80 రూపాయలతో 1600 కోట్లు గడించారు.. ఈ ఏడుగురు మహిళలు చేసిన పనికి ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే..

మహిళలు అన్ని రంగాల్లో మెరుస్తున్నారు. పురాతన పితృస్వామ్య సిద్ధాంతాలను కూల దోస్తున్నారు. మగ కోటలుగా పరిగణించే సంప్రదాయాలపై దాడి చేస్తున్నారు. అనాచారాలకు చరమ గీతం పాడుతూ ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ ఏడుగురు మహిళలు మాత్రం 70ఏళ్ల ముందే ఆచారంతో కట్టిపడేసే సంకెళ్లను విస్మరించారు. రూ. 80 పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసి రూ. 1600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. లిజ్జత్ పాపడ్ తో ప్రతీ ఇంటిని పలకరించిన వీరి సక్సెస్ స్టోరీ మీకోసం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

1959లో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటుంది. నిరక్షరాస్యత.. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా ఉంది. ఆర్థిక అవకాశాలు చాలా తక్కువ. ఈ టైంలో కూడా ముంబైకి చెందిన ఏడుగురు మహిళలు.. దృఢ సంకల్పం, విప్లవాత్మకమైన ఆలోచనతో తమ జీవితాలను మార్చుకునేందుకు ప్రయత్నించారు. జస్వంతిబెన్ జమ్నాదాస్ పోపట్, పార్వతీబెన్ రాందాస్ తోడాని, ఉజంబెన్ నారందాస్ కుండలియా, భానుబెన్ ఎన్. తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి. విఠలానీ, దివాలీబెన్ లుక్కా.. కలిసి పాపడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. మొత్తానికి అప్పుడు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని.. ఇంట్లోనే తక్కువ బడ్జెట్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.అయితే తొలిరోజులు అనేక సమస్యలతో నిండిపోయాయి. రోజుకు నాలుగు ప్యాకెట్ల పాపడ్‌లు అమ్ముతూ.. మొదటి సంవత్సరంలో కేవలం రూ. 6000 మాత్రమే రావడంతో నిరుత్సాహపడ్డారు. కానీ అదే పట్టుదలతో ముందుకు సాగారు.1962 నాటికి బిజినెస్ లో ఆటుపోట్లు తెలుసుకున్న వారు.. ‘ లిజ్జత్ ‘ బ్రాండ్ తో ప్రజల్లోకి వెళ్లగలిగారు. దీంతో అమ్మకాలు దాదాపు రూ. 2 లక్షలకు పెరిగాయి. టేస్ట్, క్వాలిటీ అద్భుతంగా ఉండటంతో ప్రతి ఇంట్లోనూ ఈ పాపడ్ పేరు మారుమోగింది.

కోఆపరేటివ్ మోడల్ ద్వారా మహిళలకు సాధికారత

Related News

లిజ్జత్ పాపడ్ మహిళా వర్కర్ కోఆపరేటివ్ అయిన మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్‌గా పనిచేస్తుంది. ఈ యూనిక్ మోడల్ ఉపాధిని మాత్రమే కాదు మహిళలకు యాజమాన్య అవకాశాలను అందించడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందిస్తుంది. ఉమెన్ పవర్ ను పెంచుతుంది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరణ

రుచికరమైన, అధిక-నాణ్యత కలిగిన లిజ్జత్ పాపడ్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఏడుగురితో స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు 45000 మంది సభ్యులను కలిగి ఉంది. ప్రజెంట్ లిజ్జత్ పాపడ్ భారతదేశంలో ౮౨ బ్రాంచ్ లను కలిగి ఉండగా.. US, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *