Rahul Gandhi: ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు భగభగమంటూ మండిపోతున్నా.. లెక్క చేయకుండా బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కడపకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) గెలుపు కోసం ఈ నెల 11న ఆయన కడప జిల్లాకు వస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

కాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కంచుకోటగా ఉన్న కడప లోక్‌సభ నియోజకవర్గంలో (Kadapa Constituency) ఈ సారి పోరు హోరాహోరీగా మారింది. సీఎం జగన్‌కు తమ్ముడైన వైఎస్ అవినాష్ రెడ్డిని (YS Avinash Reddy) అక్కడి ప్రజలు 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరఫున వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఏపీసీసీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని తప్పకుండా ఓడించాలన్న లక్ష్యంతో షర్మిల ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఆమె ఉదృతంగా ప్రచారం చేస్తుండగా.. ఆమెకు తోడుగా రాహుల్ కూడా వస్తున్నారు. మరి, రాహుల్ రాకతో షర్మిలకు మైలేజ్ పెరుగుతుందా? లేదా? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *