Ooty-Kodaikanal Tour: ఇక ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే అనుమతి ఉండాల్సిందే, ఎవరిస్తారు, ఎలా తీసుకోవాలి

Ooty-Kodaikanal Tour: ప్రస్తుతం అందరూ వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నారు. దక్షిణాదిలో ప్రముఖ వేసవి విడిది కేంద్రాలంటే అందరికీ గుర్తొచ్చేది ఊటీ, కొడైకెనాల్. మీరు కూడా ఈ రెండు ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఎవరి అనుమతి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

దక్షిణ భారతదేశంలో అందమైన చల్లని హిల్ స్టేషన్ ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు. చల్లగా ఉండటమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఎండల్నించి ఉపశమనం పొందేందుకు అందరూ ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలు సందర్శిస్తుంటారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వతాలపై ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఊటీ లేదా ఉదకమండలం. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరింత చల్లగా ఉంటుంది. బొటానికల్ పార్క్, జింకల పార్క్, ఊటీ సరస్సు, పైకారా సరస్సు, కాఫీ తోటలు ఇలా అన్నీ చూడదగ్గవే.

ఇక రెండవది కొడైకెనాల్. ఊటీకు సమీపంలోనే ఉంటుంది. ఇది దిండిగల్ జిల్లాలోని హిల్ స్టేషన్. పశ్చిమ కనుమల్లో పళని కొండల్లో భూమికి 2,225 అడుగుల ఎత్తులో ఉంది. ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌గా పిలిచే కొడెకెనాల్ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా ఊటీతో పాటు అభివృద్ధి చెందింది. అందమైన జలపాతాలు, కృత్రిమంగా నిర్మించిన సరస్సు, అందమైన ఉద్యానవనాలు చాలానే ఉన్నాయి.

ఊటీ, కొడైకెనాల్ సందర్శించాలంటే ఈ ఏడాది నుంచి ఇవాళ్టి నుంచి తమిళనాడు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా మారింది. మద్రాస్ హైకోర్టు సూచనల మేరకు ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంటే ఇవాళ్టి నుంచి ఊటీ, కొడెకెనాల్ వెళ్లాలంటే ముందుగా ఈ పాస్ తీసుకోవాలి. మే 7 నుంచి జూన్ 30 వరకూ ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకుల్ని తీసుకెళ్లే వాహనాలకు ఈపాస్ అవసరం. ఇవాళ్టి నుంచి ఈపాస్ ఉంటేనే ఊటీ, కొడెకెనాల్‌లో ప్రవేశం ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ సందర్సించాలనుకుంటే www.epass.tnega.org వెబ్‌సైట్‌లో ఎప్పుడు వెళ్తున్నారు, ఎన్ని రోజులు బస చేస్తున్నారు, వాహనాన నెంబర్ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 7 నుంచి జూన్ 30 వరకూ మాత్రమే ఈపాస్ విధానం అమల్లో ఉంటుంది. ఆ తరువాత అవసరం లేదు.

పర్యాటకులు నమోదు చేసిన వివరాల్ని పరిశీలించి ఈ పాస్ జారీ చేస్తారు. ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్‌లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. చెక్ పోస్టుల వద్ద క్యూ ఆర్ కోడ్ తనిఖీ చేస్తారు. ఊటీ, కొడైకెనాల్ స్థానికులకు మాత్రం ఈ పాస్ అవసరం లేదు. టీఎన్ 43 రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.

ఆన్‌లైన్ పోర్టల్‌లో పర్యాటకులు తమ పేరు, చిరునామా, ఎన్నిరోజులు బస చేస్తారు, ఎక్కడ బస చేస్తారు, వాహనం నెంబర్ , ఆధార్ కార్డు వివరాలు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *