Saturday, November 16, 2024

Loan With Out interest: వడ్డీ లేకుండా 3 లక్షల అప్పు- సగం చెల్లించాల్సిన పని లేదు- ఇలాంటి ఆఫర్ ఒకటి ఉందని తెలిస్తే వ్యాపారాలు చేయడానికి షటర్లు దొరకవు!

Empower Women in India : మీరు వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? మీ దగ్గర డబ్బుల్లేవా..? బయట లక్షలకు లక్షలు అధిక వడ్డీకి తీసుకుని ఇబ్బంది పడుతున్నారా?

మూడు లక్షల మేర అప్పిచ్చి.. వడ్డీ కట్టనక్కర్లేదని చెబితే.. ఎలా ఉంటుంది…? ఆ అప్పుని 50 శాతం మాత్రమే తిరిగి కడితే సరిపోతుందని అంటే మీ స్పందదనేంటి?

ఉద్యోగిని.. మూడు లక్షలు వడ్డీ లేకుంగా.

మహిళలకు ఆర్ధిక స్వావలంబన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకొస్తోంది. దీనిలో భాగంగా కేంద్రం తెచ్చిన పథకమే ‘ఉద్యోగిని’. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రూ. మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తారు. వడ్డీ లేకుండా అప్పివ్వడమే కాదు.. తీసుకున్న అప్పులో యాభై శాతం వరకు మాఫీ కూడా చేస్తారు. మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే ఉద్దేశంతో.. నిరుపేద మహిళలకు సైతం వ్యాపారానికి ఎలాంటి ఆర్థిక అవరోధాలు ఉండకూడదనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీని ద్వారా చిన్నతరహా కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణాలు, బేకరీ, బ్యూటీ పార్లర్లు, క్యాంటీన్, కేటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ సెంటర్, డ్రై క్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డెయిరీ, గ్రంథాలయం, మట్టి పాత్రల తయారీ, గాజుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ వంటి 88 రకాల వ్యాపారాలు చేసేందుకు వీలుంది.

దీనికి ఎవరు అర్హులు?

ఈ స్కీమ్ కేవలం మహిళలకోసమే రూపొందించారు. కాబట్టి 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసున్న మహిళలు దరఖాస్తుదారులై ఉండాలి.
వార్షికాదాయం లక్షన్నరకు మించకూడదు.
దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు.
క్రెడిట్ స్కోర్ బాగుండాలి. గతంలో లోన్ తీసుకుని ఎగ్గొట్టి ఉండకూడదు.
ఏమేం డాక్యుమెంట్లు కావాలి..?

మూడు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్ లేదా ఓటర్)
డీపీఆర్( డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) అంటే.. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? రాబడి వచ్చే మార్గాలేంటి తదితరాలతో కూడిన ఒక నివేదిక.
ఏ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో గతంలో ఉన్న అనుభవం తాలూకు ధ్రువ పత్రాలు లేదా.. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు..
కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం..
కుల ధ్రువీకరణ పత్రం.
వ్యాపారానికి అయ్యే పెట్టుబడిపై కొటేషన్..
ఎలా దరఖాస్తు చేయాలి..?

దీనికోసం సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ నుంచి ఉద్యోగిని స్కీమ్కి చెందిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
దాన్ని పూర్తిగా ఫిల్ చేసి మీ దగ్గరున్న డాక్యుమెంట్లు జత చేసి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో బ్యాంకు మేనేజర్ని కలిసి ఆయన కన్విన్స్ అయ్యేదా దానిపై వివరించాలి.
మీరు సమర్పించిన డీపీఆర్ ద్వారా మీరు లోన్ తిరిగి చెల్లించగలరని సంబంధిత బ్యాంకు మేనేజర్ నమ్మితే మీకు లోన్ కచ్చింతంగా వస్తుంది.
ఎవరెవరికి ఎలా వర్తిస్తుంది..?

ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కనీసం రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. దీంట్లో 50 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ కూడా ఉండదు.
బీసీ, జనరల్ వర్గాలకు చెందిన మహిళలకు రూ. మూడు లక్షల వరకు రుణాలిస్తారు. 30 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ బ్యాంకులను బట్టీ 8 నుంచి 12 శాతం లోపు ఉంటుంది.

Air Like AC: సీలింగ్ ఫ్యాన్‌లో ఈ మార్పులు చేయండి.. ఇళ్లంతా ఏసీలాంటి గాలి..!

Ceiling Fan: వేసవిలో గాలి ఎంత బలంగా వీస్తే అంత తక్కువగా చెమటలు పడుతుంటాయి. గాలి ఆగినప్పుడు విపరీతమైన చెమటలు మొదలవుతాయి. అయితే, జనాలంతా ఏసీలు, కూలర్లు కొనలేరు.

ఈ క్రమంలో పోర్టబుల్ ఏసీలు, ఫ్యాన్స్‌తోనే తమ ఉక్కపోతను, వేడిని తగ్గించుకుంటుంటారు. అందరూ ఏసీ కొనలేరు. కూలర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వారు చాలా మంది ఉన్నారు. ఫ్యాన్ స్పీడ్ చాలా స్లో అవడం చాలా సార్లు చూస్తుంటాం. ఫ్యాన్ మెల్లగా నడవడం ప్రారంభిస్తే గదిలో గాలి సరిగా ప్రసరించదు. వేడి కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుంది. చాలా మంది తమ ఫ్యాన్ చెడిపోయిందని, ఇప్పుడు కొత్త సీలింగ్ ఫ్యాన్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానీ, ఇది అలా కాదు. ఎందుకంటే ఫ్యాన్‌లోని కొన్ని చిన్న విషయాల వల్ల, దాని వేగం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు మనం మీ ఫ్యాన్ వేగాన్ని పెంచడంలో సహాయపడే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

కెపాసిటర్‌లో లోపం:- సీలింగ్ ఫ్యాన్‌లోని మోటారుకు సరైన శక్తిని అందించడానికి కెపాసిటర్ పనిచేస్తుంది. చెడ్డ కెపాసిటర్ 90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలను కలిగిస్తుంది. కెపాసిటర్ దెబ్బతిన్నప్పుడు, అది మోటారుకు విద్యుత్తును బదిలీ చేయలేకపోతుంది. దీని కారణంగా దాని వేగం చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

కాబట్టి మీరు ఫ్యాన్ నుంచి వేగవంతమైన గాలిని కోరుకుంటే, మీరు కెపాసిటర్‌ను మార్చవచ్చు. మార్కెట్ లో మంచి కెపాసిటర్ రూ.70-80 ధరలో దొరుకుతుంది. మీరు దీన్ని మార్చినట్లయితే, ఫ్యాన్ వేగం రెట్టింపు అవుతుంది.

బ్లేడ్: – చాలా సార్లు మనం పట్టించుకోం. కానీ, ఫ్యాన్ బ్లేడ్‌లు తప్పుగా అమర్చడం వల్ల దాని వేగంలో సమస్య మొదలవుతుంది. ఫ్యాన్ బ్లేడ్ వంగి లేదా వంకరగా ఉంటే, ఫ్యాన్ గాలి వీచదు.

బేరింగ్: సీలింగ్ ఫ్యాన్‌లు సాధారణంగా కాలక్రమేణా బాల్ బేరింగ్‌ల లోపల ధూళి, దుమ్ము, చెత్తను పేరుకుపోతాయి. దీని కారణంగా, సీలింగ్ ఫ్యాన్ వేగం తరచుగా మందగిస్తుంది. బేరింగ్ తిరగడం కష్టం అవుతుంది.

అదనపు చిట్కా- ఫ్యాన్ నెమ్మదించడం ప్రారంభించినా లేదా జామ్ అయినట్లయితే, మీరు ఎప్పటికప్పుడు ఆయిల్ వేస్తే సక్రమంగా పనిచేస్తుంది.

Coriander Water: ధనియాలు రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే..!

వంటగదిలో ఉండే వివిధ పదార్థాలతో పలు వ్యాధులకు ఉపశమనం పొందవచ్చు. ఉదాహరణకు పసుపు, జీలకర్ర, కొత్తిమీర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో మసాలా దినుసులకు ఒక్కో రకమైన ఔషద గుణాలు ఉంటాయి.

వీటిని వండి తిన్నా లేదా పచ్చిగా తిన్నా.. ఏ రూపంలో తీసుకున్న ప్రయోజనకరమే.

విపరీతమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే వేసవిలో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జీర్ణ సమస్యలకు కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర గింజల్లో నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ పోషకాలతో నిండి ఉంటాయి. కొత్తిమీర గింజల్లో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. కొత్తిమీర విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

కొత్తిమీర గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ కొత్తిమీర గింజల నీటిని తాగడం వలన వివిధ రకాల ఫ్లూ, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. కొత్తిమీర గింజలు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరం డిటాక్సిఫై అవుతుంది.

చాలా మంది తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. కొత్తిమీర గింజలు ఇలాంటి వారికి బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కొత్తిమీర గింజల నీటిని రోజూ తీసుకోవడం వల్ల నివారించవచ్చు. కొత్తిమీర గింజల డ్రింక్‌ ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా 1 టీస్పూన్ కొత్తిమీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. రుచి కోసం కొంచెం చక్కెర లేదా తేనె చేర్చుకోవచ్చు.

AP: నోటుకు పోస్టల్ బ్యాలెట్.. ఏపీలో నలుగురు అరెస్ట్..

యుపిఐ ద్వారా ఉద్యోగులకు నగదు ట్రాన్స్ ఫర్వారిపై చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వార్నింగ్
మొత్తం 4.3 లక్షల పోస్టల్ బ్యాలెట్స్

ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పోలింగ్
నేడు, రేపు కూడా పోస్టల్ బ్యాలెట్స్ వేసే అవకాశం …

అమరావతి – ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో అయిదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ పూర్తి కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పశ్చిమంలో నలుగురు అరెస్ట్…
పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా. యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో తెలిపారు. ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇవాళ తెలిపారు. ఇది చాలా దారుణమన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు. నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేసారు. కాల్ డేటా రికార్డు, బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని సీఈవో హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు.

కాగా, పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు 3.2 లక్షల మంది ఉద్యోగులకు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. హోం ఓటింగ్ కు 28వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యవసర సర్వీసులు కింద 31,000మందికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు 40 వేలు కూడా కలుపుకుంటే 4.3 లక్షల మంది ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నట్లు మీనా పేర్కొన్నారు. ఇందులో 3 లక్షల 3 వేల మంది ఇప్పటివరకూ ఓటు వేశారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పలు కారణాలతో ఓటు వేయలేని వారి కోసం నేడు ,రేపు కూడా మరో అవకాశం ఇచ్చామన్నారు.

Rahul Gandhi: ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు భగభగమంటూ మండిపోతున్నా.. లెక్క చేయకుండా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కడపకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) గెలుపు కోసం ఈ నెల 11న ఆయన కడప జిల్లాకు వస్తున్నారు.

కాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కంచుకోటగా ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గంలో (Kadapa Constituency) ఈ సారి పోరు హోరాహోరీగా మారింది. సీఎం జగన్‌కు తమ్ముడైన వైఎస్ అవినాష్ రెడ్డిని (YS Avinash Reddy) అక్కడి ప్రజలు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరఫున వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఏపీసీసీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని తప్పకుండా ఓడించాలన్న లక్ష్యంతో షర్మిల ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఆమె ఉదృతంగా ప్రచారం చేస్తుండగా.. ఆమెకు తోడుగా రాహుల్ కూడా వస్తున్నారు. మరి, రాహుల్ రాకతో షర్మిలకు మైలేజ్ పెరుగుతుందా? లేదా? అనేది చూడాలి.

Tiruttani Temple : పోయిన వస్తువులను దొరకబట్టే ఈ ఆలయం గురించి తెలుసా?

Tiruttani Temple : ఏదైనా వస్తువు మిస్సయితే ఎంతో బాధ కలుగుతుంది. ఆ వస్తువు దొరకాలని పోలీస్ స్టేషన్లలో కంప్లెంయిట్ ఇస్తాం.. అదృష్టవశాత్తూ ఆ వస్తువు దొరికితే దొరుకుతుంది..

లేకుంటే ఆ వస్తువు దొరకాలని దైవానికి పూజలు చేస్తాం. ఆ వస్తువు దొరికితే కొన్ని ప్రత్యేక పూజలు,వ్రతాలు చేస్తామని ముడుపు కడుతూ ఉంటారు. అయితే ఈ స్వామిని దర్శించుకొని పూజించడం వల్ల మిస్సయిన వస్తువు తిరిగి పొందుతారనే నమ్మకం ఉందని కొందరు భక్తులు అంటున్నారు. పురాణాల ప్రకారం కొందరు దేవతలు తమ శక్తిని కోల్పోగా ఈ స్వామిని వేడుకొంటే తిరిగి తమ యథాస్థానానికి వచ్చారని తెలుస్తోంది. ఇంతకీ ఆ వరాన్ని ఇచ్చే స్వామి ఎవరు? ఆ లయం ఎక్కడ ఉంది?

దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి అంటే కొందరికీ మహా ఇష్టం. ఆయన ఇష్ట రోజైన మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమిళనాడులోని ఫలణి క్షేత్ర సుబ్రహ్మణ్య స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. అయితే ఇదే రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైన మురుగన్ స్వామి ప్రత్యే వరాలు ఇచ్చే దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. దేవసేన సమేతంగా కొలువైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఈ ఆలయం ఎంతో పురాతనమైంది.

సుమారు 1600 సంవత్సరాల కిందట పల్లవ, చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఉత్తరాన ఓ పర్వతం ఉంటుంది. ఇది తెల్లగా ఉండడం వల్ల దీనిని బియ్యపు కొండ అని అంటారు. తిరుత్తణి క్షేత్ర స్థల పురాణం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకల రాజులతో యుద్ధం చేశాడని చెబుతారు. ఆ తరువాత ఇక్కడ కొలువయ్యారని చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని శాంతిపురి, తణిగ అని కూడా పిలుస్తారు.

అయితే ఈ స్వామిని దర్శించుకుంటే ఏదైనా వస్తువు పొగొట్టుకుంటే తిరిగి పొందుతారట. ఒక సమయంలో బ్రహ్మ ను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో తాను సృష్టించే శక్తిని కోల్పోతాడట. దీంతో తాను తిరుత్తణిలో ఉన్న మురుగణ్ ను పూజించడం వల్ల తిరిగి తన శక్తిని తెచ్చుకుంటాడట. మరో చరిత్ర ప్రకారం ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంఘనీతి, పద్మనీతి, చింతామణి, ఐశ్వర్యాలను సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తరువాతే తిరిగి పొందాడని చెబుతున్నారు. అందువల్ల ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల పొగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారనే పేరు వచ్చింది.

BE,Btech చేసి ఖాళీగా ఉన్నారా?.. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. ఏడాదికి 25 లక్షల జీతం

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రైల్వే, నేవీ, ఆర్మీ, బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ పోస్టులను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా ఏడాదికి 25 లక్షల జీతం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆద్వార్యంలో నడిచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 54 ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లైయ్ చేసుకోవచ్చు. మే 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు:
54
ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టులు:
28
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులు:
21
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)పోస్టులు :
05
అర్హత :
బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000.. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టుకు రూ.15,00,000.. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్‌ లైన్‌
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150 చెల్లించాలి. ఇతరులకు రూ.750గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ :
అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
04-05-2024
దరఖాస్తులకు చివరి తేదీ :
24-05-2024

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన సీఎం జగన్‌

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మే 13న ఏపీలో పోలింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకున్న జగన్ ఆ మేరకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరలో హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ జరపబోతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్న వైఎస్ జగన్ విషయంలో సీబీఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే మే 15న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది కాలంగా పూర్తి బిజీగా గడువుతున్న జగన్ కు కుటుంబంతో టైమ్ కేటాయించే అవకాశం దొరకడం లేదు. ముఖ్యంగా లండన్ లో చదువుతున్న కుమార్తెను కలిసేందుకు వీలు కావడం లేదు. దీంతో ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లండన్ వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేందుకు జగన్, భారతి దంపతులు సిద్దమవుతున్నారు.
ఈ మేరకు మే 15న గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. గతంలో సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. త్వరలో జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

AP POLYCET 2024 Results : ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

How to Download AP POLYCET 2024 Results?
Log onto the Portal: Visit the official AP SBTET website at apsbtet.ap.gov.in.

Find the Results Link: Navigate to the ‘POLYCET 2024 Results’ section found on the homepage.

Enter Credentials: Provide necessary details such as your registration number and date of birth in the respective fields.
View and Save Results: Once entered, you can view your result and are advised to download and print a copy for future reference.

AP POLYCET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

జుట్టు ఎక్కువగా రాలుతోందా? సమస్యకు ఇలా చెక్‌ పెట్టేయండి..

వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం ΄పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల సాధనాలను, కాస్మెటిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినా, సరైన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు.

►ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

►జంక్‌ ఫుడ్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది.

►ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం ఉత్తమం.

►ఆల్కహాల్‌ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన విషపదార్థాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి జుట్టును కా΄ాడుకోవాలనుకునేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మేలు.

►తేనె, పెరుగు హెయిర్‌ మాస్క్‌తో సులభంగా ఉపశమనం లభిస్తుంది:

►ప్రస్తుతం చాలామందిలో జుట్టు చివరి భాగాల్లో చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటినే స్పి›్లట్‌ ఎండ్స్‌ అంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్‌ మాస్క్‌ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకుని మృదువుగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత ఒక గంట΄ాటు అలా వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత జుట్టును తక్కువ గాఢత గల షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

వేసవిలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు
►అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మికి గురికావడం వల్ల జుట్టు చిట్లడం, పల్చబడడం జరుగుతుంది.
►స్విమ్మింగ్‌ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎందుకంటే పూల్‌ నీటిలో ఉండే క్లోరిన్‌ జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపి జుట్టు రాలేలా చేస్తుంది.
►వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం అనేది సర్వసాధారణం.
►వేడి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుందని అంటారు, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, తాత్కాలికంగా జుట్టు రాలిపోతుంది.

అలోవెరా జెల్‌
అలోవెరా జెల్‌ను జుట్టు మీద అప్లై చేయడం చాలా మంచిది. దానివల్ల జుట్టు మెరవడంతోబాటు మృదువుగా కూడా మారుతుంది. అంతేకాదు, చుండ్రు లేదా జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుంది. అలోవెరా జ్యూస్‌ తాగడం వల్ల జుట్టు లోపలి భాగంలో బలపడుతుంది.

కొబ్బరి పాలతో మసాజ్‌
జుట్టు రాలడానికి శీఘ్ర రెమెడీ కొబ్బరి ΄ాలతో తలకు సున్నితంగా మసాజ్‌ చేయడం. ఆ తర్వాత తలకు వెచ్చని టవల్‌ చుట్టడం. రెగ్యులర్‌ హెయిర్‌ వాష్, కండిషనింగ్‌తో ఈ చిట్కాను అనుసరించడం వల్ల హెయిర్‌ ఫాల్‌ సమస్య అదుపులోకి వస్తుంది.

డయాబెటిక్ రోగులు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

జన్యు సిద్ధత, ఆహారంలో మార్పులు, వేగవంతమైన జీవనశైలి మార్పులు వంటి కారణాల వల్ల టైప్-2 మధుమేహం భారతదేశంలో ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో దాదాపు 98 మిలియన్ల మందికి టైప్-2 డయాబెటిస్ ఉండవచ్చు. ఆహారం- పోషకాహారం గురించి సమృద్ధిగా ఉన్న సమాచారంతో, ప్రతి సిఫార్సు మీకు ఎలా వర్తిస్తుంది, ఏది నిజంగా ప్రయోజనకరంగా ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ నిర్వహణను మెరుగుపరచడంలో సహాయపడే మూడు ఆహారాలు గురించి తెలుసుకుందాం.

బాదం
ఒక గుప్పెడు బాదంపప్పులను తీసుకోవడం వల్ల ప్రమాదకరంగా లేని టైప్-2 మధుమేహం ఉన్న వ్యక్తులకు స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనం చేకూరుతుంది. భోజనంలో బాదంపప్పును చేర్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల కంటెంట్‌ ద్వారా రక్తంలో గ్లూకోజ్ విడుదలను నెమ్మది చేయటం సాధ్యమవుతుంది.

టైప్-2 డయాబెటిస్‌ను నిర్వహించే వ్యక్తులలో జీవక్రియను పెంచడంలో బాదం కూడా సహాయపడుతుంది, తత్ఫలితంగా క్యాలరీలను వేగంగా బర్నింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ జీవక్రియ వేగం బాదం యొక్క పోషకాహార ప్రొఫైల్‌కు ఆపాదించబడింది, ఇందులో ఫైబర్, ఫోలేట్, విటమిన్ E వంటి ముఖ్యమైన విటమిన్లు, ఫైటోస్టెరాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, అలాగే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

అదనంగా, టైప్-2 మధుమేహం ఉన్నవారు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారు. బాదంలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్ ఉన్న పెద్దలలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఆకు కూరలు
మనలో చాలామంది మన ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినప్పటికీ, ఆకు కూరలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒకరి ఆహారంలో క్రమంతప్పకుండా చేర్చగలిగే ఆకుకూరలలలో బచ్చలికూర, క్యాబేజీ, మునగ ఆకులు, పుదీనా ఆకులు, ఉసిరి ఆకులు, మెంతి ఆకులు, ముల్లంగి టాప్స్ మొదలైనవి ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని ఆల్ఫా-లినోలెనిక్ రూపంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.

ఈ ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిని సూప్‌లు, సలాడ్‌లలో చేర్చడం లేదా గ్రీన్ జ్యూస్‌గా తీసుకోవడం వంటివి చేయొచ్చు. మీరు వాటిని కూరగా వండాలని ఎంచుకుంటే, వాటి పోషక ప్రయోజనాలను కొనసాగించడానికి అదనపు నూనెను జోడించకుండా ఉండటం మంచిది.

పెరుగు
“దహీ” అని పిలువబడే ఇంట్లో తయారుచేసిన పెరుగు శతాబ్దాలుగా భారతీయ ఆహారంలో ప్రధానమైనది. ఇటీవలి సంవత్సరాలలో, పెరుగు దాని అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజాదరణ పొందింది. యోగర్ట్- డయాబెటిస్ అధ్యయనం ప్రకారం, పెరుగు తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, ముఖ్యంగా ఆరోగ్యవంతమైన, అధిక హృదయనాళ ప్రమాదం ఉన్న పెద్దలలో ఇది కనిపిస్తుంది. పెరుగు తినని వారితో పోలిస్తే రోజుకు 80-125 గ్రాముల పెరుగు తినే వారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 14% తక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.

మధుమేహం నిర్వహణకు పెరుగు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి, గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. పెరుగును కొనుగోలు చేసేటప్పుడు, రుచిగల ఎంపికల కంటే సాదా వేరియంట్‌ను ఎంచుకోవడం మంచిది. సాధారణ పెరుగు మెరుగైన నియంత్రణను అనుమతిస్తుంది. అదనపు పోషకాలు, రుచి కోసం, ముక్కలు చేసిన బాదం లేదా స్ట్రాబెర్రీ వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు మేలు చేస్తాయి.

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. ఈ కారణంగా గుండెపోటు, గుండెనొప్పి వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారే అవకాశం వుంటుంది. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. ఆ గింజలు ఏమిటో తెలుసుకుందాము.

చియా విత్తనాలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించగలవు.
అవిసె గింజల్లో గుండెకి మేలు చేసే పొటాషియం, కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటుంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
నువ్వులు కూడా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
గుమ్మడికాయ గింజలు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారిగా వుంటాయి.
జనపనార విత్తనాలు తింటుంటే గుండె సంబంధ వ్యాధులను దూరం పెట్టవచ్చు.

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

నువ్వులు, నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని ఉపయోగించి ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చో తెలుసుకుందాము.

వ్యాయామం చేయకుంటే కీళ్ళ నొప్పులు, షుగర్, గుండె జబ్బులతో ఇబ్బందులు తలెత్తుతాయి.
స్నానం చేసే ముందు నువ్వుల నూనెను పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది.
పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగి ఆపై నువ్వుల నూనెను పొట్టపై రాసి 15 నిమిషాల పాటు మర్దన చేయాలి.
పిల్లలకు స్నానానికి ముందు నువ్వుల నూనె రాస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది.
నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి కనుక బీపీ కంట్రోల్ అవుతుంది.
కొవ్వు పేరుకుపోయిన శరీర భాగాలపై నువ్వుల నూనెను రాస్తే కొవ్వు కరిగిపోతుంది.
నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బిలు ఉండటం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

US Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ తేదీలు ఇవే!

US Student Visa: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఈనెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను మంగళవారం(మే 7న) విడుదల చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

దశల వారీగా స్లాట్లు..
దశల వారీగా స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా రాయబార కార్యాలయం అధికారి తెలిపారు. జూన్‌ నెల స్లాట్లను ఈనెల మూఓ వారంలో, జూలై నెల జూన్‌లో ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేయనున్నట్లు వివరించారు. అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరానికి సబంధించి ఫాలల్‌ సీజన్‌ ఏటా ఆగస్టు–సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ సీజన్‌లో అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సమాయత్తం అవుతున్నారు.

ఆదివారాల్లోనూ..
వీసా ప్రక్రియలో భాగంగా తొలిముద్రల నమోదు, తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూ విధానాన్ని అమెరికా అమలు చేస్తుంది. అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కానుసలేటు కార్యాలయాలకు శని ఆదివారాలు సెలవులు. అయితే రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని, ఆదివారాలైన మే 19, 29 తేదీల్లోనూ స్లాట్లు కేటాయించారు.

అక్టోబర్‌లో టూరుస్టు వీసాలు..
విద్యార్థుల వీసాల ప్రక్రియ పూర్తయ్యాక.. టూరిస్టు వీసా(బీ1, బీ2) స్లాట్లు అదుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్లు జారీ అవుతాయని సమాచారం. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అంతకు ముందే పర్యాటక వీసాల ప్రక్రియ పూర్తి చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది.

AP Elections 2024: మంత్రి పెద్దిరెడ్డికి షాక్..

AP Elections 2024: ఏపీలో ఎన్నికలవేళ అధికారులపై బదిలీ వేటు పడుతోంది. గత రెండు వారాలుగా పదుల సంఖ్యలో అధికారులకు బదిలీ జరిగింది. బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వివాదాస్పద అధికారులపై పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో వారందరిపై బదిలీ వేటు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

తాజాగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఇద్దరు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. చిత్తూరు జిల్లా పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తో పాటు సదుం ఎస్సై మారుతి పై ఈరోజు ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పై తాజాగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన అనుచరులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. ఈ ఇద్దరు అధికారులను బాధ్యులు చేస్తూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఆయన స్థానంలో గుప్త డిజిపిగా నియమితులయ్యారు. మరోవైపు సిఎస్ జవహర్ రెడ్డి పై సైతం వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. దాదాపు జగన్ అస్మదీయ అధికారులపై విపక్షాలు టార్గెట్ పెట్టుకున్నాయి. వారిపై ఎలక్షన్ కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నాయి. మరోవైపు బిజెపి అగ్రనేతలు ఏపీకి క్యూ కడుతున్నారు.ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున అధికారుల బదిలీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సవ్యంగా జరిగే స్థితిలో లేవని.. అధికారులపై వరుస పెట్టి బదిలీ వేటు వేస్తున్నారని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరుస పెట్టి పోలీస్ అధికారుల బదిలీ.. అధికార వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది.

భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా కంపించిన భూమి..ఎక్కడంటే

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించటంతో అందరూ ఉలిక్కిపడి మేల్కొన్నారు. అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం, భూకంప కేంద్రం, దాని లోతు గురించి సమాచారం అందలేదు. గత కొన్ని నెలలుగా, కాశ్మీర్ నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు భూకంప ప్రకంపనలు సంభవించాయి.
భారత్‌లో మరోసారి భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరిలో మే8 బుధవారం తెల్లవారుజామున 4:55 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించటంతో అందరూ ఉలిక్కిపడి మేల్కొన్నారు. అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు.

బార్లీ నీరు ఎండాకాలంలో ఎందుకు తాగాలో తెలుసా?

వేసవిలో ఎండల కారణంగా మన శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బార్లీ నీరు ఒక ఔషదంలా పని చేస్తుంది. బార్లీలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను బయటకు నెట్టివేస్తాయి.
మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్ధాయిలు కంట్రోల్‌లో ఉంటుంది.
బార్లీ వాటర్‌లో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఈ పానీయాన్ని సేవించటం ఉపయోగకరం.
మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి.
అధికబరువును తగ్గించుకోవటంలో ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

చాలామందికి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అలవాటు. ఐతే ఇలా ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా రకాలుగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల అజీర్ణం, పోషకాల శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఏమేమి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాము.

ఖాళీ కడుపుతో కాఫీని తాగడం వల్ల మానసిక ఆందోళనకు దారి తీసే అవకాశం వుంటుంది.
కాఫీలోని ఆమ్లత్వం వల్ల ఖాళీ కడుపుతో సేవించినప్పుడు, అది కడుపులోని ఎసిడిటీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
కాఫీలో టానిన్లు ఇనుము, కాల్షియంతో సహా కొన్ని పోషకాలను గ్రహించడం వల్ల సమస్యలు వస్తాయి.
కెఫిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ తాగితే, డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం శారీరక, మానసిక ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.

Bank Employees: ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. అమలు ఎప్పటి నుంచి అంటే..

సాధారణంగా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు శని,ఆదివారాలు సెలవు ఉంటుంది. ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి. ఇప్పుడే ఇదే పద్ధతిని భారతీయ బ్యాంకింగ్‌ రంగంలోనూ తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వార్త ఇప్పుడు బ్యాంకు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బ్యాంక్‌ సిబ్బంది పని-జీవిత సమతుల్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్త బ్యాంక్‌ వినియోగదారులకు ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కలిగిస్తోంది. వారంలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారని, బ్యాంక్‌ సేవలకు అంతరాయం ఏర్పడుతుంద‍న్న వాదన వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మరియు బ్యాంక్ యూనియన్లు ఈ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనను ఆమోదించలేదు. ఐదు రోజుల పనిదినాలు నిజంగా ఆచరణ సాధ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుంది. తెలుసుకుందాం రండి..

తక్కువ పని దినాలుంటే ఏమవుతుంది..
బ్యాంకులు శనివారాల్లో మూసివేసే అవకాశం ఉన్నందున, కొందరు వినియోగదారులో ఆందోళన అధికమవుతోంది. ఎందుకంటే మిగిలిన రోజుల్లో ఒకేసారి ఎక్కువ మంది బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండటంతో.. అక్కడ క్యూ లైన్లు పెరగడం, వేచి ఉండే సమయం ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. ఈ ఇది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరిగిన సెలవుల సంఖ్య దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపకుండా చూసేందుకు ఈ బ్యాంకులన్నీ కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందని కూడా వారు చెప్పారు. రోజువారీ పని గంటలను పొడిగించడంతో పాటు డిజిటల్, ఏటీఎం సేవలను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సమయ వేళల్లో మార్పులు..
ఒకవేళ ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదన అమలులోకి వస్తే బ్యాంకులు సమయ వేళల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, బ్యాంకులు తమ పని సమయాలను సవరించుకుంటాయని సామాచం.. కొత్త పని గంటలు ఉదయం 9:45 నుంచి 5:30 గంటల వరకు ఉండవచ్చు. ఫలితంగా అదనపు రోజు నుంచి పని నష్టాన్ని పూడ్చడానికి రోజుకు 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇవి పెరుగుతాయి..
డిజిటల్ బ్యాంకింగ్‌: వేగవంతమైన ప్రాసెసింగ్, విస్తరించిన ఆన్‌లైన్ బ్యాంకింగ్ గంటలు, మెరుగైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ల ద్వారా వాటిని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడం ద్వారా బ్యాంకులు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించవచ్చు.

అపాయింట్‌మెంట్ ఆధారిత సేవలు: వ్యక్తిగత శ్రద్ధ అవసరమయ్యే సంక్లిష్ట లావాదేవీలు అపాయింట్‌మెంట్ సిస్టమ్ వైపునకు వెళ్లవచ్చు, ప్రతి కస్టమర్‌కు అంకితమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది.

వారాంతపు పనివేళల సర్దుబాటు: బ్యాంకులు మూసివేసిన శనివారాలను భర్తీ చేయడానికి వారపు రోజుల సమయాన్ని సర్దుబాటు చేయవచ్చు, ఇది సాయంత్రం ఎక్కువ సమయాన్ని అందించవచ్చు.

మార్పు అనివార్యమైతే ఏం చేయాలి..
డిజిటల్ బ్యాంకింగ్‌ను స్వీకరించండి: బిల్లు చెల్లింపులు, బదిలీలు, ఖాతా నిర్వహణ కోసం ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఫీచర్‌లతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి.

మొబైల్ యాప్‌లను ఉపయోగించుకోండి: బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, త్వరిత బదిలీలు చేయడం వంటి ప్రయాణంలో బ్యాంకింగ్ అవసరాల కోసం మీ బ్యాంక్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ముందుగా ప్లాన్ చేయండి: వ్యక్తిగత సహాయం అవసరమయ్యే సంక్లిష్ట లావాదేవీల కోసం అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయండి.

ఆఫ్-పీక్ అవర్స్‌ను పరిగణించండి: నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి పీక్ లంచ్ అవర్స్ వెలుపల వారపు రోజులలో బ్రాంచ్‌లను సందర్శించండి.

ఎప్పుడు అమలులోకి వస్తుందంటే..
ఇది ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పలువురు బ్యాంక్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంకులకు ఆదివారంతో పాటు ప్రతి రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి.

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

నల్ల మిరియాలు. బ్లాక్ పెప్పర్ సూప్ అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి ఉపశమనంతో పాటు బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాము.

వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు, రెండు క్యారెట్ల ముక్కలు
6 కప్పుల కూరగాయల రసం, రుచికి తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి రుచికి తగినంత
ఎరుపు మిరియాలు రేకులు రుచికి తగినంత, తరిగిన పుదీనా ఆకుల పొడి
ఒక పెద్ద పాత్రలో, వెన్న- ఆలివ్ నూనెను మధ్యస్థంగా స్టౌ మీద వేడి చేయాలి.
ముక్కలు చేసిన ఉల్లిపాయ, క్యారెట్లు వేసి, కూరగాయలు మెత్తబడే వరకు 5 నిమిషాలు వేయించాలి.
పాత్రలో 6 కప్పుల కూరగాయల రసం వేసి మరికాసేపు మరిగించాలి.
స్టౌ వేడిని తగ్గిస్తూ సూప్ 10 నిమిషాలు పాటు ఉడికించాలి.
ఉప్పు, నల్ల మిరియాలు పొడి, ఎర్ర మిరియాలు రేకుల్ని వేయాలి.
తరిగిన పుదీనా రేకుల్ని సూప్ పైన అలంకరించి వేడిగా తాగేవయవచ్చు.

మార్పు మొదలైందా! పోస్టల్‌ ఓటుకు పోటెత్తుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీలు

ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. ఓటుకు రూ.3-5వేలు ఇస్తామని బేరాలాడుతున్న పార్టీ నేతలకు.. ‘మీ సేవలు చాలు.. చిత్తగించండి’ అని ముఖం మీదే తేల్చేస్తున్నారు. కొన్నిచోట్ల తరిమినంత పనిచేస్తున్నారు. తమ మద్దతు ఏకపక్షమే, ఓటు ఎవరికనేది అంతా ఊహించిందేనని బాహాటంగానే చెబుతున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉద్యోగవర్గాలు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసి, వినియోగించుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మార్పు మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.30 లక్షల మంది పోస్టల్‌ బ్యాలట్లకు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారానికి వారిలో 3.30 లక్షల మంది ఓట్లు వేయగా, అందులో 2.76లక్షల మంది పైగా ఉద్యోగులే. 2019 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకున్నవారు 2.38 లక్షల మందే.

ఎలాగైనా కొనాలనే..
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లంటేనే ఓ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఇన్నాళ్లూ వేధించి వెంటాడి.. ఇప్పుడు ఓట్లడిగితే తిరగబడతారనే భయం వారిని వెంటాడుతోంది. అయినా ఎంతోకొంత ప్రయత్నం చేయాలని.. నాలుగైదు రోజులుగా బేరసారాలు ప్రారంభించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.3వేల చొప్పున నిర్ణయించింది. మరోచోట రూ.5వేలైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రలోభాలకు తెరతీసింది. యూపీఐ విధానంలో నగదు బదిలీకి సిద్ధమైంది. కవర్లలో పెట్టి నగదు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్న తరుణంలో.. ఈ ఓట్లతో అయినా కొంతమేర లాభపడాలనేది వారి ఆలోచన.

వారికి ఎదురు డబ్బిస్తాం.. మీకైతే ఓటేసేదే లేదు
పోస్టల్‌ ఓట్లలో మెజారిటీ సాధించాలని ఆశిస్తున్న ఆ పార్టీ ఎంత బతిమాలుతున్నా.. వారిని దగ్గరకు రానీయడం లేదు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నవారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఛీ కొడుతున్న ఘటనలు కూడా ప్రకాశం జిల్లాలో వెలుగుచూశాయి. ఒక ఉద్యోగి అయితే ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి వెళ్లి.. ఎన్నికల ఖర్చులకు ఉంచాలని కొంత మొత్తం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మరికొన్నిచోట్ల ఎన్నికల సంఘానికి ఉద్యోగులే ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులపై ప్రకాశం జిల్లాలో ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘమే పేర్కొంది.

మండుటెండలోనూ గంటలకొద్దీ నిరీక్షణ
పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండుటెండల్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు.. అటూ ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. ఫాం2 దరఖాస్తు సమర్పించినా.. వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. అయినా ఒకటికి రెండుసార్లు తిరిగి మరీ తమ ఓటుపై ఆరాతీసి, ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

Refrigerator: ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్ చేసే ఉంచాలా.. 2 లేదా 3 గంటలు ఆఫ్ చేస్తే ఏమవుతుంది? అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారంతే..!

Refrigerator: నేడు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ నిత్యావసరంగా మారింది. పండ్లు, పాలు, కూరగాయలతో సహా అనేక ఆహార పదార్థాలను తాజాగా ఉంచడంలో రిఫ్రిజిరేటర్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది వ్యక్తుల ఇళ్లలో, రిఫ్రిజిరేటర్ నిరంతరంగా నడుస్తుంది. కొందరు వ్యక్తులు దానిని 1-2 గంటలు స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. వాస్తవానికి, రిఫ్రిజిరేటర్‌లను తయారు చేసే కంపెనీలు కూడా ఎంతకాలం నిరంతరంగా నడపాలి అనే విషయాన్ని చెప్పడం లేదు. అయితే, ఫ్రిజ్‌ని కొన్ని గంటలపాటు ఆఫ్ చేసి ఉంచడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా హానికరమా? మీరు దీని గురించి తప్పక తెలుసుకోవాలి.
ఫ్రిజ్ లోపలి నుంచి ఒక గదిలా ఉంటుంది. ఇక్కడ ఆహారం ఉంచడం వల్ల పాడైపోదు. కరెంట్ రిఫ్రిజిరేటర్‌లోకి ప్రవహిస్తున్నంత కాలం, దాని కంప్రెసర్ పని చేస్తూనే ఉంటుంది. శీతలీకరణ ప్రక్రియ లోపల కొనసాగుతుంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎక్కువ సేపు చల్లగా ఉండి ఆహారం పాడవకుండా ఉండేలా ఫ్రిజ్ డిజైన్ చేశారు. ఫ్రిజ్ ఎన్ని గంటలు నడపగలదు? రిఫ్రిజిరేటర్ రోజులో 24 గంటలు ఆహారాన్ని తాజాగా ఉంచుతుంటాయి. కాబట్టి కంపెనీలు వాటిని 24 గంటలూ నిరంతరం పనిచేసేలా డిజైన్ చేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, ఫ్రిజ్ 24 గంటలు పనిచేయడం అవసరమా, విద్యుత్తును ఆదా చేయడానికి 1-2 గంటలు ఆపగలరా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఫ్రిజ్‌ని నిరంతరంగా నడిస్తే విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తాయని భావించి స్విచ్ ఆఫ్ చేస్తారు. కానీ అలా చేస్తే లాభం తక్కువ, నష్టం ఎక్కువగా ఉంటుంది.
వాస్తవానికి, రిఫ్రిజిరేటర్ అనేది ఎలక్ట్రానిక్ శీతలీకరణ పరికరం. ఇది నిరంతరంగా పనిచేసేలా తయారు చేశారు. 24 గంటలూ నిరంతరంగా ఫ్రిజ్‌ను నడపడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏడాది పొడవునా రిఫ్రిజిరేటర్‌ను స్విచ్ ఆఫ్ చేయకపోయినా, దానిలో సమస్య లేదు. అయినప్పటికీ, దాన్ని శుభ్రం చేయడానికి లేదా ఎప్పుడైనా పాడైపోయినట్లయితే దాన్ని మరమ్మత్తు చేయడానికి మీరు ఖచ్చితంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

ఫ్రిజ్‌ని 1-2 గంటలు మూసి ఉంచగలమా? ఇలా చేస్తే ఏమి జరుగుతుంది?
మీరు ఫ్రిజ్‌ని 1-2 గంటల పాటు ఆఫ్‌లో ఉంచితే లేదా రోజంతా అనేకసార్లు ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటే, అప్పుడు ఫ్రిజ్ ఎక్కువగా శీతలీకరణను అందించదు. ఇటువంటి పరిస్థితిలో, లోపల ఉంచిన ఆహార పదార్థాలు పాడైపోయే అవకాశం ఉంది. 1-2 గంటలు ఫ్రిజ్ ఆఫ్ చేసి ఉంచి విద్యుత్ ఆదా చేయడంలో తప్పులేదు. అయితే, ఇప్పుడొస్తున్న రిఫ్రిజిరేటర్లు స్వయంచాలకంగా విద్యుత్తును ఆదా చేయగలదు.

ఫ్రిడ్జ్ విద్యుత్ ఆదా ఎలా చేస్తుంది..
ఈ రోజుల్లో అన్ని ఫ్రిజ్‌లు పవర్ ఆదా కోసం ఆటోకట్ ఫీచర్‌తో వస్తున్నాయి. దీని కారణంగా, ఫ్రిజ్ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చేరగానే.. తర్వాత స్వయంచాలకంగా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫ్రిజ్ ఆటో కట్ అయినప్పుడు, కంప్రెసర్ ఆగిపోతుంది. తద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. అప్పుడు ఫ్రిడ్జ్ కూలింగ్ అవసరం అయిన వెంటనే, కంప్రెసర్ స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలం నుంచి ఇంటి నుంచి బయటకు వెళుతున్నట్లయితే, మీరు ఫ్రిజ్ నుంచి అన్ని వస్తువులను తీసిన తర్వాత లేదా దానిని ఉపయోగించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయవచ్చు. మీరు ఒకటి లేదా రెండు రోజులు వెళ్లాలనుకుంటే, ఫ్రిజ్‌ను ఆఫ్ చేసి ఉంచవద్దు.

https://www.hmtvlive.com/technology-news/switch-off-refrigerator-for-2-hours-after-continuous-running-check-here-full-details-in-telugu-113670?infinitescroll=1

ఏడు రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు రూ.5వేల పెన్షన్‌ ఇస్తున్న కేంద్రం

అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత ప్రయోజనాలను అందిస్తుంది. మీ వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే మీరు ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల తర్వాత మీరు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందుతారు. అటల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, వృద్ధాప్యంలో ప్రభుత్వం హామీ ఇచ్చే ఆదాయానికి హామీ ఇస్తుంది. ఈ పథకంలో, మీరు మీ పెట్టుబడిని బట్టి రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే, మీరు కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.
రూ.5,000 పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అతను రోజుకు కేవలం రూ.7 పెట్టుబడి పెట్టవచ్చు. అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాలి. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల తర్వాత రూ.5,000 పెన్షన్ వస్తుంది. నెలకు రూ.42 మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా, మీకు నెలకు రూ.1,000 పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలిద్దరూ ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇద్దరి పెట్టుబడితో కలిపి ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ ప్రయోజనం. భార్యాభర్తలలో ఒకరు మరణిస్తే మరొకరు పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత, నామినీకి మొత్తం డబ్బు వస్తుంది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. దీనితో పాటు మొబైల్ నంబర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అటల్ పెన్షన్ పథకంలో ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో చేరవచ్చు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు.

Giloy: తిప్పతీగ గురించి తెలుసా? దీన్ని రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటంటే..!

ప్రకృతి చాలా విచిత్రమైనది. చాలా సాధారణం అనిపించే ఎన్నో మొక్కలు, చెట్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో భాగంగా ఉన్నాయి. చాలా వరకు రోడ్ల పక్కన, పొదలలోనూ తమలపాకులాగా తీగలు అల్లుకుని ఉంటాయి. వీటిని తిప్పతీగ అంటారు. తిప్పతీగ కరోనా ముందు వరకు ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ కరోనా కాలంలో తిప్పతీగ ప్రయోజనాల గురించి చాలా వైరల్ అయింది. అప్పటినుండి తిప్పతీగ ప్రజల జీవనశైలిలో భాగం అయ్యింది. అయితే చాలామందికి దీని పూర్తీ ప్రయోజనాల గురించి తెలియదు. తిప్పతీగ ఔషద గుణాలు, దాని ప్రయోజనాలు తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో తిప్పతీగ ఆకులు, వేర్లు, కాండం ఇలా అన్నీ చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయని పేర్కొనబడింది. తిప్పతీగ కాండం, కొమ్మ ఎక్కువగా వ్యాధులలో ఉపయోగిస్తారు. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గిలోయ్ అనే గ్లూకోసైడ్, టెనోస్పోరిన్, పామరిన్, టెనోస్పోరిక్ యాసిడ్ తిప్పతీగలో ఉంటాయి. ఇది కాకుండా తిప్పతీగలో ఐరన్, భాస్వరం, జింక్, కాపర్, కాల్షియం, మాంగనీస్ కూడా ఉంటాయి.

తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు..

జ్వరం, మధుమేహం, కామెర్లు, కీళ్లనొప్పులు, మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం, మూత్ర సమస్యల నుండి ఉపశమనానికి తిప్పతీగ ఉపయోగించబడుతుంది.

తిప్పతీగ వాత, పిత్త, కఫాతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం చేకూర్చే ఔషధం. శరీరం నుండి విష పదార్థాలను, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా, ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

తిప్పతీగ ఇన్సులిన్ ఉత్పత్తి, సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ నిర్వహణకు మంచి నివారణగా చేస్తుంది.

తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Hair Oils: ఈ నాలుగు నూనెలలో ఏ ఒక్కటి వాడినా జుట్టు రెండింతలు పెరగడం ఖాయం..!

ప్రతి ఒక్కరూ తమ జుట్టు మందంగా, దట్టంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో అది చాలా అరుదు. జుట్టుకు తగిన జాగ్రత్తలు, తగిన పోషకాహారం అందించకపోతే జుట్టు పెరగదు, ఆరోగ్యంగా కనిపించదు. సాధారణంగా జుట్టు సంరక్షణలో భాగంగా రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ దానికంటే జుట్టు సంరక్షణ దినచర్యలో సహజమైన వస్తువులను ఉపయోగించడం చాలా మంచిది. ముఖ్యంగా జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు రెండింతలు పెరిగేలా చేయవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే నూనెలు ఏంటో తెలుసుకుంటే..

ఉల్లిపాయ నూనె..

ఉల్లిపాయ నూనెను మార్కెట్లో రెడీమేడ్ ది కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఇంట్లోనే ఈ నూనె తయారుచేయవచ్చు. చిన్న ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా ఉడికించి చల్లారిన తరువాత వడగట్టి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాత్రి పూట జుట్టుకు పెట్టుకుని తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తుండాలి. ఇలా చేస్తుంటే జుట్టు రెండింతలు ఆరోగ్యంగా పెరుగుతుంది.

కలోంజి నూనె..

కలోంజి నూనె కూడా జుట్టు పెరగడంలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ నూనె చేయడానికి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మంటపై వేడి చేసి, అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఉడికించాలి. ఈ నూనె తీసి సీసాలో పెట్టుకోవాలి. ఈ నూనె జుట్టుకు జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.

కరివేపాకు నూనె ..

కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడం కామన్. అయితే ఈ నూనెలో కరివేపాకును కలిపి రాసుకుంటే అది జుట్టుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. కరివేపాకు ఆకులు జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటమే కాకుండా జుట్టు చిన్నతనంలోనే నెరసిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. 100 గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులను వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తరువాత వడగట్టి గాజు సీసాలో పెట్టుకోవాలి. ఈ నూనెను ఇతర నూనెల మాదిరిగా తలకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

బాదం నూనె..

పొడవాటి, మందమైన జుట్టు కోసం వారానికి రెండుసార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేయవచ్చు. బాదం నూనెతో జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు పోతాయి. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. చివర్లు చీలిపోవడంతో పాటు జుట్టు చిట్లడమనే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రద్దు అయిన పోస్టల్ బ్యాలెట్‌ … ఓటింగ్‌పై కీలక ప్రకటన

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పలువురు అధికారులపై ఈసీ చర్యలకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయింది. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌ పేపర్లకు బదులు.. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యంతో 12వందల 19 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో వీరందరికి రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. సంబంధిత అధికారులపై.. ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో మోదీ పర్యటన నేపథ్యంలో మరో రోజు గడువు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల బ్యాలెట్ల ఓట్లు వినియోగించుకున్నారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మిగిలిన ఓటర్లు ఈ నెల 9వ తేదీ లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒంగోలులో ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు తెలిసిందని మీనా చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్వకాల మేరకే ఎన్నికలలో నిబంధనలను ఒక్కోసారి సడలిస్తుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలట్ ను వినియోగించుకుని వారికి కేటాయించిన విధులకు వెళ్లాలనిసీఈవో కోరారు.

పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..? తప్పక తెలుసుకోండి..

పెరుగు, మజ్జిగ రెండూ మన ఆహారంలో సాంప్రదాయ భాగాలు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివని మనకు ముందు నుంచి తెలుసు. అయితే వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అని మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది.? పెరుగు, మజ్జిగ పోషక అంశాలు, ప్రయోజనాలను తెలుసుకోవాలి. అప్పుడే మీరు మీ ఆహారం ప్రకారం ఎది అవసరమో ఎంచుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేలరీలు: పెరుగు కంటే మజ్జిగలో కేలరీలు చాలా తక్కువ. 100 గ్రాముల పెరుగులో దాదాపు 98 కేలరీలు, 100 గ్రాముల మజ్జిగలో 40 కేలరీలు ఉంటాయి. అందువల్ల, మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మజ్జిగ ఉత్తమ ఎంపిక.

బ్యాక్టీరియా, ప్రోటీన్: మజ్జిగ కంటే పెరుగులో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేగులకు చాలా మేలు చేస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కాల్షియం, విటమిన్లు: పెరుగు, మజ్జిగ రెండూ కాల్షియం మంచి మూలం. అనేక ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉన్నాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ B12, B5, B2 మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అయితే మజ్జిగలో విటమిన్ B12, జింక్, రైబోఫ్లేవిన్, ప్రోటీన్లు సాపేక్షంగా అధిక మొత్తంలో ఉంటాయి.

జీర్ణ సమస్య: మీకు అజీర్ణం సమస్య ఉంటే, పెరుగు తినడం మంచిది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు తగ్గడం: తక్కువ కేలరీల మజ్జిగ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మండే వేసవిలో మజ్జిగ చల్లగా తాగితే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.

కష్టాల్లో ఉన్నారా? ఈ 15 లక్షలు మీ కోసమే! కేంద్రం అద్భుతమైన పథకం

దేశంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థికసాయం అందించి పేదవారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వం అందించే పథకాల గురించి తెలియక చాలా మంది ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ లభిస్తుంది. ఏకంగా 15 లక్షల వరకు రుణాలు పొందొచ్చు.

షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించేందుకు పీఎం సూరజ్ పోర్టల్‌ ను ప్రారంభించింది ప్రభుత్వం. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అర్హులైన పౌరులకు రూ.1లక్ష వరకు లోన్ లు ఇవ్వడంతోపాటూ రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. లోన్ పొందడానికి, అర్హులైన పౌరులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.720 కోట్లు జమ చేశారు.

ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి పరిమితి విధించలేదు. వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రమే ఈ పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి. ప్రధాన మంత్రి సూరజ్ అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in ను సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోన్ మంజూరవుతుంది. ఈ పథకం ద్వారా లోన్ పొంది వ్యాపారంలో రాణించే వీలుంటుంది.

Ghost malls: దేశంలో పెరుగుతున్న ఘోస్ట్‌ మాల్స్‌.. ఇంతకీ ఏమిటివి…?

దేశ ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఏదైనా కొనాలంటే ఎక్కువగా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. లేదంటే మెరుగైన షాపింగ్‌ అనుభూతి కోసం కుటుంబంతో కలిసి పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న మాల్స్‌కు తగిన గిరాకీ ఉండడం లేదు. దీంతో అవి ఘోస్ట్‌ మాల్స్‌గా మారిపోతున్నాయి. సాధారణంగా అందుబాటులో మాల్ ప్రాపర్టీలో 40 శాతం ఖాళీగా ఉంటే.. వాటిని ఘోస్ట్‌ మాల్స్‌గా (Ghost malls) వ్యవహరిస్తారు. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇలాంటి మాల్స్‌ 2022లో 57 ఉండగా.. 2023లో 64కు పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా పేర్కొంది. ఈమేరకు ‘థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌ 2024’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.

29 నగరాల్లో 58 హైస్ట్రీట్స్‌, 340 షాపింగ్‌ సెంటర్లను పరిశీలించాక నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదిక రూపొందించింది. దేశవ్యాప్తంగా గతేడాది 64 ఘోస్ట్‌ మాల్స్‌ వల్ల సుమారు 13.3 మిలియన్‌ చదరపు అడుగుల లీజు స్థలం నిరుపయోగంగా మారినట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 58 శాతం పెరిగినట్లు తెలిపింది. దిల్లీ రాజధాని ప్రాంతంలోనే అత్యధిక ఘోస్ట్‌ షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, బెంగళూరు ఉన్నాయంది. హైదరాబాద్‌లో మాత్రం 19 శాతం మేర ఘోస్ట్‌ షాపింగ్‌ సెంటర్లు తగ్గినట్లు నివేదిక తెలిపింది. దేశవ్యాప్త ట్రెండ్‌ను పరిశీలించినప్పుడు లక్ష చదరపు అడుగులు లీజు స్థలం కలిగిన చిన్న చిన్న మాల్స్‌లో వేకెన్సీ రేటు 36 శాతంగా ఉండగా.. 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో వేకెన్సీ రేటు 5 శాతం మాత్రమేనని నివేదిక తెలియజేస్తోంది. మిడ్‌ లెవల్‌ షాపింగ్‌ మాల్స్‌ వేకెన్సీ రేటు 15.5 శాతం ఉంటోందని తెలిపింది.

ఈ ఘోస్ట్‌ మాల్స్‌ వల్ల రిటైల్‌ సెక్టార్‌కు రూ.6,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. చిన్న మాల్స్‌కు పెద్దగా ఆదరణ ఉండకపోవడం ప్రాపర్టీ యజమానులకు సవాలుగా మారిందని, అద్దెదారులను ఆకర్షించడంలో వారు విఫలమవుతున్నారని పేర్కొంది. గ్రేడ్‌ ఏ మాల్స్‌.. వినియోగదారులతో కిటకిటలాడుతుండగా.. గ్రేడ్‌ సి మాల్స్‌ ఇలా ఘోస్ట్‌ సెంటర్లుగా మారుతున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ పేర్కొన్నారు. కొన్ని చిన్న చిన్న మాల్స్‌ మూతపడుతున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా డైరెక్టర్‌ గులాం జియా పేర్కొన్నారు. వినియోగదారుల ప్రవర్తన, మార్కెట్‌ పరిస్థితులకు ఇకపై రిటైల్‌ స్పేస్‌ను డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉందని నైట్‌ ఫ్రాంక్‌ అభిప్రాయపడింది.

Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..

Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాస్థాపన కార్యక్రమం జరిగింది. బాలరాముడి విగ్రహాప్రతిష్టాపనకు అతీరథ మహరథులు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. కులమతాలకు అతీతంగా భక్తులు కూడా బాల రాముడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. రామయ్యను కన్నులారా చూసుకొని వెళ్దామని దూర ప్రాంతాలనుంచి వస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు వేలాదిగా భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. రామయ్యను జీవితంలో ఒక్కసారైన లైవ్ లో చూడాలని భక్తులు పరితపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలరాముడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

విమానాలు,రైల్వేలు, బస్సుల సౌకర్యం కల్పించాయి. ఇదిలా ఉండగ.. బాల రాముడికోసం ప్రతి ఒక్క భక్తుడు తమ వంతుగా హుండీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. లడ్డులు, బుందీలు, జిలేబీలు టన్నుల కొద్ది భక్తులు తమ బాలరాముడికి నైవేద్యంగా సమర్పించి, అక్కడికి వస్తున్న భక్తులకు పంచిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. అయోధ్యలో ఒక బాలుడు ప్రతిరోజు అక్కడికి వస్తున్న భక్తులకు కుంకుమ, చందనం తిలకంనామాలు పెడుతుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుమీద గడుపుతూ వచ్చి పోయే భక్తులకు తిలకం పెడుతుంటాడు.

వీరిలో కొందరు విదేశీయులు కూడా బాలరాముడి కోసం వస్తుంటారు. ఈక్రమంలో కొందరు బాలుడ్ని.. రోజు తిలకంగా పెట్టుకుంటూ ఎంత సంపాదిస్తావని సరదాగా అడిగారు. దీంతో అతను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంపుల్కు వచ్చిపోయే భక్తులకు కుంకుమ, చందనంతో తయారు చేసిన తిలకం దిద్దుతుంటానని, ఇలా రోజు దాదాపు.. పదిహేను వందల వరకు సంపాదిస్తానంటూ చెప్పాడు.
అంతేకాకుండా.. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే సంపాదిస్తున్నానంటూ నవ్వుకుంటూ చెప్పేశాడు. అక్కడున్న యువకులు అతని మాటలను వీడియో తీశారు. డాక్టర్ ల కన్నా.. తాను ఏంతక్కవ సంపాదించట్లేదని కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Health

సినిమా