గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు

వేసవి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకొచ్చేది పుచ్చ, ఖర్బూజ. ఈ సీజన్ లో వీటిని సాగుచేసేన రైతులకు సిరుల పంటే. అందుకే చాలామంది రైతులు సీజనల్ గా వీటి సాగుచేపడుతుంటారు. ఈ కోవలోనే యూపీకు చెందిన ఓ రైతు రెండేళ్లుగా ఖర్బూజ సాగుచేసి చరిత్ర సృష్టించాడు. కొచెం రిస్క్ ఎక్కువే అయినా… తక్కువ సమయంలో అంటే నాలుగు నెలల్లో రూ. 3 కోట్లు సంపాదించాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉత్తరప్రదేశ్​ షాజహాన్‌పూర్‌లోని పువాయాన్ తహసీల్‌కు చెందిన ప్రగతిశీలకు చెందిన యువ రైతు దీపక్ తాను నివసించే ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను ఎకరాకు రూ.25 నుంచి 30 వేల చొప్పున రైతుల నుంచి కౌలుకు తీసుకున్నాడు. వేసవి కాలంలో బాగా డిమాండ్​ ఉన్న ఖర్బూజా పంటను సాగు చేశాడు. దీనితో పాటు పుచ్చకాయ పంటను కూడా పండించాడు. ఈ పంటల సాగుతో దీపక్​ కోటీశ్వరుడయ్యాడు. దీపక్​ చదువుకునే రోజుల్లోనే వ్యవసాయంపై దృష్టి సారించాడు. ఎంకాం చదివిన ఆయన పలుగు.. పార.. నాగలి పట్టి ఔరా అనిపించుకున్నాడు.

యూపీలోని గంగ్​ సార నివాసి దీపక్​ ఆ గ్రామంలోని రైతుల భూమిని 4 నెలల పాటు లీజుకు తీసుకున్నాడు. 20 ఏళ్ల నుంచి ఖర్బూజా.. పుచ్చకాయ పంటలను సాగుచేశాడు. మొదట్లో 10 ఎకరాల్లో పండించిన దీపక్​.. ఇప్పుడు 356 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ ప్రాంతంలో రైతులు ఎక్కువుగా బంగాళదుంప పంటను సాగు చేస్తారు. ఈ పంటను కోసిన తరువాత.. రైతుల పొలాలు ఖాళీగా ఉండటంతో 4 నెలల పాటు లీజుకు తీసుకొని పుచ్చకామ, ఖర్బూజా పంటలను సాగు చేశాడు.

Related News

దీపక్​ అనేక రకాల విత్తనాలనుసేకరించి … . థాయ్​లాండ్​, తైవాన్​ నుంచి తీసుకొచ్చిన ఖర్బూజా నాణ్యమైన విత్తనాలను పొలాల్లో నాటాడు. వీటి విత్తనాల ధర కిలో రూ. 30 వేల నుంచి 95 వేల వరకు ఉంటుంది. ఖర్బూజా పంట ఎకరానికి150 నుంచి 200క్వింటాళ్లు పండాయి. దీపక్​ ఉత్తరప్రదేశ్​లోని 40 నుంచి 50 మండీలకు .. ఉత్తరాఖండ్‌లోని 20 మండీలకు … బీహార్‌లోని అనేక జిల్లాలకు సరఫరా చేశాడు. కొంతమంది పండ్ల వ్యాపారులు నేరుగా దీపక్​ ను సంప్రదించి ఆర్డర్​ ఇచ్చేవారని యువరైతు దీపక్​ తెలిపారు.

ఖర్బూజా, పుచ్చకాయ పంటను సాగు చేసిన దీపక్​ ఒక్క సీజన్​ లోనే రూ. 3 కోట్లు సంపాదించారు. అంతేకాదు ఆయన 400 నుంచి 500 మందికి ఉపాధి కల్పించాడు. విత్తనం నాటిన దగ్గర నుంచి కోయడం.. మార్కెట్లకు రవాణాచేసేందుకు కొంతమంది సహాయం తీసుకునేవాడినని దీపక్​ అన్నారు. సమ్మర్​ సీజన్​ లో ఖర్బూజా… పుచ్చకాయలు మార్కెట్లో చాలా సులభంగా అమ్ముడవుతున్నాయి. వేసవిలో ఇలాంటి పంటలను చేస్తే ఆదాయం పెంచుకోవచ్చని అంటున్నారు.

ఖర్బూజా పంట అధిక దిగుబడి ఉత్పత్తి అయింది. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. సమ్మర్​ సీజన్​ లో దీనిని చాలామంది తింటారు. అయితే వేసవిలో పుచ్చ, ఖర్బూజకు మంచి డిమాండ్ ఉండటంతో.. గత ఏడాది నుండి ఖర్బూజ సాగుచేస్తున్నారు. బెడ్డింగ్‌విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి, సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా, నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఖర్బూజ సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు.దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కూలీలు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి, డబ్బులు చేతికొచ్చే పంటలను సాగుచేయడం వల్ల రైతు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు. .. మిగతా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *