ఆ దేశం ఇరాన్. ఇది ఆర్థికంగా బలమైనది మరియు ప్రపంచంలోని అగ్రరాజ్యాలపై తీవ్ర ఒత్తిడిని కలిగించగలిగినప్పటికీ, దాని కరెన్సీ విలువ చాలా తక్కువ. ఇరాన్ కరెన్సీని రియాల్-ఇ-ఇరాన్ అంటారు. ఇరాన్‌ను ఆంగ్లంలో రియాల్ అంటారు.

ఇరాన్‌లోని పురాతన కరెన్సీలలో ఒకటి, రియాల్ చాలా విలువైనది. అయితే గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ భారీగా పడిపోయింది. ఎందుకంటే, కొన్నేళ్లుగా ఈ దేశంపై అమెరికా అనేక ఆర్థిక ఆంక్షలు విధించింది. దీని వల్ల అమెరికా భయంతో చాలా దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభించింది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, భారత్‌తో సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. అయితే, ఒక భారతీయ రూపాయి 507.22 ఇరాన్ రియాల్స్‌తో సమానం. అంటే, భారతీయుడు 10,000 రూపాయలతో ఇరాన్‌కు వెళితే, అతను ఆ దేశంలో విలాసవంతంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దేశంలోని గొప్ప 5-నక్షత్రాల హోటల్‌లో బస చేయడానికి రోజుకు గరిష్టంగా ₹7,000 ఖర్చవుతుంది. కానీ మిడ్ రేంజ్ 5 స్టార్ హోటళ్లకు వెళితే రూ.2,000 నుంచి 4,000 మాత్రమే. అదేవిధంగా 3 స్టార్ హోటళ్లకు వెళితే ఇంతకంటే తక్కువ.

ఇరాన్ తన స్థానిక కరెన్సీలో భారతదేశంతో సహా కొన్ని దేశాలతో మాత్రమే వర్తకం చేస్తుంది. కొనసాగుతున్న శత్రుత్వాల కారణంగా అమెరికా డాలర్లను అంగీకరించదు. ఈ విధంగా, ఈ దేశంలో అమెరికన్ డాలర్లను కలిగి ఉండటం పెద్ద నేరం. ఈ నిషేధం కారణంగా, ఇరాన్‌లో యుఎస్ డాలర్ల అక్రమ స్మగ్లింగ్ వృద్ధి చెందింది. ప్రపంచంలోని పురాతన కరెన్సీలలో రియాల్ ఒకటి. మొదట 1798లో ప్రవేశపెట్టబడింది, రియాల్ 1825లో నిలిపివేయబడింది, తర్వాత మళ్లీ విడుదల చేయబడింది. 2012 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇరాన్ రియాల్ విలువ వేగంగా క్షీణిస్తోంది. కానీ రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇరాన్ లాగా, సియెర్రా లియోన్‌లో, ఒక భారతీయ రూపాయికి 238.32 రూపాయలు చెల్లిస్తారు. అదేవిధంగా ఇండోనేషియాలో 1 భారత రూపాయి 190 రూ. అందుకే ఇండోనేషియా పర్యటనకు వెళ్లినా తక్కువ ఖర్చుతో అందమైన ప్రదేశాలను చూడొచ్చు.

Income Tax Saving: పన్ను ఆదా చేయడానికి ఈ ముఖ్యమైన ట్రిక్స్ గురించి మీకు తెలుసా?

కొత్త ఆర్థిక సంవత్సరం (FY) ప్రారంభమైంది. మీరు ఇప్పుడు మీ పన్నులను నిర్వహించడానికి వ్యూహాన్ని అనుసరించాలి. మరో మాటలో చెప్పాలంటే, మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, మెరుగైన పన్ను ప్రణాళిక ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఇది సమయం. మీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2024న ప్రారంభమై మార్చి 31, 2025న ముగిస్తే, అంటే ఈ సంవత్సరం 2024-25 అయితే, అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26 అవుతుంది. మీ మునుపటి సంవత్సరం ఆదాయం దానిలో చేర్చబడుతుంది. పన్ను ప్రయోజనాల కోసం అసెస్‌మెంట్ చేయబడుతుంది.

ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరలో అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పన్నులను ప్లాన్ చేయడం ఆలస్యం చేయడమే కాకుండా ఒత్తిడిని కూడా సృష్టిస్తుంది. ఈ పనిని ఆర్థిక సంవత్సరం చివరిలో చేస్తే, అది పన్ను ప్రణాళిక కాదు, పన్ను సమ్మతి. పన్ను ప్రణాళిక వాస్తవానికి పన్ను బాధ్యతను తగ్గించడానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం, దీనిని ముందుగానే ప్రారంభించాలి.

మీకు ఏ పన్ను విధానం ప్రయోజనకరం

పన్ను ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక కలిసి ఉంటాయి. ఏడాది పొడవునా పన్ను ప్రణాళిక కొనసాగుతుంది. ఆదర్శవంతంగా ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించాలి. మీరు మీ పన్ను పరిస్థితి, ఖర్చులు, మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవాటిని పరిగణించాలి. ఇది మీ పన్ను బాధ్యత గురించి, మీ పన్ను బాధ్యతను చట్టబద్ధంగా ఎలా తగ్గించుకోవచ్చో మీకు ఒక ఆలోచనను అందిస్తుంది. జీతం పొందే వ్యక్తులు అటువంటి పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన పన్ను ప్రణాళికతో మీరు మీ పన్ను బాధ్యతలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

పన్ను ఆదా ఎంపికల గురించి తెలుసుకోండి

చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C గురించి తెలిసిందే. అయితే ఇది కాకుండా, అనేక పన్ను ఆదా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పాత పన్ను విధానంలో పొందవచ్చు. ఉదాహరణకు మీరు సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పరిమితికి మించి పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు సెక్షన్ 80CCD (1B) రూపంలో NPSకి సహకరించవచ్చు. దీని ద్వారా అదనంగా రూ.50,000 ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా అనేక ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి.

పన్ను చట్టంలో మార్పుల గురించి..

కొత్త ఆదాయపు పన్ను విధానం అనేది FY 2023-24 నుండి ఆదాయపు పన్ను మదింపు కోసం డిఫాల్ట్ పన్ను విధానం. అంటే పన్ను చెల్లింపుదారు తన పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే, కొత్త ఆదాయపు పన్ను విధానం అతని ఎంపికగా పరిగణిస్తారు. అయితే, ఈ ఎంపికను తర్వాత కూడా మార్చవచ్చు. ఇది కాకుండా పన్ను నియమాలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు దీని గురించి తెలుసుకోవాలి.

సెక్షన్ 80C : ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), ఉద్యోగుల ఆదాయపు పన్ను పథకం వంటి పన్ను ఆదా పెట్టుబడులకు అనేక మార్గాలను అందిస్తుంది. ఇందులో మీరు ఏటా రూ.1.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు.

ఆరోగ్య బీమా ప్రీమియం: స్వీయ, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాలసీల కోసం చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80D కింద మినహాయింపుకు అర్హమైనది. మీరు ఈ మినహాయింపును పొందకుంటే పన్ను బాధ్యత పెరగవచ్చు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలు: NPSకి చేసిన విరాళాలు సెక్షన్ 80C కింద అందుబాటులో ఉన్న పరిమితిని మించి ఉంటే సెక్షన్ 80CCD (1B) కింద పన్ను మినహాయింపుకు అర్హులు. ఈ అదనపు మినహాయింపును పొందకపోతే పన్ను ఆదా అవకాశాలను కోల్పోవచ్చు.

Gold Price Today: గోల్డ్ ప్రియులకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది.!

గ్లోబల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత నాలుగు రోజుల నుంచి గోల్డ్ రేట్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చునన్న సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం, వెండిలో పెట్టుబడులు నెమ్మదించడం దీనికి కారణం అని అంటున్నారు బిజినెస్ నిపుణులు.
గ్లోబల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత నాలుగు రోజుల నుంచి గోల్డ్ రేట్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చునన్న సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం, వెండిలో పెట్టుబడులు నెమ్మదించడం దీనికి కారణం అని అంటున్నారు బిజినెస్ నిపుణులు. ఈ తరహాలోనే మరికొద్ది రోజులు బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గత వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ. 300 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్టణంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,390 కాగా.. 10 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర రూ.72,430.

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలా..
ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,580. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో.. 22 క్యారట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,390 కాగా, 24 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,430. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66,540 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,590.

వెండి ధర ఇలా ఉంది..
దేశవ్యాప్తంగా వెండి ధర భారీగా తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.95,900. అలాగే చెన్నైలో కిలో వెండి రూ.95,900. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.91,400. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,900కు చేరింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!

నేషనల్ స్కిల్ అకాడమీ, హైదరాబాద్, భారత ప్రభుత్వ సర్టిఫైడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కోర్సుల ఆన్‌లైన్ శిక్షణ కోసం భారతదేశం అంతటా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ప్రోగ్రామ్ 10+2, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ మరియు PG వంటి అర్హతలు కలిగిన వ్యక్తులకు సరికొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.

వివిధ రకాల కోర్సులు

దరఖాస్తుదారులు 50కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో DevOps, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, SaaS, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, VB, GST, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మరియు వెబ్ డిజైన్ ఉన్నాయి.

కోర్సు వివరాలు మరియు సర్టిఫికేషన్

ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులు ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది, సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.

ఆర్థిక సహాయం

ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి, దారద్రరేఖకు దిగువన ఉన్నవారికి ఫీజులో రాయితీ లభిస్తుంది.SC, ST, BC, EBC, OBC, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (PH), మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.

అప్లికేషన్ సమాచారం

ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 05/06/2024. మరిన్ని వివరాలకు 9505800050 నంబర్‌పై సంప్రదించండి.

వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన సరస్వతి నది రహస్యం.. ఇప్పటికీ భూగర్భంలో ప్రవహిస్తోంది!

భారతదేశంలోని నదుల చరిత్ర చాలా పురాతనమైనది. మన ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు దేశంలోని నదులు ముఖ్యమైన సహకారం అందిస్తున్నాయి. నేడు భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి.

వాటిలో అత్యంత ప్రసిద్ధ నది గంగ, యమునా, గోదావరి, సింధు, నర్మదా, కావేరీ నదుల గురించి మనకు తెలుసు. అయితే మనం మరో నది గురించి తెలుసుకుందాం.. మీరు మీ పాఠ్య పుస్తకాలలో దాని పేరును చాలాసార్లు చదివి ఉండవచ్చు. కానీ నిజానికి ఈ రోజు భారతదేశంలో అలాంటి నది లేదు.

పురాణాలలో అనేక నదులు, ప్రదేశాలు ప్రస్తావించబడ్డాయి. సరస్వతి నది గురించి ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరస్వతి నది ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా? సరస్వతి నది చుట్టూ ఉన్న విషయాలు నేటికీ పరిశోధకులను కలవరపెడుతున్నాయి. పురాణగాథగా భావించే సరస్వతి నది వాస్తవానికి భారతదేశంలో ప్రవహించిందనడానికి పరిశోధకుల వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.

వేద కాలంలో సరస్వతిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు. ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఋషులు వేదాలను రచించారని, ఈ నది నీటిని తాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొందారని చెబుతారు. సరస్వతి నది ప్రవహించడం ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. హిమాచల్‌లోని సిర్మౌర్ నుంచి సరస్వతి నది అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, పాటియాల గుండా ప్రవహించి సిర్సాలోని దృష్టవతి నదిలో కలుస్తుంది. పురాణాలలో సరస్వతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ ఇప్పుడు ఈ నది భూమిపై లేదు. ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ, శాపం కారణంగా ఎండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు భూమిపై సరస్వతి నది పేరు మాత్రమే మిగిలి ఉంది.

ఇది ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో అలకానంద నదికి ఉపనదిగా చెబుతారు. ఈ నది వేల సంవత్సరాల క్రితం ఉండేదని, ప్రస్తుతం ఎండిపోయిందని భావిస్తున్నారు. ఇలా సరస్వతి నది చుట్టూ అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి.

సరస్వతి నది గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తుంది. ఇది తరువాతి గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఒకప్పుడు హిందువులు పూజించే కొన్ని నదులలో సరస్వతి ఒకటి. శాస్త్రీయంగా చెప్పాలంటే హరప్పా నాగరికత కాలంలోనే ఈ నది ఉండేదని తేలింది. నిజానికి ఈ నాగరికతలోని అనేక ముఖ్యమైన భాగాలు సరస్వతి నది ఒడ్డున నిర్మించబడ్డాయి.

సరస్వతి నది రామాయణం, మహాభారతాలలో వర్ణించబడింది. ప్రయాగ గంగా, యమునా, సరస్వతి సంగమం. సరస్వతి నది ఇక్కడ భూమి గుండా ప్రవహిస్తుందని చెబుతారు. సరస్వతిని పురాతన నాగరికతలో అతిపెద్ద, అతి ముఖ్యమైన నదిగా పరిగణిస్తారు. ఈ నది హర్యానా, పంజాబ్, రాజస్థాన్ గుండా నేటికీ భూగర్భంలో ప్రవహిస్తుందని కొందరు అంటుంటారు. సరస్వతీ నది చాలా పెద్దది. పర్వతాలను దాటి మైదానాల గుండా వెళ్లి అరేబియా సముద్రంలో కలిసిపోయింది. దీని వివరణ ఋగ్వేదంలో చూడవచ్చు. నేడు ప్రజలు గంగను పూజించినట్లే, ఆ కాలంలో ప్రజలు సరస్వతికి పవిత్ర నది హోదాను ఇచ్చారు.

హిందూ పురాణాల ప్రకారం, సరస్వతి నది సరస్వతి దేవి రూపం. హిందువులు సరస్వతిని జ్ఞానం, సంగీతం, సృజనాత్మకతకు దేవతగా ఆరాధిస్తారు. సరస్వతి నదికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతి నదిలో స్నానం చేశాడని కూడా చెబుతారు.

ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున కూర్చుని మహాభారత కథను గణేశుడికి వివరిస్తున్నాడు. ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడు. కానీ సరస్వతీ నది ఋషి మాట వినలేదు. వేగంగా ప్రవహిస్తూనే ఉంది. సరస్వతి నది ఈ ప్రవర్తనకు కోపంతో, గణేశుడు సరస్వతి నది అంతరించిపోవాలని శపించాడు.

మహాభారతంలోని కొన్ని భాగాలు హర్యానాలోని సిర్సా పట్టణంలో ఎక్కడో అంతరించిపోయిన ఈ నది గురించి ప్రస్తావించాయి. పురాతన కాలంలో రాజస్థాన్ ప్రస్తుతం ఉన్నలాంటి ప్రాంతం కాదని భౌగోళిక చరిత్ర, పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. రాజస్థాన్ ఒకప్పుడు సస్యశ్యామలమైన ప్రాంతం, ఇది గొప్ప నదీ లోయ సంస్కృతికి ఆతిథ్యం ఇచ్చింది. మొహెంజదారో, హరప్పా వంటి నాగరికతలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్నాయి.

అమెరికన్ శాటిలైట్ ల్యాండ్‌శాట్ కనుగొన్న కొన్ని చిత్రాలు భూమిపై వాస్తవానికి సరస్వతి నది ఉనికిలో ఉండే అవకాశం గురించి పరిశోధకులు ఆలోచించేలా చేశాయి. జైసల్మేర్ ప్రాంతంలో, భూగర్భంలో పెద్ద నది వంటి కాలువలు కనుగొనబడ్డాయి. ఇస్రో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రిమోట్ సెన్సింగ్ చిత్రాలు ఆరావళి శ్రేణికి పశ్చిమాన ఏడెనిమిది ప్రదేశాలలో పెద్ద నది ప్రవహించే మార్గాలను గుర్తించాయి.

ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్. కౌంటింగ్ లో పదును

ఏపీలో లోక్ సభ.. శాసన సభ ఎన్నికలు జరిగాయి. మే 13న కీలకమైన పోలింగ్ పూర్తి అయ్యింది. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పోల్ జరిగిన నేపథ్యంలో తుది ఫలితంపై ప్రధాన పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి.

ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్నాయి. దీంతో.. ఎవరికి వారు ఆశాభావంతో ఉంటున్నారు. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. చివర్లో జరిగే కౌంటింగ్ మరో ఎత్తు అన్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండని పక్షంలో ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. కౌంటింగ్ కోసం కొత్త కసరత్తు మొదలు పెట్టారు.

దీంతో పార్టీలకు కౌంటింగ్ టెన్షన్ మొదలైంది. పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య దాదాపు మూడు వారాల దూరం ఉండటంతో కాస్తంత నిదానించిన పార్టీలు.. నేతలు ఇప్పుడు మళ్లీ అలెర్టు అవుతున్నారు. పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంతమేర అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుకుంటూ.. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

పోలింగ్ వేళ ఏపీలోని పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని జిల్లాల్లో హింసాత్మక చర్యలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కీలకంగా మారింది. ఎన్నిలక పలితాల్ని డిసైడ్ చూసే కౌంటింగ్ వేళ.. నియమించుకునే ఏజెంట్లు ఏ

తీరులో వ్యవహరించాలన్న దానిపై పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి? ఎలా రియాక్టు కావాలి? అన్న దానిపై ఎత్తుగడలను సిద్దం చేసుకుంటున్న పార్టీలు అందుకు తగ్గట్లుగా తమ సైన్యాన్ని సిద్దం చేస్తున్నాయి.

ఇంతకాలం పోలింగ్ టెన్షన్ లో ఉన్న నేతలు.. అభ్యర్థులు.. మద్దతుదారులు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్ కు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో తక్కువ మెజార్టీలతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. కౌంటింగ్ కీలకంగా మారనుంది. పోలింగ్ పూర్తి అయిన రెండు.. మూడు రోజులకే పలువురు అభ్యర్థులు విహారయాత్రలకు వెళ్లటం తెలిసిందే. అధినేతలు సైతం విదేశీ టూర్లకు వెళ్లారు. కౌంటింగ్ కు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో క్యాడర్ ను సమాయుత్తం చేసుకోవటం కూడా నేతలు రంగంలోకి దిగారు. బయట ప్రాంతాల్లో ఉన్న వారిని కౌంటింగ్ కు ఒకట్రెండు రోజుల ముందే రావాలని కోరుతున్నారు. పోలింగ్ వేళ అంత భారీగా కాకున్నా.. ముఖ్యమైన క్యాడర్.. కౌంటింగ్ వేళ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. దీంతో.. మొన్నటి దాకా టెన్షన్ నెలకొన్న స్థానే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అటెన్షన్ మొదలైంది.

Kavya Maran: హైదరాబాద్‌ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్‌

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోవడంతో జట్టు యజమాని కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

చెన్నై: రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్‌ (IPL) మెగా టోర్నీ ముగిసింది. ఫైనల్‌లో హైదరాబాద్‌ (Hyderabad) ఘోర ఓటమిని చవిచూసింది. కోల్‌కతా (Kolkata) 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌.. చివరిమెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక వేలం పాట నుంచి మొదలు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటి ఉండే ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్‌ (Kavya Maran) మ్యాచ్‌ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలిపే తను.. ఫైనల్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే, కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో స్వల్ప స్కోర్‌కే సన్‌రైజర్స్‌ పరిమితం అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (52*), గుర్బాజ్‌ (39) చెలరేగడంతో 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్‌గా నిలిచింది.

TOP IITs and NITs : జేఈఈ ‘అడ్వాన్స్‌డ్‌’ ముగిసింది.. దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..

TOP IITs and NITs : జేఈఈ ‘అడ్వాన్స్‌డ్‌’ ముగిసింది.. దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆదివారం (మే 26న) ముగిసింది. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ జూన్‌ 2న అధికారులు విడుదల చేయనున్నారు. జూన్‌ 2 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది కీ, ఫలితాలను జూన్‌ 9న విడుదల చేస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలను ఓసారి పరిశీలిస్తే..

గతేడాది నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) ప్రకారం కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ (NIRF Rankings 2023) ప్రకారం .. దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఐదో ఏడాదీ తొలి స్థానంలోనే నిలిచి ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ దిల్లీ రెండో స్థానంలో ఉంది. అలాగే, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యాసంస్థల్లో అంతర్జాతీయంగా టాప్‌ 50లో ఒకటిగా సత్తా చాటింది.

ఐఐటీ బాంబే NIRF ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ కాన్పూర్‌ (నాలుగు), ఐఐటీ ఖరగ్‌పుర్‌ (ఐదు), ఐఐటీ రూర్కీ(ఆరు), ఐఐటీ గువాహటి (ఏడు), ఐఐటీ హైదరాబాద్‌ (8) నిలిచాయి. ఎన్‌ఐటీ తిరుచ్చి తొమ్మిదో ర్యాంకు, ఎన్‌ఐటీ కర్ణాటక (12), ఎన్‌ఐటీ రౌర్కెలా (16), ఎన్‌ఐటీ వరంగల్‌ (21), ఎన్‌ఐటీ కాలికట్‌ 23వ ర్యాంకుల్లో మెరిశాయి. ఇకపోతే, క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2024 జాబితాలోనూ ఐఐటీ బాంబే చోటు దక్కించుకోగా.. గ్లోబల్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ కాన్పూర్‌ 93వ ర్యాంకులో నిలిచింది.

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా! ఏం చేయాలంటే..

వాకింగ్‌ అనేది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే సులభమైన, సమర్థవంతమైన వ్యాయామం. ఇది గుండె, మధుమేహం ప్రమాదాలను తగ్గిస్తుంది. స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు సరైన వేగంతో నడవడం కూడా చాలా ముఖ్యమైనది. ఆశించిన ఫలితం రావాలంటే.. ఎంతసేపు, ఏ వేగంతో నడవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైన భాగం రెగ్యులర్ వ్యాయామం. వాకింగ్‌ అనేది చాలా సులభమైన, సమర్థవంతమైన ఏరోబిక్ వ్యాయామం. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మన దినచర్యలో చేర్చుకోగల సులభమైన పద్ధతి. వాకింగ్‌ మన గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇది అనేక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. అదనంగా, ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి, సరైన మార్గంలో నడవడం మన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి వాకింగ్‌: మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్‌ మంచి, ఆరోగ్యకరమైన మార్గం. కానీ, సరైన వేగంతో నడవడం కూడా చాలా ముఖ్యం. నెమ్మదిగా నడవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ గరిష్ట ప్రయోజనాలను పొందడానికి మీరు మీ వాకింగ్‌ వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాలి. మీరు బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తుంటే, గరిష్ట ప్రయోజనాలను పొందడానికి మీరు వేగంగా నడిచేందుకు ప్రయత్నించాలి. ఇది కాకుండా, వాకింగ్ చేసేటప్పడు వీలైతే చిన్న డంబెల్స్‌ను పట్టుకుని నడవండి. ఇలా చేయడం వల్ల మరింత ఫలితం ఉంటుంది.

వాకింగ్‌ తర్వాత శరీర కేలరీలను బర్న్ చేయడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. నడక, జాగింగ్, క్రీడలు వంటి శారీరక వ్యాయామం వల్ల శరీరంలోని కొవ్వు వేగంగా బర్న్‌ అవుతుంది. మన పరిస్థితిని బట్టి మన జీవనశైలిని మార్చుకుంటూ కూడా ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలము. వాకింగ్‌ ద్వారా మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కేలరీలు బర్న్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

బరువు తగ్గడం కోసం వాకింగ్‌: వాకింగ్‌ సమయంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి అనేది వ్యక్తి వయస్సు, బరువు, నడక వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వంటి మితమైన వేగంతో ఒక వ్యక్తి 100 నుండి 150 కేలరీలు బర్న్ చేయగలడు. వ్యక్తి బరువు, ఎత్తు, వయస్సు ఆధారంగా బర్న్ చేయబడిన కేలరీల పరిమాణం మారవచ్చు. అలాగే, నడిచేటప్పుడు చేతులను ఖాళీగా ఉంచకుండా.. అటూ ఇటూ తిప్పుతూ వాకింగ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అన్ని కండరాలకు శారీరక శ్రమ కలుగుతుంది.

రోజువారీ నడక గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది: గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గం క్రమం తప్పకుండా నడవడం. రోజుకు 3 కి.మీ నడిచే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం సగం తగ్గిపోతుందని ఒక పరిశోధనలో తేలింది. వాకింగ్‌ అనేది మన జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
మీ ఇంటికి సమీపంలో ఏదైనా కొండ లాంటి ఎత్తైన ప్రదేశం ఉంటే అక్కడికి నడుస్తూ వెళ్లండి. దీనివల్ల సాధారణ రోడ్లపై నడిచిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులంటున్నారు. నడిచేటప్పుడు వంగకుండా వీపును నిటారుగా ఉంచి నడవాలి. ఇలా చేస్తేనే ఎక్కువ క్యాలరీలు బర్న్‌ అవుతాయి.

KKR vs SRH IPL 2024 Final Match Report: కోల్‌కతాదే ఐపీఎల్ కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు

ఫైనల్లో హైదరాబాద్‌ బోల్తా
113 పరుగులకే ఆలౌట్‌
నైట్‌రైడర్స్‌ ఘనవిజయం
విజృంభించిన స్టార్క్, హర్షిత్, రసెల్‌

ఒక మ్యాచ్‌లో 277.. ఇంకో మ్యాచ్‌లో 287.. మరో మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 125. ఈ ఐపీఎల్‌ (IPL) లో సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) ది మామూలు విధ్వంసమా?

15, 16 బంతుల్లో అర్ధశతకాలు.. 39 బంతుల్లోనే శతకం.. హైదరాబాద్‌ బ్యాటర్లవి మామూలు విన్యాసాలా?

ఈ విధ్వంసక విన్యాసాలకు సార్థకత చేకూర్చాల్సిన అసలు మ్యాచ్‌లో అదే జట్టు కేవలం 113 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఇన్నాళ్లూ ప్రత్యర్థులపై ఉప్పెనలా పడిపోయిన ఓపెనర్లు 2, 0 పరుగులకే పెవిలియన్‌ చేరిపోయారు. మిగతా బ్యాటర్లూ చేతులెత్తేశారు.

చెన్నైలో అంత తేలిక కాదని తెలుసు. ఇక్కడ 200-250 స్కోర్లు ఎవరూ ఆశించలేదు. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మాదిరే 170-180 మధ్య స్కోరు చేస్తే మిగతా పని బౌలర్లు చూసుకుంటారన్న ధీమా!

కానీ సైకిల్‌ స్టాండ్‌ను తలపించిన బ్యాటింగ్‌ ఆర్డర్‌.. పదునెక్కిన కోల్‌కతా (Kolkata Knight Riders) బౌలింగ్‌కు దాసోహమంది. ఫలితం.. చెపాక్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాభవం. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసిన నైట్‌రైడర్స్‌ మూడో ట్రోఫీని ముద్దాడింది.

చెన్నై

ఈ ఐపీఎల్‌ (IPL) లో సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు తమదే అన్న అంచనాలు కలిగించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. అసలు పోరులో తేలిపోయింది. ఆదివారం చెపాక్‌లో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట మిచెల్‌ స్టార్క్‌ (2/14), హర్షిత్‌ రాణా (2/24), ఆండ్రి రసెల్‌ (3/19)ల అద్భుత బౌలింగ్‌కు తలవంచిన సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. 24 పరుగులు చేసిన కెప్టెన్‌ కమిన్సే (Pat Cummins) టాప్‌స్కోరర్‌. అనంతరం వెంకటేశ్‌ అయ్యర్‌ (52 నాటౌట్‌; 26 బంతుల్లో 4×4, 3×6), రహ్మనుల్లా గుర్బాజ్‌ (39; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని నైట్‌రైడర్స్‌ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మిచెల్‌ స్టార్క్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. 2012, 2014లోనూ విజేతగా నిలిచిన కోల్‌కతా.. పదేళ్ల తర్వాత మళ్లీ కప్పు అందుకుంది.

పూర్తి భిన్నంగా..: చెపాక్‌ పిచ్‌పై సన్‌రైజర్స్‌ తడబాటు చూస్తే లక్ష్యం చిన్నదైనా కోల్‌కతా చెమటోడుస్తుందేమో అనిపించింది. కానీ కోల్‌కతా బ్యాటర్లు ఎదురుదాడితో సగం ఓవర్లలో లక్ష్యాన్ని కరిగించేశారు. ఆ  జట్టు ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ మాత్రమే మెరుపుల్లేకుండా సాగింది. ఆ ఓవర్లో భువనేశ్వర్‌ అయిదు పరుగులే ఇచ్చాడు. కమిన్స్‌ వేసిన రెండో ఓవర్లో ఒక సిక్సర్‌ బాదిన వెంటనే నరైన్‌ (6) ఔటైపోయాడు. అప్పుడు సన్‌రైజర్స్‌లో కాస్త చిగురించిన ఆశలు.. కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ వచ్చీ రాగానే హైదరాబాద్‌ బౌలర్లపై ఉప్పెనలా పడిపోయాడు. భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్లో అతనువరుసగా 4, 6, 6 బాది ఇన్నింగ్స్‌కు రాకెట్‌ వేగాన్నందించాడు. నటరాజన్‌ వేసిన ఆరో ఓవర్లోనూ అతను వరుసగా 4, 4, 6, 4 బాదడంతో హైదరాబాద్‌కు పరాభవం తప్పదని తేలిపోయింది. మరో ఎండ్‌లో గుర్బాజ్‌ కూడా ధాటిగా ఆడాడు. విజయానికి 12 పరుగులే అవసరమైన స్థితిలో గుర్బాజ్‌ ఔటైనా.. శ్రేయస్‌ (6 నాటౌట్‌)తో కలిసి వెంకటేశ్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఆపసోపాలు..: రాజస్థాన్‌తో రెండో క్వాలిఫయర్‌తో పోలిస్తే చెపాక్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు ఎక్కువ అనుకూలం అన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో టాస్‌ గెలిచిన కమిన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో లీగ్‌ దశలో మాదిరే ఓపెనర్లు హెడ్, అభిషేక్‌ చెలరేగిపోతారనుకుంటే.. అనూహ్యంగా రెండు ఓవర్లు తిరిగేసరికే పెవిలియన్‌ చేరిపోయారు. తొలి బంతి నుంచే భారీ షాట్లతో చెలరేగిపోయే అభిషేక్‌ (2).. వరుసగా మూడు డాట్‌ బాల్స్‌ ఆడడంతోనే పిచ్‌ అంత తేలికగా లేదని అర్థమైపోయింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన అతను.. స్టార్క్‌ కళ్లు చెదిరే రీతిలో సంధించి ఔట్‌ స్వింగింగ్‌ డెలివరీకి ఆఫ్‌ స్టంప్‌ లేచిపోవడంతో నిశ్చేష్ఠుడై వెనుదిరిగాడు. ఈ షాక్‌ నుంచి తేరుకునేలోపే.. తర్వాతి ఓవర్లో (అరోరా) హెడ్‌ (0) కూడా ఔటైపోయాడు. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌ అంతా కూడా బ్యాటర్ల ఆపసోపాలతోనే సాగింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన త్రిపాఠి (9).. స్టార్క్‌ బౌలింగ్‌లో పేలవ షాట్‌ ఆడి వెనుదిరిగాడు. మార్‌క్రమ్‌ (20), నితీశ్‌ (13) నిలిచినా.. అదీ కాసేపే. చివరి ఆశ క్లాసెన్‌ మీద నిలవగా.. ఓ ఎండ్‌లో అతను పట్టుదలతో నిలిచినా అవతలి ఎండ్‌లో సహకరించే వారు కరవయ్యారు. ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ బాదిన షాబాజ్‌ అహ్మద్‌.. ఆ వెంటనే వరుణ్‌ (1/9)కు వికెట్‌ ఇచ్చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సమద్‌ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. చివరికి 15వ ఓవర్లో క్లాసెన్‌ (16) కూడా వెనుదిరగడంతో హైదరాబాద్‌ ఆశలు ఆవిరయ్యాయి. కెప్టెన్‌ కమిన్స్‌ చివర్లో పోరాడడంతో హైదరాబాద్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆరంభంలో స్టార్క్‌ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తే.. తర్వాత హర్షిత్‌ రాణా, రసెల్‌ ఆ జట్టు పని పట్టారు. లీగ్‌ దశలో సిక్సర్ల మోత మోగించిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే కొట్టారు.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) స్టార్క్‌ 2; హెడ్‌ (సి) గుర్బాజ్‌ (బి) అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 9; మార్‌క్రమ్‌ (సి) స్టార్క్‌ (బి) రసెల్‌ 20; నితీశ్‌ (సి) గుర్బాజ్‌ (బి) హర్షిత్‌ 13; క్లాసెన్‌ (బి) హర్షిత్‌ 16; షాబాజ్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 8; సమద్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 4; కమిన్స్‌ (సి) స్టార్క్‌ (బి) రసెల్‌ 24; ఉనద్కత్‌ ఎల్బీ (బి) నరైన్‌ 4; భువనేశ్వర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్‌) 113; వికెట్ల పతనం: 1-2, 2-6, 3-21, 4-47, 5-62, 6-71, 7-77, 8-90, 9-113; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-14-2; వైభవ్‌ 3-0-24-1; హర్షిత్‌ 4-1-24-2; నరైన్‌ 4-0-16-1; రసెల్‌ 2.3-0-19-3; చక్రవర్తి 2-0-9-1

కోల్‌కతా ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ ఎల్బీ (బి) షాబాజ్‌ 39; నరైన్‌ (సి) షాబాజ్‌ (బి) కమిన్స్‌ 6; వెంకటేశ్‌ అయ్యర్‌ నాటౌట్‌ 52; శ్రేయస్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114; వికెట్ల పతనం: 1-11, 2-102; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-25-0; కమిన్స్‌ 2-0-18-1; నటరాజన్‌ 2-0-29-0; షాబాజ్‌ 2.3-0-22-1; ఉనద్కత్‌ 1-0-9-0; మార్‌క్రమ్‌ 1-0-5-0


2

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఓడిన పైనల్స్‌. 2018లోనూ ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 


3

ఐపీఎల్‌లో కనీసం మూడు టైటిళ్లు గెలిచిన జట్లలో కోల్‌కతా స్థానం. సీఎస్కే, ముంబయి ఇండియన్స్‌ అయిదేసి టైటిళ్లు సాధించాయి.


4

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా చేసిన అర్ధశతకాలు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌ అతనే. 


8

ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న కెప్టెన్లలో శ్రేయస్‌ స్థానం. షేన్‌వార్న్, గిల్‌క్రిస్ట్, ధోని, గంభీర్, రోహిత్, వార్నర్, హార్దిక్‌ పాండ్య అతని కంటే ముందున్నారు. 


57

కేకేఆర్‌ విజయంలో మిగిలిన బంతులు. బంతులపరంగా చెపాక్‌లో ఇదే అతిపెద్ద విజయం 


ఆరెంజ్‌ క్యాప్‌: కోహ్లి (741 పరుగులు, బెంగళూరు)

పర్పుల్‌ క్యాప్‌: హర్షల్‌ (24 వికెట్లు, పంజాబ్‌)

అత్యంత విలువైన ఆటగాడు: సునీల్‌ నరైన్‌ (488 పరుగులు, 17 వికెట్లు, కోల్‌కతా)

ఉత్తమ వర్దమాన ఆటగాడు: నితీశ్‌కుమార్‌ రెడ్డి (303 పరుగులు, హైదరాబాద్‌)

ఉత్తమ వేదిక, పిచ్‌: హైదరాబాద్,

ప్రైజ్‌మనీ: రన్నరప్‌ హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు, విజేత కోల్‌కతాకు రూ.20 కోట్లు

అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా.. ఇప్పుడు సినిమాకి రూ.4 కోట్లు..

ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది.
ఉన్నత చదువులు.. జీవితంలో స్థిరపడాలని ఆశయం ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసిన ఈ ముద్దుగుమ్మ.. కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఎలాస్తున్నా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకలు ఎదుర్కొంటుంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియన్‌ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతుంది.
ఇంతకి ఈ చిన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత. దేశంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని.. నటిగా రికార్డ్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం దక్కించుకున్న ఈ అమ్మడు.. కాలేజీ రోజుల్లోనే 500 కోసం హోటల్ ఈవెంట్ హోస్ట్ గా పని చేసిందట. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న శ్యామ్ తన సినీ కెరీర్ లో రూ.101 కోట్ల ఆస్తిని సంపాదించిందని టాక్. అయితే గతంలో మాత్రం కేవలం రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా పని చేసిందని తెలియటంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

పాన్‌ కార్డులో మార్పులు చేసుకోండిలా..

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.

ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్‌డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్‌సైట్‌లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్‌సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్‌సైట్‌ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.

NSDL e-Gov పోర్టల్‌లో..

స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్‌ చేయండి

స్టెప్ 2: ‘సర్వీసెస్’ ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ‘పాన్’ ఎంచుకోండి.

స్టెప్ 3: ‘చేంజ్‌/కరెక్షన్‌ ఇన్‌ పాన్‌ డేటా’ అనే విభాగం కోసం స్క్రోల్ చేసి ‘అప్లై’ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండి

స్టెప్‌ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్‌ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్‌ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ ‘కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్’ పై క్లిక్ చేయాలి.

స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండి
స్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండి
అప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రక్రియను పూర్తి చేయడానికి, ‘ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.

స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.

స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. ‘కాంటాక్ట్ ఇతర వివరాలు’ పేజీకి వెళ్లడానికి ‘నెక్ట్స్’ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.

స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.

స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.

స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత ‘సబ్మిట్’ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.

స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.

స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, ‘కంటిన్యూ’ మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి ‘అథెంటికేట్’ మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.

స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్‌లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.

స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో ‘కంటిన్యూ’ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ‘సెండ్ ఓటీపీ’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

UTIITSL పోర్టల్‌లో ఇలా..

స్టెప్‌ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండి

స్టెప్ 2: ‘చేంజ్‌/కరెక్షన్‌ ఇన్‌ పాన్‌ కార్డ్‌’ ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్‌ టు అప్లయి’ మీద క్లిక్‌ చేయండి

స్టెప్ 3: ‘అప్లయి ఫర్‌ చేంజ్‌/కరెక్షన్‌ ఇన్‌ పాన్‌ కార్డ్‌ డీటెయిల్స్‌’ ట్యాబ్‌ను ఎంచుకోండి

స్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్‌ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ‘ఓకే’ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ‘నెక్ట్స్ స్టెప్’ పై క్లిక్ చేయండి

స్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.

స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్‌ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, ‘మేక్ పేమెంట్’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.

స్టెప్ 11: నచ్చిన ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.

సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.

ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..

» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి

» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.

» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.

» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్‌డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.

కావాల్సిన డాక్యుమెంట్లు

పాన్ కార్డు డూప్లికేట్

ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు.

ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు.

పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు.

ఏపీలో NDA కూటమిదే అధికారం.. తేల్చి చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి..? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? అన్న చర్చలు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేషనల్ మీడియా పీటీఐకు అమిత్ షా ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి 17 ఎంసీ స్థానాలు గెలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పట్ల సంతృప్తితో ఉన్నారని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అలాగే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, కర్నాటకలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని ఫైర్ అయ్యారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. ఓబీసీల రిజర్వేషన్లను కాపాడుతామని హామీ ఇచ్చారు.

EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు..ఎలాగంటే..

EPFO : ఉద్యోగుల జీతం నుండి కొంత డబ్బు ప్రతి నెల పీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వం పీఎఫ్‌ ఖాతాపై స్థిర వడ్డీని ఇస్తుంది. వీటన్నింటిని నిర్వహించే పని ప్రభుత్వం తరపున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చేస్తుంది. ఈపీఎఫ్‌వో పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే సేవను అందిస్తుంది. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని కూడా తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ కాకుండా, ఉద్యోగులు నాలుగు మార్గాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా: మీరు మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు ఈ నంబర్‌కు కాల్ చేసిన వెంటనే, అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత బ్యాలెన్స్ వివరాలు మీ నంబర్‌కు వస్తాయి.

EPFO వెబ్‌సైట్ ద్వారా: మీరు EPFO ​​వెబ్‌సైట్ ద్వారా మీ PF ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మీరు మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. మీరు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు మీ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ ఆన్‌లైన్ పాస్‌బుక్ పొందుతారు.

SMS ద్వారా: మీరు సాధారణ SMS పంపడం ద్వారా మీ పీఎఫ్‌ ఖాతాలోని బ్యాలెన్స్‌ని కూడా తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO అని టైప్‌ చేసి ఆపై మీ UAN నంబర్‌ను నమోదు చేయాలి. 7738299899 నంబర్‌కు పంపాలి.

ఉమాంగ్ పోర్టల్ ద్వారా: మీరు ఉమాంగ్ పోర్టల్ ద్వారా EPFO సౌకర్యాలను కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మీరు దీని ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. ఉమాంగ్ యాప్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టార్ హోటల్స్‌లో పనిచేసే చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్

ఏపీలో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్టార్ హోటల్స్‌లో పనిచేసే చెఫ్‌లతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్ అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి.. విజయవాడలో తాజ్ హోటల్‌ చెఫ్‌లు వంట ఏజెన్సీ మహిళలకు శిక్షణ ఇచ్చారు. పప్పు, వెజ్ కర్రీ, పులిహోరా, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు.

మరోవైపు మధ్యాహ్న భోజనంలో భాగంగా పౌష్టికాహారం సిద్ధం చేసేందుకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చెందిన నిపుణులైన చెఫ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరంతా.. మధ్యాహ్న భోజన కార్యక్రమం మెనూ కోసం వివిధ ఐటెమ్‌ల తయారీపై కొన్ని సూచనల వీడియోలను సిద్ధం చేశారు. ఈ వీడియోలలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలో వివరించడమే కాకుండా… వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా చెఫ్‌లు వివరిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్‌లోడ్ చేశారు.

మరోవైపు స్కూలు ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్‌లోడ్ చేసి.. మధ్యాహ్న భోజనం తయారుచేసే ఏజెన్సీ నిర్వాహకులకు షేర్ చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేని వారికి.. పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్కూలు తరగతి గదిలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలను ఉపయోగించి వీడియోలను చూపించాలని తెలిపారు. మొత్తం 44 వేల 190 పాఠశాలల్లో ఒకే రకమైన రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు.

ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఆపై..

సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు సంస్థల పేరుతో ఫేక్ అకౌంట్‎లను క్రియేట్ చేసి దండుకుంటున్నారు. ఇటీవల సామాన్యుల నుంచి బ్యూరోక్రాట్ల వరకు ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన పేరుతో కేటుగాళ్లు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‎ను ఓపెన్ చేశారు. ప్రొఫైల్‎లో హరిచందన ఐఏఎస్ పేరుతోపాటు ఆమె గతంలో చేసిన సామాజిక కార్యక్రమాల ఫోటోలతో రూపొందించిన ఖాతాను ఓపెన్ చేశారు. హరిచందన ఐఏఎస్‌ పేరుతో కలిగిన ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడంతో చాలామంది యాక్సెస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ ద్వారా చాటింగ్‌ చేస్తూనే వారి ఫోన్ నెంబర్లను తీసుకొని మరొక నంబరుతో వాట్సాప్‌ చేశారు. తాను మీటింగులో ఉన్నానని, అర్జంట్‌ అవసరం ఉందంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు.

కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి డబ్బులు అడగడం ఏంటని కొందరికి అనుమానం వచ్చింది. ఇది కేటుగాళ్ళ పని అయిఉండవచ్చని.. విషయాన్ని కలెక్టర్ హరి చందన దృష్టికి తీసుకువచ్చారు. తనకు ఫేస్‌బుక్‌ ఖాతా లేదని, అది ఫేక్‌ అకౌంట్‌ అయి ఉంటుందని కలెక్టర్ హరి చందన స్పష్టం చేశారు. ఈ ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరు నమ్మిమోసపోవద్దని ఆమె కోరారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్‎ను సృష్టించిన సైబర్ కేటుగాళ్లపై జిల్లా ఎస్పీ చందన దీప్తికి కలెక్ట్ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

iphone 14 plus: ఐఫోన్‌ కొనలానుకుంటున్నారా.? రూ. 20వేల డిస్కౌంట్‌, ఈ ఆఫర్‌ మళ్లీ రాదు..

యాపిల్‌ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. ముఖ్యంగా ఐఫోన్‌ కొనాలనేది చాలా మంది డ్రీమ్‌. అయితే ఐఫోన్‌ ధరలకు భయపడి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మీలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మంత్‌ ఎండ్‌ మొబైల్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తారు.

యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్లస్‌ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 58,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 26 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 58,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 57,999కి పొందొచ్చు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. మీ పోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 55,500 డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఐఫోన్ 14 ప్లస్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్‌ చిప్‌6 కోర్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 12+12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాసెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌ను మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్, బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ iOS 16తో వస్తుంది. ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4323 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అఆలగే డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం ఇందులో ఐపీ68 రేటింగ్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ కోసం, iPhone 14 Plus Wi-Fi 802.11 AX, GPS వంటి ఫీచర్లను అందించారు.

జూన్ 1 నుంచి వారి గ్యాస్ కనెక్షన్లు రద్దు కానున్నాయా? అదనంగా రూ. 300 చెల్లించాలా?

ప్రస్తుత కాలంలో వంట గ్యాస్ లేని ఇల్లు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే.. పట్టణాలు మొదలుకుని మారుమూల పల్లెల వరకు అందరూ.. ఈ గ్యాస్‌ ను వినియోగిస్తుంటారు. ముఖ‍్యంగా మహిళలైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ వంట గ్యాస్‌ మీదే ఇంటిల్లపాదికి రకరకాల వంటలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఈ గ్యాస్ కనెక్షన్‌కు ఉన్నవారికి కేవైసీ చేసుకోవాలని, గడువు తేదీలో చేయించుకోక పోతే గ్యాస్‌ కనెక్షన్‌ రద్దు అవుతుందనే సమాచారం వినిపిస్తోంది. ఈ సమయంలోనే తాజాగా ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య సమాచారం అందింది. అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచింది.

గత కొంతకాలంగా గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కేవైసీ చేసుకోవాలని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఇలా పలు ఇంధన కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు సందేశాల్ని పంపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అలాగే కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు కేవైసీ చేసుకోని వారుంటే.. ఇప్పుడు ఆందోళన చెందల్సిన అవరసరం లేదు. ఎందుకంటే.. ఈ కేవైసీ పూర్తి చేయడానికి మే 31 లాస్ట్ డేట్ అని ఎప్పటినుంచో రిపోర్ట్స్ వస్తున్నా అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతానికి ఈ గ్యాస్ సిలిండర్ ఇకేవైసీ కోసం వస్తున్నా వార‍్తలపై ఎలాంటి గడువు లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే సిలిండర్ కస్టమర్ల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో.. డెలివరీ సిబ్బందే ఇకేవైసీ పూర్తి చేస్తారట. ముఖ్యంగా అందుకు ఆధార్‌ను ధ్రువీకరించుకొని బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. LPG కనెక్షన్‌తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుములు ఉండవు. అంతేకాకుండా.. ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్‌లోన్ చేస్తే చాలు.. ఇకేవైసీ ఈజీగా పూర్తి చేయొచ్చు. అయితే ఇండేన్ గ్యాస్ కలిగిన వారు ఈ సదుపాయం పొందొచ్చు. అందుకోసం సంబంధిత గ్యాస్ డీలర్ దగ్గరకు వెళ్లి ఎల్‌పీజీ సిలిండర్ కోసం ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని కోసం ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు, కస్టమర్ నంబర్ ఇవ్వాలి. దీనితో పాటు భర్త లేదా తండ్రి పేరు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు కూడా చిరునామా పత్రాలుగా సమర్పించొచ్చు.

అయితే కేవైసీ ఇస్తే కస్టమర్ సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని వలన నకిలీ నకిలీ కనెక్షన్లు ఉంటే బయటపడతాయి. అప్పుడు బ్లాక్ మార్కెట్ తగ్గుతుంది. దీంతో ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంటుంది. మరోవైపు నిరుపేదలకు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన వారికి రూ. 300 సబ్సిడీ అందిస్తుంది కేంద్రం. అందుకోసం కేవైసీ చేసుకోవాలి. దీనికి డెడ్‌లైన్ అంటూ ఏం లేదు కానీ కేవైసీ చేసుకోవడం ఉత్తమం. అలా చేయకపోతే కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ సబ్సిడీ రాకపోవచ్చు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌లను లింక్ చేసే అవకాశం..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తరచూ అనేక అప్ డేట్ లు చేస్తూ ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, లేటెస్ట్ ఫీచర్లను ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉంటుంది.

వాటితో మరింత సులభంగా, సౌకర్యవంతంగా యాప్ ను ఉపయోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనికి పెద్దసంఖ్యలో యూజర్లు ఉన్నారు. సమాచారం, చిత్రాలు, డాక్యుమెంట్లు .. ఇలా ప్రతీదీ వాట్సాప్ లో ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతూ ఉంటాయి. ప్రజల నుంచి ఇంత ఆదరణ పొందిన ఈ యాప్ కూడా తన పనితీరు, సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

తరచూ అప్ డేట్ లు..

వాట్సాప్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రోజు నుంచి తనకు తానుగా అప్‌డేట్ అవుతూనే ఉంది. ఈ యాప్ ను ప్రజలు ఉపయోగించడానికి గల కారణాలలో ఇది ప్రధానమైనది. దీనిలో ప్రతిసారీ కొత్త ఫీచర్ల యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కొత్త పీచర్లను పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌లలో మల్టిపుల్ అకౌంట్ సపోర్టు, మల్టి డివైస్ సపోర్టు, పిన్ చేసిన సందేశాలు, లాక్ స్క్రీన్ నుంచి రిప్లయ్ ఇవ్వడం, పోల్స్, క్విజ్‌లు, స్క్రీన్ షేర్ తదితర ఫీచర్ల ఉన్నాయి. వీటిలో మల్టీ డివైజ్ సపోర్టు (బహుళ పరికరాల మద్దతు) గురించి వివరంగా తెలుసుకుందాం.

కంపానియన్ మోడ్..

మల్టీ డివైస్ సపోర్టు ఫీచర్ ను ఉపయోగించుకుని మన వాట్సాప్ ఖాతాను నాలుగు డివైస్ లు అంటే నాలుగు పరికరాలకు లింక్ చేసుకోవచ్చు. కంపానియన్ మోడ్‌తో ఇది సాధ్యమవుతుంది. ఇంతకుముందు రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ అప్లికేషన్‌ను ఉపయోగించాలనుకుంటే, రెండు వేర్వేరు నంబర్లను తీసుకోవాలనే నిబంధన ఉండేది. కానీ 2024 లో మార్పు తీసుకు వచ్చారు.

ఎంతో ప్రయోజనం..

కొత్త ఫీచర్ లో ఒకే వాట్సాప్ ఖాతాను వివిధ ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు. దీనిని కంపానియన్ మోడ్ అని కూడా పిలుస్తారు. మీ ప్రాథమిక ఫోన్‌ను ఉపయోగించి నాలుగు వేర్వేరు పరికరాలను లింక్ చేయడానికి అప్లికేషన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే నాలుగు పరికరాలు కొనసాగాలంటే ప్రతి 14 రోజులకు మీ ప్రాథమిక ఫోన్‌కు లాగిన్ అవుతూ ఉండాలి. మీరు నాలుగు పరికరాలను ఏవైనా ఎంచుకోవచ్చు, నాలుగు వేర్వేరు కంప్యూటర్లు, లేదా నాలుగు వేర్వేరు ఫోన్లను ఎంపిక చేసుకునే వీలుంది. అయితే డెస్క్‌టాప్, ఫోన్ల ను లింక్ చేసే విధానాలు ఒకదానికి మరొకటి భిన్నంగా ఉంటాయి.

ఇలా చేయండి..

వాట్సాప్ యాప్ స్క్రీన్ కుడి ఎగువ మూలలో మూడు చుక్కలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే, డ్రాప్ డౌన్ తెరుచుకుంటుంది. అక్కడ లింక్ డివైజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతర క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దీంతో మీ పని పూర్తవుతుంది. అనంతరం నాలుగు డివైజ్ లలో వాట్సాప్ యాప్ ను అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రాథమిక ఫోన్ ను 14 రోజులకు పైగా ఉపయోగించుకుంటే మిగిలిన పరికరాలు లాగ్ అవుట్ అవుతాయి. అంటే మల్టీ డివైజ్ పనిచేయాలంటే ప్రాథమిక ఫోన్ లో యాప్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉండాలి.

హీరో వేణు పై కేసు నమోదు..!

మాజీ ఎంపి కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్వాహకుల మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతోపాటు సంస్థ ఎండి పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరాఖండ్‌ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ప్రాజెక్ట్‌ ను దక్కించుకొంది. ఈ పనిని బంజారాహిల్స్‌ లోని రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ, స్వాతి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలు ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ నుండి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఈ ప్రొజెట్‌ సంబంధించి స్వాతి కన్‌స్ట్రక్షన్‌ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ 2002లో పనులు మొదలు పెట్టింది. ఇక వారు చేసిన పనులకు రూ.

450 కోట్లను టీహెచ్‌డీసీ అందించింది. అందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్‌ కన్‌స్రక్షన్స్‌ ఖాతాలో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ కి, తెహ్రీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మిగిలిన పనులకుగాను రూ.1,010 కోట్ల విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లో జమ చేసింది.

ఇందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు, మరో ప్రతినిధి, సినీ నటుడు తొట్టంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు తల్లి, పీసీఎల్‌ సంస్థ డైరక్టర్‌ కె.హేమలత, సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ ప్రవీణ్‌ పాతూరి.. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. దీంతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ప్రతినిధులపై రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ఉపాధ్యక్షుడు టి.రవికఅష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తం 5 మందిపై సెక్షన్‌ 406, 420, 506 రెడ్‌ విత్‌ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Heart Attack Symptoms: శరీరంలో ఈ ఐదు భాగాల్లో నొప్పులు వస్తే అది గుండెపోటు రావడానికి ముందస్తు హెచ్చరిక

Heart Attack Symptoms: ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్లలోనే గుండెపోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.

అందుకే గుండె ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి. గుండెపోటు లక్షణాల పై కూడా అవగాహన పెంచుకోవాలి. గుండెపోటు లక్షణాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. గుండెపోటు అనగానే ఛాతిలో వచ్చే నొప్పి మాత్రమే అనుకుంటారు. కానీ శరీరంలో అనేక భాగాల్లో వచ్చే నొప్పిని కూడా గుండెపోటును సూచిస్తాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. శరీరంలో ఏ ఏ భాగాల్లో నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలో వైద్యులు వివరిస్తున్నారు. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు.

ఛాతీ నొప్పి

గుండె నొప్పికి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి. ఛాతిలో నొప్పి రావడం లేదా అసౌకర్యంగా అనిపించడం, ఒత్తిడిగా అనిపించడం… ఇవన్నీ గుండె నొప్పిని సూచిస్తాయి. అలాగే ఛాతీ బిగుతుగా పట్టేసినట్టు ఉండటం, ఛాతీ భాగంలో పిండినట్టు, సూదులతో గుచ్చినట్టు అనిపించడం కూడా గుండెపోటు వచ్చే ముందు హెచ్చరికగానే భావించాలి. ఛాతీలోని ఎడమవైపు లేదా మధ్యలో ఈ నొప్పి అధికంగా వస్తుంది. ఇలా వస్తే అదే గుండెపోటుకు సంబంధించినదే అయి ఉండాలని అనుమానించాల్సిందే.

చెయ్యి నొప్పి

గుండెపోటు రావడానికి ముందు ఒక చేతిలో లేదా రెండు చేతులలో నొప్పి వస్తుంది. అలాగే రెండు చేతుల్లో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఏ పనీ చేయలేరు. చాలా నీరసంగా అనిపిస్తుంది. చేతులను ఎత్తడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఛాతీ నుండి ఎడమ చేయి వరకు నొప్పి ప్రసరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది గుండెపోటుకు మరొక ప్రధాన సంకేతం. కొన్నిసార్లు ఈ నొప్పి భుజాలకు, అక్కడి నుంచి వీపుకు కూడా ప్రసరిస్తుంది.

గొంతు, దవడనొప్పి

గుండెపోటు వచ్చే ముందు కొంతమందిలో గొంతు భాగంలో నొప్పి రావచ్చు. అలాగే దవడలో కూడా నొప్పి అధికంగా వస్తుంది. నడిచేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. దంతాలు కూడా నొప్పిగా అనిపిస్తుంది. మెడలో తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి. ఇవి గుండెపోటును సూచిస్తాయి.

పొత్తికడుపు భాగంలో నొప్పి

ఒకసారి పొత్తి కొడుకు భాగంలో కూడా నొప్పి వేస్తుంది. ఇది కూడా గుండెపోటును సూచించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నొప్పిగా ఉండటమే కాదు ఒత్తిడిగా అనిపించడం, బిగుతుగా అనిపించడం, వాంతులు వస్తున్నట్టు అనిపించడం, వాంతులు అవ్వడం కూడా గుండెపోటు రావడానికి ముందు హెచ్చరికగానే చెబుతున్నారు వైద్యులు.

ఒక్కోసారి పైన చెప్పిన ఎలాంటి నొప్పులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 10% గుండెపోటులు ఇలానే వస్తాయి. దీన్ని సైలెంట్ మయో కార్డియాల్ ఇస్కీమియా అంటారు. మధుమేహం, నరాల వ్యాధులు, వృద్ధులలో ఇలాంటి గుండెపోటు కనిపిస్తూ ఉంటుంది.

ఏమాత్రం గుండెపోటు లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. తీవ్రంగా చెమట పట్టడం, మైకం కమ్మడం, మానసిక ఆందోళన అధికంగా రావడం వంటివి కూడా గుండెపోటుతో సంబంధం కలిగి ఉంటాయి, ఈసీజీ, ఎకో, బ్లడ్ టైటర్స్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు చేసి గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందో లేదో తెలుస్తారు.

ఏడాది మొత్తం కాసే మామిడి చెట్లు- తుపాను వచ్చినా రాలవట! విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్- కేజీ ధర?

Special Mango Tree in Rajasthan : సాధారణంగా మామిడి కాయలు అనగానే వేసవి కాలంలో కాస్తాయి అనుకుంటాం. అయితే రాజస్థాన్​లోని కోటాకు చెందిన ఓ రైతు మాత్రం, ఏడాది మొత్తం మామిడి కాయలు కాసే చెట్లను పెంచి మంచి లాభాలను అర్జిస్తున్నాడు. ఆ మామిడి చెట్లకు విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్ ఉండడం వల్ల అమెరికా, కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మరెందుకు ఆలస్యం ఆ మామిడి చెట్లు గురించి తెలుసుకుందాం.

రాష్ట్రపతుల నుంచి సత్కారం
కోటా జిల్లాలోని గిర్ధర్‌పురా గ్రామానికి చెందిన శ్రీకృష్ణ సుమన్ అనే రైతు తన తోటలో సతత హరిత రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు. ఈయన ఇచ్చిన మామిడి చెట్లు రాష్ట్రపతి భవన్​లోని మొఘల్ గార్డెన్‌లో కూడా ఉన్నాయి. సతత హరిత రకానికి చెందిన మామిడి చెట్ల అభివృద్ధికి సుమన్ చేసిన కృషిని అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023లో ఆయనను సత్కరించారు. అలాగే 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ మంత్రులు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా సుమన్​ను సత్కరించాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మామిడి చెట్ల సాగులో సుమన్ చేసిన కృషికి రూ.లక్ష ప్రోత్సహాకాన్ని సైతం అందించింది.

పేటెంట్ కోసం దరఖాస్తు
భారత్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమన్ మామిడి చెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకు కారణం ఈ మామిడి చెట్లు ఏడాది పొడవునా మామిడి కాయలు కాయడమే. చాలా మంది విదేశీయులు, ఎన్ఆర్ఐలు సుమన్ వద్ద నుంచి మామిడి చెట్లను తీసుకెళ్లారు. ప్రస్తుతం సుమన్ తన మామిడి వెరైటీపై పేటెంట్​ను పొందేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
“నేను 1998లో మామిడి సాగు ప్రారంభించాను. ఆ తర్వాత ఏడాది పొడుగునా మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వినూత్నంగా ప్రయత్నించా. అప్పుడు 2015లో ఏడాదికి మూడుసార్లు మామిడి కాయలను ఇచ్చే చెట్లను తీర్చిదిద్దా. 2017లో అన్ సీజన్​లో మామిడి పండ్లను విక్రయించడం ప్రారంభించా. ప్రస్తుతం సీజన్​లో కేజీ మామిడి పండ్లు రూ.40- రూ.60 వరకు విక్రయిస్తున్నాను. సాధారణ మామిడి పండ్ల ధరతో పోలిస్తే వీటి ధర కేజీకి రూ.10- రూ.15 వరకు అదనంగా ఉంటుంది. అన్ సీజన్​లో ఈ మామిడి పండ్లు కేజీ రూ.200 వరకు పలుకుతాయి. దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చి నా వద్ద మామిడి మొక్కలు తీసుకెళ్తారు. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 25 వేల మొక్కలను పెంచి విక్రయించాను. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, హరియాణా, పంజాబ్, చండీగఢ్ సహా పలు రాష్ట్రాలకు చెందినవారికి మొక్కలు విక్రయించాను. అమెరికా, జర్మనీ, దుబాయ్, కెనడా, ఇరాక్, ఇరాన్, ఆఫ్రికన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైతులు మొక్కలను తీసుకెళ్లారు. ”

– శ్రీకృష్ణ సుమన్, మామిడి సాగు రైతు

విదేశాలకు సరఫరా
తుపానుల సమయంలో కూడా మామిడి కాయలు చెట్లు నుంచి రాలిపోవని సుమన్ తెలిపాడు. మగ్గిన తర్వాత ఒక్కో మామిడి పండు బరువు 250-350 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొన్నాడు. మామిడి పండు లోపల టెంకలు కూడా చిన్నగా ఉంటాయని చెప్పాడు. ఆఫ్రికా నుంచి లక్ష మామిడి మొక్కలకు ఆర్డర్‌ వచ్చిందని వెల్లడించాడు సుమన్. ‘ల్యాబొరేటరీలో మట్టికి పరీక్షలు చేయించాలనుకున్నా. కానీ కుదరలేదు. అందుకే ఆర్డర్​ను రద్దు చేసుకున్నా. వేరే కాపురం అయినప్పుడు నాకు పూర్వీకుల నుంచి కొంత భూమి ఆస్తిగా వచ్చింది. ఈ భూమిలోనే మొదట 1000 మొక్కలు నాటాను. ఆ తర్వాత కొంత భూమిని కొనుగోలు చేసి మరో 1500 మొక్కలు పెంచాను. ప్రస్తుతం ఈ మొక్కలు 5ఏళ్లకే మామిడి కాయలు కాస్తున్నాయి. కొత్త తోటలోని మొక్కల నుంచి ఏటా 50- 60 కిలోల మామిడి, పాత మొక్కల నుంచి దాదాపు 150- 180 కిలోల పంట వస్తుంది. లఖేరీలో 20 వేల మొక్కలు నాటేందుకు ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా. ఇక్కడ పూర్తిగా సేంద్రియ వ్యవసాయం ద్వారా మొక్కలను పెంచుతాం. ఇక్కడి చెట్లను, మామిడి పండ్లను విదేశాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నాం.’ అని సుమన్ తెలిపాడు.

చదువు మధ్యలోనే ఆపేసి
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం చదువును(బీఎస్సీ) మధ్యలోనే ఆపేశాడు సుమన్. చదువు మానేశాక వ్యవసాయం చేశాడు. అందరికంటే పెద్ద కావడం వల్ల సుమన్​పై ఆర్థిక భారం మరింత పడేది. వారి కుటుంబం తమకున్న భూమిలో గోధుమ, వరి పండించేవారు. దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం వల్ల వ్యవసాయంలో పెద్దగా లాభాలు వచ్చేవి కావు. కుటుంబ పోషణే కష్టమైపోయేది. ఆ తర్వాత రోజువారీ ఆదాయం కోసం కూరగాయల సాగును ప్రారంభించాడు సుమన్. ఆఖరికి మామిడి సాగును ఎంచుకుని విజయం సాధించాడు.

Health

సినిమా