Friday, November 15, 2024

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..! మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

పచ్చి మిరపకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పచ్చిమిర్చి బరువు తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ ఒక పచ్చి మిరపకాయను ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ ఎ, సి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

పచ్చి మిరపకాయలో క్యాప్ సిన్ ఉంటుంది. ఇది కంటి మంట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వ్యాధులను నయం చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి వచ్చినా పచ్చిమిర్చితో నయమవుతుంది. విటమిన్ సి కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని జీరో కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. అంతే కాకుండా పచ్చి మిర్చిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్‌లు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి అనేక వ్యాధులను నివారిస్తాయి.

పచ్చిమిర్చి బీపీ రోగులకు మేలు చేస్తుంది. పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది. దీంతో కంటిచూపు పెరుగుతుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరిచేస్తుంది. మెగ్నీషియం ఎముకలను బలపరుస్తుంది మరియు ఎముకలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

HD Revanna Arrest: మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్, పని మనిషి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం

HD Revanna Arrest: కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణని కర్ణాటక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మహిళ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే హెచ్‌డీ రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. అయితే…ఈ వీడియోలో కనిపించిన పని మనిషిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించారంటూ ఆరోపణలు వచ్చాయి. కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితుడిని ముందుగా పోలీసులు గుర్తించారు. ఆ తరవాత హెచ్‌డీ రేవణ్ణని అరెస్ట్ చేశారు. అయితే…అంతకు ముందు హెచ్‌డీ రేవణ్ణ తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మధ్యంతర బెయిల్‌ కోరారు. కానీ బెంగళూరు కోర్టు ఆ రిక్వెస్ట్‌ని కొట్టివేసింది. ఫలితంగా..పోలీసుల అరెస్ట్‌కి లైన్ క్లియర్ అయింది.

బాధితురాలు హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ఐదేళ్ల పాటు పని చేసింది. మూడేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చేసింది. అయితే..ఏప్రిల్ 29వ తేదీన రేవణ్ణ సన్నిహితుడు సతీష్ తన తల్లిని కార్‌లో తీసుకెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే…ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో వీళ్లు కూడా సాక్ష్యం చెబుతారేమో అన్న అనుమానంతో ముందుగానే వాళ్లని కిడ్నాప్ చేయించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కొడుకుని కాపాడుకునేందుకు ఇలా సాక్షుల్ని తప్పిస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో మిగతా సాక్షుల్నీ ఇలాగే బెదిరిస్తున్నారా అన్నది తేలాల్సి ఉందని, వాళ్లకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. కొడుకు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు హెచ్‌డీ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కిడ్నాప్ కేసు కూడా తోడవడం మరింత సంచలనమవుతోంది.

ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్నారు. ఆయన కనబడితే అరెస్ట్ చేయాలంటూ కర్ణాటక హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసుని విచారిస్తోంది. ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి విచారణకు హాజరు కావాలని హోంశాఖ ప్రజ్వల్‌ని హెచ్చరించింది. ఇంట్లో వంట మనిషిని లైంగికంగా వేధించడంతో పాటు మరి కొంత మంది మహిళలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలు కూడా రికార్డ్ చేసి బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించడం సంచలనమైంది. అయితే…అతని తరపు న్యాయవాది మాత్రం అవన్నీ మార్ఫింగ్ వీడియోలు అంటూ వాదిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కావాలనే కుట్ర చేసి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అప్పుడే..!

సూర్యుడి ప్రతాపంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటున్నాయి. మే 7 వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతంలో మరో రెండు రోజుల పాటు అంటే మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్​లోని గంగా నదీ తీర ప్రాంతం, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి & కరైకల్, ఇంటీరియర్ కర్ణాటకలో మే 4 నుంచి 7 వరరకు వడగాల్పులు వీస్తాయి. ఐతే.. కొన్ని ప్రాంతాల్లో మే 5, 6 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్సుంది ఐఎండీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్​లో మే 5న భారీ నుంచి అతి భారీ వర్షాలు, మే 5, 6 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహేల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 7న కోస్తాంధ్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇంకొద్దిరోజులు ఎండకు ఓపికపడితే వాతావరణం చల్లబడొచ్చు.

AP Elections: ఏపీ ఎన్నికల్లో అదే గేమ్ ఛేంజర్ కానుందా ? మ్యానిఫెస్టోలు, అజెండాలు ఎటో..!

ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ తరచూ చెప్పుకుంటున్న సంక్షేమమో లేక విపక్షాలు చెప్పుకుంటున్న అభివృద్ధో ఎన్నికల అజెండా అవుతుందని అంతా భావించారు. చివరికి వీటి కంటే మ్యానిఫెస్టోలో కీలకమవుతాయని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు వీటన్నింటినీ మించి మరో అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అధికార విపక్షాలన్న తేడా లేకుండా అంతా దాని చుట్టే తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూహక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. శతకోటి ఎన్నికల అంశాల్లో అదీ ఒకటిగా ఉండొచ్చని మాత్రమే భావించారు. కానీ అప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్న పథకాలు, అభివృద్ధి వంటి అంశాలు, మ్యానిఫెస్టోల్ని దాటి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చర్చలోకి వచ్చేసింది. అది ఎంతగా అంటే ఇప్పుడు జగన్, చంద్రబాబు, పవన్ అందరి నోటా ఇదే మాట.
ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన భూహక్కు చట్టం ఇంకా అమల్లోకి అయితే రాలేదు. కానీ అది అమల్లోకి వస్తే ఏం జరుగుతుందన్న దానిపై విపక్షాలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. అప్పటికే జనంలో ఉన్న ఆందోళనలను వాడుకుంటూ ఎన్నికల అజెండాగా మార్చేశాయి. ముఖ్యంగా సీఎం జగన్ మళ్లీ గెలిస్తే భూహక్కు చట్టంతో మీ భూములు, స్థలాలు అన్నీ లాక్కుంటాడంటూ జనాన్ని రెచ్చగొట్టేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలే భూముల విలువ తెలిసిన రూరల్ ప్రాంతాల ప్రజలు, అందులోనూ వైసీపీ ఓటర్లలోనే ఇది భయాందోళనలు కలిగిస్తోంది. దీంతో సహజంగానే వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఓసారి భూహక్కు చట్టం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని, మరోసారి దీన్ని ఇప్పట్లో అమలు చేయబోమని, ఇంకోసారి ఈ చట్టంలో తప్పేముందని .. ఇలా రోజుకో రకంగా వైసీపీ మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, స్వయంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. దీంతో ప్రజల్లో గందరగోళం మరింత పెరుగుతోంది. దీనిపై ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇచ్చే పరిస్ధితిలో ప్రభుత్వం కూడా లేదు. ఇది అంతిమంగా ఎన్నికల్లో తమ కొంపముంచుతుందన్న భయాలు వైసీపీలో పెరుగుతున్నాయి.

Sharmila vs Jagan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు అద్దం గిఫ్ట్‌గా పంపిన షర్మిల..

కడప, మే 04: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా.. మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు ఫేస్ కనిపిస్తుందా ? నేను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు.. కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క సాక్ష్యం అయినా.. ఒక్క ఆధారం అయినా చూపించగలరా ? జగన్ భ్రమలో ఉన్నాడు. జగన్ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది. జగన్ వైఖరి మాలోకంను తలపిస్తుంది. నా జన్మకి నేను చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిశాను. అదికూడా నా కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్లాను. ఆనాడు వైఎస్ఆర్ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ స్ఫూర్తితోనే నేను చంద్రబాబును పెళ్లికి పిలవడానికి వెళ్లాను. నేను 5 నిమిషాలు కూడా ఏనాడూ బాబుతో మాట్లాడలేదు.’ అని షర్మిల చెప్పుకొచ్చారు.

బాబు చెబితేనే అదంతా చేశానా?

‘నేను చంద్రబాబు చెప్తేనే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా ? ‘బాయ్ బాయ్ బాబు’ అనే క్యాంపెయిన్ చేశానా? సునీత, రేవంత్ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో.. ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలి. జగన్ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది. జగన్ గారు.. మీరు అద్దం చూస్కోండి.. మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు మొహం కనిపిస్తుందా? సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా ? హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే మీకు భయం ఎందుకు?’ అని సీఎం జగన్‌ను షర్మిల నిలదీశారు.

 

షర్మిల చేసిన కామెంట్స్ యధావిధిగా..

  • వైఎస్ఆర్ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ కాదు.
  • సీబీఐ చార్జిషీట్‌లో పేరు చేర్పించింది జగన్.
  • పొన్నవోలుతో పిటీషన్ వేయించి మరి చేర్పించాడు.
  • నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్ రావు.. కానీ ఈ కేసు చెల్లలేదు.
  • ఎర్రంనాయుడు వేసిన పిటీషన్‌ను కోర్టు ఇంప్లేడ్ చేసింది.
  • విచారణ చేయమని మాత్రమే అనాడు కోర్టు చెప్పింది.
  • కానీ వైఎస్ఆర్ పేరును అప్పుడు పిటీషన్‌లో చేర్చలేదు.
  • పొన్నవోలు సుధాకర్‌తో సుప్రీం కోర్టు వరకు వెళ్లి పేరు పెట్టించారు.
  • ఇదే నిజం. తారు మారు చేసే ప్రయత్నం చేసినా నిజం దాగదు.
  • గిఫ్ట్ గా అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారు.
  • సీఎం అయిన 6 రోజులకే అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు.
  • మూడు సార్లు చార్జీ షీట్‌లో పెట్టాలి అనుకున్న వ్యక్తికి మీరు పదవి ఇచ్చారు.
  • ఏ సంబంధం లేకుంటే ఎందుకు ఇస్తారు.
  • కళ్ళకు ఎదుట అందరికీ స్పష్టంగా కనిపించింది.
  • కాంగ్రెస్‌కి సీబీఐ ఛార్జ్ షీట్‌కి సంబంధం లేదు.
  • మమ్మల్ని ఈ విషయంలో ఊసరవెల్లి అంటున్నారు.
  • గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని నేను చెప్పినట్లు వీడియోలు ప్లె చేస్తున్నారు.
  • నిజానికి ఆరోజు నాకు నిజం తెలియదు.

 

  • నేను కాంగ్రెస్ పెట్టించింది అనుకున్నాను.
  • సోనియాను కలిశాక అసలు విషయం తెలుసుకున్నాను.
  • సోనియా నాతో మేము ఎందుకు పెడతాం అని చెప్పారు.
  • ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలసినప్పుడు కూడా తెలుసుకున్నాను.
  • జగన్ కావాలని పెట్టించినట్లు ఉండవల్లి స్పష్టం చేశారు.
  • అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతనే నేను కాంగ్రెస్ పెట్టలేదు అని చెప్తున్నాను.
  • వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
  • జగన్ కూడా ఆరోపణలు చేశారు.
  • రిలియన్స్ ఆస్తులను ధ్వంసం చేశారు.
  • జగన్ సిఎం అయ్యాక రెలియన్స్ చెప్పిన వాళ్లకు రాజ్యసభ ఇచ్చారు.
  • తాను చెప్పింది అబద్ధం అని నిరూపించుకున్నారు.
  • వివేకా హత్య తర్వాత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ చేశాడు.
  • సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.
  • సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దు అన్నారు.
  • నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే ఎందుకు సీబీఐ విచారణ వద్దు అన్నారు ?
  • మీరు అప్పుడొక మాట.. ఇప్పుడు ఒక మాట మాట్లాడారు.
  • సొంత తండ్రి పేరును FIR లో పెట్టించిన వ్యక్తికి మీరు పదవి ఇస్తారా ?
  • మీకు మీరు ఒకసారి ఆలోచన చేయండి.

 

  • ఈ మధ్య జగన్ నేషనల్ మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నారు.
  • నేను చంద్రబాబు మనిషి అంటున్నాడు.
  • నన్ను చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడట.
  • నేను బాబు మాట వింటున్నానట.
  • నేను వైఎస్ఆర్ బిడ్డను.. నేను ఎంత మొండి దాన్నో జగన్‌కి తెలుసు.
  • నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తిని కాదు.
  • నాకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదు.

AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే.. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రతి ప్రశ్నకు చెప్పిన సమాధానం ఏపీ ప్రజల్లో అనేక అనుమానాలు కలిగించేలా ఉన్నాయి.

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలిసిన జగన్.. తనకు ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై క్లారిటీ ఉన్నప్పటికీ.. యాంకర్ అడిగిన ప్రతిప్రశ్నకు నిజాయితీగా కాకుండా.. తనను సమర్థించుకోవడానికే సమాధానం చెబుతున్నారా అనే విధంగానే ఇంటర్వ్యూ సాగింది. ఐదేళ్ళలో రాష్ట్రంలో వచ్చిన మార్పులు, కేంద్ర రాజకీయాలు, వైసీపీ గెలుుకునే సీట్లు, చెల్లి షర్మిల గురించి అడిగిన ప్రతిప్రశ్నకు ఇష్టం లేనట్లే సమాధానం చెప్పినట్లు కనిపించింది. చేతులారా చెల్లిని దూరం చేసుకున్న జగన్.. తాను తన చెల్లి షర్మిలను మిస్ అవుతున్నా అంటూ చెప్పిన సమాధానంపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. చెల్లిని కావాలనుకునే వ్యక్తి ఎందుకు దూరం చేసుకున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

చెల్లిని మిస్ అవుతున్నారా..

షర్మిలను మిస్ అవుతున్నారా అంటూ జగన్‌ను యాంకర్ ప్రశ్న వేయగా.. తప్పకుండా.. ఎందుకు కాదంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీని కోసం ఎలా ఆలోచిస్తున్నారని అడగ్గా.. అనుకోకుండా తాను వేరే లైన్ తీసుకుందని సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారు. చెల్లిని మిస్ అయినట్లు అయితే నాలుగేళ్లుగా తన గురించి ఎందుకు పట్టించుకోలేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చెల్లిపై ప్రేమ ఉంటే తనను పిలిచి మాట్లాడిఉండేవాళ్లు కదా.. ఇంటర్వ్యూలో ఏదో చెప్పాలని జగన్ సమాధానం చెప్పినట్లుగానే కనిపించిందని మరికొంతమంది విమర్శిస్తున్నారు. మొత్తానికి ప్రతి ప్రశ్నకు దాటవేసే ధోరణిలోనే సమాధానలు చెప్పినట్లు ఇంటర్వ్యూలో స్పష్టమైంది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. నేటి నుంచి బంద్!!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) ప్రైవేటు ఆస్పత్రులు (Private Hospitals) షాక్ ఇచ్చాయి. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈనెల ఏడవ తేదీ నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు డిసెంబర్‌లో 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని (Aarogysree) నిలిపివేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం కేవలం రూ.560 కోట్లు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని బకాయిపెట్టారు.

కాగా ఇటీవల ఆరోగ్య శ్రీ లిమిట్‌ను ఐదు లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నాలుగు నెలల్లో మొత్తం ప్రభుత్వ బకాయిలు1600 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో ప్రభుత్వ బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సామాన్యులకు ఈనెల 7 నుంచి, ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఇప్పటికే పలు ఆసుపత్రుల బయట ప్రభుత్వ సిబ్బందికి చేసే ఈహెచ్ఎస్ వైద్యసేవలు లేదంటూ బోర్డులు పెట్టాశారు కూడా. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు అవమానంగా భావిస్తున్నారు. తమ డబ్బులు జీతం నుంచి పట్టుకున్న ప్రభుత్వం, వైద్యసేవలు అందించకపోవటంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AC Blast: ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త

ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా సరిగా హ్యాండిల్ చేయని, అజాగ్రత్తగా వాడితే అది పేలిపోతుంది. ఇళ్లలో ఏసీలు విచక్షణారహితంగా వాడటం వల్ల కూడా అదే జరుగుతుంది. ఎయిర్ కండీషనర్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకుంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఎయిర్ కండీషనర్ వాడుతున్నప్పుడు, పాత ఏసీని వాడుతున్నప్పుడు అలాగే అద్దెకు తీసుకున్న ఏసీని వాడుతున్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏసీ వల్ల పెద్ద ప్రమాదాలు జరిగినా ఇలాంటి ఎన్నో సంఘటనల గురించి ఇప్పటికి మీరు కూడా చదివి ఉంటారు. కానీ సకాలంలో దృష్టి సారించి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలను నివారించవచ్చు.

ఎయిర్ కండీషనర్‌లో పేలుడు ప్రమాదం.. కారణాలు, నివారణ

ముఖ్యంగా వేసవిలో ఎయిర్ కండిషనర్లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే ఎయిర్ కండీషనర్లలో కూడా పేలుడు సంభవించే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఇది చాలా అరుదైన సంఘటన, అయితే ఇది ఎలా జరుగుతుందో, దానిని ఎలా నిరోధించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.

ఏసీలో పేలుడు రావడానికి కారణం:

ఎలక్ట్రికల్ పనిచేయకపోవడం: బాడ్ వైరింగ్, వదులుగా ఉన్న కనెక్షన్ లేదా షార్ట్ సర్క్యూట్ ఎయిర్ కండీషనర్‌లో పేలుడుకు కారణం కావచ్చు.
గ్యాస్ లీకేజీ: ఎయిర్ కండీషనర్ శీతలీకరణ వ్యవస్థలో గ్యాస్ లీకేజీ ఉంటే, గ్యాస్ ఏదైనా మండే పరికరాన్ని తాకినా పేలుడు సంభవించవచ్చు.
వేడెక్కడం: ఎయిర్ కండీషనర్ అధికంగా వేడెక్కినా లేదా సరిగ్గా చల్లబడకపోయినా పేలడం జరగవచ్చు.
నిర్వహణలో లోపం: ఎయిర్ కండీషనర్ క్రమం తప్పకుండా నిర్వహణ ఉండకపోతే కూడా పేలవచ్చు. అలాగే సమయానికి సర్వీస్ చేయకపోతే, అది పేలుడుకు దారితీయవచ్చు.
టర్బో మోడ్: టర్బో మోడ్ సాధారణంగా ఏసీ వేగవంతమైన శీతలీకరణ కోసం దాని సుదీర్ఘ ఉపయోగం హానికరం.
పేలుడు నిరోధించడానికి చిట్కాలు:

ఎలక్ట్రికల్ భద్రత: ఎయిర్ కండీషనర్‌ను ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ ఇన్‌స్టాల్ చేశారని నిర్ధారించుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ భద్రతను తనిఖీ చేస్తూ ఉండండి.
రెగ్యులర్ మెయింటెనెన్స్: ఎయిర్ కండీషనర్‌ను క్వాలిఫైడ్ టెక్నీషియన్ ద్వారా క్రమం తప్పకుండా నిర్వహించడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి స్థానిక ప్రొవైడర్ నుండి AC అద్దెకు తీసుకున్నప్పుడు. ఇది కాకుండా, 600 గంటల ఉపయోగం తర్వాత ఏసీ సర్వీసింగ్ అవసరం.
లీకేజీ చెక్: ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి, టెక్నీషియన్‌ను పిలవండి.
అధిక వినియోగాన్ని నివారించండి: సహజంగానే ఏసీ వాడకం విపరీతమైన వేడిలో నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిని ఎక్కువ కాలం ఉపయోగించరాదు.
టర్బో మోడ్ సరైన ఉపయోగం: గది చల్లబడిన తర్వాత, టర్బో మోడ్‌ను ఆపివేయాలి. ఏసీని సాధారణ వేగంతో నడిపించాలి. లేకపోతే కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది.

IPL 2024 Playoffs Scenario: పాపం.. ముంబై ఓటమితో ఆ 3 జట్లకు మైండ్ బ్లాంక్.. కట్‌చేస్తే.. ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్?

IPL 2024 Playoffs Scenario: ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్‌కు మరింత బలం చేకూర్చింది. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.

IPL 2024 Playoffs Scenario: ఐపీఎల్ 2024 (IPL 2024)లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ (MI vs KKR)ని ఓడించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం, ముంబై ఓటమి తర్వాత, ప్లేఆఫ్‌కు వెళ్లే లెక్కలు మరోసారి మారిపోయాయి. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు దాదాపు ఈ సీజన్‌కు దూరమైనప్పటికీ, వారి ఓటమి ఇతర జట్లకు కూడా భారీ దెబ్బను మిగిల్చింది. అదేంటో ఇప్పుడు ఓసారి చూద్దాం..

పాయింట్ల పట్టికలో జట్ల స్థానం..
ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్‌కు మరింత బలం చేకూర్చింది. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.

ముంబై ఓటమితో ఈ జట్లకు గడ్డుకాలం..
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయి ఉంటే.. లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లాభపడి ఉండేవి. దీనికి కారణం ఈ జట్లు ఇప్పటికీ KKR కంటే వెనుకబడి ఉన్నాయి. కేకేఆర్ ఓడిపోతే ఆయా జట్లు ముందుకు వెళ్లే అవకాశం ఉండేది. లక్నో, సన్‌రైజర్స్ ప్రస్తుతం 10 మ్యాచ్‌లలో 12 పాయింట్లను కలిగి ఉండగా, KKR అదే సంఖ్యలో మ్యాచ్‌ల నుంచి 14 పాయింట్లను కలిగి ఉంది. CSK కూడా 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మాత్రమే సాధించింది. KKR మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్‌కు వెళుతుంది. ఇటువంటి పరిస్థితిలో కేవలం రెండు స్థానాలు మాత్రమే మిగిలిపోతాయి. దీని కోసం చాలా జట్ల మధ్య పోరు జరుగుతుంది.

ఈ కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ విజయం ఇతర జట్లకు కష్టాలను పెంచింది. ఇప్పుడు లక్నో, సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లలో రెండింట్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ కనీసం మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఇటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్‌ల లెక్కలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.

IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే:
1) రాజస్థాన్ రాయల్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లు

3) లక్నో సూపర్‌జెయింట్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

5) చెన్నై సూపర్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

7) పంజాబ్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) గుజరాత్ టైటాన్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

9) ముంబై ఇండియన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 10 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

Best Selling Phone : ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి!

Best Selling Phone : దేశీయ మార్కెట్‌లోకి రోజుకో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి బోలెడు ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. అయితే మీరు కూడా మంచి ఫీచర్లు ఉన్నా ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 12 వేలు ఉంటే మీకో బెస్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్. ఇది చాలా చౌకగా ఉండటంతో ప్రజలు దీన్ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఈ రియల్ మీ 12x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే దీని అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అంటే ఫోన్‌ను రూ. 11,999లకే కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 4 GB RAM +128 GB, 6 GB RAM +128 GB, 8 GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్‌లో ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.72-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 20Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కంపెనీ Realme UI 5.0తో ఆండ్రాయిడ్ 14లో పని చేస్తుంది. Realme UI 5.0 అనేది ఆండ్రాయిడ్ కస్టమైజ్డ్ వెర్షన్‌ను అందించే కంపెనీ కస్టమ్ స్కిన్ వెర్షన్. ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. 45 W SUPERVOOC ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఫోన్‌లో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియోకాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.ఇది 6mm ఆటో ఫోకస్‌కు ఉపయోగపడుతుంది. ఫోటో, వీడియో, నైట్, స్ట్రీట్, ప్రో, పనో, పోర్ట్రెయిట్, టైమ్‌లాప్స్, స్లో-మో, టెక్స్ట్ స్కానర్, 50M, టిల్ట్-షిఫ్ట్, మూవీ, డ్యూయల్-వ్యూ వీడియో , స్మార్ట్ సినారియో రికగ్నిషన్‌కు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీడియో షూటింగ్ కోసం ఫిల్ లైట్‌ ఉంది.

Noise Pop Buds : కిక్కిచ్చే ఆఫర్.. రూ.3500 ఇయర్‌బడ్స్ రూ.1000 లోపే!

Noise Pop Buds : మార్కెట్‌లో ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ గ్యాడ్జెట్లను ఉపయోగించేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తకొత్త కంపెనీలు ఈ మార్కెట్‌లో రకరకాల ఉత్పత్తులును తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా నాయిస్ పాప్ బడ్స్ భారతదేశంలో ప్రారంభించబడ్డాయి. కొత్త TWS బడ్‌లు ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC), 50 గంటల బ్యాకప్ బ్యాటరీ, క్వాడ్ మైక్ సెటప్‌తో తీసుకొచ్చారు. వీటిని నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వాటి ధర కూడా రూ.1000 లోపే ఉంటుంది. వాటి ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకోండి.

నాయిస్ సరికొత్త బడ్స్‌ను రూ.3,499 ధరతో విడుదల చేయగా లాంచింగ్ ఆఫర్ కింద 68 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో బడ్స్‌ను రూ.999లతో కొనుగోలు చేయవచ్చు. వీటిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, నాయిస్ ఇండియా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫారెస్ట్ పాప్, లిలక్ పాప్, మూన్ పాప్, స్టీల్ పాప్ కలర్ ఆప్షన్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 50 గంటల బ్యాకప్‌ని అందించే బ్యాటరీ ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 90 నిమిషాల టైమ్ పడుతుంది.

స్పెసిఫికేషన్లు, బ్యాటరీ విషయానికి వస్తే నాయిస్ పాప్ బడ్స్‌లో 50 గంటల బ్యాకప్‌ని అందించే బిగ్ బ్యాటరీ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది. అలానే ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇన్‌స్టాఛార్జ్ సౌకర్యం కూడా ఉంది. 10 నిమిషాల ఛార్జింగ్‌లో 150 నిమిషాల బ్యాకప్ అందించగలదని కంపెనీ తెలిపింది.

నాయిస్ TWS ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో వస్తుంది. ఇది కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గిస్తుంది. వీటికి 10ఎంఎం డ్రైవర్లు అందించారు. వీటిలో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 10 మీటర్ల పరిధిని అందిస్తుంది.

దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాటిని స్ప్లాష్ ఫ్రీగా చేయడానికి IPX5 రేటింగ్ ఉంది. తద్వారా వాటర్, స్వెట్, డస్ట్ నుంచి సేఫ్‌గా ఉంటాయి. బడ్స్‌పై కంపెనీ ఏడాదిపాటు వారెంటీ కూడా అందిస్తుంది.

అదే సమయంలో నాయిస్ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఆఫర్లలో, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 2 మాక్స్, నాయిస్ ఫిట్ హాలో ప్లస్, నాయిస్ బడ్స్ ఎక్స్ ప్రైమ్ పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ సమ్మర్ ఇక కూల్ కూల్.. ఇప్పుడు AC గోడకు కాదు ఇంట్లో ఎక్కడంటే అక్కడే..

టెక్నాలజీ అండ్ చైనా కంపెనీ Xiaomi కొత్త వెర్టికల్ ACని పరిచయం చేసింది. ఈ 3 టన్నుల ఎయిర్ కండీషనర్‌ను ఎక్కడైనా ఈజీగా ఉంచవచ్చు. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం…

Xiaomi Mijia ఎయిర్ కండీషనర్ Fresh Air Pro Dual Outlet పేరుతో తీసుకొచ్చారు. ఇది సాధారణ స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ లాంటిది కాదు. ఈ ఏసీ టవర్ ఫ్యాన్ లాగా నిలువుగా ఉంటుంది.

Xiaomi Mijia వర్టికల్ AC ఇంటి వినియోగం(home usage) కోసం గోడకు మౌంట్ చేయాల్సిన పని లేదు. గదిలో అవసరమైన ప్రదేశంలో దీనిని ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత.

సిల్వర్ కలర్ లో వస్తున్న ఈ మిజియా వెర్టికల్ ఏసీ క్వాలిటీ కూలింగ్ అందిస్తుంది. దీని డ్యూయల్ అవుట్‌పుట్ కారణంగా ఫాస్ట్ కూలింగ్ అందించగలదు.

3 టన్నుల సామర్థ్యం గల ఈ AC 1930W కూలింగ్ పవర్, 2680W హీటింగ్ పవర్ రెండింటితో ఉంటుంది. ఇంకా క్లాస్ 1 ఎనర్జీ సేవింగ్ ఫీచర్‌ కూడా ఉంది, అంతేకాదు కనీస విద్యుత్‌ వినియోగిస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇంటి లోపల మీకు కూలింగ్ అందిస్తుంది. ఈ AC కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే కెపాసిటీ కూడా కలిగి ఉంది. ఇందులో ఆటోమేటిక్ ఆన్ లేదా ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. మేలో చైనాలో విడుదల కానున్న ఈ ఏసీ ధర భారతీయ రూపాయి ప్రకారం దాదాపు లక్ష వరకు ఉండవచ్చని అంచనా.

UPSC: కేంద్ర శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు

దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ డైరెక్టర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్ డైరెక్టర్‌: 01 పోస్టు

2. డిప్యూటి కమీషనర్‌: 02 పోస్టులు

3. డిప్యూటి డైరెక్టర్: 01 పోస్టు

4. అసిస్టెంట్ కంట్రోలర్‌: 02 పోస్టులు

5. ట్రైనింగ్‌ ఆఫీసర్‌: 04 పోస్టు

6. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 05 పోస్టులు

7. సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్: 02 పోస్టులు

మొత్తం ఖాళీలు: 17.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16-05-2024.

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024.. iQOO స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు.. లిస్ట్‌..!

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024 (Amazon Great Summer Sale 2024) జరుగుతోంది. ఈ సేల్‌ మే 2వ తేదీన ప్రారంభమై.. 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ICICI, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వన్‌కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణం 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై భారీ తగ్గింపును పొందవచ్చు. ఐకూ హ్యాండ్‌సెట్‌లను (iQOO Smartphone Discounts) కూడా డిస్కౌంట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z7 ప్రో, ఐకూ Z9, ఐకూ 11, ఐకూ 11 వంటి హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ప్రయోజనాలు, నో ఈఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లేతో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 44W ఫ్లాష్‌ఛార్జ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్ ధర రూ.17999 గా ఉంటుంది. ఈ అమెజాన్‌ సేల్‌లో ఐకూ Z7 ప్రో హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 3D కర్వడ్‌ పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 64MP AURA లైట్‌ OIS కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు.

ఐకూ నియో 9 ప్రో హ్యాండ్‌సెట్‌ను క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ మరియు ప్రీమియం లెదర్ డిజైన్‌తో 50MP సోనీ IMX920 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 6.78 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌ను రూ.31,999 కే కొనుగోలు చేయవచ్చు. ఐకూ 11 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ 120Hz ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000 బ్యాటరీని కలిగి ఉంది. ఫలితంగా కేవలం 25 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.41,999 కి సొంతం చేసుకోవచ్చు. ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.52999గా ఉంది. ఈ అమెజాన్‌ గ్రేట్ సమ్మర్‌ సేల్‌ 2024 లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.49999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌ మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 పై పనిచేస్తుంది.

TRAI: ఇక మొబైల్‌ స్క్రీన్‌పై కాలర్‌ నేమ్‌.. ట్రాయ్‌ కీలక నిర్ణయం.. టెలికాం కంపెనీలకు ఆదేశాలు

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకరి నంబర్ సేవ్ చేసి ఉండకపోతే, మీకు తెలియని నంబర్ నుండి మీకు కాల్ వస్తే మీ మదిలో వచ్చే మొదటి ప్రశ్న కాలర్ ఎవరు కావచ్చు అని. ఇది మీకు తరచుగా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం కంపెనీలను కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్‌ని అమలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత తెలియని వ్యక్తి మీ ఫోన్‌కి కాల్ చేస్తే మీరు మీ ఫోన్ స్క్రీన్‌పై అతని పేరు కనిపిస్తుంది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసినా అతని పేరు స్కీ్న్‌పై తెలిసిపోతుంది.

అయితే సాధారణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లలో తెలియని కాల్‌ల గురించి సమాచారాన్ని పొందడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తారు. ఇందులో చాలా మంది వినియోగదారులు ట్రూ కాలర్‌ని ఉపయోగిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాలేషన్ సమయంలో తమ ఫీచర్‌లను అందించడానికి చాలా అనుమతులను అడుగుతాయి. ఇందులో సంప్రదింపు వివరాలు, ఫోన్ గ్యాలరీ, స్పీకర్, కెమెరా, కాల్ హిస్టరీకి సంబంధించిన సమాచారం ఉంటుంది. వీటన్నింటికీ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ థర్డ్ పార్టీ యాప్స్ పనిచేయవు. పర్మిషన్ ఇస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ లీక్ అవుతాయని భయం కూడా ఉంటుంది.

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ట్రయల్..

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని దేశవ్యాప్తంగా అన్ని టెలికాం కంపెనీలను ట్రాయ్‌ ఆదేశించింది. ఆ తర్వాత దేశంలో ప్రస్తుతం మొబైల్ సేవలను అందించే కంపెనీలు ట్రయల్ ప్రారంభించాయి. ట్రాయ్‌ వివరాల ప్రకారం, ఈ ట్రయల్ విజయవంతమైతే, కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. దీని తర్వాత మీకు తెలియని నంబర్‌ల గురించి సమాచారాన్ని పొందడానికి థర్డ్ పార్టీ యాప్ ఏదీ అవసరం లేదు.

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్‌ను పరీక్షించడానికి ట్రాయ్‌ దేశంలోని అతి చిన్న సర్కిల్‌ను ఎంపిక చేసింది. ఆ తర్వాత మొబైల్ సర్వీస్ అందించే కంపెనీలు హర్యానాలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించబోతున్నాయి. ట్రాయ్‌ సూచనలను అనుసరించి, కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్, టెస్టింగ్ హర్యానాలో ప్రారంభమవుతుంది.

సెలవుల్లో పిల్లలు ఫోన్లో మునిగిపోతున్నారా? -​ ఇలా చేస్తే ఇక ముట్టుకోరు!

How to Avoid Children from Mobile in Summer: నేటి పిల్లలంతా స్మార్ట్​ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కుదిరితే ఫోను లేదంటే టీవీ.. అన్నట్టుగా వాటితోనే గడుపుతున్నారు. బయటికి వెళ్లి ఆడుకోవాలి అనే సంగతే మర్చిపోతున్నారు. అయితే.. ఒక్కరోజు సెలవు దొరికితేనే ఫోన్లో తలకాయ దూర్చే పిల్లలు.. వేసవి సెలవులు వస్తే ఊరుకుంటారా? సెలవులు ఉన్నన్ని రోజులు ఫోన్లు, టీవీలతోనే కాలక్షేపం చేస్తారు. ఇది చూసిన పెద్దలు ఆందోళన చెందుతుంటారు. ఈ లిస్టులో మీ పిల్లలు కూడా ఉంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ సమ్మర్​లో పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్​ పాటించాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి.

రిలేటివ్స్​ ఇంటికి పంపించడం: ఒకప్పుడు పిల్లలకు వేసవి సెలవులు మాత్రమే కాదు పండగ సెలవులు వచ్చినా.. అమ్మమ్మ, నానమ్మ, అత్త, పిన్ని.. అంటూ బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ సెలవులు వచ్చినా ఇంట్లోనే ఉంటున్నారు. ఫోన్లకు అంకితమైపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే పిల్లలను చుట్టాలింటికి పంపించాలని అంటున్నారు. కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? మనుషులు ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా అక్కడ చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్​ చేస్తే కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటారు. దీనివల్ల ఫోన్​ ఉపయోగించడం క్రమంగా తగ్గిస్తారని చెబుతున్నారు.

గేమ్స్​ ఆడించడం: ఈరోజుల్లో గేమ్స్​ అంటే.. వీడియో గేమ్స్​, పబ్జీ, ఇంకా ఆన్​లైన్​ గేమ్స్​ మాత్రమే అని పిల్లలు అనుకునేలా తయారైంది పరిస్థితి. ఇవి మానసికంగా ఒత్తిడి కలిగించేవే తప్పించి ఆరోగ్యాన్ని పెంచేవి కావు. అసలు ఆటలంటే మైదానాల్లో ఆడేవేనని అంటున్నారు నిపుణులు. వీటితోపాటు చిన్న పిల్లలు సరదాగా ఆడుకునే పులి-మేక, గోలీలు, ఏడుపెంకులాట, నాలుగు స్తంభాలు, వీరి వీరి గుమ్మడిపండు, లండన్​ లండన్​ స్టాప్​, కళ్లకు గంతలు ఆటలన్నీ భలే సరదగా ఉంటాయి. ఈ ఆటలు ఆడితే అటు మానసికంగా, ఇటు శారీరకంగా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ ఆటల్లోని సరదా తెలిస్తే ఫోన్​ తీసుకోమన్నా కూడా పిల్లలు తీసుకోరని చెబుతున్నారు.

కథలు చెప్పడం: చిన్నపిల్లలు కథలను ఎంతగానో ఇష్టపడతారు. అయితే ప్రస్తుత రోజుల్లో కథలు చెప్పేంత తీరిక పెద్దవాళ్లకు లేకపోవడంతో ఫోన్లోనే పిల్లలకు కావాల్సిన కథలు పెట్టుకుని వింటున్నారు. అయితే ఇలా వినడం కన్నా.. పెద్దల ద్వారా వింటే ఆ ఊహాలోకంలోకి వెళ్లొచ్చంటున్నారు నిపుణులు. కథలే కాకుండా ఇతిహాసాలు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబితే వాటి మీద ఇంట్రస్ట్​ కలిగి ఫోన్​ జోలికి పోరంటున్నారు నిపుణులు.

Belly Fat: పొట్ట తగ్గించుకోవాలని ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారా? పసుపు ఇలా వాడి చూడండి..!

బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, ఆహారం నియంత్రించుకోవడం కూడా చేస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి కంటిన్యూగా చేస్తే పర్లేదు.. కానీ అడపాదడపా వీటిని పాటిస్తే పెద్దగా ఫలితాలేమీ ఉండవు. పైపెచ్చు సప్లిమెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎవరైనా సరే ఎక్కువ లావు లేకపోయినా కాసింత పొట్ట ఉంటే చాలు.. లావున్నారని, బాగా బరువు ఉన్నారని అంటూ ఉంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, ఆహారం నియంత్రించుకోవడం కూడా చేస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి కంటిన్యూగా చేస్తే పర్లేదు.. కానీ అడపాదడపా వీటిని పాటిస్తే పెద్దగా ఫలితాలేమీ ఉండవు. పైపెచ్చు సప్లిమెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఇవన్నీ కాకుండా వంటింట్లో ఉండే పసుపుతో బరువును, పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకోసం పసుపును ఎలా తీసుకోవాలో తెలుసుకుంటే..

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు బరువు తగ్గడాన్ని సులభం చేస్తాయి.

ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు నిద్రపోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు ఒత్తిడి. వీటన్నింటికీ పసుపు పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక గ్లాసు వేడి పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది, నిద్రను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి పసుపు నీరు చాలా మేలు చేస్తాయి. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే బరువు తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది.

పసుపు బరువును తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది, అయితే దీనితో పాటు ఆహారాన్ని కూడా నియంత్రించాలి. జంక్ ఫుడ్ తింటూ బరువు తగ్గుతామని అనుకోవడం కాదు. పసుపు తీసుకోవడంతో పాటు ఆహారాన్ని నియంత్రించాలి. ప్రతిరోజూ కొన్ని వ్యాయామం చెయ్యాలి.

వడ్డీ లేకుండానే మహిళలకు రూ.5 లక్షల రుణం – ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

Lakhpati Didi Scheme Details : మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి పథకాలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు! అసలు ఆ పథకం ఏంటి? ఎవరు అర్హులు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
How to Apply for Lakhpati Didi Scheme: ఎప్పుడైతే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించి కుటుంబానికి అండగా నిలిస్తారో అప్పుడే దేశం ముందుకు సాగుతుందని నిపుణులంటున్నారు. అందుకే ప్రభుత్వాలు మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు వీలుగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, నిరక్ష్యరాస్యులు ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు కృషి చేశాయి. అయితే, గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళల కోసం మరో పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు వడ్డీ లేకుండానే రుణం అందిస్తారు. కాగా, ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. మరి ఆ పథకానికి సంబంధించిన వివరాలు, లోన్‌ పొందడానికి ఎవరు అర్హులు ? ఎన్ని లక్షల వరకు రుణాన్ని అందిస్తారు ? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

అదే లక్ష్యంగా: మహిళలను లక్షాధికారులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో లఖ్‌పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. మొట్టమొదట ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ స్కీమ్‌ పొందడానికి అర్హులు : స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండి.. 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు లఖ్‌పతి దీదీ పథకానికి అర్హులు.

ఈ పథకం పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు:

ఆధార్​ కార్డు
బ్యాంక్​ పాస్​బుక్​
SHG సభ్యత్వ కార్డు
కులధ్రువీకరణ పత్రం
ఫోన్​ నెంబర్​
పాస్​ఫొటో
ఎలా అప్లై చేసుకోవాలంటే:

మీరు ఈ స్కీమ్‌ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి.
అక్కడ లఖ్‌పతి దీదీ పథకం ఫారమ్​ తీసుకుని.. అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి.
తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్​ చేయాలి.
మీ దరఖాస్తు ఫారమ్​ను అధికారులు పరిశీలించి.. అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.
శిక్షణను అందిస్తారు : ఈ పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ శిక్షణ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తారు. ఈ స్కీమ్‌ ద్వారా మహిళలు ఆదాయ వనరుల్ని కల్పించుకునేందుకు, పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం పేర్కొంది.

Benefits Of Betel Leaf: తమల పాకులతో హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చెక్‌!

తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని మీకు తెలుసా?

సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.

తమలపాకు నీటితో జుట్టును కడగాలి
తల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్‌ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది.

తమలపాకు,నెయ్యి హెయిర్‌ మాస్క్‌
తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్‌ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

మసాజ్‌
తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

తమలపాకులతో చేసిన నూనె
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్‌ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు.

తమలపాకులను తినండి
ఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరగబోతున్నాయి.. మీ జేబుపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా?

బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఇటీవల అనేక నియమాలను మార్చింది. ఇప్పుడు ఇది మీ జేబుపై కూడా ప్రభావం చూపుతుంది. కొత్త మార్గదర్శకాల కారణంగా ఇప్పుడు బీమా కంపెనీలు ఆరోగ్య బీమా ప్రీమియంను పెంచబోతున్నాయి. దీని కారణంగా ప్రీమియం కనిష్టంగా రూ.1000 పెరగవచ్చు. కొన్ని కంపెనీలు ప్రీమియం పెంచే సూచనలు కూడా ఇవ్వడం ప్రారంభించాయి . ఐఆర్‌డీఏ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు గరిష్టంగా 4 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించింది. ఇది కాకుండా, కొత్త నిబంధనలలో సీనియర్ సిటిజన్లకు కూడా ఉపశమనం లభించింది. అంతే కాకుండా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆరోగ్య బీమా కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశించింది. దీంతో పాటు ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్‌ను కూడా ప్రజలకు అందించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు వినియోగదారులకు ఎంతో ఊరటనిచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రీమియం రేట్లు పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి.

హెచ్‌డిఎఫ్‌సి ఇఆర్‌జిఓ ఇటీవలే ప్రీమియంను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచబోతున్నట్లు తెలిపింది. పాలసీదారుడి వయస్సు, కుటుంబ సభ్యులను బట్టి ప్రీమియం పెంచబడుతుందని కంపెనీ వినియోగదారులకు పంపిన ఇమెయిల్‌లో తెలిపింది. కొత్త నిబంధనలు, వైద్య ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోవిడ్ 19 తర్వాత ప్రీమియం వేగంగా పెరిగింది:
కంపెనీలు ప్రీమియంను 10 నుంచి 15 శాతం పెంచుకోవచ్చని ఎకో జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్‌డీఏ ఇప్పుడు ఆదేశించింది. కస్టమర్ వయస్సు పెరుగుతున్న కొద్దీ కంపెనీల రిస్క్ పెరుగుతుంది కాబట్టి, ప్రీమియం పెరగడం ఖాయం. ప్రతి 5 సంవత్సరాల వయస్సు తర్వాత, ప్రీమియంలు 10 నుండి 20 శాతం పెరుగుతాయి. CNBC TV 18 నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2019 నుండి 2024 వరకు సగటు ప్రీమియం దాదాపు 48 శాతం పెరిగి రూ.26533కి చేరుకుంది. కోవిడ్ 19 తర్వాత ఇది వేగంగా పెరిగింది.

గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు

వేసవి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకొచ్చేది పుచ్చ, ఖర్బూజ. ఈ సీజన్ లో వీటిని సాగుచేసేన రైతులకు సిరుల పంటే. అందుకే చాలామంది రైతులు సీజనల్ గా వీటి సాగుచేపడుతుంటారు. ఈ కోవలోనే యూపీకు చెందిన ఓ రైతు రెండేళ్లుగా ఖర్బూజ సాగుచేసి చరిత్ర సృష్టించాడు. కొచెం రిస్క్ ఎక్కువే అయినా… తక్కువ సమయంలో అంటే నాలుగు నెలల్లో రూ. 3 కోట్లు సంపాదించాడు.

ఉత్తరప్రదేశ్​ షాజహాన్‌పూర్‌లోని పువాయాన్ తహసీల్‌కు చెందిన ప్రగతిశీలకు చెందిన యువ రైతు దీపక్ తాను నివసించే ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను ఎకరాకు రూ.25 నుంచి 30 వేల చొప్పున రైతుల నుంచి కౌలుకు తీసుకున్నాడు. వేసవి కాలంలో బాగా డిమాండ్​ ఉన్న ఖర్బూజా పంటను సాగు చేశాడు. దీనితో పాటు పుచ్చకాయ పంటను కూడా పండించాడు. ఈ పంటల సాగుతో దీపక్​ కోటీశ్వరుడయ్యాడు. దీపక్​ చదువుకునే రోజుల్లోనే వ్యవసాయంపై దృష్టి సారించాడు. ఎంకాం చదివిన ఆయన పలుగు.. పార.. నాగలి పట్టి ఔరా అనిపించుకున్నాడు.

యూపీలోని గంగ్​ సార నివాసి దీపక్​ ఆ గ్రామంలోని రైతుల భూమిని 4 నెలల పాటు లీజుకు తీసుకున్నాడు. 20 ఏళ్ల నుంచి ఖర్బూజా.. పుచ్చకాయ పంటలను సాగుచేశాడు. మొదట్లో 10 ఎకరాల్లో పండించిన దీపక్​.. ఇప్పుడు 356 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ ప్రాంతంలో రైతులు ఎక్కువుగా బంగాళదుంప పంటను సాగు చేస్తారు. ఈ పంటను కోసిన తరువాత.. రైతుల పొలాలు ఖాళీగా ఉండటంతో 4 నెలల పాటు లీజుకు తీసుకొని పుచ్చకామ, ఖర్బూజా పంటలను సాగు చేశాడు.

దీపక్​ అనేక రకాల విత్తనాలనుసేకరించి … . థాయ్​లాండ్​, తైవాన్​ నుంచి తీసుకొచ్చిన ఖర్బూజా నాణ్యమైన విత్తనాలను పొలాల్లో నాటాడు. వీటి విత్తనాల ధర కిలో రూ. 30 వేల నుంచి 95 వేల వరకు ఉంటుంది. ఖర్బూజా పంట ఎకరానికి150 నుంచి 200క్వింటాళ్లు పండాయి. దీపక్​ ఉత్తరప్రదేశ్​లోని 40 నుంచి 50 మండీలకు .. ఉత్తరాఖండ్‌లోని 20 మండీలకు … బీహార్‌లోని అనేక జిల్లాలకు సరఫరా చేశాడు. కొంతమంది పండ్ల వ్యాపారులు నేరుగా దీపక్​ ను సంప్రదించి ఆర్డర్​ ఇచ్చేవారని యువరైతు దీపక్​ తెలిపారు.

ఖర్బూజా, పుచ్చకాయ పంటను సాగు చేసిన దీపక్​ ఒక్క సీజన్​ లోనే రూ. 3 కోట్లు సంపాదించారు. అంతేకాదు ఆయన 400 నుంచి 500 మందికి ఉపాధి కల్పించాడు. విత్తనం నాటిన దగ్గర నుంచి కోయడం.. మార్కెట్లకు రవాణాచేసేందుకు కొంతమంది సహాయం తీసుకునేవాడినని దీపక్​ అన్నారు. సమ్మర్​ సీజన్​ లో ఖర్బూజా… పుచ్చకాయలు మార్కెట్లో చాలా సులభంగా అమ్ముడవుతున్నాయి. వేసవిలో ఇలాంటి పంటలను చేస్తే ఆదాయం పెంచుకోవచ్చని అంటున్నారు.

ఖర్బూజా పంట అధిక దిగుబడి ఉత్పత్తి అయింది. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. సమ్మర్​ సీజన్​ లో దీనిని చాలామంది తింటారు. అయితే వేసవిలో పుచ్చ, ఖర్బూజకు మంచి డిమాండ్ ఉండటంతో.. గత ఏడాది నుండి ఖర్బూజ సాగుచేస్తున్నారు. బెడ్డింగ్‌విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి, సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా, నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఖర్బూజ సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు.దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కూలీలు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి, డబ్బులు చేతికొచ్చే పంటలను సాగుచేయడం వల్ల రైతు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు. .. మిగతా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.

Covid FLiRT: కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు అమెరికా గజగజ – భారీగా పెరుగుతున్న FLiRT కేసులు, లక్షణాలేమిటీ?

New COVID-19 Variant On The Rise In The US: కరోనా వైరస్ కారణంగా అమెరికా అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సీన్ రాక తర్వాత నెమ్మదిగా అమెరికా కుదుట పడింది. మళ్లీ కోలుకుని గాడినపడింది. అయినా, ఇప్పటికీ అమెరికాను కోవిడ్-19 భయం వణికిస్తూనే ఉంది. సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతూనే ఉన్నారు. తాజాగా అమెరికాను కొత్త వేరియంట్ భయపెడుతోంది. FLiRT అనే పేరుతో పిలిచే ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కూడా గత వైరస్ లా మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ నుంచే పుట్టుకొచ్చినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

అమెరికాలో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు
గత ఏడాది చివరల్లో జేఎన్-1 కరోనా వేరియంట్‌ బాగా విస్తరించింది. దీనిని తొలిసారి సెప్టెంబర్‌లో గుర్తించారు. జేఎన్.1 కరోనా స్పైక్ ప్రోటీన్‌ లో మ్యుటేషన్ కలిగి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ FLiRT కూడా దాని మాదిరిగానే వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఇది జేఎన్.1 నుంచి ఏర్పడిన ఓమిక్రాన్‌ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. గత రెండు వారాల్లో అమెరికాలో నమోదైన కోవిడ్ -19 కేసుల్లో 25 శాతం FLiRT వేరియంట్ కేసులే ఉన్నాయన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించలేదని తెలిపారు.

FLiRT ప్రమాదకరమా?
FLiRT వేరియంట్ రోగిపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది? అనే విషయంపై పరిశోధన సాగుతోంది. అయితే, ఇది రోగ నిరోధక శక్తిని విపరీతంగా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. గత వేరియంట్ల మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందన్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు సహా జీర్ణాశయ సమస్యలు ఉన్నట్లు తెలిపారు.

FLiRT అంటే?
ఫ్లిర్ట్(flirt) అంటే మాటలతో పడగొట్టడం లేదా సరసాలు ఆడటమో కాదు. కొత్తగా ఏర్పడే కోవిడ్-19 వేరియెంట్లలో.. నిర్దేశిత మ్యూటేషన్స్‌ను సులభంగా గుర్తించేందుకు వీలుగా.. వాటి శాస్త్రీయ పదాలతో పేర్లు పెడుతుంటారు. FLiRT కూడా అలాగే పుట్టింది. JN.1 వేరియెంట్ నుంచి ఏర్పడిన ఈ కొత్త మ్యూటేషన్‌లో ఒకదానికి F, L.. మరొకదానికి R, T అక్షరాలు ఉన్నాయి. అవన్నీ కలిపి.. ఈ కొత్త వేరియెంట్‌కు FLiRT అని పేరు పెట్టారు.

అమెరికాలో మరో కోవిడ్-19 వేవ్ తప్పదా?
అమెరికాలో కోవిడ్ -19 కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతున్నప్పటి, ఎక్కువ ప్రమాదం ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జేఎన్-1 వేరియంట్ సోకిన వ్యక్తులు ఇన్ఫెక్షన్ నుంచి కొంత కోలుకున్నట్లు తెలిపారు. గతంతో మాదిరిగా రోగులపై కొత్త వేరియంట్లు బలమైన ప్రభావాన్ని చూపించడం లేదంటున్నారు. అంతేకాదు, కొత్త వేరియంట్లు వస్తున్నప్పటికీ బలహీనం అవుతున్నట్లు చెప్పారు.

జాగ్రత్తలు పాటించాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిడ్-19 విషయంలో భయపడాల్సిన అవసరం లేకపోయినా, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కోవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతూనే ఉంటుందని అభిప్రాయపడింది. వీలైనంత వరకు ప్రజలు టీకాలు వేసుకోవాలని సూచించింది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మంచిదని తెలిపింది. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించింది. మనిషికి మనిషికి మధ్యన దూరం పాటించాలని చెప్పింది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెల్లకూడదని చెప్పింది. కరోనా విషయంలో అలసత్వం వహించకూడదని వివరించింది. పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులు తప్పకుండా కరోనా సూచనలు పాటించాలని చెప్పింది.

AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. అయితే, గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు.. బ్యాంకులు ఓపెన్‌ చేయకముందే.. ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు.. అయితే, డీబీటీ ద్వారా డబ్బులు జమ కానివారికి ఇవాళ్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

పెన్షన్ల పంపిణీ కొరకు ఈ నెల 1,945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని.. మూడు రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. మొత్తం 16,57,361 మందిలో 15,95,482 (96.27 శాతం) మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది ఏపీ ప్రభుత్వం.. 48,92,503 మందిలో 48,17,718 (98.47 శాతం) మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్టు పేర్కొంది.. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్ అందలేదని స్పష్టం చేసింది.. పెన్షన్ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.. ఈ రోజు, రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌ అండ్ రూరల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాని వారికి ఈ నెల 4న (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Uric Acid: హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వాముతో అద్భుత ఔషధం..! ఇలా వాడితే..

Ajwain: వాము.. ప్రతి ఒక్కరి వంటింట్లో వాములో ఎన్నో పోషక విలువలు,ఔషధ గుణాలు నిండి ఉంది. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాము రుచిలో కాస్త ఘాటుగా ఉంటుంది. వాములో ఉండే రసాయనాలు జీర్ణ ప్రక్రియలో సహాయపడతాయి. ప్రతి రోజు వామును తీసుకోవటం వలన మన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక స్పూన్ వామును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు ఉన్నవారికి వాము ఒక దివ్య ఔషధం అంటున్నారు నిపుణులు. వాములో ఉన్న గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించటంలో సహాయపడుతుంది. జలుబు,అలసట,తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారం అని ఆయుర్వేదం చెప్పుతుంది. అలాగే, యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో ఇబ్బంది పడేవారికి వాము, నిమ్మకాయతో చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ అనేతా శరీరంలో పేరుకుపోయిన ఒక విష పదార్థం. ఇది ప్యూరిన్ ప్రోటీన్ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే తీవ్ర సమస్యలు వస్తాయనే భయం ఉంటుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. నిమ్మరసంతో వాము కలిపి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

నిమ్మకాయ, వాము ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తారు . ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నిమ్మ, వాములో ఉండే లక్షణాలు, పోషకాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది మూత్ర సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Nepal: నేపాల్ రూ. 100 నోటుపై కొత్త భూభాగాలు.. భారత్ తీవ్ర అభ్యంతరం..!

Nepal: నేపాల్‌ దేశం తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడంతో నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం నాడు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్‌, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్తపటం ఏర్పాటు చేసింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ది కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా ఇండియా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని క్లారిటి ఇచ్చింది.

ఇక, ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) నేతృత్వంలో సమావేశమైన మంత్రి మండలి రూ. 100 నోట్లపై నేపాల్‌ పాతపటం స్థానంలో కొత్తపటం ముద్రణకు నిర్ణయం తీసుకొన్నట్లు ఆ దేశానికి చెందిన సమాచార, ప్రసార శాఖ మంత్రి రేఖాశర్మ మీడియాకు తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్‌ 2020 జూన్‌లో రాజ్యాంగ సవరణ కూడా చేసినట్లు తెలుస్తుంది. సరిహద్దులో వ్యూహాత్మకంగా ఉన్న కీలకమైన పై మూడు భూభాగాలు తమకు చెందినవిగా భారత్‌ తెలియజేస్తుంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌.. ఐదు భారత రాష్ట్రాలతో నేపాల్‌ 1,850 కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.

VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 99 అప్రెంటిస్ ఖాళీలు

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)… 2023-24 సంవత్సరానికి టెక్నీషియన్‌/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 50 ఖాళీలు

2. టెక్నీషియన్ అప్రెంటిస్: 49 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 99.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 30-04-2024 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 28 ఏళ్లు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 30 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

సెలక్షన్‌ డ్రైవ్ తేదీ: 08.05.2024.

వేదిక: వీఎస్‌ఎస్‌సీ గెస్ట్ హౌస్, ఏటీఎఫ్‌ ఏరియా, వెలి, తిరువనంతపురం జిల్లా, కేరళ.

Healthy Lifestyle: ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే చాలు.. శరీర మార్పులు చూసి షాక్ అవుతారు..

Chia Seeds Benefits : ఈ వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది. ఈ క్రమంలో చియా గింజలు నీళ్లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. చియా గింజలు మన శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు.. దానిని తగ్గించడానికి కూడా చియాగింజలు బాగా ఉపయోగపడతాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న చియా గింజలను రాత్రి మొత్తం నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఆ నీళ్లను ఖాళీ కడుపుతో తాగితే.. రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

చియా గింజలని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. రాత్రి మొత్తం చియాగింజలను నానబెట్టిన నీళ్ళని ఉదయం తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందట. చియా గింజలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. పీచు పదార్థం, ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటి ఆక్సిడెంట్లు, క్యాల్షియం, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే.. చియా గింజలలో బోలెడు పోషకాలు ఉన్నాయి.

బరువు తగ్గడానికి ఔషధం

ఉదయం చియా గింజల నీళ్లను తాగడం వల్ల.. రోజు మొత్తం ఏం తిన్నా.. చాలా సులువుగా జీర్ణం అవుతూ ఉంటుంది. అందులో ఉండే పీచు పదార్థం వల్ల.. మన శరీరం దాన్ని త్వరగా అరిగించుకోగలదు. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి ఇబ్బందులు కూడా రాకుండా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి చియా గింజలు ఒక దివ్య ఔషధం. ఉదయాన్నే చియాగింజల నీళ్లు తాగడం వల్ల కడుపు కొంచెం నిండుగా అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువగా తినబుద్ధి కాదు. కాబట్టి చాలా త్వరగా బరువు తగ్గిపోవచ్చట.

గుండెకి ఎంతో మేలు:

చియా గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని పూర్తిగా తగ్గించేస్తుంది. దానివల్ల మనకు గుండె సంబంధిత సమస్యలు రావు. చియా గింజలు రక్తపోటుని కూడా నియంత్రిస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా గింజల నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కంటెంట్ మన శరీరాన్ని అలసిపోనివ్వవు. రోజు మొత్తం హుషారుగా ఉండటానికి చియా గింజల నీళ్లు బాగా ఉపయోగపడతాయి. చియా గింజలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మన బోన్ దృఢపడేలాగా చేస్తాయి. బోన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకల సమస్యలు రాకుండా దోహదపడతాయి.

చియా గింజలు షుగర్ ను కూడా నియంత్రణలోకి తెస్తాయి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇకనుంచి రోజు ఉదయం లేవగానే.. రాత్రంతా చియా గింజలను నానబెట్టిన నీళ్లు తాగడం మొదలుపెట్టండి. చాలా త్వరగానే.. మీ శరీరంలోని మంచి మార్పులను మీరు చూస్తారు.

Post Office: ఈ పథకం మిమ్మల్ని కోటీశ్వరున్ని చేస్తుంది.. కేవలం రూ.417 పెట్టుబడితో భారీ ఆదాయం

దేశంలోని చాలా మంది ప్రజలు లక్షాధికారులు కావాలని కలలు కంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకుంటారు. కొంతమంది ఈ కలను ఎలా నెరవేర్చుకోవాలనే దానిపై పని చేస్తారు. మీరు జీతం తరగతి వ్యక్తి అయితే, మీ ఉద్యోగం ప్రారంభంలోనే పెట్టుబడి పెట్టడం అర్ధమే. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత మంచి రాబడిని పొందవచ్చు. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే అటువంటి పోస్టాఫీసు పథకం గురించి తెలుసుకుందాం.

ఈ పోస్టాఫీసు పథకం మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు

పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా రూ.12,500 జమ చేసి 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలి. అంటే రోజూ రూ.417 పొదుపు చేసి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు మెచ్యూరిటీపై మొత్తం రూ. 40.68 లక్షలు పొందుతారు. ఇందులో మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు కాగా, మీ వడ్డీ ఆదాయం రూ. 18.18 లక్షలు. ఈ గణన తదుపరి 15 సంవత్సరాలకు 7.1% వార్షిక వడ్డీ ఆధారంగా జరిగింది. వడ్డీ రేటు మారినప్పుడు మెచ్యూరిటీ మొత్తం మారవచ్చు. పీపీఎఫ్‌లో వడ్డీ సమ్మేళనం ఆధారంగా అందుబాటులో ఉంటుంది.

ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు

మీరు ఈ పథకం ద్వారా కోటీశ్వరులు కావాలనుకుంటే 15 సంవత్సరాల తర్వాత మీరు దానిని 5 సంవత్సరాలకు రెండుసార్లు పొడిగించుకోవాలి. అంటే, ఇప్పుడు మీ పెట్టుబడి కాలం 25 సంవత్సరాలు. 25 ఏళ్ల తర్వాత మీరు మొత్తం రూ.1.03 కోట్లు పొందుతారు. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, మీరు వడ్డీ ఆదాయంగా రూ. 65.58 లక్షలు పొందుతారు. మీరు పీపీఎఫ్‌ ఖాతాను పొడిగించాలనుకుంటే మీరు మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందు దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోండి. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించడం అంటూ ఉండదు.

పన్నుపై మినహాయింపు పొందండి

పీపీఎఫ్‌ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది. ఈ పథకంలో మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై రాయితీని పొందవచ్చు. పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీపై కూడా పన్ను విధించబడదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇందులో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితం.

Washing Machine: కొత్త 7 Kg వాషింగ్ మెషిన్‌ను రూ.1,350కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Onida 7 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ డెడ్‌ చీఫ్ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ONIDA గతంలో లాంచ్‌ చేసిన ఓ వాషింగ్‌ మెషిన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.5,850తో లభిస్తోంది. అయితే దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ONIDA వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ వాషింగ్‌ మెషన్‌ చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది అద్భుతమైన మోటర్‌ను కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కూడా డెడ్‌ చీప్‌ ధరకు పొందవచ్చు. ఈ ఆఫర్‌ వినియోగించడానికి పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను రూ.1,350కే పొందవచ్చు.

ఒనిడా 7 కిలోల వాషింగ్ మెషిన్ టాప్ 10 ఫీచర్లు:
7 కిలోల బట్టల సామర్థ్యం
వాష్ ట్యూబ్
రెండు టబ్‌లు
పవర్‌ఫుల్ మోటార్
3 వాష్ ప్రోగ్రామ్‌లు
ఫ్లో బ్యాక్ సిస్టమ్
రట్‌ ఫ్రీ డిజైన్
చైల్డ్ లాక్
లిఫ్ట్-అప్ డ్రైయర్
1 సంవత్సరాల వారంటీ

అదనపు లక్షణాలు:
సోప్ డిస్పెన్సర్
ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ డిస్పెన్సర్
వాటర్ ఇన్‌లెట్ పైప్
డ్రెయిన్ పైప్

PM Modi: ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్‌ ఖరారు

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 6, 8 తేదీల్లో నాలుగుచోట్ల ప్రధాని పర్యటన ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.

విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, జనసేన అధికార ప్రతినిధి గౌతం మాట్లాడారు. 6వ తేదీ ఉదయం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కశింకోట మండలం ఊగినిపాలెం వద్ద, 8వ తేదీ ఉదయం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పీలేరు మండలం కలికిరి వద్ద బహిరంగసభలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రధాని పాల్గొంటారని తెలిపారు. ఎనిమిదో తేదీ సాయంత్రం 5గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌షోలో ప్రధాని పాల్గొంటారని వివరించారు.

Health

సినిమా