Friday, November 15, 2024

జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!

మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి…


బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… జార్ఖండ్‌లోని నేతర్‌హట్‌లో బడి… తరువాత పాట్నా సైన్స్ కాలేజీలో చదువు… అక్కడ తన గణిత ప్రతిభ అందరి దృష్టికీ వచ్చింది… అలవోకగా పెద్ద పెద్ద క్లిష్టమైన ఈక్వేషన్లకు సైతం మనసులోనే గుణించుకుని జవాబులు చెప్పేవాడు…

కాలేజీ ప్రిన్సిపాల్ ఆ ప్రతిభ చూసి చకచకా పై క్లాసులకు ప్రమోట్ చేశాడు… 1969లో అలా పీహెచ్డీ కూడా అయిపోయింది తనది… తన ప్రతిభ గుర్తించిన ప్రొఫెషర్ జాన్ కెల్లీ తనకు అమెరికాలో కాలిఫోర్నియా యూనివర్శిటీలో, బెర్కిలీలో చదవడానికి ఏర్పాట్లు చేశాడు… దాదాపు దశాబ్దం ఉన్నాడు అక్కడ వశిష్ట…

తరువాత ఇండియాకు తిరిగి వచ్చాడు… ఐఐటీ కాన్పూర్‌లో టీచింగ్ ప్రొఫెషన్… టీఐఎఫ్ఆర్ ముంబై, ఐఎస్ఐ కలకత్తా… తను ఓ గొప్ప మెంటార్… తరువాత డెస్టినీ ఎదురుతిరిగింది… స్కిజోఫ్రెనియాకు గురయ్యాడు… తద్వారా విడాకులు, తన విద్యాప్రతిభ క్షీణించింది… ఆసుపత్రుల చుట్టూ తిరిగేవాడు… తరువాత ఓరోజు రైలులో వెళ్తూ మాయమైపోయాడు… సీన్ కట్ చేస్తే…

తన స్వగ్రామంలో తేలాడు… అక్కడికి ఎందుకు వచ్చాడు..? ఎలా వచ్చాడు..? తనకే తెలియదు… వచ్చేశాడు అలాా, అంతే… మళ్లీ చికిత్సలు షురూ… బెంగుళూరులోని NIMHANS చేర్చారు, అక్కడి నుంచి ఢిల్లీలోని IHBAS కు మార్చారు… హీరో శతృఘ్నసిన్హా సాయం చేసేవాడు… కొద్దిగా కోలుకున్నాక మాధేపురలోని BNMU లో టీచింగుకు రీఎంట్రీ దొరికింది… కానీ తన ప్రతిభ ఏమిటో తనకే తెలియని దురవస్థ…

2019లో 72 ఏళ్ల వయస్సులో కన్నుమూశాడు… తనకు మరణానంతరం పద్మశ్రీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం… అమెరికాలో ఉన్నప్పుడు బెర్కిలీలోని ఆ యూనివర్శిటీ మాత్రమే కాదు, నాసా వంటి సంస్థలూ తన సేవల్ని వాడుకున్నాయని చెబుతారు… గణిత మేధావి రామానుజన్ వారసుడిగా చెప్పేవారు అందరూ… చంద్రుడిపైకి మనిషిని పంపించిన అపోలో మిషన్ రోజుల్లో నాసా కంప్యూటర్లు మొరాయిస్తే వశిష్ట నారాయణ్ సాయం చేశాడంటారు…

గణితం అంటేనే ఇండియా… పెద్ద పెద్ద విద్యావేత్తలు కూడా ఆశ్చర్యపోయేలా… కంప్యూటర్‌తో పోటీపడే, కాదు, మిన్నగా మెరిట్ చూపించిన చాలామంది పుట్టారు ఇక్కడ… ఒకదశలో వశిష్ట నారాయణ్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కొన్ని థియరీలను కూడా చాలెంజ్ చేశాడు… తరువాత ఏమైంది..? విధి వక్రించింది… ఆ జ్ఞానం బరువును ఆ మెదడు తట్టుకోలేకపోయింది… దెబ్బతింది… అదీ విధి…!!

8 నెలలు… 3800 కిలోమీటర్ల ఓ సాహసి ఒంటరి పాదయాత్ర… కానీ దేనికి..?!

సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!!

WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి తెలుసుకోవాలి.

సృష్టిబక్షి మాటల్లోనే కాస్త చెప్పుకుందాం: నేను చాలాకాలం మహిళల సమస్యలపై గొంతు చించుకునేదాన్ని. మహిళలపై జరిగే హింసకు సంబంధించిన కథనాలు వచ్చినప్పుడు చలించిపోయేదాన్ని. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫైర్ అయ్యేదాన్ని. 2017లో ఓసారి హైవే నంబర్ 91పైన… భర్త ఎదుటే ఓ భార్య, అతడి కూతురిని సామూహిక అత్యాచారం చేసిన ఘటన నన్ను తీవ్రంగా వెంటాడింది. ఒక దేశం మహిళల రక్షణ విషయంలో ఎంత భద్రంగా ఉందో చెప్పడానికి ఇలాంటి ఘటనలు భారతదేశంలో కొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనలకు చెక్ పెట్టడం నా ఒక్కదానివల్ల అయ్యే పని కాకపోవచ్చు.. కానీ, నేనూ ఆ సంస్కరణలో భాగస్వామి కావాలనుకున్నాను. అప్పుడే ఏదైనా చేయాలన్న సంకల్పానికి నాలో బీజం పడింది.

మా నాన్న ఆర్మీ ఉద్యోగి. ఆయన దేశానికెంతో చేస్తున్నాడు. కాబట్టి, నేనూ ఏదో చేయాలనుకున్నా. ఆ తలంపుతోనే.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాలినడకను ప్రయాణిస్తూ.. మార్గమధ్యంలో వీలైనంత మందిని చైతన్యపర్చాలని నిర్ణయించుకున్నా. అయితే, అదే సమయంలో నేను తలపెట్టిన పాదయాత్ర ఎప్పటికీ గుర్తుండేవిధంగా.. మరెందరికో స్ఫూర్తి నింపేవిధంగా.. దాన్ని డాక్యుమెంట్ చేయాలనుకున్నా. కానీ నిర్మాతైన నా సోదరి అపూర్వ బక్షి.. ఆ డాక్యుమెంట్ చేసినదాన్ని ప్రపంచానికి చూపిద్దామన్న సూచనతోనే.. ఇప్పుడు WOMB..WOMEN OF MY BILLIONగా తెరకెక్కింది.

240 రోజుల కాలినడక.. 3800 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎన్నో సవాళ్లు!

మహిళా పక్షపాతిగా.. మహిళల సమస్యల పట్ల పాలకులను, సమాజాన్ని ఆలోచింపజేసేందుకు.. ఓ సుదీర్ఘమైన ప్రయాణాన్ని నేనెంచుకున్నాను. ఆ ప్రయాణమే ఎంత కాలం పడుతుందో నాకు సరిగ్గా తెలియదు. అయితే, బహుదూరపు బాటసారిగా నేను బయల్దేరేకంటే ముందు ఓ ఏడాదిపాటు.. అందుకోసం శిక్షణ కూడా పొందాను. నాకు నేను ఈ ఫీట్ సాధించేందుకు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసే ఈ మారథాన్ ఆలోచించినంత వీజీ కాదని నాకూ తెలుసు. అందుకే శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యాను. అలా జర్నీ ప్రారంభమైంది.

రోజూ 30 నుంచి 40 కిలోమీటర్లు నడవాలన్నది నా లక్ష్యంగా పెట్టుకుని ప్రయాణాన్ని ప్రారంభించాను. నా ప్రయాణం కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు… నా జర్నీలో ఎదురయ్యే మహిళలను కలుస్తున్నప్పుడు.. వారు చెప్పే వారి వ్యథలు, కథలు కదిలిస్తుంటే… వాటి గురించి ఆలోచనలు మెదట్లో సుడులై తిరిగి మానసికంగానూ ఒకింత ఒత్తిడికి గురి చేసేవి. అయితే అదే సమయంలో నాలో ఒక చిన్న ఆశ చిగురించడానికి గల కారణమేంటంటే… నేను చెప్పేవాటిని దారి పొడవునా వినే ఎందరో మహిళల్లో.. చాలామంది ఇకపై వారు హింసను సహించేది లేదన్న చైతన్యంతో కనిపించినప్పుడు.. నా బాధను మర్చిపోయేదాన్ని. నా ప్రయాణం విజయవంతంగా సాగుతోందనే నమ్మకం నాలో నాకు కల్గి.. ముందుకెళ్లేదాన్ని.

మహిళా భద్రత, అభ్యున్నతి కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర అనే ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. అయినప్పటికీ… మరెందరో మహిళల జీవన స్థితిగతులను చూసినప్పుడు, అరాచకాలు కళ్లకు కట్టినప్పుడే కదా… ఈ ఆలోచనకు బీజం పడింది.. కాబట్టి దీని వెనుక ఎందరో మహిళల వ్యధలున్నాయనే భావన నా గమ్యాన్ని, లక్ష్యాన్ని ఎప్పటికప్పుడూ నాకు గుర్తు చేస్తూ ఉండేది. ప్రారంభంలో ఒంటరిగా సుమారు 4 వేల కిలోమీటర్ల ఈ పాదయాత్ర నేనెలా చేయగలననుకునేదాన్ని. కానీ, ప్రయాణంలో ఎందరో నాతోపాటు కలిసిన సన్నివేశాలు.. వారితో గడిపిన సమయం.. ముచ్చట్లు ఇవన్నీ నా జర్నీని సులభతరం చేశాయి. నా ఈ జర్నీలో ఎదురైన మూడు కీలకమైన స్టోరీస్ ను మీరు WOMB డాక్యుమెంటరీలో చూడొచ్చు.

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు సంబంధించైనా, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివలైనా… నా డాక్యుమెంటరీని ప్రదర్శించడమే కాకుండా.. నా డాక్యుమెంటరీలో పాత్రధారులైన మహిళలకు న్యాయం, సాయమందేలా చూడాల్సిన బాధ్యత వాళ్లకుంది. ఎందుకంటే అలాంటి అంశాలెన్నింటినో ఎంతో బాధ్యతతో నేను జర్నీలో విన్నాను.. వాటిని డాక్యుమెంట్ చేశానంటోంది సృష్టి బక్షి.

WOMB డాక్యుమెంటరీతో.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు సృష్టి సందేశం మరి చేరుతుందా..?

నా జర్నీయే మహిళా అభ్యున్నతి, వారి రక్షణ కోసం. కాబట్టి మారుమూల ప్రాంతాల్లో సైతం మహిళలనుభవిస్తున్న వ్యథలను తెలుసుకోవడంతో పాటు.. ఎందరో సక్సెస్ స్టోరీస్ ను కూడా ఉదాహరణలుగా చూపించేందుకే నేను యాత్ర చేపట్టాను. వాటిని డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు డాక్యుమెంటరీగా కూడా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతోంది. ఇక సందేశం చేరేదెలా అంటే… ఇది విస్తృతమైన చర్చకు తెర తీయాలి. టాక్ ఆఫ్ ద మౌత్ కావాలి. అప్పుడే తన లక్ష్యానికి.. ఈ డాక్యుమెంటరీ కూడా తోడైనట్టు అంటోంది సృష్టి.

తన జర్నీలో కలిసిన మహిళల స్పందన గురించి.. సృష్టి ఏమంటుందంటే..?

వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేందుకు చాలాచోట్లా సాధారణంగానే ముందుకు రారు. ఆ క్రమంలో మా వర్క్ షాప్స్ లో మేం చైతన్యపర్చే ప్రయత్నం చేశాం. మేం కల్పించాలనుకున్న అవగాహనకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది మహిళలు ముందు కొంత మొహమాటపడ్డా.. ఆ తర్వాత మహిళలుగా తామెదుర్కొన్న బాధలు, వ్యథలను నిర్భయంగా ముందుకొచ్చి చెప్పారు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరుగొద్దనే భావనను మహిళలు ముందుకొచ్చి వెలిబుచ్చేందుకు.. ఈ అవగాహనా సదస్సులు దారివెంట ఎంతో ఉపయోగపడ్డాయి.

నేను ఆర్మీ ఆఫీసర్ కూతురిగా… దాదాపు దేశమంతటా తిరిగాను.. వివిధ చోట్ల పెరిగాను. నేను హాంకాంగ్‌లో ఉన్నప్పుడు నా తోటివారి కంటే నాకే ఎక్కువ తెలుసనుకునేదాన్ని. కానీ, నేను భారతదేశంలోని గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలిసినప్పుడు అర్థమైంది. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని. నాకింకా ఏం తెలియదో, ఎంత తెలియదో అప్పుడర్థమైందంటుంది. అలా తన కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీలో.. ఎన్నో కథలు, వ్యథలు, సక్సెస్ స్టోరీస్, ఎన్నో ఆవిష్కరణలతో… తానో కొత్త భారతాన్ని కనుగొన్నానంటోంది బహుదూరపు బాటసారి సృష్టి బక్షి…

బ్యూటీ క్రీమ్స్ కు బదులు ఈ జెల్ రాస్తే.. మెరిసే ముఖం మీ సొంతం.

Aloe Vera For Skin Care: మనలో చాలామంది రకరకాల ఫంక్షన్స్, పార్టీలకు వెలుతుంటారు. అలాంటప్పుడు అందరి కంటే కొంచం స్పెషల్ గా కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. ప్రతి ఒక్కరు చర్మం కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పార్లర్స్‌కి వెళ్తుంటారు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే అందంగా కనిపించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అలోవెరా జెల్ నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీన్ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖానికి ఇది సహజ కాంతినిస్తుంది. చాలా మంది ముఖం అందంగా కనిపించడానికి రకరకాల క్రీములు, ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల వల్ల మన చర్మానికి హాని కలుగుతుంది.

కలబంద ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు వాడే ఔషధాల్లో కూడా అలోవెరాను ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అందాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని మెరిపించి వయసును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కలబందలో అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఎ,బి లు ఇందులో ఉంటాయి. అలోవెరాలో ఉండే మినరల్స్ చర్మంలోకి చొచ్చుకు వెళ్లి మృత కణాలను తొలగిస్తాయి.

మెరిసే చర్మం కోసం:

అలోవెరా జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి అలోవెరా జెల్ ను అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్ర పరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మంపై ఉన్న మొటిమలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.

రోజ్ వాటర్, అలోవెరా జెల్ ను సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయండి. దీన్ని కాసేపు చర్మంపై మసాజ్ చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ అలోవెరా జెల్ లో కాస్త తేనె కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి. దీని ముఖంతో పాటు మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత చర్మాన్ని మసాజ్ చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా జెల్ లో కొంత నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్, మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత దీన్ని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2,3 సార్లు చేస్తే అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ముడతలు పడిన చర్మం తిరిగి జీవం పోసుకోవడానికి బాదం నూనెలో, అలోవెరా జెల్ కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ఫేస్ క్లీన్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మంపై ముడతలు పోయి జీవం పోసుకుంటుంది.

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.

ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి.
భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా ఎసిడిటీ నుంచి బయట పడవచ్చు.
తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే ఎసిడిటీ రాకుండా చూసుకోవచ్చు.
భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి, దీనివల్ల ఎసిడిటీ తగ్గుతుంది.
భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు.
చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి, లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.

Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగానే పెరిగాయి. తులం బంగారం పై ఏకంగా 300 లకు పైగా పెరగ్గా, కిలో వెండి పై వెయ్యికి పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 88,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,380 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,380 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,410. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..66,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,500 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,350, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.71,380 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 88,500, ముంబైలో 85,000, ఢిల్లీలో 85,000, బెంగుళూరు లో 83,500, అదే విధంగా హైదరాబాద్ లో 88,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Ooty-Kodaikanal Tour: ఇక ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే అనుమతి ఉండాల్సిందే, ఎవరిస్తారు, ఎలా తీసుకోవాలి

Ooty-Kodaikanal Tour: ప్రస్తుతం అందరూ వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నారు. దక్షిణాదిలో ప్రముఖ వేసవి విడిది కేంద్రాలంటే అందరికీ గుర్తొచ్చేది ఊటీ, కొడైకెనాల్. మీరు కూడా ఈ రెండు ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఎవరి అనుమతి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో చూద్దాం.

దక్షిణ భారతదేశంలో అందమైన చల్లని హిల్ స్టేషన్ ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు. చల్లగా ఉండటమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఎండల్నించి ఉపశమనం పొందేందుకు అందరూ ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు సందర్శిస్తుంటారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వతాలపై ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఊటీ లేదా ఉదకమండలం. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరింత చల్లగా ఉంటుంది. బొటానికల్ పార్క్, జింకల పార్క్, ఊటీ సరస్సు, పైకారా సరస్సు, కాఫీ తోటలు ఇలా అన్నీ చూడదగ్గవే.

ఇక రెండవది కొడైకెనాల్. ఊటీకు సమీపంలోనే ఉంటుంది. ఇది దిండిగల్ జిల్లాలోని హిల్ స్టేషన్. పశ్చిమ కనుమల్లో పళని కొండల్లో భూమికి 2,225 అడుగుల ఎత్తులో ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌గా పిలిచే కొడెకెనాల్ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా ఊటీతో పాటు అభివృద్ధి చెందింది. అందమైన జలపాతాలు, కృత్రిమంగా నిర్మించిన సరస్సు, అందమైన ఉద్యానవనాలు చాలానే ఉన్నాయి.

ఊటీ, కొడైకెనాల్ సందర్శించాలంటే ఈ ఏడాది నుంచి ఇవాళ్టి నుంచి తమిళనాడు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా మారింది. మద్రాస్ హైకోర్టు సూచనల మేరకు ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంటే ఇవాళ్టి నుంచి ఊటీ, కొడెకెనాల్ వెళ్లాలంటే ముందుగా ఈ పాస్ తీసుకోవాలి. మే 7 నుంచి జూన్ 30 వరకూ ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకుల్ని తీసుకెళ్లే వాహనాలకు ఈపాస్ అవసరం. ఇవాళ్టి నుంచి ఈపాస్ ఉంటేనే ఊటీ, కొడెకెనాల్‌లో ప్రవేశం ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ సందర్సించాలనుకుంటే www.epass.tnega.org వెబ్‌సైట్‌లో ఎప్పుడు వెళ్తున్నారు, ఎన్ని రోజులు బస చేస్తున్నారు, వాహనాన నెంబర్ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 7 నుంచి జూన్ 30 వరకూ మాత్రమే ఈపాస్ విధానం అమల్లో ఉంటుంది. ఆ తరువాత అవసరం లేదు.

పర్యాటకులు నమోదు చేసిన వివరాల్ని పరిశీలించి ఈ పాస్ జారీ చేస్తారు. ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్‌లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. చెక్ పోస్టుల వద్ద క్యూ ఆర్ కోడ్ తనిఖీ చేస్తారు. ఊటీ, కొడైకెనాల్ స్థానికులకు మాత్రం ఈ పాస్ అవసరం లేదు. టీఎన్ 43 రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.

ఆన్‌లైన్ పోర్టల్‌లో పర్యాటకులు తమ పేరు, చిరునామా, ఎన్నిరోజులు బస చేస్తారు, ఎక్కడ బస చేస్తారు, వాహనం నెంబర్ , ఆధార్ కార్డు వివరాలు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.

రూ.4000 – రూ.3000 ఏది కావాలో తేల్చుకోండి!

వివిధ వర్గాల లబ్ధికి ఆద్యుడు చంద్రబాబే
పింఛన్ల చరిత్రలో తెదేపాది సామాజిక విప్లవం
అభాగ్యులకు జగన్‌ చేసిందంతా దగానే
ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఇబ్బడిముబ్బడిగా కోత
ఈ ఇబ్బందులను తీర్చేలా ఈసారి తెదేపా వరాల జల్లు

రాష్ట్రంలో రాజకీయం పింఛను చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా… పార్టీలకు ముఖ్య ప్రచారాస్త్రం ఆసరాగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసిందెవరు? మోసం చేసిందెవరు? ఆచి తూచి, పరిశీలించాల్సిన విషయమిది…

  • అర్హులందరికీ పింఛను ఇచ్చే ఆరాటంలో తెదేపా.. 
  • ఎక్కువ మందిని అనర్హులను చేసే పనిలో వైకాపా..
  • ఐదేళ్లలో పింఛను డబ్బులు ఎకాఎకి పది రెట్లు పెంచిన తెదేపా..
  • రూ.1000 పెంచేందుకు ఐదేళ్లు తీసుకున్న వైకాపా..
  • పింఛను చరిత్రలో సామాజిక విప్లవం తెచ్చిన తెదేపా..
  • లబ్ధిదారులను ఏమార్చే ప్రణాళికలో వైకాపా..
  • బడుగు, బలహీన వర్గాలకు ఆసరా అందించే దిశగా తెదేపా..
  • వారి జీవితాల్ని ప్రశ్నార్థకం చేసే ఆలోచనలో వైకాపా..
  • సంక్షేమానికి, సంక్షోభానికి… మంచికి, వంచనకు… అభ్యుదయానికి, జగన్నాటకానికి… మధ్య జరగబోయే ఈ ఎన్నికలో సరైన ఎంపిక… ఆంధ్రావని పునరుజ్జీవనానికి పూనిక!

తెదేపా గెలిస్తే… ఈ ఏప్రిల్‌ నుంచే అమలు

  • ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు రూ.1000 అదనం
  • ఆ మూడు నెలలది కలిపి జులైలో ఇంటికే…
  • వరసగా రెండు నెలలు ఎవరైనా తీసుకోకపోయినా ఆ మొత్తం కలిపి మూడో నెల అందజేత
  • దివ్యాంగులకు రూ.6 వేల పింఛను
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అమలు
  • పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను
  • కిడ్నీ సంబంధిత , తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు
  • వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పింఛను అందజేత

అందరికీ వరాల మాల

అన్ని వర్గాలకూ అండగా నిలవడం అత్యవసరమని గుర్తించిన తెదేపా సామాజిక భద్రత పింఛన్ల చరిత్రలోనే ఒక విప్లవాన్ని సృష్టించింది. పార్టీ ఆవిర్భావం నుంచి బడుగులకు తిరుగులేని దన్నుగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఏయే వర్గాలకు ఆసరా అవసరమో ఎప్పటికప్పుడు గుర్తించి వారందరికీ అండగా నిలబడింది. మారుతున్న కాలం… పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఖర్చులు అంచనా వేస్తూ పింఛను మొత్తాన్ని పెంచింది. 1984లో రూ.30 ఇచ్చింది. ఆ తర్వాత 1995లో రూ.75కి పెంచింది. 2014-19 మధ్య రూ.200గా ఉన్న పింఛను మొత్తాన్ని ఏకంగా రూ.2 వేలు చేసింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 10 రెట్లు పెంచింది. ఇది సామాజిక భద్రత పింఛన్ల చరిత్రలోనే ఒక రికార్డు. అంతేకాదు… కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నామని, ఏదో ఒక వంక పెట్టి పాత వారికి కోత వేయలేదు. ఎక్కడాలేని నిబంధనలు తెచ్చి కొర్రీలూ వేయలేదు. సామాజిక భద్రత పింఛనుదారులపై ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే వ్యవహరించింది.

ఆ కష్టం…ఇక ఉండదు!

ర్నూలు, వైఎస్‌ఆర్‌, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక మంది వలస కార్మికులున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో వృత్తిరీత్యా ఉంటున్న పిల్లల వద్ద ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ సమయానికి పింఛను తీసుకోలేని వారూ ఉంటారు.  తెదేపా హయాంలో ఇలాంటివారు రెండు నెలలకో, మూడు నెలలకో తమ గ్రామాలకు వచ్చినప్పుడు పింఛను మొత్తాన్ని తీసుకునేవారు. ఇబ్బందులు కలిగించకుండా అధికారులూ సహకరించేవారు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనే నిబంధనను సీఎం జగన్‌ తేవడం వల్ల ఇలాంటివారికి పింఛను దక్కకుండా పోయింది. రెండున్నరేళ్ల నుంచి వేల మందికి ఇలా పింఛను మొత్తం అందకుండా చేశారు. తాజాగా చంద్రబాబు ఇలాంటివారికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారంలోకి రాగానే వివిధ కారణాలతో 2 నెలలు పింఛను తీసుకోలేకపోయినవారికి మూడో నెలలో మొత్తం కలిపి ఒకేసారి ఇస్తామని హామీనిచ్చారు.

దివ్యాంగులకు 100 శాతం పెంపు….

పింఛను పెంచాలని ఎక్కువ శాతం వైకల్యమున్న వారు రెండు మూడేళ్లుగా మొత్తుకుంటున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెదేపా ప్రభుత్వమిచ్చిన రూ.3వేల పింఛనుతోనే సరిపెట్టింది. రూపాయి పెంచకపోగా ఇచ్చే రూ.3 వేలూ తానే పెంచి అమలు చేసినట్టు జగన్‌ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు దివ్యాంగులకు తెదేపా భారీ వరాన్ని ప్రకటించింది. అధికారంలోకి రాగానే వారికి అందుతున్న పింఛను మొత్తాన్ని రూ.6 వేలు చేస్తామని ప్రకటించింది.  ఇప్పుడున్న మొత్తానికి 100 శాతం పెంచుతామంది.

పింఛనుదారులకు తెదేపా వరాలు ప్రకటించింది. అధికారంలోకి వస్తే పింఛను రూ.4 వేలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ.. దాన్ని ఏప్రిల్‌ నుంచే అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రూ.3 వేల చొప్పున ఏప్రిల్‌ నెలకు పింఛను ఇచ్చింది. మే, జూన్‌ నెలల్లోనూ ఈ మొత్తాన్నే ఇవ్వనుంది. ఎన్నికలు ముగిశాక కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే జులైలో పింఛను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నెలలో ఇచ్చే రూ.4 వేలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి అదనంగా రూ.వేయి చొప్పున మూడు నెలలది కలిపి అందిస్తామని తెలిపింది. అంటే జులైలో ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున అందనుంది. ఇదేకాకుండా దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామని స్పష్టం చేసింది. పింఛనుదారుల ఇంటి వద్దనే పింఛను మొత్తాన్ని వాలంటీర్లతో అందిస్తామని వెల్లడించింది.

అదో స్వర్ణయుగం…

తెలుగుదేశం పాలనా కాలంలో 2014-19 మధ్య రూ.200 పింఛను మొత్తాన్ని రెండు విడతల్లో రూ.2 వేలకు పెంచడమే కాదు చర్మకారులకు, 50 ఏళ్లు పైబడిన డప్పు కళాకారులు, మత్స్యకారులు, 30 ఏళ్లుదాటిన ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన హిజ్రాలకు తొలిసారిగా పింఛను మంజూరుచేశారు.

2014 డిసెంబరు : ఆదివాసీల వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారు. 2019 ఫిబ్రవరిలో ఎస్టీలందరి వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 ఏళ్లనుంచి 50 ఏళ్లకు తగ్గించారు. వేల సంఖ్యలో ఎస్టీలు లబ్ధిపొందారు.
2017 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకునే రోగులకు రూ.2,500 తొలిసారిగా మంజూరు చేశారు. 2018 జులైలో ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకున్నా వర్తింపచేశారు. 2019లో ఈ తరహా రోగులకిచ్చే పింఛను మొత్తాన్ని రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచారు.
2018 జనవరి : 18 ఏళ్లు దాటిన హిజ్రాలకు రూ.1500 పింఛను మంజూరు చేశారు. సరిగ్గా ఏడాదికి ఆ పింఛను మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు.
2018 జూన్‌ : తొలిసారిగా 50 ఏళ్లుపైబడిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డప్పు కళాకారులకు రూ.1,500 పింఛను మంజూరు చేశారు. ఏడాది తిరగకుండానే 2019 ఫిబ్రవరిలో వారికిచ్చే పింఛను మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు.
2018 నవంబరు : మొట్టమొదటిసారిగా చర్మకారులకు  రూ.1000 పింఛను మంజూరుచేశారు. ఆ తర్వాత రెండు నెలలకే చంద్రబాబు హయాంలోనే రూ.2 వేలకు పెరిగింది.
2018 : 50 ఏళ్లకన్నా వయసు పైబడిన మత్స్యకారులకు రూ.1000 పింఛను మంజూరుచేశారు.
2018 : ఒంటరి మహిళలకు రూ.1000 పింఛను ప్రకటించారు. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు.

తెదేపా నుంచి అధికారమార్పిడి జరిగేనాటికి పింఛన్ల సంఖ్య 54 లక్షలకు చేరింది.


వైకాపా వస్తే… 2028 నుంచి రూ.3250

  • కొత్తగా వెంటనే ఏమీ పెరగదు. నాలుగేళ్ల తర్వాత 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెరుగుతుంది. దివ్యాంగులకూ ఇదే పరిస్థితి
  • వరసగా రెండు నెలలు తీసుకోకపోతే ఆ మొత్తాన్ని మరుసటి నెలలో ఇవ్వరు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలి
  • వరసగా మూడు నెలలు తీసుకోకపోతే పింఛను పూర్తిగా పోయినట్టే
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకు పింఛను ఇవ్వరు
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛను (ఇప్పటికే అమలవుతోంది)

అన్నీ కోతలే..!

సంక్షేమానికి తానే ఆద్యుడనని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్లలో పింఛనుదారులకు చేసిన దగా అంతాఇంతా కాదు. రకరకాల నిబంధనలతో, ఆదాయ పరిమితి, వ్యవసాయ భూమి వంటి షరతులతో తొలి దశలోనే చాలామంది లబ్ధిదారులకు కత్తెరవేశారు. అన్నీ ఉన్నా… అందరూ ఉన్నా… సరిగ్గా చూసుకునే వారు లేరనే సామాజిక భద్రత పింఛన్లను గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. అది తెలిసీ జగన్‌ దుర్మార్గంగా వ్యవహరించారు. ఇబ్బడిముబ్బడిగా కోత వేశారు. తెదేపా ప్రభుత్వంలో ఉన్న రూ.2 వేల పింఛనును రూ.3 వేలకు పెంచేస్తానని చెప్పి, అమలు చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఏటా పెంచింది రూ.250 మాత్రమే. చివరి విడత రూ.250 ఎన్నికలు నాలుగు నెలల్లో ఉన్నాయనగా ఈ జనవరిలో పెంచారు. పెంచిన ప్రతిసారీ ఏదో సాకు చూపి పింఛనుదారుల సంఖ్యలో కత్తెర వేశారు. 80 శాతంపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాలకు తెదేపా ప్రభుత్వమే రూ.3 వేలు పింఛను అందించింది. వీరికి గత ఐదేళ్లలో జగన్‌ ఒక్క రూపాయీ పెంచింది లేదు.

రాకుంటే పింఛను ఉండదు…

చంద్రబాబు హయాంలో దూరా భారమో… ఆరోగ్య సమస్యలో… ఇతర పనులో ఉండి…ఏ నెల పింఛనును ఆ నెల తీసుకోకపోయినా తరువాత నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు. కానీ జగన్‌కు పేదలు ఇలా లబ్ధిపొందడం ఇష్టంలేదు. ఏ నెల పింఛను ఆ నెల తీసుకోవాలని కొత్త నిబంధన పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లే వారు, ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు…పింఛను తీసుకునేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పింఛను రద్దు చేస్తారన్న భయంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు వ్యయప్రయాసలకోర్చి స్వగ్రామానికి వచ్చేవారు. ఇంతాజేసి వారికి మిగిలేది నామమాత్రమే. మూడు నెలలు వరసగా తీసుకోలేదనే కారణంగా ప్రతి నెలా 5వేల పింఛన్లు తొలగిస్తున్నారంటే ఈ నిబంధన ఎంతమందిపై  ప్రభావం చూపిందో స్పష్టమవుతోంది.

పదే పదే అబద్ధాలు…

తెదేపా ప్రభుత్వంలో 53.85 లక్షల మందికి పింఛన్లు అందేవి. దీనికోసం నెలకు రూ.1,305 కోట్లు ఖర్చు చేసేది. ఇది వైకాపా ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కే. దీన్ని దాచిపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. తెదేపా ప్రభుత్వం 30 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేదని అసత్యాలు వల్లె వేస్తున్నారు. ప్రస్తుతం 65.95 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. తెదేపా ప్రభుత్వం అభయహస్తం పింఛన్లు, కళాకారులు, బ్రాహ్మణులు, సైనిక సంక్షేమ పింఛన్లు, అమరావతిలో భూముల్లేని పేదలకు ఇచ్చే పింఛన్లను సామాజిక భద్రత పింఛన్ల కింద చూపించలేదు. వాటిని ప్రత్యేకంగా అందించేది. కానీ.జగన్‌ మాత్రం వీటిని కూడా సామాజిక భద్రత పింఛన్ల కిందకే మార్చి అంకెలు పెంచి చూపిస్తున్నారు.

తెదేపా ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛనుదారులున్నా భారంగా భావించకుండా ఆర్థికసాయం అందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు… ఇలా వివిధ కేటగిరీల పింఛన్లు ఒకే ఇంట్లో ఉన్నా కోత వేయలేదు. జగన్‌ అధికారంలోకి రాగానే మొదట వేసిన వేటు వీరిపైనే. ఒకే రేషన్‌ కార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే నిబంధన తెచ్చి విచ్చలవిడిగా తొలగించారు. ఇలా తీసేసింది పదో పాతికో కాదు….వేలల్లో. పేదలందరూ గగ్గోలు పెడుతున్నా….ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి…. ఇతర అవసరాలరీత్యా వేరేచోట ఉంటున్న లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానంలో ఉన్నచోటే పింఛను తీసుకునే వెసులుబాటును 2021లో తీసేయించారు. దీంతో వేరే ఊళ్లలో, పిల్లల దగ్గర ఉంటున్న వృద్ధులు, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి కల్పించారు.

ఒంటరి మహిళల వేదన

ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను మంజూరుకు నిబంధనలు తెచ్చారు. తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వగా…. జగన్‌ ఆ అర్హత వయసును కుదించారు. 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే పింఛను అందిస్తున్నారు..

పారదర్శకత అంటే ఇదేనా?

ఎక్కడా లేని పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పే జగన్‌…..చేతల్లో దానికి పాతరేశారు. సామాజిక తనిఖీ చేస్తే ఏయే కారణాలు చూపి ఎంతమందికి పింఛన్లు ఎగ్గొట్టేది బయటపడుతుందని రెండేళ్లుగా పక్కనపెట్టారు. అర్హులు, అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. తనిఖీకి పంపిన జాబితా సైతం జిల్లా అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా జనవరిలో కొత్త పింఛన్లకుగాను 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే… 1.17 లక్షల మందికి మాత్రమే మంజూరుచేశారు. దాదాపు 97 వేల మందికి కారణాలు చెప్పకుండానే నిలిపేశారు. 2021 మేలో 50 వేలు, జూన్‌లో 45వేల మంది పింఛనుదారుల్లో తగ్గుదల ఉంటే… జులైలో ఏకంగా 1.30 లక్షల తగ్గుదల కనిపించింది. 2022 డిసెంబర్‌లో 57 వేలు, 2023 అక్టోబర్‌లో 24వేల తగ్గుదల ఉంది. ఇలా ప్రతి నెలా పింఛన్ల మంజూరు పరిశీలిస్తే అసాధారణ తగ్గుదల కనిపిస్తోంది.

కులవృత్తిదారులపై దొంగదెబ్బ

కులవృత్తి పింఛనుదారులపై జగన్‌ కక్షకట్టారు. జనవరిలో కొత్త పింఛన్ల మంజూరులో కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేతకారులు, డప్పు కళాకారులు, చర్మకారుల దరఖాస్తులన్నీ పక్కనపెట్టారు. వారందరూ పింఛను తీసుకునేందుకు అర్హులేనని క్షేత్రస్థాయిలో అధికారులు తేల్చినా పక్కనపెట్టారు. ఇక చేనేత కార్మికులపై మరింత దుర్మార్గంగా వ్యవహరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛను మంజూరు చేసేందుకు చరిత్రలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రీ పెట్టని విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. సంఘాల్లో ఉన్న వారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలని పేర్కొన్నారు. మాస్టర్‌ వీవర్‌ దగ్గర కూలికి పనిచేస్తుంటే….ఆయన చెల్లించిన నెలవారీ కూలి డబ్బులు రెండేళ్లపాటు ఆ చేనేత కార్మికుని బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ అయినట్టు ఆధారాలు చూపించాలి. అంతేకాదు రెండేళ్లపాటు మాస్టర్‌ వీవర్‌ దగ్గరే పనిచేస్తున్నట్టు ధ్రువీకరణ కూడా ఇవ్వాలన్నారు. సొంత మగ్గం నేసే కార్మికులైతే జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) లేదా ప్రైవేటు వ్యాపారి నుంచి రెండేళ్లపాటు కొనుగోలు చేసిన ముడి సరకుకు జీఎస్టీ చెల్లింపులు ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఇలాగైతే ఒక్క చేనేత కార్మికునికి కూడా పింఛను మంజూరుకాదని జిల్లా కలెక్టర్లు స్పష్టంగా చెప్పినా…జగన్‌ చెవికెక్కించుకోలేదు.

Vivo Y18 4G: రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. మార్కెట్లోకి వివో కొత్త ఫోన్‌

మార్కెట్లో 5జీ ఫోన్‌ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరుగుతోన్న నేపథ్యంలో 4జీ ఫోన్‌లను తక్కు ధరకు తీసుకొచ్చే పనిలో పడ్డాయి కంపెనీలు. ముఖ్యంగా రూ. 10వేలలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై18 పేరుతో ఈ 4జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తీసుకొచ్చారు.

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999కాగా, 4 జీబీ ర్యామ్‌.. 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ లభించనుంది.

వివో వై18 4జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ ఎల్‌సీడీ హెచ్‌cw డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఫోన్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌‌ కెమెరాను అందించారు. ఐపీ54 రేటింగ్‌తో కూడిన వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌ను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్‌, 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ 2.0 ఫీచర్లను అందించారు

ప్రయాణ సమయంలో వాంతులు మరియు వికారం నుండి బయటపడటానికి ఈ చిట్కాలను అనుసరించండి

ప్రయాణ సమయంలో చలన అనారోగ్యం అనేది ప్రజలకు చాలా సవాలుగా ఉంటుంది . ప్రయాణంలో ఈ అనారోగ్యాన్ని నివారించడానికి చాలా మంది మందులు తీసుకుంటారు, కానీ ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఆయుర్వేదంలో ఇటువంటి అనేక మూలికలు ఉన్నాయి, వీటిని ప్రయాణ సమయంలో చలన అనారోగ్యాన్ని నివారించడానికి ఉపయోగించవచ్చు.

ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు ప్రయాణాలు కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి. ప్రయాణంలో చాలా మంది కళ్లు తిరగడం, వాంతులు అవుతాయి. దీన్నే మోషన్ సిక్‌నెస్ అంటారు. ఈసమస్యదీంతో ప్రజలు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. కానీ నియంత్రించడం కూడా సులభం.

పోషకాహార నిపుణుడు రాజమణి పటేల్ ప్రకారం, ప్రయాణ సమయంలో చలన అనారోగ్యం అనేది ప్రజలకు చాలా సవాలుగా ఉంటుంది. ప్రయాణంలో ఈ అనారోగ్యాన్ని నివారించడానికి చాలా మంది మందులు తీసుకుంటారు, కానీ ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఆయుర్వేదంలో ఇటువంటి అనేక మూలికలు ఉన్నాయి, వీటిని ప్రయాణ సమయంలో చలన అనారోగ్యాన్ని నివారించడానికి ఉపయోగించవచ్చు.

అల్లం:

అల్లం మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో అల్లం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అల్లంలో ఉన్నటువంటి గుణాలు ప్రయాణ సమయంలో వచ్చే వికారం మరియు వాంతుల సమస్యను నివారిస్తుంది. మీకు వాంతులు, వికారం వ్యాధి ఉన్నట్లయితే, మీరు అల్లం టీ, మిఠాయి లేదా చిన్న ముక్కలను నమలవచ్చు.

తులసి:

తులసికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పొట్టకు ఉపశమనం కలిగించడంలో తులసి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.

లవంగాలు:

మోషన్ సిక్‌నెస్ నుండి ఉపశమనం పొందడంలో చిన్న లవంగం కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన హెర్బ్. అయితే వేసవిలో వీటిని ఎక్కువగా తినకూడదు. మొత్తం లవంగాలను తినవచ్చు లేదా నీటిలో మరిగించి త్రాగవచ్చు.

ఏలకులు:

ఏలకులను సుగంధ మసాలా అని కూడా అంటారు. ఇది ప్రతి భారతీయ వంటకాలలో ఉపయోగించబడుతుంది. పొట్టకు ఉపశమనాన్ని కలిగించడంతో పాటు వాంతులు, వికారం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో ఇది మేలు చేస్తుంది. ప్రయాణ సమయంలో, మీరు ఏలకులు నమలవచ్చు లేదా దాని నుండి టీ తయారు చేసి త్రాగవచ్చు.

ఏపీలో మరో వారంలో ఎన్నికలు.. సీఎం జగన్ తీవ్ర ఆందోళన

మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమని చెప్పారు. ఇష్టానుసారంగా అధికారులను బదిల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నలో వైసీపీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మంచి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి భూములు వారికివ్వడమే ఈ యాక్ట్ లక్ష్యమన్నారు. భూ వివాదాలు తలెత్తకూడదనే ఈ యాక్ట్‌ను తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. యాక్ట్ వల్ల ఎలాంటి నష్టముండదని.. అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఉందన్నారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులను భద్రంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందజేస్తామా సీఎం జగన్ పేర్కొన్నారు.

AP Inter Advanced Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది.
రెండు సెషన్లలో పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్‌ ఇయర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.

ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌…

మే 24వ తేదీన ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-1, 2 ఉంటుంది. మే 25వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. మే 27న మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్‌-1, 2, సివిక్స్‌ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి.

మే 28వ తేదీన మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బీ, 2బీ, జువాలజీ పేపర్‌-1, 2 ఉంటుంది. మే 29వ తేదీన హిస్టరీ పేపర్‌-1, 2, ఫిజిక్స్‌ పేపర్‌-1, 2, ఎకనామిక్స్‌ పేపర్‌-1, 2 జరుగుతుంది.

మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్‌-1, 2, కామర్స్‌ పేపర్‌-1, 2, సోషియాలజీ పేపర్‌-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్‌ పేపర్‌-1, 2 మే 31వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, 2, లాజిక్‌ పేపర్‌-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2 జూన్‌ 1వ తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 2, జాగ్రఫీ పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయి.

Oplus_131072

Health Tips: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా? వీటిపై ఎలాంటి ప్రభావం!

చాలా మంది ఉదయం బ్రష్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. బ్రష్‌ చేయకుండా నీటిని తాగితే మంచిదేనా? వైద్యుల ప్రకారం.. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి.
అయితే బ్రష్‌ చేసిన తర్వాతే నీటిని తాగడం మంచిదని భావిస్తుంటారు. కొందరు బ్రష్‌ చేయకుండానే నీటిని తాగుతుంటారు. ఆయుర్వేదం నుండి ఆరోగ్య నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా వ్యాధులు రావని భావిస్తున్నారు. ఈ వ్యాధులలో గ్యాస్, అసిడిటీ, చర్మ వ్యాధులు, మలబద్ధకం, నీరసం, బిపి, మధుమేహం కూడా ఉన్నాయి. పళ్ళు తోముకున్న తర్వాత ఎంత సేపటికి నీరు తాగాలి? ఉదయాన్నే పళ్లు తోముకోకుండా నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రష్‌ చేయకుండా నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బరువు తగ్గడంలో మేలు చేస్తుంది- ఉదయం పూట బ్రష్‌ చేయకుండా వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా బ్రష్‌ చేయకుండా నీటిని తాగడం ఒక వ్యక్తి ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా వ్యక్తి ఉదయం అదనపు కేలరీలు తీసుకోకుండా ఉంటారు. పళ్లు తోమకుండా ఉదయాన్నే నీళ్లు తాగితే ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చునని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు బరువు తగ్గాలని కోరుకుంటే, ఉదయాన్నే పళ్ళు తోముకునే ముందు నీరు తాగే అలవాటు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.
హై బీపీ, హై షుగర్- హై బీపీ, బ్లడ్ షుగర్ సమస్య ఉదయాన్నే నీటిని తాగడం ద్వారా నియంత్రించవచ్చు. ఇందుకోసం ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.
మెరుగైన జీర్ణక్రియ – ఉదయం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోమకుండా నీరు త్రాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ అలవాటు ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌ను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది.
మెరుగైన రోగనిరోధక శక్తి – ఉదయం పళ్ళు తోముకునే ముందు నీరు తాగడం వల్ల వ్యక్తి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయం పూట బ్రష్‌ చేయకుండానే నీటిని తీసుకోవాలి.
నోటి దుర్వాసన పోతుంది – తరచుగా నోరు పొడిబారడం వల్ల ఒక వ్యక్తికి నోటి దుర్వాసన మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు తాగటం ద్వారా ఈ సమస్య నయమవుతుందంటున్నారు నిపుణులు. నోటిలో బ్యాక్టీరియాను తొలగించడానికి లాలాజలం కలిగి ఉండటం అవసరం. కానీ నిద్రిస్తున్నప్పుడు తక్కువ స్థాయి లాలాజలం కారణంగా నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన రావచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యను నివారించడానికి ఉదయం పళ్ళు తోముకునే ముందు నీరు తాగాలి.
బ్రష్ చేసిన తర్వాత ఎంతసేపు నీళ్లు తాగాలి? ఒక వ్యక్తి బ్రష్ చేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాల వరకు ఏదైనా తినడం లేదా తాగడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

Mango Murabba: సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!

సమ్మర్‌లో వచ్చే మామిడి కాయల గురించి ఏడాది అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి మామిడి కాయలు. అందులోనూ చిన్న పిల్లలు ఉంటే..
ఎన్ని మామిడి కాయలు తెచ్చినా సరిపోవు. మామిడి కాయలతో ఎన్నో రకాల వెరైటీలు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మామిడి కాయతో రకరకాల పచ్చళ్లు పెడతారు. అలాగే పలు రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. మామిడి కాయలతో స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా మ్యాంగో మురబ్బా తయారు చేస్తారు. చాలా మందికి ఇది తెలుసు. కానీ తయారు చేయడం రాదు. ఈ రెసిపీ చేయడం చాలా సులువు. ఇది తయారు చేయడానికి కేవలం పుల్లగా ఉండే మామిడి కాయలను మాత్రమే ఎంచుకోవాలి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మ్యాంగో మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు:

మామిడి కాయలు, యాలకులు, పంచదార, బెల్లం తురుము, బ్లాక్ సాల్ట్, కారం, జీలకర్ర పొడి.
మామిడి కాయ మురబ్బా తయారీ విధానం:

మామిడి కాయల మురబ్బా తయారు చేయడానికి పుల్లగా ఉండే మామిడి కాయల్ని ఎంచుకోవాలి. అలా అయితేనే ఈ రెసిపి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచి కూడా పర్ ఫెక్టుగా వస్తుంది. ముందుగా మామిడి కాయలపై ఉండే పొట్టును తీసేయాలి. ఆ తర్వాత సన్నగా తురిమి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చిన్న మంట పెట్టాలి. ఆ తర్వాత ఇందులోనే మామిడి కాయ తురుము వేయాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసి.. బాగా కలపాలి. పంచదార వేసి.. మొత్తం మిశ్రమాన్ని బాగా ఉడికించాలి.

ఇప్పుడు ఇది హల్వాగా తయారవుతుంది. ఈ సమయంలో ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇదంతా దగ్గర పడ్డాక.. చిన్న మంట మీద ఉడికించి.. బెల్లం తీగ పాకంలా సాగుతున్నట్టు అవుతుంది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా యాలకుల పొడి వేసుకోవాలి. కావాలి అనుకునేవారు డ్రైఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాంగో మురబ్బా రెడీ. ఈ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది.

దేవర షూటింగ్ స్పాట్‌లో ఘోర ప్రమాదం..20 మందికి తీవ్ర గాయాలు!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌ల్లోఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే దేవర మూవీ షూటింగ్ ‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీ షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఒక తేన తెట్ట కదలడంతో, అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులపై అవ దాడి చేశాయి. దీంతో వారు పరుగులు పెడుతున్న క్రమంలో వారికి తీవ్రంగా గాయాలు అయ్యాయంట. వెంటనే వారిని దగ్గరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 మంది ఈ తేనెటీగల దాడిలో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా దాడి జరిగినట్లు సమాచారం.

ఇక మూవీ షూటింగ్ స్పాట్‌లో ఎవరూ సెల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల షూటింగ్ స్పాట్‌లో ఇలాంటి జాగ్రత్తలు మరింత ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ‘దేవర’ షూటింగ్ స్పాట్‌లో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగల దాడి జరిగిన సమయంలో కూడా ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Ap Elections: ఎన్నికల సంఘం సీరియస్.. ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ రాజకీయాల్లో ఈసీ నిర్ణయాలు సంచలనంగా మారాయి. మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహణను ముమ్మరం చేసింది. అటు ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధానంగా నేతల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కోడ్ ఉల్లంఘిస్తూ ఎవరూ ప్రవర్తిస్తున్నా వెంటనే చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది అధికారులపై చర్యలు తీసుకుంది. చంద్రబాబు, జగన్ లాంటి నాయకులకు కూడా నోటీసులు జారీ చేసింది. చర్యలు ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో నేతలు అనుసరిస్తున్న తీరు, చోటు చేసుకుంటున్న ఘటనలు, నేతల ప్రసంగాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తోంది.

తాజాగా సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక చేసింది. మేమంతా సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ అనుచితంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇవ్వాలని 2 రోజులు సమయం ఇచ్చింది. అయినా సరే సీఎం జగన్ మోహన్ రెడ్డి అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం మళ్లీ సీరియస్ అయింది. జగన్‌కు గతంలో ఇచ్చిన నోటీసుపై సరైన వివరణ రాకపోవడంతో ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం హోదాలో ఉన్న జగన్ బాధ్యతారహితంగా మాట్లాడటం తప్పని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సభల్లో, రోడ్ షోల్లో ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. అటు చంద్రబాబుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ సభల్లో జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని ఈసీ సూచించింది.

Home Loan: గృహ రుణాలపై షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ, ఇంటి అప్పుల్లో ఇంత స్పీడా?

Home Loan Outstanding: గృహ రుణాలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చెప్పిన వివరాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఇంటి అప్పుల గణాంకాలు ఆశ్చర్యకరమైన వేగంతో పెరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం బ్యాంక్‌లు/ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి, హౌసింగ్ లోన్ డేటాను ఆర్‌బీఐ ఆదివారం విడుదల చేసింది.

రెండేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఔట్‌స్టాండింగ్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా లెక్కల ప్రకారం, 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (FY24) మొత్తం గృహ రుణ బకాయిలు (Home Loan Outstanding) రూ. 27.23 లక్షల కోట్లకు (రూ. 27.23 ట్రిలియన్లు) చేరింది. ఇవి.. 2022 మార్చి ముగింపు (FY22) నాటికి రూ. 17,26,697 కోట్లుగా ఉండగా, 2023 మార్చి ముగింపు ‍‌(FY23) నాటికి రూ.19,88,532 కోట్లుగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే, కేవలం గత సంవత్సరాల్లోనే గృహ రుణ బకాయిలు ఏకంగా రూ. 10 లక్షల కోట్లు (రూ.10 ట్రిలియన్లు) పెరిగాయి.

గృహ రుణ బకాయిలు అంటే తీసుకున్న మొత్తం హౌసింగ్‌ లోన్‌ కాదు. అప్పు తీర్చగా ఇంకా మిగిలిన మొత్తాన్ని ఔట్‌స్టాండింగ్‌ అమౌంట్‌ అంటారు.

2024 మార్చి ముగింపు నాటికి వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు (Loan Outstanding Of Commercial Real Estate) రూ. 4,48,145 కోట్లకు చేరాయి. 2022 మార్చి ముగింపు నాటికి ఇవి రూ. 2,97,231 కోట్లు మాత్రమే. ఇవి కూడా రెండు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 50% పెరిగాయి.

కొవిడ్-19 తర్వాత విపరీతంగా పెరిగిన డిమాండ్
కేంద్ర బ్యాంక్‌ గణాంకాల ప్రకారం, కొవిడ్-19 తర్వాత హౌసింగ్ సెక్టార్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం తెలిసొచ్చింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. హౌసింగ్‌ లోన్‌ ఔట్‌స్టాండింగ్‌ కేవలం రెండు సంవత్సరాల్లోనే రూ. 10 లక్షల కోట్లు పెరిగిందంటే, ప్రజలు ఏ స్థాయిలో హోమ్‌ లోన్స్‌ తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. గృహ విక్రయాలు పెరగడమే కాదు, గత ఆర్థిక సంవత్సరంలో ధరలు విపరీతంగా పెరగడం కూడా రుణ బకాయిలు పెరగడానికి ఒక కారణమని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

గృహ రుణాలు పెరగడానికి కొవిడ్‌ కాలంలో పుట్టుకొచ్చిన హౌసింగ్ డిమాండ్ కూడా ఓ కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. కొవిడ్‌ తర్వాత అన్ని ప్రైస్‌ రేంజ్‌ల్లోనూ గిరాకీ వృద్ధి చెందింది. కొవిడ్ కారణంగా ఆగిన కొనుగోలుదార్లు ఈ మధ్యకాలంలో ఇళ్ల కొనుగోళ్లు పూర్తి చేశారు. భరించగలిగే స్థాయి (Affordable Housing) నివాసాలకు డిమాండ్‌ పెంచడంలో ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. హౌసింగ్ లోన్లలో కనిపిస్తున్న ఈ వృద్ధి భవిష్యత్తులో కూడా బలంగా ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు.

ప్రాప్‌ఈక్విటీ (PropEquity) MD & CEO సమీర్ జసుజా చెప్పిన ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో న్యూ లాంచ్‌లు పెరగడం, రేట్లు పెరగడం కూడా గృహ రుణాలను పెంచాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత టైర్ 1 నగరాల్లో ఇళ్ల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. దీనివల్ల, ఇంటిపై తీసుకునే అప్పులు కూడా పెరిగాయి. గత కొంత కాలంగా ఖరీదైన ఇళ్లకు (Luxury Home) డిమాండ్ కూడా పెరుగుతోంది.

NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష విధానంలో మార్పులు, కొత్తగా ‘టైమ్-బౌండ్ సెక్షన్’ అమలు

National Board Of Examinations- నీట్‌ పీజీ-2024 పరీక్షల విధానంలో మార్పులు చేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) ప్రకటించింది. కొత్త విధానంలో ప్రకారం నీట్ పీజీ పరీక్షలో టైమ్-బౌండ్ సెక్షన్ (Time Bound Sections) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నీట్‌ పీజీతోపాటు.. నీట్‌ ఎండీఎస్‌ (NEET MDS), నీట్‌ ఎస్‌ఎస్‌, ఎఫ్‌ఎంజీఈ, డీఎన్‌బీ పీడీసీఈటీ (DNB PDCET), జీపీఏటీ, డీపీఈఈ (DPEE), ఎఫ్‌డీఎస్‌టీ (FDST), ఎఫ్‌ఈటీ (FET) పరీక్షల్లో ఈ కొత్త మార్పును తీసుకురానున్నట్లు NBEMS వెల్లడించింది.

అసలేంటి టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌..?
టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌ విధానం అనేది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలో సెక్షన్ల వారీగా సమయం కేటాయించడం. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. మల్టిపుల్‌ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్‌ పీజీతో పాటు NBEMS నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త విధానం ప్రకారం..

➥ నీట్‌ పీజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రంలో A, B, C, D, E అనే టైమ్‌ బౌండ్‌ సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఇస్తారు. ఇచ్చిన సమయంలో ఆసెక్షన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అభ్యర్థి మరో సెక్షన్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా ప్రతి సెక్షన్‌కు సమయం కేటాయింపు ఉంటుంది.

➥ అభ్యర్థులకు కేటాయించిన సమయం ముగిసిన తర్వాత ఒక సెక్షన్‌లోని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను మార్చేందుకు వీలు ఉండదు. ఇచ్చిన సమయంలో సంబంధిత సెక్షన్‌లో ఒక ప్రశ్నను రివ్యూ చేసుకొనేందుకు మార్కింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుందని ఎన్‌బీఈఎంఎస్‌ తెలిపింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అరుదైన ఛాన్స్! ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం

Janasena Chief Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం లభించింది. ఆయనకు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) నుంచి ఆహ్వానం వచ్చింది. మే 22వ తేదీన జరగనున్న ఐరాస సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించాలని ఆ ఆహ్వానంలో ఉంది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. భారతదేశం తరఫున ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉందని.. అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కిందని తెలిసింది. ఐరాస సమావేశంలో పాల్గొనడం కోసం మే 20న పవన్ కల్యాణ్ న్యూయార్క్ కు వెళ్లనున్నట్లు తెలిసింది.

దేశం తరఫున కృషి చేస్తున్న నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అంటున్నారు. అలా ఆ నలుగురిలో పవన్ కల్యాణ్ కు అవకాశం వచ్చినట్లు తెలిసింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 3వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మే 11 సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మే 13 నుంచి జూన్ 3 వరకూ రాజకీయ నాయకులు అందరూ ఉత్కంఠతోనే కాస్త విశ్రాంతిలో ఉండనున్నారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ కు మే 20న వెళ్తారని తెలుస్తోంది.

PM Modi: వైఎస్‌ జగన్‌పై ప్రధాని కన్నెర్ర.. అంతా అవినీతిమయం అంటూ ఫైర్..

అనకాపల్లి, మే 05: వైసీపీ(YCP) పాలన అంతా అవినీతిమయం.. ఏపీలో(Andhra Pradesh) మాఫియా రాజ్యం నడుస్తోంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం నాడు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడబోతోందన్నారు. కేంద్రంలోనూ ఎన్డీయే సర్కార్ వస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందిని ప్రధాని చెప్పారు. చంద్రుడి దక్షిణ భాగంపై భారత్‌ అడుగు పెట్టిందని.. ప్రపంచంలోనే భారత్‌ గౌరవం పెరుగుతోందన్నారు.

ఏపీ అభివృద్ధిపై.. వైసీపీ అరాచకాలపై ప్రధాని షాకింగ్ కామెంట్స్..

అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మించామని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ యువత కోసం ఎన్డీయే సర్కార్ పని చేస్తోందన్నారు. ఏపీకి ట్రిపుల్‌ఐటీ, ఐసర్‌, ఐఐఎం మంజూరు చేశామని ప్రధాని తెలిపారు. ఎన్డీయే మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి అని.. వైసీపీ మంత్రం అవినీతి..అవినీతి..అవినీతి.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని మోదీ.

అంతేకాదు.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రధాని ఆరోపించారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కానీ, వైసీపీ సర్కార్‌ మాత్రం ఏమీ చేయడం లేదని మోదీ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ ఆఫీస్‌కి వైసీపీ సర్కార్‌ భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జగన్‌ తండ్రి ప్రారంభించారని.. పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్‌ అడ్డుకుంటున్నారని ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ వల్లే అదంతా..

వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూత పడ్డాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో చెరుకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరుకు రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు ప్రధాని మోదీ. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని.. కర్ణాటకలో ట్యాంకర్, భూమాఫియా ప్రభుత్వం నడుస్తుంటే.. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తోందని విమర్శించారు ప్రధాని మోదీ.

BREAKING: ప్రభుత్వ పథకాలకు బ్రేక్.. సర్కార్ రిక్వెస్ట్‌కు ఈసీ రెడ్ సిగ్నల్

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఈసీ అనుమతి నిరాకరించింది. స్కీమ్స్‌కు ఫండ్స్ రిలీజ్ చేసేందుకు ఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇన్ ఫుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నో చెప్పింది. పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటిన్యూ కానున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

T20 jersey: టీ20 వరల్డ్‌ కప్‌ జెర్సీ రివీల్‌.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్‌ ట్రోల్స్‌!

టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్‌ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.

T20 jersey | ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించినప్పటినుంచి ఈసారి జెర్సీ (T20 jersey) ఎలా ఉండబోతోందో అంటూ టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న వేళ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌, కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ (Adidas) జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. హెలికాప్టర్‌ సాయంతో జెర్సీని ప్రదర్శిస్తుంటే.. రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ మైదానం నుంచి ఆసక్తికరంగా వీక్షిస్తున్నట్లు వీడియోను రూపొందించింది.

ఈ కొత్త జెర్సీ.. నీలం, కాషాయం రంగులు కలగలిపి ఉంది. ‘వి’ షేప్‌ నెక్‌ ఉంది. మే 7 నుంచి జెర్సీలు స్టోర్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అడిడాస్‌ అధికారికంగా జెర్సీని ఆవిష్కరించకముందే సంబంధిత చిత్రాలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో అధికారికంగా ప్రకటించిన వెంటనే ‘మాకు ముందే తెలుసులేవోయ్‌’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ముందు మీ పీఆర్‌ టీమ్‌ ఫైర్‌ చేయండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. జెర్సీ బాగుందంటూ కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ కలర్‌ కాంబినేషన్‌పై అసహనం వ్యక్తంచేస్తున్నారు. జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. జూన్‌ 5న ఐర్లాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

భారత్ కొత్త కిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. ‘ఒక జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా కొత్త టీ20 జెర్సీని ప్రజెంట్ చేశాం. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు అడిడాస్ స్టోర్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని బీసీసీఐ పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by adidas India (@adidasindia)

ఈ అవకాశం పోతే మళ్లీ రాదు.. APలో నెలకు 70 వేల జీతంతో ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 70 వేల వేతనం అందుకోవచ్చు. ఇలాంటి అవకాశం పోతే మళ్లీ రాదు. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 241 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
సీనియర్ రెసిడెంట్ ఖాళీల సంఖ్య:
241
విభాగాల వారీగా ఖాళీలు:
అనాటమీ: 25
ఫిజియాలజీ: 15
బయోకెమిస్ట్రీ: 20
ఫార్మకాలజీ: 20
పాథాలజీ: 23
మైక్రోబయాలజీ: 20
ఫోరెన్సిక్ మెడిసిన్: 15
కమ్యూనిటీ మెడిసిన్: 20
మెడిసిన్: 15
పీడియాట్రిక్స్: 05
డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ (డీవీఎల్): 04
సైకియాట్రీ: 04
జనరల్ సర్జరీ: 15
ఆర్థోపెడిక్స్: 03
ఒటోరినోలారిన్జాలజీ: 04
ఆప్తాల్మాలజీ: 04
ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 08
అనస్థీషియాలజీ: 09
రేడియో డయాగ్నసిస్: 10
డెంటిస్ట్రీ: 02
అర్హత:
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులు ఎంపికకు అర్హులు.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 03.05.2024 నాటికి 44 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులు రూ 500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌ లైన్‌
ఎంపిక విధానం:
వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. రూ.70,000 పొందొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:
05-05-2024
దరఖాస్తులకు చివరితేది:
12-05-2024

సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తికి జగన్‌ ఝలక్‌!

సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్‌.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఝలక్‌ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్‌ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్‌ మంజూరు చేశారు. అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్‌ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే.. రెండు ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు.

Hair fall solution: జుట్టు రాలిపోతోందా.. ఈ ఒక్క ఆయిల్ తో అన్ని జుట్టు ప్రాబ్లమ్స్ కి చెక్!

Rosemary oil for hair fall : జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అమ్మాయిలు చాలా వరకు తమ జుట్టు ని కాపాడుకోవడానికి,నల్లగా, అందంగా మార్చుకోడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య ఆడ, మగా తేడా లేకుండా అందరూ ఎదురుకుంటున్న సమస్య జుట్టురాలిపోవడం.

జుట్టు ఊడిపోతుంది అని చాలా మంది ఎన్నెన్నో హెయిర్ కేర్ ప్రోడెక్ట్స్.. బోలెడంత డబ్బులు పెట్టి మరీ కొంటున్నారు. అయినా వాటి వల్ల వచ్చే మెరుపు కాసేపే ఉంటుంది. జుట్టు అందంగా మెరవాలి అంటే.. ఆ మెరుపు లోపల నుండి రావాలి. అది అలా రావాలి అంటే మనం జుట్టు ఆరోగ్యం గురించి కూడా బాగా శ్రద్ధ తీసుకోవాలి.

బయటకొనే ప్రొడక్ట్స్ మన జుట్టుకి సెట్ అయితే బాగానే ఉంటుంది.. కానీ పడకపోతే మాత్రం జుట్టు మరింతగా ఊడిపోతూ ఉంటుంది. కొత్త సమస్యలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ లేకుండా ఇంట్లోనే.. కేవలం ఒకే ఒక ఆయిల్ తో మన జుట్టు రాలిపోవడం ఆగిపోయే మార్గం ఉంది.

జుట్టు సమస్యలు అన్నిటికీ ఒకే ఒక్క దివ్య ఔషధం రోజ్ మేరీ ఆయిల్. రోజ్ మేరీ లో ఉండే ఇన్ఫ్లోమేటరీ గుణాలు చుండ్రు కి కూడా చెక్ పెట్టగలవు. ఈ ఎండాకాలంలో పొడిబారి పోతున్న జుట్టుని.. తిరిగి హైడ్రేట్ చేసి అందంగా మార్చడంలో రోజు మేరీ ఆయిల్ తర్వాతే ఏదైనా. రోజు మేరీ ఆయిల్ వల్ల మన జుట్టుకి ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

మెరిసే జుట్టు:

రోజ్ మేరీని ఆయిల్ ను వాడడం వల్ల జుట్టుకు మంచి మెరుపు వస్తుంది. అందులో ఉండే పోషకాలు మన కురులను సహజంగా నల్లగా మార్చగలవు. నలుపుతో పాటు రోజ్ మేరీ ఆయిల్ వల్ల.. జుట్టు కాంతివంతంగా మారుతుంది. డబల్ బాయిలింగ్ పద్ధతిలో రోజ్ మేరీ ఆయిల్ ను వేడిచేసి మాడుకి పట్టిస్తే.. తక్కువ సమయం లోనే జుట్టు పెరగడం మీరు చూస్తారు.

జుట్టు ఊడడం:

ప్రతి రోజూ రోజ్ మేరీ ఆయిల్‌తో తలపై మసాజ్ చేసుకోవడం వల్ల మంచి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. కుదుళ్లు కూడా దృఢంగా మారతాయి. కావాల్సిన పోషకాలు అంది జుట్టు అందంగా, ఒత్తుగా మారుతుంది. ఆయిల్ తో మసాజ్ చేస్తాము కాబట్టి.. కుదుళ్లలో రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. రోజ్ మేరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

SIM Rules: రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..

డ్యూయల్ సిమ్ అనేది ప్రస్తుతం చాలా కామన్. ప్రతి ఫోన్లో రెండు స్లిమ్ స్లాట్ లతో వస్తున్నాయి. దీంతో అందరూ రెండు సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. ఇంటి నంబర్ ఒకటి, ఆఫీస్ నంబర్ ఒకటి అన్నట్లు రెండు సిమ్ కార్డులను వాడుతున్నారు. అందరూ దీనిని అలవాటు అయిపోయారు. మీరు కూడా ఇలానే రెండు సిమ్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఇకపై రెండు సిమ్ కార్డులు కలిగి ఉండటం ఖరీదైనదిగా మారిపోనుంది. ఎందుకంటే టెలికాం రంగంలో రానున్న రోజుల్లో టారిఫ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 2021డిసెంబర్లో చివరిసారిగా టారిఫ్ ప్లాన్ ధర పెంచారు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత వాటి ధరలను సవరించాలని టెలికాం దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రానున్న రోజుల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రాబోయే కొద్ది నెలల్లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచవచ్చని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

2 సిమ్ కార్డ్‌లు ఉన్న వ్యక్తులకు సమస్యలు..
మీరు ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తే, మీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచడానికి, కనీసం రూ. 150 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టారిఫ్ పెరిగితే సిమ్‌ను యాక్టివేట్‌గా ఉంచడానికి, రూ. 150కి బదులుగా, మీరు రూ. 180 నుంచి రూ. 200 వరకూ చెల్లించవలసి ఉంటుంది. మీరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తే, మీరు కనీసం 28 రోజులకు రూ. 400 రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.

ఏయే ప్లాన్‌ల ధర ఎంత పెరుగుతుంది?
మీరు నెలవారీ రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే, టారిఫ్ పెరిగిన తర్వాత మీరు నెలకు దాదాపు రూ. 75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

నెలవారీ ఖర్చులు పెరుగుతాయి..
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5జీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు. ఇది ప్రస్తుతానికి పూర్తిగా ఉచితం. అటువంటి పరిస్థితిలో, మీరు ఒక సిమ్ 5జీ, మరో సిమ్ 4జీని ఉంచినట్లయితే, మీ నెలవారీ ఖర్చు దాదాపు 50 శాతం పెరుగుతుంది. ఎందుకంటే 5జీ ప్లాన్ ధర 4జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే 4జీ ప్లాన్ ధరను కూడా పెంచుతున్నారు. దీంతో మొత్తం వ్యయం బారీగా పెరగనుంది. ఇది వినియోగదారులపై పెను భారం కానుంది

Bernard Hill : టైటానిక్ నటుడు మృతి

Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు బెర్నార్డ్ హిల్ 79 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. అయన మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర బాగా పాపులర్. ఆ సినిమానే కాకుండా ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ సినిమాలో కూడా నటించాడు. ఇక తన కెరీర్‌లో, ఆయన సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు మరియు థియేటర్‌లో కూడా పనిచేశాడు.

అయితే ఇండస్ట్రీలో చాలా కాలం గడిపి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుని ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇక బార్బరా డిక్సన్ X లో అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. బెర్నార్డ్ హిల్ మరణవార్త షేర్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. మేము కలిసి పనిచేశాము, అతను అద్భుతమైన నటుడు. వారితో ప్రయాణం చేయడం చాలా పెద్ద విషయం. RIP బెన్నీ అంటూ కామెంట్ చేసింది. ఇక హిల్ మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా మంది నటుడి అద్భుతమైన నటనను ప్రశంసించారు, మరికొందరు అతని పని తీరును ప్రశంసించారు. అయితే ఈ నటుడు హఠాత్తుగా మరణనించడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.

కొన్ని సినిమాలు హద్దులు దాటి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సొంతం చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడతాయి. అంతేకాదు డబ్బు సంపాదించిన ఆ సినిమాల్లోని పాత్రలు అందులో నటించిన నటీనీతులు కూడా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతారు. అలాంటి సినిమాల్లో ఒకటి టైటానిక్. హాలీవుడ్ సినిమా టైటానిక్ పేరు వినని వారు ఎవరుంటారు? ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ గా లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ తుది శ్వాస విడిచారు. బెర్నార్డ్ ఈ చిత్రంలో కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ పాత్రను పోషించారు. ఈ పాత్రతో అతనికి పాపులారిటీ వచ్చింది. నటుడిగా బెర్నార్డ్ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

బెర్నార్డ్ మరణ వార్తను స్కాటిష్ జానపద సంగీత విద్వాంసుడు బార్బరా డిక్సన్ వెల్లడించారు. అతను X లో బెర్నార్డ్ మృతి గురించి ప్రస్తావిస్తూ బెర్నార్డ్ హిల్ ఈ ప్రపంచంలో ఇక లేరని చెప్పడానికి తనకు చాలా బాధగా ఉంది. మేము జాన్ పాల్ జార్జ్ రింగో, విల్లీ రస్సెల్ షోలలో కలిసి పనిచేశాము. బెర్నార్డ్ తెలివైన నటుడు. బెర్నార్డ్ తో కలిసి పనిచేయడం తనకు ఓ అద్భుతం అని రెస్ట్ ఇన్ పీస్ బెన్నీ (బెర్నార్డ్ హిల్) అని కామెంట్ ను జత చేశాడు.

విచారం వ్యక్తం చేసిన అభిమానులు
బెర్నార్డ్ నటుడుగా అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో భాగమయ్యాడు. ఆయన మృతి పట్ల అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – అందరూ అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్‌లో పోషించిన పాత్రను సూచిస్తున్నారు.. అయితే అతను వోల్ఫ్ హాల్ సిరీస్‌లో కూడా చాలా బాగా నటించాడు. మరొక వ్యక్తి రాశాడు- గుడ్‌బై బెర్నార్డ్ హిల్. మీ అద్భుతమైన నటనతో మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. కళ పట్ల ప్రజలను ప్రేరేపించిన విధానం, మీ ప్రాముఖ్యతను కాదనలేమని నివాళుల్పిస్తున్నారు.

Sunita Williams: గణపతి ప్రతిమను తీసుకెళ్తా.. మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌..

Indian origin astronaut sunita williams set to fly space again: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షంలోనికి వెళ్లనున్నారు. సునీతతోపాటు, మరో ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి వెళ్లనున్నారు. గతంలో బోయింగ్‌ మానవ రహిత ప్రయోగాలు చేపట్టింది. కానీ ప్రస్తుతం మొదటి సారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. మే 7, 2024న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.04 గంటలకు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి సరికొత్త అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్‌లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించడం గురించి ఎలాంటి కంగారు లేదని సునీతా పేర్కొన్నారు. లాంచ్ ప్యాడ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు, తమకు అన్నిరకాల వాతావరణ పరిస్థితులలో ఉండేలా ట్రైన్ చేశారని సునీతా విలియన్స్ చెప్పారు. అంతేకాకుండా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నప్పుడు, తన ఇంటికి తిరిగి వెళ్లినట్లుగా ఉంటుందని అన్నారు. అంతరిక్షంలో సమోసాలు తినడానికి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మూడోసారి వెళ్లడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందన్నారు.

డాక్టర్ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా దంపతులకు వ్యోమగామి సునీతా విలియమ్స్ (59) జన్మించారు. ఆమె మానవ సహిత అంతరిక్ష నౌక యొక్క తొలి మిషన్‌లో ప్రయాణించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఒక క్వాలిఫైడ్ నేవీ టెస్ట్ పైలట్ గా ఖ్యాతి గడించారు. ఆమె 2006, 2012లో రెండుసార్లు అంతరిక్షయాత్ర చేపట్టారు. NASA నుండి వచ్చిన సమాచారం ప్రకారం, సునీత మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. స్పెస్ లో ఎక్కువగా కాలం గడిపిన వ్యోమగామిగా కూడా రికార్డుల కెక్కారు.

ఒక సమయంలో, ఆమె 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌వాక్ చేసిన రికార్డును క్రియేట్ చేశారు. అయితే ఆ తర్వాత 10 స్పేస్‌వాక్‌లతో పెగ్గీ విట్సన్ దానిని అధిగమించిందని NASA తెలిపింది. సునీతా విలియమ్స్ తండ్రి న్యూరోఅనాటమిస్ట్. ఆయన గుజరాత్ లోని జులాసన్‌లో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఆ తర్వాత USAకి వలస వెళ్లి స్లోవేనియన్‌కు చెందిన బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు. బోయింగ్ యొక్క స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్‌కు పైలట్‌గా ఉండటానికి సునీతా ప్రస్తుతం సిద్ధమవుతున్నట్లు NASA తెలిపింది. సునీతా విలియమ్స్.. 1998లో తొలిసారి వ్యోమగామిగా ఎంపికైంది. 2015లో స్పేస్ షటిల్ రిటైర్ అయిన తర్వాత, NASA యొక్క వాణిజ్య సిబ్బంది కార్యక్రమంలో ప్రయాణించే ఎంపిక చేసిన వ్యోమగాముల సమూహంలో భాగంగా ఆమె ఎంపిక చేయబడింది.

తన విమానాయానానకి ముందకు వ్యోమగామి సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. ఈసారి తనతో గణేషుడి విగ్రహాం తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గతంలో రెండు సార్లు.. భగవద్గీత కాపీలను అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. వినాయకుడు నాతో ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా, తన ప్రయాణం సక్సెస్ అవుతుందని ఆమె అన్నారు. తన ప్రయాణంలో అదృష్టం కూడా కలిసి వస్తుందని ఆమె అన్నారు.

అయితే.. భారతదేశం దాని స్వంత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్‌ను కలిగి ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ క్రాఫ్ట్ యొక్క మొదటి విమానంలో మరొక మిషన్. ఇది మనందరికీ గర్వకారణమని బెంగళూరులోని ఇస్రో యొక్క మానవ అంతరిక్ష విమాన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం మోహన్ అన్నారు. ఇది అంతరిక్షం ప్రయాణంలో మరో మైలురాయని, సునీతా టీమ్ ప్రయాణంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సునీతా విలియమ్స్ ను భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం తెలసిందే.

Summer Health Tips: వేసవిలో ఈ హెల్త్ టిప్స్ పాటించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు!

Summer Health Tips: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పడగాలులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఎండలు పెరిగే కొద్దీ.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనారోగ్యాలతో బాధపడే వారు ఎండలో వెళ్లకపోవడమే మంచిది.

ఎండలో బయటకు వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటించండి..

మైగ్రేన్‌తో బాధపడే వారు ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉన్నా.. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. చర్మ వ్యాధులు ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. లేదంటో బయటకు వెళ్లేప్పుడు గొడుగు, కళ్ళద్దాలు, టోపీ, స్కార్ఫ్ వెంట తీసుకెళ్లండి. సన్ స్క్రీన్ లోషన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

ఎండ నుంచి ఉపశమనం కోసం..

అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి శరీరంలో నీటి స్థాయి అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. దీంతో పాటు కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకుంటే మంచిది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది.

పోషకాహారం ముఖ్యం

వేసవిలో జీర్ణశక్తి తగ్గిపోతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే వేసవిలో ఎల్లప్పుడూ జీర్ణమయ్యే లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మసాలా, అధిక ప్రోటీన్ లేదా జిడ్డుగల ఆహారాన్ని తినకపోవడమే మంచిది. దానికి బదులు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తినడం మేలు. వేసవిలో పాలక్, పొట్లకాయ, టమోటాలు, దోసకాయలు, పుచ్చకాయలు, నారింజ, బేరి వంటి కూరగాయలను తినొచ్చు.

తగిన విశ్రాంతి ముఖ్యం

వేసవిలో చాలా అలసట కూడా ఉంటుంది. అందుకే వేసవిలో మధ్యాహ్నం పూట కాస్త విశ్రాంతి తీసుకోవాలి. లంచ్ తర్వాత 20 నిమిషాలు పడుకోండి. ఇది మీ అలసటను తగ్గిస్తుంది. రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది.

వ్యాయామాలు

వేసవిలో ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్తే మేలు జరిగింది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. చల్లటి గాలిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం సహా తీవ్ర ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు.

పుచ్చకాయ గింజలు పనికి రావని పడవేస్తున్నారా..? వీరికి దివ్యౌషధం..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

పుచ్చకాయ గింజలలో ఉండే మెగ్నీషియం మంచి గుండె పనితీరును మరియు సరైన రక్తపోటును నిర్వహిస్తుంది. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కండరాలను దృఢంగా మార్చుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. అయితే పుచ్చకాయ మాత్రమే కాదు పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా.. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెపోటును నివారించడానికి ముఖ్యమైనవి.

పుచ్చకాయ గింజల్లో కాపర్‌, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్‌ అధికంగా ఉంటాయి. పుచ్చకాయ గింజల ప్రయోజనాల్లో ఒకటి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. పుచ్చకాయ గింజలలో ఉండే ఫైబర్, అసంతృప్త కొవ్వులు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు కాపర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఈ గింజలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టును బలోపేతం చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లో కాపర్‌, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఈ సూక్ష్మపోషకాలు.. ఎముకలను దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, పుచ్చకాయ గింజలు కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పుచ్చకాయ గింజలలో ఉండే మెగ్నీషియం మంచి గుండె పనితీరును మరియు సరైన రక్తపోటును నిర్వహిస్తుంది. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆస్టియోపొరోసిస్ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కండరాలను దృఢంగా మార్చుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
పుచ్చకాయ గింజలు చర్మానికి ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది అలాగే వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే విటమిన్ బి నాడీ వ్యవస్థ మరియు మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పుచ్చ కాయ గింజల్లో జింక్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

HYDలో ఈ ఏరియాలో గజం స్థలం రూ. 14 వేలే.. ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది!

డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కొంతమంది తెలియక భూమ్మీద పెట్టకుండా అవగాహన లేని వాటిలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకుంటూ ఉంటారు. అదే పెట్టుబడి భూమ్మీద పెట్టి ఉంటే లక్షలు, కోట్లు సంపాదించేవారు. ఇప్పటికీ చాలా మంది పెట్టుబడి పెట్టలేదే అని బాధపడుతూ ఉంటారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఏరియాల్లో స్థలాలు కొనలేని పరిస్థితి.

అందుకే భూమి మనకి అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేస్తేనే దాంతో పాటు ఆకాశంలా ఎదుగుతాము. లేదంటే ఆ తర్వాత కొందామన్నా గానీ ఆకాశంలా చేతికి అందదు. ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది. అదే బెంగళూరు హైవే. అవును హైదరాబాద్ లో ఉన్న ఈ బెంగళూరు హైవేలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఫ్యూచర్ లో లక్షల్లో లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. కనెక్టివిటీ పరంగా, ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ఈ బెంగళూరు హైవే అనేది స్ట్రాటజిక్ లొకేషన్ గా ఉంది. సరసమైన ధరలకు స్థలాలు దొరుకుతున్న కారణం వల్ల ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తికనబరుస్తున్నారు.

బెంగళూరు హైవే మీదనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
కనెక్టివిటీ:
కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంది. అలానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి కూడా దగ్గరలో ఉంది.

ఇన్ఫ్రాస్ట్రక్చర్:
హైవేల నిర్మాణాలు, ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ నెట్వర్క్స్ సహా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని హైదరాబాద్ నగరంలో మనం చూశాం. ఫ్యూచర్ లో బెంగళూరు హైవే కూడా ఇదే విధంగా డెవలప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

పారిశ్రామిక వృద్ధి:
అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, ఏషియన్ పెయింట్స్ సహా అనేక కంపెనీలకు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి ఈ బెంగళూరు హైవేకి ఆనుకుని ఉన్నాయి.

రవాణా:
రవాణా పరంగా బెంగళూరు హైవే అనేది ఈజీ యాక్సెస్ కలిగి ఉంది. హైదరాబాద్ సిటీలోకి వెళ్లడానికైనా.. అలానే మిగతా ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉంది.

ధరలు:
ఇక్కడ ల్యాండ్ రేట్లు చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ బెంగళూరు హైవే అనేది పెట్టుబడికి ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు.

బెంగళూరు హైవే మీద స్థలాల రేట్లు:
ప్రస్తుతం పలు ప్రాపర్టీ వెబ్ సైట్స్ సమాచారం మేరకు.. అలానే పలు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న లెక్కలు ప్రకారం.. బెంగళూరు హైవే మీద చదరపు అడుగు స్థలం రూ. 1600గా ఉంది. అంటే గజం 14,400 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన ఒక 100 గజాల స్థలం కొనాలంటే 15 లక్షల లోపే అవుతుంది. ఒక 200 గజాల స్థలం కొనాలంటే 30 లక్షల లోపే అవుతుంది. 2019లో చదరపు అడుగు 1150 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దాని విలువ 1600 అయ్యింది. అంటే ఈ ఐదేళ్ళలో చదరపు అడుగు మీద 450 రూపాయల లాభం. గజం మీద 4050 రూపాయల లాభం. 100 గజాల మీద 4 లక్షలు లాభం అన్న మాట. ఏడాదికి లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు. ఇప్పుడు ఈ బెంగళూరు హైవే మీద ల్యాండ్ కొంటే గనుక ఫ్యూచర్ లో ఇంతకంటే మంచి లాభాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియాలో కుటుంబాలకు, పని చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. బాగా నిర్వహించబడుతున్న రోడ్లు, ప్రజా రవాణా, హైవే దగ్గరలోనే మార్కెట్లు, స్కూల్స్ వంటివి ఉన్నాయి.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Health

సినిమా